తన సినిమా హిట్‌ కాకున్నా..! | Hrithik congratulates Akshay on the success of Rustom | Sakshi
Sakshi News home page

తన సినిమా హిట్‌ కాకున్నా..!

Published Sun, Aug 21 2016 2:24 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

తన సినిమా హిట్‌ కాకున్నా..!

తన సినిమా హిట్‌ కాకున్నా..!

దాదాపు రెండేళ్ల తర్వాత 'మొహెంజోదారో' సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు హృతిక్‌ రోషన్‌. భారీ బడ్జెట్‌తో, చరిత్రాత్మక కథతో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఫలితంతో హృత్తిక్ నిరాశ చెంది ఉండొచ్చు కానీ.. తన చిత్రానికి పోటీగా వచ్చిన 'రుస్తుం' సూపర్‌ హిట్‌ కావడం ఆయనకు ఈర్ష్య కలిగించలేదు సరికదా సంతోషాన్నిచ్చింది.

అక్షయ్‌కుమార్‌ 'రుస్తుం', హృతిక్ 'మొహెంజోదారు' సినిమాలు ఒకేసారి పోటాపోటీగా విడుదలైన సంగతి తెలిసిందే. ఓవైపు 'రుస్తుం' భారీ వసూళ్లతో వందకోట్ల దిశగా దూసుకెళుతుండగా.. 'మొహెంజోదారో' మాత్రం చతికిలపడింది. ఈ నేపథ్యంలో 'రుస్తుం' హిట్‌ పై అక్షయ్‌కుమార్‌ ఫుల్‌ హ్యాపీగా ఉండటం తనకు సంతోషాన్ని ఇచ్చిందని హృతిక్ ట్వీట్‌ చేశారు. అక్షయ్‌ కుమార్‌ విజయాన్ని తాను కూడా ఆస్వాదిస్తున్నానని, ఆనందంగా ఉండటం ఒక ప్రాక్టీస్‌ అని హృతిక్ పేర్కొన్నాడు. 'రుస్తుం' సినిమాను ఆదరిస్తున్నందుకు అభిమానులకు కృతజ్ఞతలు చెప్తూ అక్షయ్‌కుమార్‌ ఒక వీడియో పెట్టాడు. ఆ ట్వీట్‌పై స్పందిస్తూ హృతిక్ తాను కూడా ఈ సినిమా విజయంపై హ్యాపీగా ఉన్నట్టు తెలిపాడు. సినీ పోటిని పక్కనబెడితే తమ మధ్య చక్కని స్నేహబంధం ఉన్నదంటూ చాటాడు. 'రుస్తుం' సినిమా దేశీయంగా రూ. 90 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి.. ఇప్పటికీ బాగా ఆడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement