అక్షయ్ వర్సెస్ హృతిక్! | Hrithik-Akshay set for box office clash in August | Sakshi
Sakshi News home page

అక్షయ్ వర్సెస్ హృతిక్!

Published Tue, May 17 2016 7:36 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

అక్షయ్ వర్సెస్ హృతిక్!

అక్షయ్ వర్సెస్ హృతిక్!

ముంబయి: బాలీవుడ్ బాక్సాపీసు వద్ద ప్రముఖ హీరోలు హృతిక్ రోషన్.. అక్షయ్ కుమార్ తలపడనున్నారు. రుస్తుం సినిమాతో అక్షయ్ వస్తుండగా అదే సమయంలో అదే తేదీన మొహంజదారో చిత్రంతో హృతిక్ వస్తున్నాడు. ఈ రెండు చిత్రాలను కూడా ఆగస్టు 12కే విడుదల చేయాలని రెండు చిత్రాల నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

రుస్తుం సినిమా విడుదల తేదినీ తాము ముందే ప్రకటించినందున తమకోసం మొహంజదారో చిత్ర విడుదల తేదిని మార్చాల్సిందిగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ అశుతోష్ గౌరీకర్ ప్రొడక్షన్స్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, తమ చిత్ర దర్శకుడిని ఎవరూ కలవలేదని, అయినా, తమ చిత్ర విడుదల తేదిని జనవరి 15, 2015లోనే ఆగస్టు 12గా ప్రకటించామని అశుతోష్ గౌరీకర్ ప్రొడక్షన్స్ అధికార ప్రతినిధి చెప్ఆపరు. తమ చిత్ర విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement