బాలీవుడ్ స్టార్‌హీరోయిన్ అలియాభట్‌ను అనుకరించి పాపులర్ ముద్దుగుమ్మ చాందినీ భబ్దా గుర్తుందా? ఇపుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌తో వార్తల్లో నిలిచింది. విషయం ఏమిటంటే...!
కంటెంట్ క్రియేటర్, చాందినీ భాబ్దా తన మిమిక్రీతో సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె ఫాలోవర్ల సంఖ్య 4.5 లక్షల కంటే ఎక్కువే. తాజాగా తన లైఫ్‌లో ఒకముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. చాందినీ ముంబైలో ఒక విలాసవంతమైన ఫ్లాట్‌ని కొనుగోలు చేసింది. అదీ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందట. ఈఎంఐ అయినా.. 25ఏళ్ల లోపే సొంత ఇల్లు అంటూ ఆనందంలో మునిగి తేలుతూ సంబంధించిన సమాచారాన్ని ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్‌తో షేర్ చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశ పూజాకార్యాక్రమాలను నిర్వహించింది. అంతేకాదు తనదైన స్టయిల్‌లో రెన్నోవేషన్ కూడా చేయనుందట త్వరలోనే.
యాక్టింగ్‌పై కూడా అభిరుచి ఉన్న ఈ అమ్మడు ‘కానిస్టేబుల్ గిరాప్డే’ అనే కామెడీ టీవీషోలో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అవకాశకాశాల కోసం ఎదురు చూస్తోంది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన చాందినీ భబ్దా అలియాతో పాటు హీరోయిన్లు అనన్య పాండే, కంగనా రనౌత్ వాయిస్‌లను కూడా బాగా అనుకరిస్తుంది. అయితే తన వాయస్‌ను అనుకరించడంపై స్పందించిన అలియా చాందినినీ ప్రశంసల్లో ముచెత్తడం,దీనికి చాందినీ సంతోషంగా ఉబ్బితబ్బిబ్బవడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment