Mimicry
-
బుడ్డోడు మిమిక్రీ అదరగొట్టాడు
-
Shraddha Kapoor: బహు భాషిణి
నటిగా సుపరిచితమైన శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా లిప్స్టిక్కు సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్లో బ్రిటిష్, ఫ్రెంచ్, రష్యన్, అమెరికన్ యాక్సెంట్లతో మాట్లాడి ‘ఔరా’ అనిపించింది. శ్రద్ధా నాలుగు విభిన్న భాషలను అలవోకగా మాట్లాడుతున్న ఈ వీడియో వైరల్ అయింది. గతంలో ‘కపిల్ శర్మ షో’లో తన భాషా నైపుణ్యాన్ని ప్రదర్శించి ‘శభాష్’ అనిపించుకుంది శ్రద్ధ. ‘శ్రద్ధా కపూర్‌లో మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంది’ అంటున్నారు ఆమె అభిమానులు. -
మిమిక్రీ చేసే పక్షులు!
అండమాన్ దీవుల్లో నేను, నా భర్త రోమ్ ఒక రోజు తెల్లవారుజామున రెండు పిల్లులు అరుస్తూ కొట్టుకుంటున్నట్టు వినిపించిన శబ్దాలకు నిద్ర లేచాము. నిద్ర కళ్ళతో బాల్కనీకి వెళ్లి అడవిలో ఆ శబ్దాలు వస్తున్న వైపు చూసాము. ఆశ్చర్యంగా ఆ రెండు శబ్దాలు చేస్తున్నది పొడుగు తోకల ఏట్రింత (రాకెట్ టైల్డ్ డ్రోంగో) అనే పక్షి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాము. ఒకసారి సముద్రపు గ్రద్ద వలె, మరోసారి దర్జీ పిట్టలా, మధ్యలో లారీ హార్న్ శబ్దాలను నమ్మశక్యం కానీ రీతిలో అనుకరిస్తున్న ఆ పక్షి అనుకరణలు గమనించాము. ఒక పక్షికి ఇంత అద్భుతమైన అనుకరణ (మిమిక్రీ) చేయవలసిన అవసరం ఏముంది?ఏట్రింతలు ఇతర జాతుల పక్షులతో కలిసి వేటాడుతూ ఉంటాయి. ఇతర పక్షుల జాతులతో కలిసి ఒక జట్టుగా ఏర్పడుట కోసమే ఇవి వాటి అరుపులను అనుకరిస్తాయని శ్రీలంక పక్షి శాస్త్రవేత్తలు భావిస్తారు. ఈ అనుకరణ యాదృచ్చికమో లేక కావాలని చేసే అనుకరణో కచ్చితంగా చెప్పడం కష్టం.ఇతర పక్షులు తమ ఆహారాన్ని తినే సమయంలో ఏట్రింతలు ఘాతుక పక్షుల ముప్పు లేకుండా కాపలా కాస్తుంటాయి . ఏదైనా ఘాతుక పక్షి దగ్గరగా వచ్చినట్లైతే ఆ ఘాతుక పక్షిపై మూకుమ్ముడిగా దాడి చేయడానికి ఇతర పక్షుల హెచ్చరిక అరుపులను అనుకరిస్తూ వాటిని ప్రోత్సాహిస్తాయిని భావిస్తారు.కొద్దిసేపటి క్రితం మేము ఒక జాలె డేగ, వంగ పండు పక్షిపిల్లని పట్టుకుని తింటూండటం చూసాము. దాని సమీపంలోనే నల్ల ఏట్రింత, జాలె డేగ అరుపులను అనుకరించినా, ఆ డేగ పట్టించుకోలేదు. దీనినినిబట్టి ఏట్రింతలు ప్రతీసారి మూకుమ్మడి దాడి కోసమే అనుకరిస్తాయని భావించలేము. కొన్ని సందర్భాలలో పక్షులు తమ చుట్టుపక్కల విన్న శబ్దాలను అనుకరించవచ్చు, ముఖ్యంగా అవి ఒత్తిడికి గురైనప్పుడు లేక మొదటి సారి ఆ శబ్దం విన్నప్పుడు ఆ విధంగా అనుకరించవచ్చు.చిలుకలు మరియు మైనా జాతి పక్షులు మనుషులను అనుకరించగలవు. ఇలా అనుకరించడం కోసం వాటికి చిన్నప్పటినుంచే తర్ఫీదు ఇస్తారు. అవి మనుషుల మాటలను సరిగ్గా అనుకరించగానే వాటికి ఆహారాన్ని బహుమానంగా ఇస్తూ ఈ విధంగా నేర్పిస్తుంటారు. చిలుకలు వాక్క్యూమ్ క్లీనర్ చేసే శబ్దాన్ని, టెలిఫోన్ రింగు, కుక్క అరుపులను కూడా అనుకరించగలవు. ఐన్స్టీన్అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆఫ్రికా దేశపు చిలుక, అమెరికాలోని నాక్స్విల్లె జూలోని తోడేళ్లు , చింపాంజీలు, కోళ్లు, పులులు మరియు ఇతర జంతువుల అరుపులను అనుకరించేది. ఈ అనుకరణ విద్య అవి సహజసిద్ధంగా బ్రతికే అడవుల్లో జీవించేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించవలసిన విషయము. అడవిలో సమూహంగా జీవించే చిలుకలు సామూహిక బంధాన్ని బలపర్చుకోవడానికి ఒకటినొకటి అనుకరించుకుంటూ ఉంటాయని ఆస్ట్రేలియాలోని డీకిన్ విశ్వవిద్యాలయలోని లారా కెల్లీ అన్నారు. అవే చిలుకలు పంజరంలో బంధించినట్లైతే వాటి సమీపంలోని మనుషులను అనుకరిస్తాయి. ప్రపంచంలో ఈ అనుకరణ విద్యలో ఆస్ట్రేలియాకి చెందిన "లైర్ బర్డ్" చాలా ప్రముఖమైన పక్షి . యూట్యూబ్‌లో ఒక వీడియోలో ఈ పక్షి, కార్ రివర్స్ చేసే శబ్దాన్ని, కెమెరా క్లిక్ శబ్దాన్ని, చైన్ సా , చెట్లు పడిపోయే శబ్దాన్ని, తుపాకి, వాద్య పరికరాలు, ఫైర్ అలారం, పసి పాపాల ఏడుపు, రైళ్లు, మనుషులు, ఈ విధంగా అనేక రకాలైన శబ్దాలను అనుకరించడం చూడవచ్చు. మగ పక్షులు ఆడ పక్షులను ఆకర్షించడానికి ఎంతో కష్టపడి అనేక రకాల శబ్దాలను అనుకరిస్తూంటాయి కనుక ఆడ పక్షులు ఏ మగ పక్షైతే ఎక్కువ శబ్దాలను అనుకరిస్తుందో దాన్ని భాగస్వామిగా ఎంచుకోవచ్చు అని కొందరు భావిస్తూంటారు. కానీ ఐరోపా జీవశాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నిరూపించానికి ఎటువంటి ఆధారం దొరకలేదు అంటున్నారు. మరొక శూన్యవాద సిద్ధాంతం ప్రకారం ఈ అనుకరణ వలన ఎటువంటి ఉపయోగం ఉండదు, అది కేవలం సాధన మాత్రమే అని భావిస్తుంటారు. ఆఫ్రికాలోని కలహారి ఎడారిలో కనిపించే ఏట్రింతలు ఈ అనుకరణ విద్యని ఉపయోగించి తెలివిగా ఆహారాన్ని సంపాదించుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పక్షులు తమ పరిసరాల్లోని ఇతర పక్షులు లేక జంతువులు ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు, ఘాతుక పక్షులు లేక వాటిపై దాడి చేసే ఇతర జంతువులు అరుపులను అనుకరిస్తాయి. ఆ శబ్దాలను విన్న ఆ జంతువులు లేక పక్షులు భయంతో ఆహారాన్ని వదిలి వెళ్ళగానే ఏట్రింతలు ఆ ఆహారాన్ని దొంగిలిస్తాయి. ఇప్పటి వరకు “పక్షుల అనుకరణ” వలన అవి పొందే ప్రయోజనాలలో ఇది ఒక్కటే నిరూపితమైనది.ఈ అండమాన్ దీవుల్లో మేము చూసిన ఏట్రింత కూడా ఇదే విధంగా ఆహారంగా కోసం అనుకరిస్తుందా? ఇది తెలియాలంటే కొంత సమయం మరియు పరిశీలన అవసరం. ఈ అనుకరణ విద్యను ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లోని పక్షులు ప్రదర్శిస్తాయి కనుక ఈ చర్యని వివరించడానికి ఓకే వివరణ అన్నింటికీ వర్తింపచేయలేమని కెల్లీ అభిప్రాయపడతారు.ఈ ఆలోచనల మధ్యలో, డిష్ వాషర్లు, అంబులెన్సు శబ్దాలను కూడా అనుకరించే వాటి సామర్ధ్యానికి, ప్రకృతినే ఒక సంగీత వర్ణమాలగా ఉపయోగించే అద్భుతమైన నైపూణ్యానికి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. రచయిత - జానకి లెనిన్ ఫోటో క్రెడిట్: సుభద్రాదేవితెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewritersపుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
Lok Sabha Election 2024: మోదీకి ఆయన స్టైల్లోనే బదులిస్తా
శ్యామ్ రంగీలా. మిమిక్రీ సంచలనం. ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీ వంటి నేతలను అనుకరిస్తూ 2017లో ఆయన చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. సరిగ్గా ఏడేళ్ల తరవాత ఆయన స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అది కూడా వారణాసిలో మోదీపైనే పోటీ చేస్తున్నారు! రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన శ్యామ్ యూట్యూబ్ చానల్‌కు దాదాపు కోటిమంది సబ్స్రై్కబర్లున్నారు. మోదీని అనుకరిస్తూ ‘ధంగ్ కీ బాత్’ షో కూడా నడుపుతున్నారాయన. ఒకప్పుడు మోదీకి మద్దతు పలికిన శ్యామ్ ఆయనపైనే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఇలాంటి పలు ప్రశ్నలకు ఆయన ఇచి్చన సమాధానాలు... ప్రధానిపై ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఇటీవల సూరత్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. అది సరికాదనిపించింది. ఎన్నికల ప్రక్రియే ప్రజాస్వామ్యానికి ప్రాణం. పోటీ ఉండాలి. అలాకాకుండా బీజేపీ తన ప్రత్యర్థుల నామినేషన్లను విత్‌డ్రా చేయిస్తోంది. అందుకే నేను పోటీ చేస్తున్నా. ఒక సామాన్యుడు ప్రధానిపైనే పోటీలో నిలబడ్డాడనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా. మీది రాజకీయ ప్రధాన హాస్యం. ప్రస్తుతం దేశ రాజకీయాల తీరుపై ఏమంటారు? ఇప్పుడు రాజకీయాలే అతి పెద్ద కామెడీ. రాజకీయాల్లో హాస్యానికి కొదవే లేదు. కమెడియన్లను నిషేధించి రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ ఖర్చుతో కూడింది. మరి మీకు డబ్బులెలా...? నా దగ్గర ఏమీ లేవు. నేనేం చేసినా ప్రజల సాయంతోనే. ‘అభీ తో జోలా హై బస్. ఉఠాకే చల్ దేంగే, ఔర్ క్యా?’ (నా దగ్గరున్నది జోలె మాత్రమే. అది తీసుకుని రోడ్డున పడతానంతే) ‘జోలా ఉఠాకే’ అన్నది ప్రధాని మోదీ డైలాగ్ కదా! ఒకప్పుడు ప్రధాని మద్దతుదారుగా ఉన్న మిమ్మల్ని మార్చిందేమిటి? 2016 దాకా ప్రధానికి అభిమానినే. బీజేపీ అధికారంలోకి రాగానే ఇక అవినీతి పోతుందని, పెద్ద మార్పు వస్తుందని చాలామందిమి భావించాం. అందుకే ఆయనకు మద్దతుగా పోస్టులు పెట్టేవాన్ని. ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్‌కు ఎంపికైనప్పుడు ఎగిరి గంతేశా. మోదీని అనుకరిస్తూ నేను చేసిన వీడియోకు ప్రశంసలొచ్చాయి. కానీ అది ప్రసారమే కాలేదు. ప్రభుత్వం వద్దందని చానల్ వాళ్లు చెప్పారు. నేను మోదీని అనుకరించానంతే. ఎందుకు వద్దన్నారో అర్థం కాలేదు. రాజకీయాలపై హాస్యానికి చాలా దేశాల్లో ఆదరణ ఉంది. భారత్‌లో పరిస్థితి ఏమిటనుకుంటున్నారు? ఇక్కడ వ్యంగ్యాన్ని, హాస్యాన్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉంది. రాజకీయాలపై హాస్యం ఇక్కడ పని చేయదు. అందుకే చానళ్లలో పొలిటికల్ కామెడీ షోలే ఉండవు. రాహుల్ గాంధీపై జోకేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆహా్వనించవు, మోదీ మీద కామెడీ చేస్తే బీజేపీ ఊరుకోదు. అందుకే నా యూట్యూబ్‌లో వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నా. వారణాసిలో ప్రచారమెలా ఉంది? బాగా సాగుతోంది. నలుగురైదుగురు స్నేహితులు నా వెంట వచ్చారు. ఇక్కడ మరింతమంది కలిసొస్తున్నారు. మీకు వారణాసి ప్రజల మద్దతు ఉందనుకుంటున్నారా? కచ్చితంగా. పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచే నాకు మద్దతుగా సందేశాలు వస్తున్నాయి. వరుస కాల్స్ వస్తున్నాయి. ప్రచారంలోనూ మోదీని మీ స్టయిల్లో అనుకరిస్తారా? తప్పకుండా. మోదీకి ఆయన శైలిలోనే బదులిస్తానని ఇప్పటికే చెప్పా కూడా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్టార్ హీరో ఫ్లాట్ కొనుక్కున్న మిమిక్రీ క్వీన్, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు!
బాలీవుడ్ స్టార్హీరోయిన్ అలియాభట్‌ను అనుకరించి పాపులర్ ముద్దుగుమ్మ చాందినీ భబ్దా గుర్తుందా? ఇపుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌తో వార్తల్లో నిలిచింది. విషయం ఏమిటంటే...! కంటెంట్ క్రియేటర్, చాందినీ భాబ్దా తన మిమిక్రీతో సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె ఫాలోవర్ల సంఖ్య 4.5 లక్షల కంటే ఎక్కువే. తాజాగా తన లైఫ్‌లో ఒకముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. చాందినీ ముంబైలో ఒక విలాసవంతమైన ఫ్లాట్‌ని కొనుగోలు చేసింది. అదీ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందట. ఈఎంఐ అయినా.. 25ఏళ్ల లోపే సొంత ఇల్లు అంటూ ఆనందంలో మునిగి తేలుతూ సంబంధించిన సమాచారాన్ని ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్‌తో షేర్ చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశ పూజాకార్యాక్రమాలను నిర్వహించింది. అంతేకాదు తనదైన స్టయిల్లో రెన్నోవేషన్ కూడా చేయనుందట త్వరలోనే. యాక్టింగ్‌పై కూడా అభిరుచి ఉన్న ఈ అమ్మడు ‘కానిస్టేబుల్ గిరాప్డే’ అనే కామెడీ టీవీషోలో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్లో అవకాశకాశాల కోసం ఎదురు చూస్తోంది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన చాందినీ భబ్దా అలియాతో పాటు హీరోయిన్లు అనన్య పాండే, కంగనా రనౌత్ వాయిస్‌లను కూడా బాగా అనుకరిస్తుంది. అయితే తన వాయస్‌ను అనుకరించడంపై స్పందించిన అలియా చాందినినీ ప్రశంసల్లో ముచెత్తడం,దీనికి చాందినీ సంతోషంగా ఉబ్బితబ్బిబ్బవడం తెలిసిందే. View this post on Instagram A post shared by Chandni Bhabhda 🧿 (@chandnimimic) -
వైఎస్ఆర్ వాయిస్..సీఎం జగన్ ఎమోషనల్
-
చంద్రబాబు మిమిక్రీ..సీఎం జగన్ రియాక్షన్ చూడండి
-
జగన్ ముందే జగన్ మిమిక్రీ..
-
కొడాలి నాని మిమిక్రీ
-
‘వెయ్యి సార్లు చేస్తా.. జైల్లో వేసిన వెనకాడ’
కోల్‌కతా: అనుకరించడం ఓ కళ అని, అనుకరించడాన్ని తాను అలాగే కొనసాగిస్తూ ఉంటానని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బేనర్జీ అన్నారు. అయితే పార్లమెంట్ భద్రత వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి మాట్లాడాలని విపక్ష ఎంపీలు పట్టుబట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పలవురు ప్రతిపక్ష ఎంపీలు కూడా సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్‌పై విపక్ష ఎంపీలు పార్లమెంట్ బయట నిరసన తెలిపాయి. నిరసనలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ హావభావాలను టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వ్యంగ్యంగా అనుకరించిన తెలిసిందే. ఈ వ్యవహారంపై మరోసారి ఎంపీ కల్యాణ్ బేనర్జీ స్పందింస్తూ.. మరోసారి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను అనుకరించారు. తాను ఇలాగే అనుకరించడం కొనసాగిస్తానని అన్నారు. అది ఒక కళారూపమని తెలిపారు. అవరమైతే వెయ్యిసార్లు అయినా ఇలానే అనుకరిస్తానని పేర్కొన్నారు. తన భావాలను వ్యక్తం చేయడానికి అన్ని రకాలుగా ప్రాథమిక హక్కులు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో జైలులో వేసినా తాను వెనకడుగు వెయనని తేల్చి చెప్పారు. ఎటువంటి ప్రాధాన్యత లేని ఈ విషయాన్ని ధన్‌ఖడ్ పెద్దది చేస్తున్నాడని విమర్శించారు. చదవండి: వికసిత్ భారత్‌ను నిజం చేయండి: మోదీ కల్యాణ్ బెనర్జీ చేసిన అనుకరణ తనను ఎంతగానో బాధించిందని, ఇలా చేయడం తనను, తన కులాన్ని అవమానించడమేనని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు ధన్‌ఖడ్‌ను అనుకరించినందుకు అదే రోజు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై కేసు నమోదైంది. అభిషేక్ గౌతమ్ అనే ఓ న్యాయవాది ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. कल्याण बनर्जी ने फिर की जगदीप धनखड़ की मिमिक्री ◆ संसदीय क्षेत्र श्रीरामपुर में एक सभा के आयोजन के दौरान की मिमिक्री ◆ कहा-"उपराष्ट्रपति धनखड़ अपने पद की संवैधानिक गरिमा को नष्ट कर रहे" TMC MP Kalyan Banerjee | #JagdeepDhankar #KalyanBanerjee pic.twitter.com/fkl79gxiUu — News24 (@news24tvchannel) December 24, 2023 -
‘మిమిక్రీ’పై ఆగ్రహ జ్వాలలు
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను అనుకరిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ధన్‌ఖడ్‌కు మద్దతు ప్రకటిస్తూ ముర్ము బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఎంపీల ప్రవర్తనను చూసి కలత చెందానని పేర్కొన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను ఎంపీలంతా కాపాడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. రాష్ట్రపతికి ధన్‌ఖడ్ కృతజ్ఞతలు తెలిపారు. అవమానాలు, హేళనలు తన మార్గం తనను నుంచి తప్పించలేవన్నారు. ధన్‌ఖడ్‌కు మోదీ ఫోన్ ధన్‌ఖడ్‌తో మోదీ ఫోన్లో మాట్లాడారు. విపక్ష సభ్యుల ప్రవర్తన చాలా బాధ కలిగించిందన్నారు. విపక్ష సభ్యులు మిమిక్రీ చేయడాన్ని మోదీ ఆక్షేపించారు. ఎవరు ఎన్ని విధాలుగా హేళన చేసినా తన విధులు తాను నిర్వరిస్తూనే ఉంటానని, ఎవరూ తనను అడ్డుకోలేరని మోదీతో ధన్‌ఖడ్ చెప్పారు. తాను 20 ఏళ్లుగా ఇలాంటి హేళనలు, అవమానాలు ఎదుర్కొంటున్నానని మోదీ చెప్పారంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, ఎన్డీయే ఎంపీలు కూయాయనకు మద్దతు ప్రకటించారు. సంఘీభావంగా బుధవారం లోకసభలో 10 నిమిషాలపాటు లేచి నిల్చున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ధన్‌ఖఢ్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. ధన్‌ఖడ్ బుధవారం రాజ్యసభలో మాట్లాడారు. పార్లమెంట్‌ను, ఉప రాష్ట్రపతి పదవిని అవమానిస్తే సహించబోనని హెచ్చరించారు. మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ ఎవరినీ కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారు. ఉప రాష్ట్రపతిని అవమానించలేదని చెప్పారు. బీజేపీ ఎంపీపై చర్యలేవి: కాంగ్రెస్ జాట్ కులాన్ని ప్రతిపక్షాలు అవమానించాయన్న ఆరోపణలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. పార్లమెంట్లో తనను ఎన్నోసార్లు మాట్లాడనివ్వలేదని, దళితుడిని కాబట్టే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని తాను అనొచ్చా అని ప్రశ్నించారు. మోదీ గతంలో అప్పటి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని మిమిక్రీ చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ గుర్తు చేశారు. -
NDA: ఉపరాష్ట్రపతికి సంఘీభావంగా..
సాక్షి, ఢిల్లీ: దేశ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ను హేళన చేస్తూ టీఎంసీ ఎంపీ ఒకరు చేసిన చేష్టలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. చైర్మన్ ధన్కడ్ ఈ చర్యను ఖండించగా.. ప్రధాని మోదీ ఈ ఉదయం ఉపరాష్ట్రపతికి ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు కూడా. ఈ క్రమంలో.. బుధవారం పెద్దల సభలో ఎన్డీయే ఎంపీలు, ధన్కడ్కు సంఘీభావం ప్రకటించారు. ‘‘ఈ చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్లు రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో ఉన్నవాళ్లను పదే పదే అవమానిస్తున్నారు. అన్నివిధాలుగా పరిధి దాటి ప్రవర్తించారు. ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఓ ప్రధానిని అవమానిస్తూ వస్తున్నారు. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని అవమానించారు. జాట్ కమ్యూనిటీ నుంచి ఉపరాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి మీరు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. అలాంటి మిమ్మల్ని ఇప్పుడు అవమానించారు. మీరు ఉన్న ఉన్నతస్థానం పట్ల వాళ్లకు గౌరవం లేదు. రాజ్యాంగాన్ని, ఉపరాష్ట్రపతిని అవమానించడం మేం సహించలేం అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రాజ్యసభలో తెలిపారు. వాళ్లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. మీకు గౌరవసూచికంగా ప్రశ్నోత్తరాల సమయం మొత్తం మేం నిలబడాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారాయన. ఏం జరిగిందంటే.. ఎంపీల సస్పెన్షన్ పరిణామం అనంతరం.. పార్లమెంటు వెలుపల మంగళవారం ఓ ఘటన చోటుచేసుకుంది. ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ను ఉద్దేశించేలా.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుకరణ చేశారు. ఆయన గొంతును అనుకరిస్తూ.. విచిత్రంగా ప్రవర్తించారు. ఆ సమయంలో విపక్ష సభ్యులు నవ్వులు కురిపిస్తుండగా.. రాహుల్ గాంధీ ఆ దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరించారు. దీనిపై ధన్కడ్ మండిపడుతూ.. ఎంపీ స్థానంలో ఉండి ఛైర్మన్‌ని హేళన చేయడం సిగ్గుచేటన్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. If the country was wondering why Opposition MPs were suspended, here is the reason… TMC MP Kalyan Banerjee mocked the Honourable Vice President, while Rahul Gandhi lustily cheered him on. One can imagine how reckless and violative they have been of the House! pic.twitter.com/5o6VTTyF9C — BJP (@BJP4India) December 19, 2023 మరోవైపు రాజకీయంగా ఈ ఘటన దుమారం రేపుతోంది. అధికార-విపక్ష ఎంపీలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం స్పందించారు. రాహుల్ జీ(రాహుల్ గాంధీ) వీడియో తీసి ఉండకపోతే.. ఈ వ్యవహారంపై ఇంత రాద్దాంతం జరిగి ఉండి కాదేమో అనేలా ఆమె ప్రకటన ఇచ్చారు. మరోవైపు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ధన్కడ్కు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జాట్ కమ్యూనిటీ సైతం ఈ డిమాండ్‌తో నిరసనలకు దిగింది. #WATCH | On TMC MP mimicry row, West Bengal CM Mamata Banerjee says, "...You wouldn't have come to know if Rahul ji had not recorded a video..." pic.twitter.com/t1gNmnI69p — ANI (@ANI) December 20, 2023 -
20 ఏళ్లుగా అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు: ధన్కర్కు మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ధన్కర్ స్వయంగా ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించారు. మంగళవారం పార్లమెంట్లో జరిగిన ఘటన విషయంపై ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతిలాంటి రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిని, అది కూడా పార్లమెంట్లో విపక్షాల ఎంపీలు ఇలా అవమానించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ఆయన ఇలాంటి అవమానాలకు గురవుతున్నారని చెప్పినట్లు తెలిపారు. అయితే కొంతమంది ప్రవర్తన తన కర్తవ్యాన్ని నిర్వర్తించడకుండా అడ్డుకోలేవని ధన్కర్ వెల్లడించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా తాను మాత్రం కట్టుబడి పని చేస్తానని తెలిపారు. తన హృదయపూర్వకంగా రాజ్యంగ విలువలకు కట్టుబడి ఉన్నానని, తన మార్గాన్ని ఎవరూ మార్చబోరని పేర్కొన్నారు. ఇక ప్రధానితోపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీలు తమ వ్యక్తీకరణ గౌరవంగా ప్రవర్తించాలని హితవు పలికారు. కాగా మంగళవారం సస్పెండ్ అయిన పార్లమెంట్ విపక్ష సభ్యులు సస్పెన్షన్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కకర్ మిమిక్రీ చేశారు. పార్లమెంట్ మెట్ల వద్ద ఉన్న మెట్లపై కూర్చుని చైర్మెన్ జగదీప్‌ను అనుకరిస్తూ ఎగతాళి చేశారు. ఈ మిమిక్రీ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన ధన్కర్.. రాజ్యసభలో తనపట్ల జరిగిన సంఘటనను వ్యక్తిగత దాడిగా అభివర్ణించారు. మరోవైపు ‘ఎంపీల సస్పెన్షన్’ వివాదం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. పార్లమెంట్లో గతవారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో కార్యకలాపాలు స్తంభించాయి. మరోవైపు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగింస్తున్నందుకు ఇప్పటి వరకు రాజ్యసభ, లోక్‌సభలోని విపక్షాలకు చెందిన 141 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఎంపీల సస్పెన్షన్‌పై ప్రతిపక్షాలు తమ నిరసనలను తీవ్రం చేస్తున్నాయి. Received a telephone call from the Prime Minister, Shri @narendramodi Ji. He expressed great pain over the abject theatrics of some Honourable MPs and that too in the sacred Parliament complex yesterday. He told me that he has been at the receiving end of such insults for twenty… — Vice President of India (@VPIndia) December 20, 2023 -
'సిగ్గుచేటు..' రాజ్యసభ ఛైర్మన్‌పై విపక్ష ఎంపీ మిమిక్రి
ఢిల్లీ: పార్లమెంటు వెలుపల తనపై మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ మండిపడ్డారు. ఎంపీ స్థానంలో ఉండి ఛైర్మన్‌ని హేళన చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. లోక్‌సభ, రాజ్యసభల నుంచి విపక్ష ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌ని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఇమిటేట్ చేశారు. ఇందుకు విపక్ష సభ్యులు నవ్వులు కురిపిస్తుండగా.. ఆ దృశ్యాలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫోన్లో చిత్రీకరించారు. If the country was wondering why Opposition MPs were suspended, here is the reason… TMC MP Kalyan Banerjee mocked the Honourable Vice President, while Rahul Gandhi lustily cheered him on. One can imagine how reckless and violative they have been of the House! pic.twitter.com/5o6VTTyF9C — BJP (@BJP4India) December 19, 2023 విపక్షాల చర్యను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా ఖండించారు. కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేయాలని పిలుపునిచ్చారు. సభ గౌరవ మర్యాదలను కాపాడకుండా, సభాధ్యక్షునిపై హేళనగా ప్రవర్తించిన ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరారు. డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్‌లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్‌సభ లోపల గ్యాస్ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారిక ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సభలో గందరగోళం సృష్టించడంతో ఇప్పటివరకు 141 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇదీ చదవండి: లోక్ సభలో నేడు 49 మంది ఎంపీలపై వేటు -
మల్లారెడ్డి వాయిస్ ని యాజ్ ఇట్ ఈజ్ దింపేసాడు
-
ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధీ(39) మృతి చెందారు. కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు మిమిక్రీ కళాకారులు బిను ఆదిమాలి, ఉల్లాస్, మహేశ్ ప్రస్తుతం సమీపంలోని కొడుంగలూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సుధీ మృతి పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. (ఇది చదవండి: రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి.. ఫోటోలు వైరల్!) ఎలా జరిగిందంటే.. సుధి, మిగిలిన ముగ్గురు వటకరా ప్రాంతంలో ఒక ఈవెంట్‌ను ముగించుకుని కారులో తిరిగి తమ ఇళ్లకు బయలుదేరారు. తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఓ కంటెనర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సుధీ తలకు బలమైన గాయం కావడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతున్నారు. కొల్లం సుధీ కెరీర్ కొల్లం సుధీ 2015లో అజ్మల్ దర్శకత్వం వహించిన కంఠారి చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత కట్టప్పనయిలే రిత్విక్ రోషన్, కుట్టనాదన్ మార్ప్పప్ప, కేసు ఈ వీడింటే నాధన్, 'ఎస్కేప్', స్వర్గతిలే కత్తురుంబు కొల్లం వంటి సినిమాల్లో నటించాడు. సుధీ చాలా చిత్రాలలో కనిపించినప్పటికీ.. అతను బుల్లితెరపై నటనకే ఎక్కువ ప్రశంసలు అందుకున్నాడు. కొల్లం సుధీ తన మిమిక్రీతోనే అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. అతను స్టార్ మ్యాజిక్ షోతో మరింత ఫేమ్ సంపాదించారు. మలయాళంలో పలు కామెడీ షోలతో అలరించాడు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత) View this post on Instagram A post shared by Kollam Sudhi (@kollam_sudhi_) -
మిమిక్రీ ఫన్ జోన్
-
గాన గంధర్వుడు బాలు మ్యూజికల్ మ్యాజిక్: వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచి సంవత్సరం ముగిసినా ఆ అమర గాయకుడిని మర్చి పోవడం అభిమానులకు వశం కావడం లేదు. అమృతగానంతో ఓలలాడించిన బాలుని తలచుకుని ఇప్పటికీ కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన జ్ఞాపకాలను పదే పదే నెమరువేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బాలుకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. రావోయి చందమామ అంటూ మధుర గాత్రంలొ అయిదు రకాల గొంతులతో ఆయన చేసిన మ్యాజిక్‌ను మరోసారి ఎంజాయ్ చేస్తున్నారు. బాలు జ్ఞాపకాలుఅనే ట్విటర్ ఖాతా ఈ వీడియోను షేర్ చేసింది. When Balu garu gave us a glimpse of his mimicry talent with the classic "Raavoyi Chandamama", in 5 different voices...#SPBLivesOn ❤🙏#SPBalasubrahmanyam pic.twitter.com/L6NZVRk8Uh — బాలు జ్ఞాపకాలు (@balu_jnapakalu) September 28, 2021 -
గొంతుతో మాయ చేస్తారు!
వారు గొంతుతో మాయ చేస్తారు.. తమ స్వరంతో పలు రకాల ధ్వనులను అనుకరిస్తూ ఆశ్చర్య పరుస్తారు.. ప్రకృతి సవ్వడులు.. పక్షులు, జంతువుల అరుపులు, ప్రముఖులను అనుకరిస్తూ వాహ్వా అనిపిస్తారు. తమ కళతో ప్రజలను రంజింపచేస్తారు మిమిక్రీ కళాకారులు..ప్రపంచ ప్రఖ్యాత ధ్వని అనుకరణ సామ్రాట్ నేరేళ్ల వేణుమాధవరావు జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 28న ప్రపంచ మిమిక్రీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆర్మూర్: ధ్వని అనుకరణలో సత్తా చాటుతున్నారు జిల్లాకు చెందిన పలువురు కళాకారులు.. ఆర్మూర్ పట్టణానికి చెందిన బోండ్ల నారాయణ, నాగుబాయిల కుమారుడు బోండ్ల ఆనంద్ అనే యువకుడు 24 ఏళ్లుగా మిమిక్రీ రంగంలో రాణిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. చిన్నతనం నుంచే కళల వైపు ఆకర్షితుడైన ఆనంద్ తన గురువు జాదూ యుగంధర్ రంగనాథ్ వద్ద మిమిక్రీ మెలకువలు నేర్చుకున్నాడు. మిమిక్రీ సీనియర్ కళాకారుడు, మెజీషియన్ అయిన తన గురువుతో కలిసి ఇప్పటి వరకు సుమారు ఐదు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆనంద్ తన మిమిక్రీ ద్వారా సినీ నటులు, రాజకీయ నాయకులను, పశు, పక్షాదులు, వాహన సముదాయాలకు సంబంధించిన దాదాపు 62 రకాల ధ్వనులను పలికించగలడు. ప్రతి ఏటా ఆర్మూర్‌లో నిర్వహించే దసరా ఉత్సవాల్లో ఆనంద్ మిమిక్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రెండు దశాబ్దాలకు పైగా ధ్వని అనుకరణతో మన్ననలు పొందుతున్న ఆనంద్ పలు బిరుదులను సైతం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ పేరిట నెలకొలి్పన అవార్డును సైతం ఆనంద్ అందుకున్నాడు. మూడేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మిమిక్రీ కళాకారుల వర్క్‌షాప్‌లో నేరెళ్ల వేణమాధవ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని సైతం అందుకున్నాడు. జిల్లా కేంద్రంలోని ఆక్స్ఫార్డ్ స్కూల్లో కావ్య విద్యా విషయక సమాఖ్య ఆధ్వర్యంలో మిమిక్రీ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. తెలంగాణ జానపద కళాకారుల సంఘం వారు మిమిక్రీ కళారత్న అవార్డును, కావ్య విద్య విషయ సమాఖ్య వారు మిమిక్రీ స్టార్ బిరుదును ప్రదానం చేశారు. రుణపడి ఉంటా మిమిక్రీ కళను నమ్ముకొన్న నన్ను ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటాను. నా తల్లిదండ్రులు, గురువు రంగనాథ్, భారత్ గ్యాస్ మేనేజర్ సుమన్ ప్రోత్సాహంతో మిమిక్రీ చేస్తున్నా. ఈ కళను మరింత మెరుగు పర్చుకొని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే సంకల్పంతో కష్టపడుతున్నాను. – బోండ్ల ఆనంద్ సత్తా చాటుతున్న తండ్రీకూతుళ్లు.. నిజామాబాద్‌కల్చరల్ : మిమిక్రీలో రాణిస్తూ ఇంటిపేరుగా మార్చుకున్నాడు మల్లాపూర్ గ్రామానికి చెందిన శంకర్.. ఆయన దివ్యాంగుడైనా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల్లో ప్రముఖ వ్యక్తుల కంఠధ్వనులను అనుకరించడం, ప్రకృతి శబ్ధాలను పలకడంలో పట్టు సాధించారు. మిమిక్రీతో పాటు వెంట్రిలాక్విజం కూడా నేర్చుకున్నారు. ఆయనతో కూతురు భార్గవిని కూడా మిమిక్రీ రంగంలోకి దిగించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందుతున్నారు తండ్రీకూతుళ్లు.. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల వేణుమాధవ్ ఆధ్వర్యంలో 2017లో జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యశాలలో భార్గవి తొలి ప్రదర్శన ఇచ్చి ఎంతగానో ఆకట్టుకుంది. ప్రశంసలే బహుమానాలు కళాకారులకు ప్రేక్షకుల ప్రశంసలే బహుమానాలు. వారి ప్రోత్సహంతో ముందకు సాగుతున్నా. కళను ప్రదర్శిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాను. – శంకర్ -
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూత
-
టాలీవుడ్లో మరో విషాదం
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్(57) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అనుకరణ విద్యలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కలిగిన ఆయన ఎంతో సినిమా ప్రముఖుల గొంతులను, హావభావాలను అలవోకగా అనుకరించేవారు. జురాసిక్‌పార్క్ సినిమాలోని సన్నివేశాన్ని అనుకరించడంలో ఆయన పేరెన్నికగన్నారు. అలాగే వివిధ శబ్దాలను, జంతువులు, పక్షుల కూతలను అనుకరించడంతో దిట్ట అయిన ఆయన విదేశాల్లోనూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. పలు సినిమాల్లోనూ ఆయన నటించారు. (సినిమా పరిశ్రమ బతకాలి) హరికిషన్ 1963, మే 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. రంగమణి, వీఎల్ఎన్ చార్యులు ఆయన తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచే ఆయనకు మిమిక్రీ అంటే ఆసక్తి. తనకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు, తోటి వారి గొంతులను అనుకరిస్తూ ఉండేవారు. అలా ప్రస్థానం ప్రారంభించిన ఆయన తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ప్రముఖ మిమిక్రీ కళాకారుడిగా పేరు సంపాదించారు. పది వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. ధ్వన్యనుకరణతో ప్రేక్షకులను రంజింపజేసి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఎంతో మంది శిష్యులను ఆయన తయారు చేశారు. నటుడు శివారెడ్డి కూడా ఈయన శిష్యుడే. హరికిషన్ మరణం పట్ల ఆయన శిష్యులు, అభిమానులు, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెల్పుతున్నారు. (సినీనటి వాణిశ్రీ కుమారుడు ఆత్మహత్య) -
నాలుగు నిమిషాలు.. యాబై మంది వాయిస్‌లు
మిమిక్రీలో చాలావరకు పురుషుల గొంతులే వినిపిస్తాయి. మహిళలూ ఆ అనుకరణను అవలీలగా చేస్తారు... అని అఖిల ఏఎస్ అనే అమ్మాయి నిరూపిస్తోంది. నాలుగు నిమిషాల్లో యాభై ఒక్కమంది సెలబ్రీటీలను అనుకరించి చూపించింది! ఆ వీడియో వైరలయింది. ‘‘ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు దుమ్ము.. ఓ వైపు పొగ...’’ అంటూ యాంటీ స్మోక్ యాడ్‌లో వినిపించే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ను అనుకరిస్తోంది ఓ ఇరవై ఏళ్ల అమ్మాయి తన తరగతి గదిలో. అచ్చంగా యాడ్‌లోని పురుషుడి గొంతుతోనే మాట్లాడుతున్న ఆ మాటలకు క్లాస్ అంతా ఈలలు, చప్పట్లతో మారుమోగిపోతోంది. వన్స్ మోర్ అంటున్నారు క్లాస్మేట్స్. అలా గోపన్ నాయర్ (మలయాళం వాయిస్ ఆర్టిస్ట్, ఈ నగరానికి ఏమైంది అనే యాడ్‌కు మలయాళంలో వాయిస్ ఇచ్చింది అతనే) నుంచి మలయాళ నటీమణులు పార్వతి, నజిరియా నాజిమ్, కేరళ రాజకీయ నాయకులు ఇలా ఒకరి తర్వాత ఒకరిని అనుకరిస్తూనే ఉంది. ఆ అమ్మాయి పేరు ఏఎస్ అఖిల. ఆయుర్వేద వైద్యవిద్యను అభ్యసిస్తోంది. ఈ యేడాదితో చదువు పూర్తయిపోయి డాక్టర్ పట్టా పుచ్చుకోనుంది. పైన చెప్పుకున్న ఆమె మిమిక్రీ సీన్ ఆ కాలేజ్‌లో చేసిందే. మిమిక్రీఖిల అఖిల మలయాళ అమ్మాయి అని ఈపాటికే అర్థమయ్యుంటుంది. పుట్టింది, పెరిగింది తిరువనంతపురం జిల్లాలోని నేడుమంగడ్లో. చిన్నప్పటి నుంచీ చుట్టూ ఉన్న పరిసరాలను, మనుషులను పరిశీలించడం అలవాటు ఆమెకు. ఆ పరిశీలనలోంచే ఈ మిమిక్రీ కళ అబ్బింది, అలవడింది. స్కూల్లో ఉన్నప్పుడే క్లాస్‌లో తన కళను ప్రదర్శించేది. క్లాస్ టీచర్స్‌ను, క్లాస్‌మేట్స్‌ను అనుకరిస్తూండేది. ఒకసారి ఇలాగే క్లాస్‌లో డెమో ఇస్తూండగా టీచర్స్‌కు పట్టుబడింది. ఫలితం.. స్కూల్లో ఆమె కళాప్రదర్శన. దాంతో అఖిలకు స్టేజ్ ఫియర్ పోయి ధైర్యం వచ్చింది. ఎక్కడైనా ప్రదర్శనలు ఇవ్వగలననే ఆత్మవిశ్వాసమూ పెరిగింది. అప్పటినుంచి తిరువనంతపురంలో జిల్లాల్లోని ప్రతి ఇంటర్‌స్కూల్ కాంపిటీషన్లో పాల్గొనడం మొదలుపెట్టింది. ఎక్కడ గొంతు సవరిస్తే అక్కడ ప్రైజులు వచ్చిపడేవి. ఆ కళను తనతోపాటే పెంచి పెద్దచేసుకుంది. అయితే ఎక్కడా దానికి సంబంధించి శిక్షణ తీసుకోకుండానే. టీవీ, పరిశీలన ఇవే ఆమె ధ్వన్యనుకరణ నైపుణ్యాన్ని పెంచిన గురువులు. ఎవరెవరిని అనుకరిస్తుంది? ఎవరిని కాదు అని అడగొచ్చు. రజినీకాంత్, కమల్‌హసన్, అద్నన్ సమీ, ఎస్. జానకి, ఓమెన్ చాందీ, వీఎస్ అచ్యుతానందన్, షాలినీ, షామిలీ (చిన్నప్పటి వాయిస్‌లను).. ఇలా చెప్పుకుంటూ పోతే వందకు పైనే తేలొచ్చేమో జాబితా. ఈ వీడియో వైరల్.. ఒక మలయాళం చానెల్లోని ఓ ప్రోగ్రామ్‌లో అఖిల చేసిన మిమిక్రీ వీడియోలో కేవలం నాలుగంటే నాలుగు నిమిషాల్లో యాభై ఒక్కమంది సెలబ్రిటీల స్వరాన్ని అనుకరించింది. ప్రతి నాలుగు సెకన్లకు ఆడ, మగ గొంతును మారుస్తూ. ఆ ‘షో’ను చూసిన ప్రేక్షకులు ఆమె ప్రతిభకు అబ్బురపడ్డారు. మిమిక్రీ కళలో మహిళా సూపర్‌స్టార్ అనే పేరు తెచ్చేసుకుంది అఖిల ఈ షోతో. ఇప్పటివరకు మలయాళంలో ఎందరో మిమిక్రీ కళాకారులు వచ్చినా.. తర్వాత తర్వాత వాళ్లంతా సినిమా ఆర్టిస్టులుగా స్థిరపడ్డారు. కాని అఖిల అలా కాకుండా మిమిక్రీ కళాకారిణిగానే కొనసాగాలనుకుంటోందట. ఈ నగరానికి ఏమైంది.. ‘‘ఈ నగరానికి ఏమైంది’’ మలయాళం యాడ్‌కు గళమిచ్చిన గోపన్ నాయర్‌ను అనుకరిస్తూ ఓ వీడియో కూడా చేసింది అఖిల. ఆ వీడియోకు మైఖేల్ జాక్సన్ ‘డేంజరస్’ పాట మ్యూజిక్‌ను జతకూర్చి ఒక కొత్త ప్రయోగానికి రూపమిచ్చింది. అన్నట్టు అఖిల .. కేరళకు చెందిన తొలి ‘లేడీస్ ఓన్లీ మిమిక్స్ పరేడ్ గ్రూప్’లో సభ్యురాలు కూడా. మీ లక్ష్యం ఏంటి అని అడిగితే ‘‘ఇలాగే ముగ్గురిని అనుకరిస్తూ ముప్పైమందిని నవ్వించడమే’’ అంటుంది నవ్వుతూ అఖిల ఏఎస్. ‘చిన్నప్పటినుంచీ పక్షుల కిలకిలారావాలు, జంతువుల అరుపులను బాగా అబ్జర్వ్ చేసేదాన్ని. నేను ఫస్ట్ మిమిక్రీ చేసింది కూడా పక్షుల కూతలనే. తర్వాత ఇంట్లోవాళ్లను, ఫ్రెండ్స్‌ని, టీచర్స్ని అనుకరించే దాన్ని. నిజానికి మా ఇంట్లో ఎవరికీ ఈ కళ లేదు. కేవలం పరిశీలనతో నా అంతట నేను నేర్చుకున్నదే. సెలబ్రిటీల విషయానికి వస్తే నేను ఎస్. జానకమ్మను ముందు ఇమిటేట్ చేశా. టీవీ బాగా చూస్తాను. నా స్కిల్‌ను పెంచి నాకు కచ్చితత్వాన్ని ఇస్తున్న సాధనం అదే’ – అఖిల -
షారుక్.. కమల్.. 4 నిమిషాల్లో 51మంది
సాధనమ్మున పనులు సమకూరును ధరణిలోన..ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదు అని కేరళకు చెందిన ఓ యువతి నిరూపిస్తోంది. మిమిక్రీ కళలో అద్భుతమైన ప్రతిభతో పలువురిని అబ్బుర పరుస్తోంది. మిమిక్రీ లేడీ సూపర్‌స్టార్‌గా దూసుకుపోతోంది. ప్రతీ సెకనుకు ఆమె గొంతు అద్భుతంగా వంపులు తిరుగుతుంది. ఆడ, మగ తేడా లేదు. సెలబ్రిటీలనుంచి ప్రముఖ రాజకీయవేత్తల దాకా ప్రముఖుల గొంతులను అనుకరిస్తారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలో 51మంది వాయిస్‌లను మిమిక్రీ చేయగల అసాధారణ నైపుణ్యం ఆమె సొంతం. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ అద్భుతం పేరే అఖిల. న్యూస్ మినిట్ కథనం ప్రకారం తిరువనంతపురం జిల్లా నేదుమంగాడ్ కు చెందిన అఖిలా ఎ.ఎస్ ఆయుర్వేద మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతోంది. పాఠశాల స్థాయినుంచే స్వయంగా మిమిక్రీ కళపై ఆసక్తి పెంచుకున్న ఆమె ఇంటర్ స్కూల్ పోటీల్లో తొలిసారి మిమిక్రీ కళను ప్రదర్శించింది. మొదట జంతువులను అనుకరిస్తూ వచ్చింది. ఆ తరువాత స్కూలు వార్షికోత్సవాల్లో టీచర్లను అనుకరించేంది. అలా జానకమ్మ పాట ‘అజకాదల్’ పాడానని అఖిల గుర్తు చేసుకుంటారు. అనేక టీవీ, మిమిక్రీ షోలను చూస్తూ నిరంతర సాధనతోనే పరిణతి సాధించారు. అలా మిమిక్రీ కళలో రాణిస్తున్న తొలి కేరళ యువతిగా అఖిల నిలవడం విశేషం. ప్రముఖ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్, షారూక్ ఖాన్ సహా అచ్యుతానందన్, ఉమెన్ చాందీ వంటి రాజకీయ నాయకులు స్వరాలు ఆమె గొంతులో అలవోకగా పలికిస్తుంది. దీంతోపాటు మైఖేల్ జాక్సన్ పాటల్లోని బీట్ శబ్దాలు కూడా ప్రత్యేకంగా ఆమె గొంతునుంచి జాలువారతాయి. పూక్కలం వరవాయ్ చిత్రంలో బేబీ షాలినికి కూడా ఆమె డబ్బింగ్ చెప్పారట. అంతేకాదు ధూమపాన వ్యతిరేక ప్రకటనల ద్వారా థియేటర్లలో వినిపించే గోపన్ నాయర్ వాయిస్‌ను అఖిల గొంతులో విని తీరాల్సిందే. ఓ టీవీలో ప్రసారమైన రియాలిటీ షో ద్వారా తనకు మంచి గుర్తింపు లభించిందని ఇంకా చేయాల్సి చాలా వుందంటారు అఖిల ఉత్సాహంగా. -
పులికి మిమిక్రీ చేయడం తెలుసు
పుట్టిన తర్వాత ఓ వారం రోజుల వరకూ పులులకు కళ్లు కనిపించవు. ఆ తర్వాతే మెల్లగా అన్నీ కనిపిస్తాయి. చూపు స్పష్టమ వడానికి కాస్త సమయం పడుతుంది! పులికి ఎంత బలముంటుందంటే... అది తనకంటే రెండు రెట్లు పెద్దదైన జీవిని కూడా తేలికగా చంపేయగలదు! తమ ఆహారం విషయంలో పులులు చాలా స్వార్థంగా ఉంటాయి. ఒక జంతువును చంపి తిన్న తర్వాత ఇంకా మిగిలితే... దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి, ఆకులతో కప్పి మరీ దాచిపెడతాయి. ఆ తర్వాత మళ్లీ ఆకలేసినప్పుడు వెళ్లి తింటాయి! పులి పిల్లలు రెండేళ్ల వరకూ తల్లిని అంటిపెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే అవి పద్దెనిమిది నెలల వరకూ వేటాడలేవు. అందుకే వేటలో నైపుణ్యం సంపాదించాక గానీ తల్లిని వదిలి వెళ్లవు! ఇవి ఒంటరిగా వేటాడటానికి ఇష్టపడతాయి. పైగా రాత్రిపూటే వేటాడతాయి! ఎంత ఒంటరిగా ఉండటానికి ఇష్టపడినా, సాటి పులి విషయంలో ఇవి చాలా స్నేహంగా మెలగుతాయి. తాను ఆహారాన్ని తింటున్నప్పుడు అక్కడికి మరో పులి వస్తే, దానికి తమ ఆహారాన్ని పంచుతాయివి! ఎందుకంటే, పులి ఆహారం కోసం, తనను తాను రక్షించుకోవడం కోసం తప్ప ఏ ప్రాణినీ చంపదు. పరిశీలిస్తుందంతే. అందుకే ఎప్పుడైనా పులి ఎదురుపడితే కంగారుపడి దాన్ని రెచ్చగొట్టకుండా... దాని కళ్లలోకే చూస్తూ, మెల్లగా వెనక్కి నడుస్తూ పోవాలని జీవ శాస్త్రవేత్తలు చెబుతుంటారు! పులులకు మిమిక్రీ చేయడం తెలుసు. ఒక్కోసారి వేటాడబోయే జంతువుని మోసగించడానికి, ఆ జంతువులాగే శబ్దాలు చేయడానికి ప్రయత్నిస్తాయి! పులుల జ్ఞాపకశక్తి మనుషుల కంటే ముప్ఫైరెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి అవి దేనినైనా గుర్తు పెట్టుకున్నాయంటే... చనిపోయేవరకూ మర్చిపోవు! -
హీరోయిన్గా హిరోషిణి
చెన్నై : ఆంధ్రా, తెలంగాణా యూట్యూబ్ ఛానల్లో పాపులర్ అయిన మిమిక్రీ ఆర్టిస్ట్ అచ్చ తెలుగమ్మాయి హిరోషిణి. ఈ చిన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో ఉట్రాన్ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అవుతోంది.సాట్ సినిమాస్ పతాకంపై ఓ.రాజా గజనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ఉట్రాన్. ఉట్రాన్ చిత్రం గురించి ఓ.రాజా గజనీ తెలుపుతూ సమీపకాలంతో హర్రర్, థ్రిల్లర్ వంటి సీక్వెల్స్‌కు తమిళసినిమా ప్రముఖ్యతనివ్వడంతో ఎవర్గ్రీన్ కథా చిత్రాలయిన ప్రేమ కథా చిత్రాల రాక కొరవైందన్నారు. ఆ లోటును తీర్చే చిత్రంగా ఉట్రాన్ ఉంటుందని చెప్పారు. ఇక కళాశాల యువకుడి నేపధ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఒక్క స్క్రూ ఆ యువకుడి జీవితాన్ని ఎలా మార్చేసిందన్నదే చిత్ర కథ అన్నారు. ఇది 1994లో చెన్నైలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు. ఇందులో రోషన్ అనే నటుడు హీరోగా పరిచయం అవుతున్నారని చెప్పారు. సినీ, పత్రికా రంగాల నేపధ్యం నుంచి వచ్చిన ఈయన పలు వాణిజ్య ప్రకటనల్లో నటించారని చెప్పారు. ఇక హీరోయిన్గా ఆంధ్రా, తెలంగాణాల్లో యూట్యూబ్ చానళ్లలో కోమలి సిస్టర్స్ పేరుతో మిమిక్రీ ఆర్టిస్టŠస్‌గా పేరు పొందిన యువతుల్లో ఒకరైన హిరోషిణిని హీరోయిన్గా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో ముఖ్య పాత్రల్లో జిన్నా, గానా పాటల్లో దుమ్మురేపుతున్న గానా సుధాకర్, ఒరు కల్ ఒరు కన్నాడీ ఫేమ్ మధుమిత, దర్శకుడు సరవణన్శక్తి, ఇమాన్ అన్నాచ్చి, విజయ్ టీవీ ఫేమ్ కోదండం, కాదల్ చిత్రం ఫేమ్ సరవణన్, సులక్షణ నటిస్తున్నట్లు తెలిపారు. రఘునందన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ద్వారా కెమెరామెన్ సుకుమార్ శిష్యుడు హాలీక్ ప్రభును చాయాగ్రహకుడిగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. -
నరేంద్రమోదీ వాయిస్‌ను మిమిక్రీ చేసిన రాహుల్
-
వైరల్ : అచ్చం మోదీలాగా రాహుల్‌గాంధీ..!
మోరేనా : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచార హోరు పెంచారు. భారీ బహిరంగ సభల్లో బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మోరేనాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ నరేంద్రమోదీ వాయిస్‌ను మిమిక్రీ చేశారు. మోదీ హవాభావాలతో ప్రసంగిస్తూ.. ‘మిత్రులారా..! నన్ను ప్రధాన మంత్రి అని పిలవకండి. వాచ్మెన్ అని పిలవండి’ అంటూ తియ్యగా మాట్లాడి నరేంద్ర మోదీ ప్రజల్ని మభ్యపెడతాడని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రజలను మిత్రులారా అని పేర్కొంటూ రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో వేల కోట్లు ఎగవేసిన మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలకు ‘సోదరుడి’గా వ్యవహరిస్తున్నాడని విమర్శలు గుప్పించారు. కాగా, రాఫెల్ డీల్‌లో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించిందనే ఆరోపణలతో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఇక నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ వరసగా మూడు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నుంచి అధికారాన్ని ‘హస్త’గతం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తోంది. -
మిమిక్రీతో క్రిమినల్‌ను బెదరగొట్టిన పోలీసు..!
-
మిమిక్రీతో క్రిమినల్‌ను హడలెత్తించిన పోలీసు..!
లక్నో : ఓ పోలీసు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కరుడుగట్టిన నేరస్తుడు పట్టుబడ్డాడు. పిస్తోల్ జామ్ కావడంతో ఏం చేయాలో తోచని కానిస్టేబుల్ మిమిక్రీతో బుల్లెట్లు దూసుకెళ్లున్న శబ్దం చేశాడు. నేరస్తున్ని పారిపోకుండా బెదిరింపులకు గురిచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంబాల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు..18 క్రిమినల్ కేసుల్లో నిందితునిగా ఉన్న రుక్సార్ పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే, ఇటీవల రుక్సార్ జాడ తెలుసుకున్న పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. గాల్లోకి కాల్పులు జరిపి లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. అంతలోనే ఇరు వర్గాల మధ్య ఎన్కౌంటర్ కూడా మొదలైంది. ఇంతలోనే ఓవైపున్న పోలీసు ఇన్స్పెక్టర్ తుపాకీ జామ్ అయింది. (కారు ఆపనందుకు కాల్చేశారు) అయితే, విషయం బయటకు తెలిస్తే క్రిమినల్ తమపై కాల్పులు జరిపి పారిపోతాడని గ్రహించిన ఓ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించాడు. ఇన్స్పెక్టర్ పక్కన నిల్చుని బుల్లెట్లు గాల్లోకి దూసుకెళ్లినట్టు మిమిక్రీ చేశాడు. అంతలోనే స్పందించిన మిగతా పోలీసులు పారిపోయే ప్రయత్నం చేసిన రుక్సార్ కాలికి గురిపెట్టి కాల్చారు. క్రిమినల్‌ను అరెస్టు చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. కాగా, రుక్సార్ తలపై 25 వేల రివార్డు ఉంది. ఇదిలా ఉండగా.. రెండు వారాల క్రితం కారు ఆపలేదని ఆపిల్ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగిని లక్నోలోని గోమతినగర్‌లో పోలీసులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. (తివారి హత్య; కానిస్టేబుల్ భార్యకు భారీ విరాళం!) -
సీనియర్ హాస్య నటుడు మృతి
సీనియర్ నటుడు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ రాకెట్ రామనాథన్ (74) కన్నుమూశారు. తమిళంలో పలువురు నటులకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సుపరిచితుడైన రామనాథన్.. నటుడిగా నామ్, స్పరిశం, మన్‌సోరు, కోవిల్‌యానై చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డును, నడిగర్ సంఘం నుంచి కలచ్ఛసెల్వం బిరుదును అందుకున్నారు. రాకెట్ రామనాథన్‌కు భార్య భానుమతి, కొడుకు గురు బాలాజీ, కూతు రు సాయిబాల ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖలు సంతాపం తెలిపారు. దక్షిణ భారత నటీనటుల సంఘం సంతాపం వ్యక్తం చేస్తూ ఒక లేఖను మీడియాకు విడుదల చేసింది. రాకెట్ రామనాథన్ భౌతిక కాయానికి బుధవారం సాయంత్రం కృష్ణాపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. -
నేరెళ్ల వేణుమాధవ్ ఫోటోలు మీ కోసం
-
స్వరబ్రహ్మ నేరెళ్ల వేణుమాధవ్ ఇకలేరు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, స్వరబ్రహ్మ నేరెళ్ల వేణుమాధవ్ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొన్నిరోజులుగా వెంటిలేటర్‌పై ఉండి చికిత్స పొందారు. మిమిక్రీ రంగంలో తనదైన సొంత ఒరవడితో, సొంత శైలితో స్వరబ్రహ్మగా వేణుమాధవ్ పేరుతెచ్చుకున్నారు. కళారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఇటీవల ఆయన పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. 2001లో పద్మశ్రీ పురస్కారం ఆయనను వరించింది. శ్రీరాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డునూ ఆయన అందుకున్నారు. ఆయన మృతిపై సర్వత్రా సంతాపం వ్యక్తమవుతోంది. వరంగల్‌లో జననం బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నేరెళ్ల వేణుమాధవ్ 1932 డిసెంబర్ 28న వరంగల్‌లోని మట్టెవాడలో జన్మించారు. 16 ఏళ్లకే ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. చిలకమర్తి ప్రహసనాల్లో నటించడం ద్వారా రంగస్థలానికి పరిచయం అయ్యారు. అనంతరం పలువురు ప్రముఖుల గొంతును అనుకరిస్తూ.. అనతికాలంలో విశేషమైన పేరుప్రఖ్యాతలు గడించారు. ఇంగ్లిష్ సినిమాల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్‌తో సహా మిమిక్రీ చేయడంలో ఆయన సిద్ధహస్తులు. 1947లో ఆయన తొలి మిమిక్రీ ప్రదర్శన ఇచ్చారు. 1953లో హన్మకొండలో జీసీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఆయన పనిచేశారు. అదే సంవత్సరం రాజమండ్రిలో థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్‌లో మలి ప్రదర్శన ఇచ్చారు. 1975లో శోభావతితో వేణుమాధవ్ వివాహం జరిగింది. వేణుమాధవ్‌కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మిమిక్రీ కళలో తిరుగులేని రారాజుగా ఎదిగిన ఆయన దేశవిదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. 2005లో తెలుగు యూనివర్సిటీ నుంచి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం అందుకున్నారు వేణుమాధవ్ నిర్వహించిన పదవులు 1976-77 మధ్యకాలంలో ఎఫ్డీసీ డైరెక్టర్‌గా వేణుమాధవ్ వ్యవహరించారు 1974-78లో సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా కొనసాగారు సౌత్‌జోన్ కల్చరల్ కమిటీ తంజావూరు సభ్యుడిగా ఉన్నారు 1993-94లో దూరదర్శన్ ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా టెలికం అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా, రైల్వో జనల్ యూజర్స్ కమిటీ సభ్యుడిగా సేవలు అందించారు ఏపీ లెజిస్లేటివ్ లైబ్రరీ కమిటీ సభ్యుడిగా, రవీంద్రభారతి కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. 1975-76లో ప్రభుత్వ అకడమిక్ రివ్యూ కమిటీ సభ్యుడిగానూ పనిచేశారు ‘నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్’ను స్థాపించి వర్ధమాన కళాకారులకు చేయూతనిచ్చారు వేణుమాధవ్ బిరుదులు ఇవే.. ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, కళా సరస్వతి, స్వర్కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, ధ్వన్యనుకరణ చక్రవర్తి, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ సంతాపం ప్రముఖ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మిమిక్రీకి గుర్తింపు తీసుకువచ్చి.. చరిత్రలో చిరస్థాయిగా నేరెళ్ల నిలిచిపోయారు. ధ్వని అనుకరణ సామ్రాట్ ఆయన. మిమిక్రీని పాఠ్యాంశంగా, అధ్యయన అంశంగా మలిచి.. మిమిక్రీ పితామహుడిగా వేణుమాధవ్ ప్రఖ్యాతి గాంచారు’ అని సీఎం కేసీఆర్ కీర్తించారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తెలుగు జాతికి తీరని లోటు : వైఎస్ జగన్ మహాకళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్.. ఆయన మృతి తెలుగు జాతికి తీరని లోటు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తెలుగువారికి ఎంతో కీర్తిప్రతిష్టలు ఆయన తీసుకొచ్చారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా వేణుమాధవ్‌కు అసంఖ్యాక అభిమానులు ఉన్నారని, దశాబ్దాలుగా ఆయన వందలమంది మిమిక్రీ కళాకారులకు మార్గదర్శనం చేశారని అన్నారు. అనేక భారతీయ భాషల్లో స్వరానుకరణ, హాలీవుడ్ నటుల స్వరాలను కూడా అలవోకగా పలికించటంతోపాటు హాస్యం పండించడం ద్వారా వేణుమాధవ్ కోట్లమంది హృదయాలకు చేరువయ్యారని పేర్కొన్నారు. వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాహుల్ గాంధీలా మిమిక్రీ చేస్తూ...
సాక్షి, బెంగళూరు : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బీదర్‌లో నిర్వహించిన ర్యాలీలో షా ప్రసంగించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ గొంతును అనుకరిస్తూ షా మిమిక్రీ చేశారు. ‘‘రాహుల్ బాబాను కదిలిస్తే చాలూ ‘ ప్రధాని గారూ.. ఈ నాలుగేళ్లలో మీరు దేశానికి ఏం చేశారు?’ అని ప్రశ్నిస్తున్నాడు’’ అంటూ రాహుల్ గొంతును షా అనుకరించారు. (దీంతో సభకు హాజరైన వారంతా నవ్వుకున్నారు). ‘కానీ, రాహుల్ బాబా నువ్వు అంతలా ఎందుకు అరుస్తున్నావ్?. పదే పదే ఏం చేశారని మోదీని ఎందుకు ప్రశ్నిస్తున్నావ్? కానీ, ప్రజలు మీ నాలుగు తరాల(కాంగ్రెస్ పాలన)లతో జరిగిన నష్టం వల్లే ఎక్కువ బాధపడ్డారు. ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నారు. మా ప్రభుత్వం ఆ తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కర్ణాటకలో ఈసారి అధికారం బీజేపీదే. ముందు నువ్వు అది తెలుసుకో’ అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి షా పేర్కొన్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నీరవ్ మోదల్, రఫెల్ ఒప్పందం తదితర విషయాల్లో మోదీ మౌనంగా ఉన్నారంటూ రాహుల్ విమర్శలు గుప్పించారు. అంతే కాదు అవినీతి పరులను పక్కనపెట్టుకుని మోదీ అవినీతిపై యుద్ధం అంటూ మాట్లాడం హాస్యాస్పదంగా ఉందంటూ చురకలు అంటించారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన బీజేపీ చీఫ్ అమిత్ షా గత రెండు రోజులుగా ర్యాలీల్లో పాల్గొంటూ కాంగ్రెస్‌కు కౌంటర్ ఇస్తున్నారు. ఏప్రిల్ 15లోపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన... ఈసీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఏప్రిల్ 15వ తేదీలోపు ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఓం ప్రకాశ్ రావత్ వెల్లడించారు. ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఏప్రిల్ మొదటి వారంలో ఈసీ బృందం పర్యటిస్తుందని.. పరిస్థితులను సమీక్షించి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని తెలిపారు. విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ తెలిపారు. కాగా, మే 28వ తేదీతో కర్ణాటక ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. -
రాహుల్ గాంధీలా మిమిక్రీ చేసిన అమిత్ షా
-
నేరెళ్ల వేణుమాధవ్‌కు అరుదైన గౌరవం
-
నేరెళ్ల వేణుమాధవ్‌పై ప్రత్యేక తపాలా కవర్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: మిమిక్రీలో 70 ఏళ్ల కళా జీవితాన్ని పూర్తి చేసుకున్న మిమిక్రీ దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 86వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ ఆయనపై ప్రత్యేక తపాలా కవర్‌ను ఆవిష్కరించింది. మంగళవారం హైదరాబాద్ జనరల్ పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్ ఈ తపాలా కవర్‌ను ఆవిష్కరించి విడుదల చేశారు. అనంతరం నేరెళ్ల వేణుమాధవ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తన అసమాన ధ్వని అనుకరణ ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జాతికి పేరుప్రతిష్టలు తెచ్చిపెట్టిన దిగ్గజం వేణుమాధవ్ అని కొనియాడారు. మిమిక్రీలో 70 ఏళ్ల పాటు చేసిన కృషికి గుర్తుగా తపాలా శాఖ ఈ అరుదైన గౌరవం ఇస్తోందన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు దివంగత సంజయ్ గాంధీ సభలో వేణుమాధవ్ మిమిక్రీ ప్రదర్శనను చూసి మంత్రముగ్ధుడిని అయ్యానని, ఇప్పుడు ఆయన పక్కన కూర్చోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ.. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు మామూలేనని, అయితే తపాలా శాఖ ఇచ్చిన ఈ అరుదైన గౌరవానికి మాటలు రావడం లేదన్నారు. తన పేరుపై ప్రత్యేక పోస్టల్ కవర్‌ను విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ పోస్టుమాస్టర్ జనరల్ ఎం.రాజేంద్రప్రసాద్, సినీనటుడు రావి కొండల్రావు, పోస్ట్‌మాస్టర్ జనరల్ ఏలిషా, డైరెక్టర్ వెన్నం ఉపేంద్ర, వీవీవీ సత్యనారాయణరెడ్డి, ఆశాలత, జీవీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
మోదీని సీఎం మిమిక్రీ చేయడం తగదు
వైట్‌ఫీల్డ్: దేశ ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ సీఎం సిద్ధరామయ్య మిమిక్రీ చేయడం ఆయన స్థాయికి తగదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు ఆక్షేపించారు. శనివారం మారతహళ్లి న్యూహారిజన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ‘పొలిటిక్స్ ఆఫ్ గుడ్ గవర్ననెస్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిం మాట్లాడారు. ప్రపంచంలోనే మోదీ గురించి ఎన్నో సర్వేలు మంచి పాలన అందిస్తున్నట్లు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బాహుబలి సినిమా ఎంత విజయం సాధించిందో అందరికీ తెలుసని, అదే రీతిలో మోదీ ప్రధానిగా మరింత విజయాన్ని సాధిస్తున్నారని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద లింబావళి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. మహదేవపుర నియోజకవర్గాన్ని ఒక మోడల్‌గా తీర్చిదిద్ధుతానని అన్నారు. సినీనటులు, బీజేపీ నేత సాయికుమార్ మాట్లాడుతూ.. మోదీ చేపట్టిన ప్రగతితో కర్ణాటకలో కూడా వచ్చే ఎన్నికల్లో తమపార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు. బీజేపీ కిసాన్మార్చా జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, కదిరి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
నవ్వుల దసరా
-
ఆ కోరిక ఇంకా తీరలేదు!
టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్ చూసేవాళ్లకి చిరపరిచితుడు. లైవ్‌షోస్ అలవాటున్నవారు లైక్ కొట్టే మాస్టర్ ఆఫ్ సెర్మనీ. అనుకరణ కళాభిమానులకు మిమిక్రీ మిస్సైల్. సినిమా ప్రేక్షకులకీ తెలిసినోడు... యాడ్సలోనూ కనిపిస్తాడు. ప్రైవేటు సంస్థల బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రత్యక్షమవుతాడు. స్టాండప్ కామెడీ నుంచి షార్ట్ ఫిల్మ్‌ల దాకా... ఒక రంగంలో సక్సెస్ అయితే అక్కడే అతుక్కుపోయి ఫ్యూచర్‌ను వెతుక్కునే ధోరణికి దూరంగా, నచ్చిన ప్రతి రంగానికీ దగ్గరగా తనను తాను నిత్య నూతనంగా మలచుకుంటున్న లోహిత్ కుమార్ తన గురించి ‘సాక్షి’తో పంచుకున్న కబుర్లు ఆయన మాటల్లోనే... ఎంటర్టైన్మెంట్... ఓ సెంటిమెంట్... మాది వరంగల్ జిల్లాలోని పెదవోడూరు గ్రామం. రైతు కుటుంబం. నాకో అన్నయ్య ఉన్నాడు. ప్రస్తుతం ప్రభుత్వోద్యోగి. ఆవులు, గేదెలు, దూడలు, పక్షులు, పిట్టల పలకరింపులు వింటూ... వాటిని అనుకరిస్తూ పెరిగాను. అదే నా తొలి మిమిక్రీ స్కూల్ అని చెప్పాలి. స్నేహితులు, బంధువుల సమూహం ఎక్కడ కనపడినా వారిని ఏదో ఒక రకంగా ఎంటర్టైన్ చేయడం నాకలవాటు. బహుశా అదే ఇంకా కంటిన్యూ అవుతోందనుకుంటా. చిన్నప్పుడు అబ్బిన మిమిక్రీ కాలేజీడేస్‌లో స్టేజ్ ప్రోగ్రామ్స్‌తో పాటు యాడ్స్‌లోనూ భాగం అయ్యేలా చేసింది. అలా డిగ్రీ చదివేటప్పుడే నేను సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయిపోయా. అందుకేనేమో... నాకెప్పుడూ ఫ్యూచర్ గురించి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలగదు. కొత్త కొత్త రంగాలవైపు నా ప్రయాణం ఆగలేదు. అనుకరిస్తూ... అనుభూతిస్తూ... గుంటూరులోని హిందూ కాలేజ్ ద్వారా మిమిక్రీలో వరుసగా 3 సార్లు స్టేట్ ఫస్ట్ వచ్చాను. కేవలం 15 నిమిషాల్లో 150 శబ్ధాలు పలికించి తక్కువ టైమ్‌లో అత్యధిక శబ్ధాలు అనుకరించిన కళాకారుడిగా 1992లో లిమ్కాబుక్‌లోకి ఎక్కాను. ఈ రికార్డ్ ఇప్పటికి అలాగే నా పేరు మీదే ఉంది. ప్రతిరోజూ ఒక కొత్త వాయిస్ సాధన చేయడం నాకు అలవాటు. కమల్ హాసన్ వాయిస్ అనుకరణతో బాగా పేరొచ్చింది. వ్యక్తిగతంగా టాలీవుడ్ విలన్ షియాజీ షిండే వాయిస్ ఇష్టం. వేదిక ఎక్కితే వినోదం పంచడమే నాకు తెలుసు. అందుకు ఎలాంటి అవకాశం వచ్చినా వదులుకోను. ఆ క్రమంలోనే పరిచయస్థుల సూచనమీద ఓ ప్రోగ్రామ్‌లో ఎమ్సీ (మాస్టర్ ఆఫ్ సెర్మనీ) గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వేల సంఖ్యలో ఎమ్సీగా చేశాను. . సీరియల్స్ టూ సినిమాస్... బాపుగారి బుడుగు టివి సీరియల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు నాకు 24 ఏళ్లు. అప్పటి నుంచి ఇక వెనుతిరిగి చూడకుండా 17కి పైగా సీరియల్స్ చేశాను. మనసు చూడతరమా? పుత్తడిబొమ్మ, గోరింటాకు, మేఘమాల... ఇలాంటి సూపర్‌హిట్స్ ఉన్నాయి. యండమూరి లేడీస్ హాస్టల్లో మెయిన్ క్యారెక్టర్ చేశాను. ఒకేసారి 6 సీరియల్స్‌కి చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న రోజుల్లోనూ ఇతర అభిరుచుల్ని, కొత్తవి నేర్చుకోవడాన్ని మానలేదు. సీనియర్దర్శకుడు కోదంరామిరెడ్డి తీసిన 2 షార్ట్ ఫిల్మ్స్‌లో లీడ్‌రోల్స్ చేశాను. ఇక ఇప్పుడు సినిమాల మీదే ఎక్కువ దృష్టి పెట్టాను. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన స్నేహగీతం సహా ఇప్పటిదాకా 15 సినిమాల వరకూ చేసుంటాను. ఓ మనసు, రాంగ్‌రూట్, అక్షరం, సతీ తిమ్మమాంబ తదితర చిత్రాల్లో నటిస్తున్నాను. అగ్నిసాక్షిగా, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రూపొందించిన లేడీస్ అండ్ జెంటిల్మన్ విడుదల కానున్నాయి. కమెడియన్‌గా, విలన్‌గా, కామెడీ విలన్‌గా చేయాలనే కోరిక తీరాలి. ఏ స్టేజ్‌లో ఉన్నా స్టేజ్ మీదే... షూటింగ్ లేకపోతే యాంకరింగ్ అది లేకపోతే మిమిక్రీ, అది లేకపోతే ఎమ్సీగా... ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అభినయాన్ని, హాస్యాన్ని కలబోసిన స్టాండప్ కామెడీని అందించే అతితక్కువ తెలుగు స్టేజ్ పెర్ఫార్మర్లలో ఒకడిని అయ్యాను. దాదాపు 13 సంవత్సరాల పాటు ల్యాంకో సంస్థలో రిక్రియేషన్ అంబాసిడర్‌గా చేశాను. తాజాగా బేస్ థింగ్స్ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా ఎంపికయ్యా. ప్రసాద్ అనే స్నేహితుడితో కలిసి పిఎల్ మీడియా వర్క్స్ బేనర్ మీద సినిమా నిర్మాణంలోకి కూడా ప్రవేశించాను. ‘ఎప్పటి నుంచో చూస్తున్నాం... ఇంకా అంతే యంగ్‌గా కనిపిస్తున్నావ్’ అని ఫ్రెండ్స్ నన్ను అంటుంటారు. చేసే పనిలో రొటీన్ ఫీలింగ్ లేకపోతే బోర్ ఉండదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎగ్జయిట్మెంట్ అందుకుంటుంటే... అదే టానిక్‌లా పనిచేసి మనల్ని నిత్య యవ్వనులుగా ఉంచుతుందని నా నమ్మకం. - ఎస్.సత్యబాబు -
‘షో’భన్ బాబు
♦ పాటలు, డ్యాన్స్, మిమిక్రీ, యాంకరింగ్‌లో ప్రతిభ ♦ రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రదర్శనలు.. పలువురి ప్రశంసలు పాటలు పాడటం.. పేరడీగా మలచడం.. ధ్వన్యనుకరణ చేయడం.. ఇతరుల డ్యాన్స్‌ను అనుకరించడం.. యాంకరింగ్‌తో ఆకట్టుకోవడం.. షార్ట్ ఫిలింస్‌లో నటనా కౌశలాన్ని ప్రదర్శించడం.. ఇలా వివిధ విభాగాల్లో ప్రతిభ చాటుతున్నాడు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో బహుమతులు దక్కించుకోవడంతోపాటు ప్రముఖుల మెప్పు పొందుతున్నాడు నగరానికి చెందిన శోభన్‌బాబు. వేదికలపై నిత్యం ప్రదర్శనలతో అలరించే ఆయన అందరి దృష్టిలో ‘షో’భన్బాబుగా మారాడు. - ఖమ్మం కల్చరల్ నగరంలోని ఎన్నెస్పీ కాలనీకి చెందిన శోభన్‌బాబు ప్రైవేటు ఉద్యోగి. ప్రవృత్తిగా కళారంగాన్ని ఎంచుకున్నాడు. 1996లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి కళారంగంలో రాణిస్తున్నాడు. అప్పట్లోనే జిల్లాస్థాయి పాటల పోటీల్లో ప్రతిభ కనబరిచి.. ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. సినిమా పాటలకే ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా జానపద పాటలు ఎక్కువగా పాడుతూ పల్లె సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించడం అలవర్చుకున్నాడు. క్రమక్రమంగా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అంతేకాక డ్యాన్స్‌లు చేస్తూ.. ఇతరులను అనుకరించడం అలవర్చుకున్నాడు. డ్యాన్స్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, రాజశేఖర్, బ్రహ్మానందం, ఆర్.నారాయణ మూర్తి, శోభన్‌బాబు తదితర హీరోలను అనుకరించడంలో నేర్పు సంపాదించాడు. ఖమ్మంకు చెందిన మొగిలి దర్శకుడిగా గతేడాది విడుదల అయిన ‘ఒక్కడితో మొదలైంది’ అనే సినిమాలో హీరో సుమన్ పక్కన ఓ పాత్రలో నటించాడు. వేదికలపై యాంకరింగ్ చేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంటాడు. ఒకే వేదికపై యాంకరింగ్‌తోపాటు పాట పాడుతూ.. డ్యాన్స్ చేస్తూ.. మిమిక్రీ చేయడం ఇతడి అదనపు ప్రత్యేకతలు. పలు టీవీ సీరియల్స్, లఘు చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించిన అనుభవం ఉంది. అతడి ఉత్తమ నటనకు పలువురిచే ప్రశంసలు అందుకున్నాడు. సినిమా పాటలను యువతకు నచ్చేలా పేరడీ పాటలుగా మలిచి పాడటంలో సిద్ధహస్తుడు. అవార్డులు, ప్రశంసలు కొన్ని... ♦ 2001లో విజయవాడ రాష్ట్రస్థాయి నాటికల పోటీల్లో సిద్ధార్థ అకాడమీలో ‘పిచ్చి పెళ్లికొడుకుగా’ నవ్వించి..ప్రథమ బహుమతి పొందాడు. ♦ 2002లో హైదరాబాద్‌లో జరిగిన పాటల పోటీల్లో ప్రథమ బహుమతి ♦ 2002లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన యూత్ ఫెస్టివల్ పాటల పోటీల్లో పాల్గొన్నాడు ♦ 2006లో జోనా మెమోరియల్ రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో ప్రథమ బహుమతి. ♦ 2007లో వరంగల్ రాష్ట్రస్థాయి యూత్ ఫెస్టివల్లో మిమిక్రీ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించాడు. ♦ 2008లో తెలుగు భాషా దినోత్సవంలో వక్తృత్వ పోటీల్లో ద్వితీయ బహుమతి పొందాడు. వీటితోపాటు సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్, సునీల్, సుమన్, రఘు కుంచె, డెరైక్టర్ బి.గోపాల్ చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నాడు. -
మిమిక్రీ మేళా 12th December 2015 Part 1
-
సుడిగాలి.. జడివాన
మిమిక్రీ అనగానే.. హీరోల గొంతులు, రాజకీయ నాయకుల ప్రసంగాల అనుకరణే గుర్తుకొస్తుంది. ప్రాకృతికమైన ధ్వనులని తమ గళంలో మేళవించే పట్టున్నవాళ్లు కొద్దిమందే. అలాంటివారిలో మేటి చిట్టూరి గోపీచంద్. పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ స్ఫూర్తితో 45 ఏళ్లుగా ఈ రంగంలో కొనసాగుతున్న ఆయన ఇటీవలే అమెరికాలో జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పరిచయం.. ..:: కోన సుధాకర్‌రెడ్డి బయట వర్షం పడుతుంటే ఇంట్లో ముసుగుతన్ని పడుకొని ఆ సవ్వడిని విని ఆనందించేవాళ్లు ఎంతోమంది. కానీ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే గాలుల చప్పుడును వినాలంటే? గాలి ధాటికి ఎక్కడికో కొట్టుకుపోతాం.. వినడమే సాధ్యం కాదు! అలాంటి అసాధ్యాన్ని తన స్వరంతో సుసాధ్యం చేశారాయన. ఇక సినీనటుల గొంతులని అవలీలగా అనుకరించేస్తారు. రాజకీయ నాయకుల స్వరాలకు వ్యంగ్యం జోడిస్తారు. నదీ ప్రవాహ సవ్వడులు, పశుపక్ష్యాదుల అరుపులు.. ఒకటేమిటి సకల శబ్దాలను అనుకరించగల గోపీచంద్ ఉచితంగా ఎందరికో మిమిక్రీలో శిక్షణ ఇస్తున్నారు. మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్‌లో 30 రకాలు గోపీచంద్ సృష్టించినవే ఉన్నాయి. సినీ ఆర్టిస్టుల తొలినాళ్ల వాయిస్- ఇప్పటి వాయిస్, ప్రకృతి వైపరీత్యాల సవ్వడుల వంటివి ఆయన పేటెంట్! జీవితాన్ని నేర్పిన సినారె... సినారె పాల్గొన్న ఓ కార్యక్రమంలో మిమిక్రీ చేసిన గోపీచంద్.. ఆయన వద్ద మిమిక్రీలో సాహిత్యాన్ని ఎంతవరకు ఉపయోగించవచ్చో నేర్చుకొన్నారు. ఆయన ప్రభావంతోనే ‘అక్షరమంజీరాలు, సాగరమేఖల, స్వాప్నిక్, వె న్నెల, దివ్యనాగావళి’ వంటి కావ్యాలని రచించారు. ‘ప్రేమకు వేళాయెరా’ చిత్రంతో సహా పలు సినిమాల్లో నటించారు. ‘మిమిక్రీ కళకు నాడు ఎంత అదరణ ఉందో ఇప్పుడు అంతకు రెట్టింపైంది. చాలా మంది ఈ కళపై ఆధారపడి బతుకుతున్నారు. నేటి యువత కూడా ఆకర్షితులు అవుతున్నారు. అద్భుతంగా చేస్తున్నారు’ అని కితాబిస్తారాయన. తెనాలిలో స్కూల్ స్థాయిలో పిట్టల అరుపుల వంటి నేచురల్ సౌండ్స్ ఇమిటేట్ చేయడం మొదలుపెట్టిన ఆయన.. కాలేజీకి వచ్చేసరికి ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అయిపోయారు. 15 ఏళ్ల వయసులోనే ప్రదర్శనలు ప్రారంభించిన గోపీచంద్ ఈ 45 ఏళ్లలో వేల ప్రదర్శనలు ఇచ్చారు. సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్, ఖతర్, మస్కట్, బ్యాంకాక్, అమెరికా సహా 14 దేశాలు చుట్టివచ్చారు. -
పులులు మిమిక్రీ చేస్తాయా?!
జంతు ప్రపంచం ►పుట్టిన తర్వాత ఓ వారం రోజుల వరకూ పులులకు కళ్లు కనిపించవు. ఆ తర్వాతే మెల్లగా అన్నీ కనిపిస్తాయి. చూపు స్పష్టమవడానికి కాస్త సమయం పడుతుంది. పులికి ఎంత బలముంటుందంటే... అది తనకంటే రెండు రెట్లు పెద్దదైన జీవిని కూడా చాలా తేలిగ్గా చంపేయగలదు! ►ఆహారం విషయంలో పులులు చాలా స్వార్థంగా ఉంటాయి. ఒక జంతువును చంపి తిన్న తర్వాత ఇంకా మిగిలితే... దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి, ఆకులతో కప్పి మరీ దాచిపెడతాయి. ఆ తర్వాత మళ్లీ ఆకలేసినప్పుడు వెళ్లి తింటాయి! ►పులి పిల్లలు రెండేళ్ల వరకూ తల్లిని అంటిపెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే అవి పద్దెనిమిది నెలల వరకూ వేటాడలేవు. అందుకే వేటలో నైపుణ్యం సంపాదించాక గానీ తల్లిని వదిలి వెళ్లవు! ►ఇవి ఒంటరిగా వేటాడటానికి ఇష్టపడతాయి. పైగా రాత్రిపూటే వేటాడతాయి! ►ఎంత ఒంటరిగా ఉండటానికి ఇష్టపడినా, సాటి పులి విషయంలో ఇవి చాలా స్నేహంగా మెలగుతాయి. తాను ఆహారాన్ని తింటున్నప్పుడు అక్కడికి మరో పులి వస్తే, దానికి తమ ఆహారాన్ని పంచుతాయివి! ఎందుకంటే, పులి ఆహారం కోసం, తనను తాను రక్షించుకోవడం కోసం తప్ప ఏ ప్రాణినీ చంపదు. పరిశీలిస్తుందంతే. అందుకే ఎప్పుడైనా పులి ఎదురుపడితే కంగారుపడి దాన్ని రెచ్చగొట్టకుండా... దాని కళ్లలోకే చూస్తూ, మెల్లగా వెనక్కి నడుస్తూ పోవాలని జీవ శాస్త్రవేత్తలు చెబుతుంటారు! ►పులులకు మిమిక్రీ చేయడం తెలుసు. ఒక్కోసారి వేటాడబోయే జంతువుని మోసగించడానికి, ఆ జంతువులాగే శబ్దాలు చేయడానికి ప్రయత్నిస్తాయి! పులుల జ్ఞాపకశక్తి మనుషుల కంటే ముప్ఫైరెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి అవి దేనినైనా గుర్తు పెట్టుకున్నాయంటే... చనిపోయేవరకూ మర్చిపోవు. -
గురుబ్రహ్మి
1979... ప. గో. జిల్లా, అత్తిలిలోని ఎస్.వి.ఎస్.ఎస్.ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్... వేసవి సెలవులు పూర్తయి వారం అవుతోంది. అన్ని క్లాసుల్లోనూ స్టూడెంట్స్ పలుచ పలుచగా ఉన్నారు. కానీ, ఒక్క క్లాస్ రూమ్ మాత్రం హౌస్‌ఫుల్! ఒక తెలుగు లెక్చరర్ పద్యం పాడుతుంటే పిన్‌డ్రాప్ సెలైన్స్. అదే పద్యాన్ని ఎన్టీఆర్‌లాగా, ఏయన్నార్లాగా, కృష్ణలాగా మిమిక్రీ చేసి పాడుతుంటే అందరూ ఈలలూ చప్పట్లూ. బట్టీ పట్టకుండానే ఆ పద్యం కంఠతా వచ్చేసింది వాళ్లకు. ఆ లెక్చరర్ స్టయిలే అంత! ఏదైనా కామెడీ మిళాయించే చెబుతారు. చేదు మాత్రకు షుగర్ కోటింగ్ తరహా. లేకపోతే ఓ తెలుగు క్లాస్‌కి అంత అంటెడెన్సా! ఇలాంటి ఇన్సిడెంట్లు ఆ తెలుగు లెక్చరర్ ఖాతాలో చాలానే ఉంటాయ్. ఇంతకూ ఆ తెలుగు లెక్చరర్ ఎవరో చెప్పనేలేదు కదా. హి ఈజ్ వన్ అండ్ ఓన్లీ బ్రహ్మానందం! 30 ఏళ్లుగా తెలుగు తెర నంబర్‌వన్ కమెడియన్. ఆయన పూర్వాశ్రమంలో తెలుగు లెక్చరర్. సుమారు ఎనిమిదేళ్లు అత్తిలి కాలేజ్‌లోనే పనిచేశారు. ఆ ఊరితోనూ... ఆ కాలేజ్తోనూ... అక్కడి స్టూడెంట్స్‌తోనూ... బ్రహ్మానందంకు బోలెడంత అనుబంధం ఉంది. ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్లంతా ఎక్కడెక్కడో ఉన్నారు. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా వాళ్లకు ఇప్పటికీ గురువు గుర్తున్నారు. వాళ్లల్లో కొంతమందిని తమ గురువు గురించి అడిగితే... ఆ జ్ఞాపకాల ప్రవాహంలో తడిసి ‘బ్రహ్మానంద’భరితులయ్యారు. ఆయన బోధించిన సవర్ణదీర్ఘ సంధి, చంపకమాల, ఉత్పలమాల... అన్నీ ఇప్పటికీ గుర్తున్నాయి! ‘కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజ... అనే పద్యాన్ని ఎన్టీఆర్ అయితే ఎలా పాడతారు... ఏయన్నార్ అయితే ఇంకెలా పాడతారు... కృష్ణ, గుమ్మడి అయితే ఇంకే తీరుగా పాడతారు... ఒకసారి ఊహించుకోండి. మాకైతే ఆ అవసరం రాలేదు. ఎందుకంటే మా గురువుగారు... అదేనండీ బ్రహ్మానందంగారు ఇవన్నీ మాకు క్లాసులో మిమిక్రీ చేసి వినిపించేవారు. అంతేకాదు, ఇందిరాగాంధీ ఎలా మాట్లాడతారో, అచ్చం అలానే దింపేసేవారు. విమానం ల్యాండింగ్ కూడా భలే చేసేవారు. అసలు ఆయన క్లాస్ అంటేనే జోక్స్మయం. అందుకేనేమో మేం జ్వరమొచ్చినా ఆయన క్లాస్‌కి మాత్రం డుమ్మా కొట్టేవాళ్లం కాదు. ఆయన మిమిక్రీ చేస్తే బ్రహ్మాండం! దానివల్లే ఆయన చుట్టుపక్కల ఊళ్లల్లో పాపులర్ అయిపోయారు. పక్క ఊళ్లలో ఆయన మిమిక్రీ షోస్ చేయడానికి వెళ్తే, నేను ఆయనను నా సైకిల్ మీదే తీసుకెళ్లేవాణ్ణి. అత్తిలి సంత మార్కెట్లో ఎరుకల అమ్మన్నగారి డాబాలో, ఆయన, ఇంకో లెక్చరర్‌గారు కలిసి అద్దెకుండేవారు. స్టూడెంట్స్ మెస్ నుంచి మేమే క్యారేజీ పంపించేవాళ్లం. నేను ఆయనకు ప్రియాతిప్రియమైన శిష్యుణ్ణి కూడా! నేను మంచి ఒడ్డూ పొడుగూ అని ఎస్.ఐ. ఉద్యోగానికి వెళ్లమన్నారు. వెళ్లాను కానీ ఆఖరి నిమిషంలో ఎంపిక కాలేదు. నేను లెక్చరర్ అయ్యి, ఎమ్‌ఫిల్, పీహెచ్డీ చేశానంటే అందుకు ఆయనే ప్రేరణ. నేను పొలిటికల్ సైన్స్ లెక్చరర్ అయినా, అప్పుడప్పుడూ మా గురువుగారి పాఠాలు గుర్తుకొచ్చేసి... ‘ముక్కంటి అంటే... మూడు నేత్రములు కలవాడు’ అని చెబుతుంటాను. ఆయన బోధించిన వ్యాకరణం, సవర్ణదీర్ఘ సంధి లాంటి సూత్రాలు ఛందస్సులో చంపకమాల, ఉత్పలమాల... అన్నీ ఇంకా గుర్తున్నాయి. అంత గొప్ప గురువు ఆయన! - డా. ఎం. సుందర్రావు, అసోసియేట్ ప్రొఫెసర్, కేసీఆర్ఎల్ డిగ్రీ కాలేజ్, భీమవరం ఏదో ఒక జోక్‌తో మొదలుపెట్టి, చాలా తెలివిగా పాఠంలోకి దించేసేవారు! అత్తిలి అనగానే అందరికీ బ్రహ్మానందంగారే గుర్తుకొస్తారు. అది ఆయన సొంత ఊరు కాకపోయినా, అత్తిలి గురించే ఆయన ఎక్కువ చెబుతుంటారు. అత్తిలి ఆడపడుచుగా ఈ విషయంలో నేను గర్వపడుతుంటా. నేను ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్‌ని. ఎప్పుడైనా మేం క్లాస్ ఇంట్రస్ట్ లేదని చెప్పినా, ఏదో ఒక జోక్‌తో మొదలుపెట్టి, చాలా తెలివిగా పాఠం చెప్పేసేవారు. క్లాసులో ఎంత సరదాగా ఉండేవారో. డిగ్రీ తర్వాత నాకు పెళ్లయి, మధ్యప్రదేశ్ వెళ్లిపోయా. ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చేశాం. ఇంతవరకూ ఆయనను కలవలేదు కానీ, ఇప్పటికీ అప్పటి బ్రహ్మానందంగారు అలానే గుర్తుండిపోయారు. - స్వర్ణలత, గృహిణి, హైదరాబాద్ బోర్ కొట్టకుండా పాఠమెలా చెప్పాలో ఆయనను చూసి నేర్చుకోవాలి! రాజమండ్రిలో ‘అల్లుడా మజాకా’ షూటింగ్ జరుగుతోంది. నేనప్పుడు అక్కడ ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తున్నా. చిరంజీవిగారు, బ్రహ్మానందంగారు... ఇంకా చాలామంది యాక్టర్లున్నారు. నేను బ్రహ్మానందంగారి దగ్గరకెళ్లి ‘‘నేను మీ అత్తిలి కాలేజ్‌లో స్టూడెంట్‌ని’’ అనగానే, గుర్తు పట్టేశారు. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అంతటి గొప్ప నటుడి దగ్గర మేం పాఠాలు నేర్చుకున్నందుకు ఇప్పటికీ గర్వపడుతుంటాం. పిల్లలకు బోర్ కొట్టకుండా పాఠమెలా చెప్పాలో ఆయనను చూసి నేర్చుకోవాలి. ‘గురువు’ అనే పదానికి గొప్ప రోల్‌మోడల్ ఆయన. ఓ చిన్న కాలేజీలో పనిచేసిన ఆయన, ఈ రోజు ప్రపంచం అంతా తెలిసే స్థాయికి ఎదగడమంటే మామూలు విషయం కాదు. దీని వెనుక ఏ హస్తమూ లేదు. అంతా ఆయన స్వయంకృషే. ‘అహ నా పెళ్ళంట’లో ‘అరగుండు’ పాత్ర చూసి ఎంతగా నవ్వుకున్నామో, లేటెస్ట్గా ‘రేసుగుర్రం’లో ‘కిల్‌బిల్ పాండే’ చూసీ అలాగే నవ్వుకున్నాం. ఆయన తర్వాత ఎంతోమంది కమెడియన్లు వచ్చారు... వెళ్లారు. కానీ ఆయన ఇప్పటికీ నెంబర్‌వన్‌గానే ఉన్నారు. ఈతరం వాళ్లు ఆయనను చూసి చాలా నేర్చుకోవాలి. - అరిటాకుల శ్రీనివాసరావు, పోలీస్ అధికారి, శ్రీకాకుళం నా పెళ్లిలో మిమిక్రీ చేసిఅందర్నీ నవ్వించారు! నేను 1976-79 స్టూడెంట్‌ని. బాగా గుర్తు... అప్పట్లో ఆయన పట్నాల వెంకటేశ్వర్రావుగారి జ్యూయెలరీ షాపు పక్కనే అద్దెకుండేవాళ్లు. ఆయన ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉండేది. ఆరోజుల్లో మా నాన్నగారు కాలేజ్ వైస్ ప్రెసిడెంట్. కానీ సార్ ఆయన్ని కూడా వదిలేవారు కాదు... బాగా అనుకరించేవారు. ఒక్కోసారి నాన్నగారి గొంతుతో నన్ను కంగారు పెట్టేవారు. మాకు కూడా మిమిక్రీ నేర్పుదామని తెగ ట్రై చేశారు కానీ, మా వల్ల కాలేదు. 1984 ఫిబ్రవరి 19న జంగారెడ్డిగూడెం సమీపంలోని ఓ పల్లెటూళ్లో నా పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి మా గురువుగారు బ్రహ్మానందంగారు వచ్చారు. నేనడక్కుండానే మిమిక్రీ చేసి, పెళ్లికి వచ్చిన వారందరినీ భలే నవ్వించారు. ఇప్పటికీ ఈ విషయం అందరికీ నేను గర్వంగా చెప్పుకుంటుంటాను. ఆ తర్వాత అదే కాలేజ్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా చేసి రిటైరయ్యాను. ఇప్పటికీ నేనాయనతో టచ్‌లో ఉన్నా. మొన్నీమధ్యనే నర్సాపురంలో కలిశా. అంత పెద్ద స్థాయికెదిగినా ఇప్పటికీ ఆయన ‘‘ఏరా పాండూ!’’ అని ప్రేమగా పలకరిస్తుంటారు. అలాంటి గురువులు చాలా అరుదు! - బుద్దాల పాండురంగారావు, సీనియర్ అసిస్టెంట్ (రిటైర్డ్ ), అత్తిలి ఆయన దగ్గర పాఠాలతోపాటు మనుషుల్ని ఎలా డీల్ చెయ్యాలో కూడా తెలుసుకున్నాను! మా నాన్నగారు బందెల శ్రీరామ్మూర్తిగారు 1975లో ఈ కాలేజీ స్థాపించారు. సున్నం ఆంజనేయులు గారిని ప్రిన్సిపాల్గానూ, బ్రహ్మానందం గారిని తెలుగు లెక్చరర్‌గానూ మా నాన్నగారే అపాయింట్ చేశారు. నేను 1977లో బీకామ్‌లో చేరా. మామూలుగా తెలుగు క్లాస్ అంటే చాలామందికి బోర్. కానీ మా కాలేజ్‌లో ఒక్క తెలుగు క్లాస్‌కే ఫుల్ అటెండెన్స్! దట్ క్రెడిట్ గోస్ టూ బ్రహ్మానందంగారు! అసలాయన తెలుగు పాఠం చెబుతుంటే ఎంత వినసొంపుగా ఉండేదో. పాఠం మధ్యలో జోక్స్ చెప్తూ, తెలుగు పాఠాన్ని అంత హాస్యస్ఫోరకంగా గుర్తుండిపోయేలా ఎవరూ చెప్పలేరేమో! అందరూ నోళ్లు వెళ్ళబెట్టి పాఠాలు వినడమే తప్ప, ఆవలింతలొచ్చే ప్రసక్తే లేదు. అందుకేనేమో తెలుగులో ఒక్కరు కూడా ఫెయిలయ్యేవారు కాదు. రామాయణ, భారతాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. పాఠ్యాంశంలో లేకపోయినా అప్పుడప్పుడూ వాటి గురించి బోధించేవారు. నాకెప్పుడూ ఆయన సీరియస్‌గా కనబడినట్టు గుర్తు లేదు. ఎప్పుడూ సరదాగా ఉండేవారు. స్టూడెంట్స్‌ని కొట్టడం, తిట్టడం లాంటివి కూడా చేసేవారు కాదు. స్టూడెంట్స్‌తో చనువుగా ఉండేవారు కానీ, వాళ్లు నిక్‌నేమ్స్ పెట్టేంత అవకాశం ఇచ్చేవారు కాదు. ఆయన క్లాసు వల్ల పాఠాలతో పాటు, మనుషుల్ని ఎలా డీల్ చేయాలన్న అంశం కూడా మాకు జీవితంలో ఉపయోగపడింది. ఆయన దగ్గర చదువుకున్నవాళ్లు చాలామంది పోలీస్ ఆఫీసర్లు, లాయర్లు, జడ్జీలు, ఎమ్మార్వోలు, తాసిల్దార్లు అయ్యారు. నేను డిగ్రీ పూర్తయిన రెండేళ్ల తర్వాత అదే కాలేజ్‌లో సూపరింటెండెంట్‌గా చేరా. వచ్చే ఏడాది రిటైరవుతున్నా. ఆయన మొదటినుంచీ నన్ను సొంత తమ్ముడిలా చూసుకునేవారు. ఆయన ఎక్కడకు వెళ్లినా వెంట నేనుండాల్సిందే. ఆయన బ్యాచ్‌లర్‌గా ఉన్నన్ని రోజులూ మాతో కలిసి సినిమాలకు వచ్చేవారు. తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు... ఇలా ఎక్కడ సినిమా రిలీజైతే అక్కడకు వెళ్లిపోయేవాళ్లం. చుట్టుపక్కల ఊళ్లల్లో మిమిక్రీ షోస్ చేయడానికి వెళ్లినపుడు తోడుగా నన్ను తీసుకెళ్లేవారు. ఆఖరికి తెనాలి దగ్గర ఓ పల్లెటూళ్లో జరిగిన ఆయన పెళ్లిచూపులకు కూడా నన్ను ఆయన వెంట తీసుకెళ్లారు. ఈ కాలేజ్‌లో పనిచేసిన మా గురూజీ తెలుగువాళ్లంతా గర్వపడే స్థాయికెదిగారు. కానీ ఇంతవరకూ మేం ఆయనను కాలేజ్ తరపున సన్మానించలేకపోయామనే అసంతృప్తి నాలో చాలా ఉంది. మాస్టారూ! త్వరలోనే మీకు గురుదక్షిణ చెల్లించుకుంటాం ! - బందెల సూర్యచంద్రరావు, ఎస్.వి.ఎస్.ఎస్. డిగ్రీ కళాశాల సూపరింటెండెంట్, అత్తిలి -
ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ డిసీజెస్ స్వరజ్వరాలు
మన జీవితంలో మాట్లాడటానికీ తద్వారా ఎదుటివారికి మన భావాలు వ్యక్తం చేయడానికి స్వరం అవసరం. సంభాషణలకు మంచి స్వరం అందరికీ కావాలి. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా విచిత్రంగా ధ్వనిస్తే దాన్ని అవతలివారు సత్వరం గుర్తిస్తారు. ఇలా గొంతు విచిత్రంగా మారడానికి కొన్నిసార్లు వాళ్ల వృత్తి కూడా కారణమవుతుంది. వృత్తిపరంగా స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించేవారిని ‘ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్’ అంటారు. వీళ్లలో స్వరపేటికకు సంబంధించి వివిధ రకాల సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువ. ఇలాంటివారు గొంతు పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి స్వరాన్ని కోల్పోవచ్చు. ఇది జీవనోపాధిని దెబ్బతీయడం మాత్రమే గాక సమాజంతో కమ్యూనికేషన్‌కే ఒక ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. అందుకే స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించేవారికి వచ్చే సమస్యలు, నివారణ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. ఎవరెవరిలో స్వర ఉపయోగం ఎక్కువ..? ఉపాధ్యాయులు, రాజకీయవేత్తలు, పెద్దగా అరుస్తూ అమ్మకాలు సాగించే వీధి వర్తకుల వంటివారు నిత్యజీవితంలో గొంతుతో ఎక్కువగా పనిచేస్తుంటారు. వృత్తిరీత్యా పాటలు పాడుతూ తమ కళను ప్రదర్శించే గాయకులకూ, మిమిక్రీ కళాకారులకూ గొంతే తమ భావ, కళావ్యక్తీకరణ సాధనం. వీరంతా ‘ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్’ కోవకే చెందుతారు. వీళ్లలో స్వరానికి, గొంతుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇక మామూలు ప్రజల్లో సైతం గట్టిగా అరుస్తూ మాట్లాడేవారికి కూడా సమస్యలు వస్తాయి. స్వరసమస్యల్లో రకాలు... స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించే ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్‌లో వచ్చే సమస్యలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 1. ఆర్గానిక్ సమస్యలు 2. ఫంక్షనల్ సమస్యలు ఆర్గానిక్ సమస్యలు: స్వరవ్యవస్థకు సంబంధించిన ఏదైనా భాగంలో ఇన్ఫెక్షన్‌గాని లేదా మాట్లాడేందుకు దోహదపడే శరీరపరమైన నిర్మాణ వ్యవస్థలోని ఏదైనా ప్రాంతంలో గడ్డలు, వాపులు రావడం, హార్మోన్లపరంగా ఏదైనా తేడాలు రావడం, గొంతుకు సంబంధించిన అలర్జీలు, గ్యాస్ కడుపులోంచి పైకి తన్నడం వల్ల వచ్చే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ), శ్వాసతీసుకోవడంలో సమస్యలు, వినికిడిలోపం, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్, సైనసైటిస్, స్వరపేటిక సరిగా పనిచేయకపోవడం వల్ల స్వరానికి కలిగే ఇబ్బందులను వైద్యపరిభాషలో ఆర్గానిక్ సమస్యలుగా పేర్కొంటారు. ఫంక్షనల్ సమస్యలు : ఇవి స్వరాన్ని మామూలు కంటే ఎక్కువగా ఉపయోగించడం, గొంతును మాట్లాడటానికి బదులుగా బాగా దుర్వినియోగం చేయడం వల్ల వచ్చే సమస్యలు. కొన్ని సందర్భాల్లో ఈ ఫంక్షనల్ సమస్యలు... ఆర్గానిక్ సమస్యలకు దారితీయవచ్చు. మాట్లాడే ప్రక్రియ ఎలా జరుగుతుంది? మనం మాట్లాడే ప్రక్రియలో నాలుగు వ్యవస్థలు క్రియాశీలంగా పనిచేసి మనం సంభాషించగలిగేలా చేస్తాయి. అవి... 1) శ్వాసవ్యవస్థ, 2) స్వరవ్యవస్థ (ఫొనేటరీ), 3) రెజనేటరీ వ్యవస్థ 4) ఆర్టిక్యులేటరీ వ్యవస్థ. శరీర నిర్మాణపరంగా గొంతు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉండే ఈ నాలుగు వ్యవస్థలూ... తమ కార్యకలాపాలు నిర్వహించడానికి మెదడు, నరాలతో అనుసంధానితమై ఉంటాయి. ఈ నాలుగు చోట్లలో ఎక్కడ లోపం వచ్చినా మాట్లాడే స్వరంలో మార్పు వస్తుంది. ముందుగా మనం గాలి పీల్చుకున్న తర్వాత అది ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడి నుంచి గాలిగొట్టం (ట్రాకియా) ద్వారా గొంతులో ఉన్న స్వరపేటికలు ఉన్న లారింగ్స్ అనే భాగానికి చేరుతుంది. అక్కడ స్వరపేటికలోని కండరాలు స్పందించే తీరుకు అనుగుణంగా కొద్ది కొద్ది మోతాదుల్లో గాలి (పఫ్స్ ఆఫ్ ఎయిర్) పైకి వచ్చి ఫ్యారింగ్స్ అనే భాగాన్ని చేరుతుంది. అక్కడ ఒక్కొక్క భాగంలో గాలి ఒక శబ్దతరంగంగా మారుతుంది. ఈ శబ్దతరంగాలు నోరు, ముక్కురంధ్రాల నుంచి బయటకు వెలువడుతూ రకరకాల శబ్దాలను వెలువరిస్తాయి. ఆయా శబ్దాలన్నీ ఒక వరుస క్రమంలో వస్తూ మనకు అర్థమయ్యే భాషలా వినిపిస్తుంటాయి. ఇదీ మాట్లాడే సమయంలో జరిగే ప్రక్రియ. ఎక్కువగా మాట్లాడేవారికి వచ్చే సమస్యలు... 1) లారింగో ఫ్యారింజియల్ రిఫ్లక్స్ : దీన్నే సెలైంట్ రిఫ్లక్స్ అని కూడా అంటారు. మన జీర్ణవ్యవస్థలోని ఈసోఫేగస్ అనే భాగంలో రెండు చివరలా కడుపులోని పదార్థాలపై పనిచేసే యాసిడ్ బయటకు రావడానికి వీల్లేకుండా మూయడానికి స్ఫింక్టర్స్ అనే మూతలు ఉంటాయి. అవి సరిగా పనిచేయకకపోవడం వల్ల స్వరంలో మార్పులు వస్తాయి. దీని లక్షణాలు గ్యాస్‌ను బయటకు తన్నే జీఈఆర్డీ అనే సమస్యతో పోలి ఉన్నా ఇందులో నిర్దిష్టంగా కొన్ని మార్పులు ఉంటాయి. 2) మజిల్ టెన్షన్ డిస్ఫోనియా : ఇందులో శబ్దాన్ని వెలువరించడానికి అవసరమైన గొంతు కండరాలన్నీ ఆరోగ్యంగానే ఉన్నా... సాధారణ వ్యక్తులతో పోలిస్తే అవి చాలా గట్టిగా ఉండి శబ్దాన్ని సృష్టిండానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఈ సమస్యను సంక్షిప్తంగా ‘ఎమ్టీడీ’ అని కూడా అంటారు. 3) వోకల్ నాడ్యూల్స్ : మన గొంతులో శబ్దాన్ని సృష్టించే స్వరపేటికలోని వోకల్ ఫోల్డ్స్ అనే భాగంలో అదనపు కండ పెరగవచ్చు. ఇలా పెరిగిన అదనపు కండను ‘వోకల్ నాడ్యూల్స్’ అంటారు. 4) వోకల్ పాలిప్స్ : స్వరపేటికలో ఇరువైపులా ఎటైనా పెరిగే అదనపు కండను వోకల్ పాలిప్స్‌గా పేర్కొంటారు. 5) వోకల్ సిస్ట్స్, స్పాస్మోడిక్ డిస్ఫోనియా : వోకల్ సిస్ట్లోనూ స్వరపేటికలో కండ పెరగడం జరుగుతుంది. అయితే అది ఒక సంచిలా పెరిగి ఆ సంచిలో ఒకరకం ద్రవం నిండి ఉంటుంది. 6) వోకల్ ఫోల్డ్ స్కారింగ్ : స్వరపేటికలో స్వరతంత్రులు స్పందించే ముడుతల్లో (ఫోల్డింగ్స్లో) గాటులాంటిది ఏర్పడటాన్ని వోకల్ ఫోల్డ్ స్కారింగ్ అంటారు. 7) వోకల్ ఫోల్డ్స్‌లో మార్పులు : స్వరపేటికలోని స్వరతంత్రుల ముడుతలన్నీ ఒక నిర్ణీత క్రమంలో ఉంటాయి. వీటిలో ఏదైనా మార్పులు రావడం వల్ల స్వరం మారిపోవచ్చు. ఇలా వచ్చే మార్పులను వోకల్ ఫోల్డ్స్ ఛేంజెస్గా పేర్కొంటారు. 8) వయసు పరంగా స్వరంలో వచ్చే మార్పులు : వయసు పెరుగుతున్న కొద్దీ అన్ని కండరాల్లోనూ మార్పులు, బలహీనతలు వచ్చినట్టే స్వరపేటికలోని కండరాల్లోనూ మార్పులు వస్తాయి. ఫలితంగా వయసు పైబడ్డ కొద్దీ స్వరంలోనూ మార్పులు వస్తాయన్నమాట. అధికంగా వచ్చే సమస్య వోకల్ ఫోల్డ్ నాడ్యూల్స్ వృత్తిపరంగా గొంతును అధికంగా ఉపయోగించేవారిలో అత్యధికుల్లో వచ్చే సమస్య వోకల్ ఫోల్డ్ నాడ్యూల్స్. ఇందులో స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు కలిసే చోట కండ ఒక చిన్న గడ్డలా పెరుగుతుంది. ఇలా పెరిగిన వోకల్ నాడ్యూల్స్ వల్ల స్వరపేటికలోని రెండు అర్ధభాగాలూ పూర్తిగా మూసుకుపోవు. దాంతో స్వరంలో మార్పు వస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే మన మాటల్లో మునుపు ఉండే నాణ్యత (క్వాలిటీ ఆఫ్ వాయిస్) లోపిస్తుందన్నమాట. అంతేకాకుండా ఒక్కోసారి గొంతు బొంగురుపోయినట్లుగా ఉండటం, మాట్లాడే సమయంలో నొప్పి రావడం, మాట వస్తూ వస్తూ మధ్యలో ఆగిపోవడం వంటివీ జరగవచ్చు. మాటపూర్తిగా పెగలకుండా... లోగొంతుకతో వస్తున్నట్లుగా కూడా అనిపించవచ్చు. అంతేకాదు... స్వరపేటికలో స్వరతంత్రులు (వోకల్ కార్డ్స్) కూడా ఉంటాయి. వీటిలోనూ మళ్లీ ట్రూ కార్డ్స్, ఫాల్స్ కార్డ్స్ అనే రకాలుంటాయి. ఈ సమస్య ఉన్నవారిలో ట్రూ కార్డ్స్ అనేవి స్పందించినప్పుడు గొంతులో నొప్పి వస్తుంటుంది. అందువల్ల ఆ నొప్పిని అధిగమించడానికి వీళ్లు ఫాల్స్ కార్డ్స్ అనే తంత్రుల సహాయంతో మాట్లాడుతుంటారు. దాని వల్ల స్వరంలో మార్పు వస్తుందన్నమాట. ఎక్కువగా వచ్చే మరో సమస్య వోకల్ పాలిప్స్ ఇవి స్వరపేటికలోని వోకల్ ఫోల్డ్స్ పైన ఉండే భాగాలు. వీటిలో ద్రవం నిండి ఉంటుంది. వోకల్ పాలిప్స్ కూడా నాడ్యూల్స్ లాగానే స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు సరిగా మూసుకుపోకుండా అడ్డుపడతాయి. ఫలితంగా మాట మధ్యమధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. మరో ముఖ్యమైన సమస్య వెంట్రిక్యులార్ డిస్ఫోనియా వెంట్రిక్యులార్ డిస్ఫోనియా లేదా ప్లైకా వెంట్రుక్యులారిస్ అనే సమస్య కూడా వృత్తిపరంగా స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించేవారిలో తరచూ కనిపిస్తుంటుంది. వీళ్లలోనూ ట్రూ వోకల్ ఫోల్డ్స్కు బదులుగా ఫాల్స్ వోకల్ఫోల్డ్స్ అనేవి స్పందిస్తుంటాయి. ఫలితంగా స్వరంలో తేడా వస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో నాడ్యూల్స్గానీ లేదా పాలిప్స్గానీ ఏవీ ఉండవు. వీళ్ల స్వరం నూతి నుంచి వచ్చినట్లుగా, లోగొంతుకతో మాట్లాడుతున్నట్లుగా వస్తుంటుంది. మాటలో గరుకుతనం ఉన్నట్లు అనిపిస్తుంది. గాలిలో మాట్లాడినట్లుగా ఉంటుంది. మాట్లాడుతుంటే చాలా కష్టపడుతున్నట్లు (స్ట్రెయిన్డ్ వాయిస్) అనిపిస్తుంది. లారింజైటిస్ స్వరపేటికలోగాని లేదా మన శ్వాసవ్యవస్థలోని లారింగ్స్ అనే భాగంలోగాని ఇన్ఫెక్షన్ రావడాన్ని లారింజైటిస్ అంటారు. ఇలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాట్లాడుతుంటే గొంతులో మంట, ఇరిటేషన్, మాటల మధ్య దగ్గు రావడం, గొంతులో ఏదో వాచినట్లుగానూ లేదా ఏదో అడ్డుపడ్డట్లుగానూ అనిపిస్తుంది. లారింజైటిస్ ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం కూడా రావచ్చు. వీళ్లలో కొన్నిసార్లు స్వరం తాత్కాలికంగా పూర్తిగా పోతుంది. ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్‌లో పై సమస్యలకు కారణాలు వృత్తిపరంగా ఎక్కువగా తమ స్వరాన్ని ఉపయోగించే వారు తమ స్వరపేటికను ఎక్కువగా అలసిపోయేలా (స్ట్రెయిన్) చేస్తారు. గొంతు (స్వరపేటిక)కు తగినంత విరామం ఇవ్వకపోవడం, సామర్థ్యం కంటే ఎక్కువగా అరవడం, తమ పిచ్ రేంజ్‌కు మించి స్వరపేటికను ఉపయోగించడం చేస్తుంటారు. మన గొంతు ఎప్పుడూ తడిగా ఉండాలి. అప్పుడే స్వరానికి సమస్యలు రావు. వృత్తిపరంగా గొంతును ఎక్కువగా వాడే వారు మధ్యమధ్య మంచినీళ్లు తాగుతూ ఉండాల్సి రావడం చూస్తుంటాం. అప్పుడే మాట స్పష్టంగా ఉంటుంది. గొంతును తడిగా ఉంచడానికే ఇలా చేస్తుంటారన్నమాట. అయితే గొంతు పొడిబారిపోతున్నా దాన్ని పట్టించుకోకుండా అలాగే మాట్లాడటాన్ని కొనసాగించడం వంటి పనుల వల్ల స్వరపేటికపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఈ ఒత్తిడి వల్ల కూడా అక్కడి వోకల్ ఫోల్డ్స్ కండరాలు ఎక్కువగా అలసిపోతాయి. దాంతో స్వరపేటిక ఎక్కువ రాపిడికి గురవుతుంది. ఇది స్వరపేటికలో కొంత భౌతికమైన గాయాన్ని సైతం చేస్తుంది. ఫలితంగా ఆ గాయం ఉన్నచోట మరింత రాపిడి జరగడం వల్ల ఒక్కోసారి అక్కడ ఇన్ఫెక్షన్ లేదా వాపు కూడా రావచ్చు. అయినప్పటికీ అదేపనిగా స్వరపేటికను వాడుతూ ఉంటే క్రమంగా కొన్నాళ్లకు అది వోకల్ నాడ్యూల్స్ లేదా వోకల్ పాలిప్స్ వంటి సమస్యలతో పాటు లారింజియల్ ఇన్ఫెక్షన్స్కు దారితీయవచ్చు. ఏయే పరీక్షలు అవసరం...? ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్‌లో స్వరంలో ఏదైనా మార్పులు కనిపించనప్పడు గొంతుబొంగురుపోవడం ముందుగా కనిపిస్తుంది. ఇక మధ్యమధ్య మాటలు ఆగిపోవడం, చాలా శక్తి ఉపయోగిస్తే గాని గొంతు పెగలకపోవడం జరుగుతుంది. ఇక్కడ పేర్కొన్న అన్ని సమస్యల్లోనూ కొద్దిపాటి స్వల్పమైన తేడాలు మినహాయించి లక్షణాలన్నీ దాదాపుగా ఇలాగే ఉంటాయి. అందువల్ల స్వరంలో మార్పు వచ్చినప్పుడు అందుకు నిర్దిష్టమైన కారణాన్ని తెలుసుకోవడం (కరక్ట్ డయాగ్నోజ్) ముఖ్యం. ఈ లక్షణాలు కనిపించగానే నిపుణులైన ఈఎన్టీ వైద్యులను, స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించాలి. వారు లారింగోస్కోపీ అనే ఉపకరణం ఆధారంగా సమస్యను నిర్దిష్టంగా నిర్ధారణ చేస్తారు. ఇక స్పీచ్ థెరపిస్ట్‌లు స్వరసంబంధిత పరీక్షలు చేసి స్వరంలోని మార్పులను పూర్తిగా విశ్లేషిస్తారు. దీనికోసం వారు రూపొందించే పరీక్ష ప్రణాళిక ఈ కిందివిధంగా ఉంటుంది. 1) ఈఎన్టీ పరీక్ష 2) లారింగోస్కోపీ / స్ట్రోబోస్కోపీ ఉపకరణంతో చేసే పరీక్ష 3) స్వరం వినిపించే తీరును అంచనా వేయడం (వాయిస్ అసెస్మెంట్) 4) లక్షణాల ఆధారంగా వ్యాధి చరిత్రను విపులంగా రావడం (డిటెయిల్డ్ కేస్ హిస్టరీ) 5) కొన్ని పరికరాలు / ఉపకరణాలతో పరీక్ష చేసి స్వరంలో లోపాలను విశ్లేషించడం (ఇన్స్ట్రుమెంటల్ వాయిస్ అనాలసిస్). చికిత్స ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్‌లో వచ్చే స్వర సమస్యలకు చికిత్స అన్నది ఆ సమస్యకు కారణాలను బట్టి, అది చూపే లక్షణాలను బట్టి నిర్ణయిస్తారు. కొన్ని సమస్యల్లో యాంటీబయాటిక్స్, యాంటీ రిఫ్లక్స్ మందులు వాడితే సరిపోతుంది. మరికొన్ని సమస్యలకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ముఖ్యంగా వోకల్ నాడ్యూల్స్ వంటివి పెద్దవిగా పెరిగినప్పుడు వాటిని శస్త్రచికిత్సతో తొలగించాల్సి రావచ్చు. మొదట్లో చాలావరకు మందులు, వాయిస్ థెరపీ, వోకల్ హైజీన్ (స్వరపేటిక ఆరోగ్యాన్ని కాపాడుకునే జాగ్రత్తలు... అంటే గొంతుకు తగిన విశ్రాంతి ఇవ్వడం, ఎప్పుడూ తడిగా ఉంచడం వంటి నివారణ చర్యలు), జీవనశైలి మార్పులు (లైఫ్‌స్టైల్ మాడిఫికేషన్స్) ద్వారా వీటిని తగ్గించవచ్చు. ఇక దీర్ఘకాలంగా ఈ సమస్యతో బాధపడేవారికి, వోకల్ నాడ్యూల్స్ పరిమాణం పెద్దగా ఉన్నవారికి ఫోనో సర్జరీ లేదా నాడ్యూల్ రిమూవల్ వల్ల ఉపశమనం కలుగుతుంది. వాయిస్ థెరపీ / నివారణ వాయిస్ థెరపీ చాలావరకు స్వర సమస్యల నివారణకూ తోడ్పడు తుందని అనుకోవచ్చు. ఇందులో స్వర సమస్యను అంచనా వేయడం, విశ్లేషించడం (వాయిస్ అసెస్మెంట్ అండ్ అనాలిసిస్) ద్వారా వాయిస్ థెరపీ చికిత్సకు ప్రణాళికను రచిస్తారు. వాటి ఆధారంగా ఈ చికిత్సను డిజైన్ చేస్తారు. ఇందులో ముఖ్యంగా అవలంబించే మార్గాలు... 1) స్వరం వాడే విధానం, స్వరానికి సంబంధించిన అలవాట్లు, మాట్లాడే విధానంతో పాటు స్వరాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతారు. 2) మంచి నీరు ఎక్కువగా తీసుకోవడంతో పాటు తరచూ తాగాల్సిన అవసరం గురించి వివరిస్తారు. అప్పుడే వోకల్ ఫోల్డ్స్ తడిగా ఉండి సమస్యలు రాకుండా ఉంటాయి. 3) అతిగా స్వరాన్ని వాడేవారికి స్వరపేటికకు ఇవ్వాల్సిన విశ్రాంతి గురించి వివరిస్తారు. 4) స్వరపేటిక ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రక్రియల (వోకల్ హైజీన్ ప్రోగ్రామ్)ను వివరిస్తారు. 5) స్వరం నుంచి మాటలెలా వస్తాయి, ఎందుకీ స్వర సంబంధమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి అన్న విషయాలను వివరిస్తూ, అందుకు తగిన చికిత్స గురించి రోగికి కౌన్సెలింగ్ ఇస్తారు. 6) వోకల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ బోధిస్తారు. 7) శ్వాస సంబంధిత వ్యాయామాలు వివరించి, వాటిని చేయిస్తారు. వీటివల్ల స్వరపేటికపై ఒత్తిడి తగ్గడంతో పాటు వాటిలోని పొరల్లో ఉండే కండరాలు సక్రమంగా పనిచేస్తాయి. ఈ ప్రక్రియలో మొదట శబ్దాలు, తర్వాత పదాలు, అటుపై వాక్యాలు, అనంతరం సంభాషణలు ప్రాక్టీస్ చేయిస్తారు. 8) వారి వృత్తిని వదులుకోవడం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి, వృత్తికి అవరోధం కలిగించకుండానే వారు స్వరం విషయంలో తీసుకోవాల్సిన / చేసుకోవాల్సిన మార్పులను వివరిస్తారు. ఈ ప్రక్రియల వల్ల ఒకవేళ దీనితో సాధ్యం కానప్పుడు మందులు లేదా శస్త్రచికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా కొంతమేర కొన్ని వ్యాయామాల ప్రాక్టీస్‌లు అవసరమవుతాయి. హోమియో విధానంలో స్వర సమస్యలకు చికిత్స / ఔషధాలు అర్జంటమ్ నైట్రికమ్: దీర్ఘకాలికంగా గొంతుబొంగురుపోవడం, తాత్కాలికంగా స్వరం కోల్పోవడం వంటి సమస్యలకు వాడదగిన ఔషధం. గాయకులు పాటపాడుతూ ఉచ్ఛస్వరానికి వెళ్లినప్పుడు దగ్గురావడం వంటి సమస్యలకూ వాడవచ్చు. స్వరపేటిక వాపు, నొప్పి, శ్లేష్మం, గొంతులో మందంగా పూతలా ఏర్పడినవారికి, మింగడానికి కష్టంగా ఉండి, గొంతులో ఏదో పేడులా అడ్డుపడినట్లు అనిపించడం; ఆహారం తీసుకున్న తర్వాత గొంతులోనే ఉన్నట్లు అనిపించడం; ఊపిరిఆడనట్లు అనిపించడం... వంటి సమస్యలు ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సమస్యలు అర్ధరాత్రివేళల్లో, భయపడినప్పుడు, ఆందోళన కలిగినప్పుడు, తీపిపదార్థాలు తీసుకున్నప్పుడు, వేడిగా ఉండే గదిలో ఎక్కువవుతాయి. వీరికి చల్లగాలి వల్ల ఉపశమనం కలుగుతుంది. అకోనైట్ : హఠాత్తుగా గొంతుబొంగురుపోవడం, గట్టిగా మాట్లాడినవారిలో స్వరపేటిక దెబ్బతినడం, ధ్వనిలో మార్పు, కొన్నిసార్లు, స్వరాన్ని తాత్కాలికంగా కోల్పోవడం వంటి లక్షణాలు... ముఖ్యంగా బాగా భయపడ్డవారిలో లేదా హఠాత్తుగా షాక్‌కు గురైనవారిలో లేదా చల్లగాలికి వెళ్లినప్పుడు కనిపిస్తుంటాయి. అంతేకాకుండా పై లక్షణాలతో పాటు జ్వరం, బొంగురుగా దగ్గురావడం, గొంతుపొడిబారినట్లుగా ఉండటం, విశ్రాంతి లేకుండా అటూ ఇటూ తిరగడం వంటివి చేసినప్పుడు కూడా ఇక్కడ పేర్కొన్న లక్షణాలు చూడవచ్చు. రాత్రివేళలో, శ్వాసతీసుకున్నప్పుడు కూడా వీరికి పైన పేర్కొన్న లక్షణాలు ఎక్కువవుతాయి. కాస్టికమ్ : దీర్ఘకాలికంగా స్వరపేటిక రాపిడికి గురైనవారిలోనూ, వోకల్కార్డ్స్ పక్షవాతానికి గురైన వారిలో వాడదగిన మందు ఇది. గొంతులో మంట, నొప్పి, పొడిబారినట్లుగా అనిపించడం, పొడిదగ్గు, గొంతుబొంగురుపోవడం... ముఖ్యంగా సభల్లో ప్రసంగించేవారికి, సింగర్స్‌కూ ఇటువంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. చల్లగాలికీ, ఉదయాన్నే ఎక్కువ కావడం, తెమడ గొంతులో అడ్డం పడినట్లుగా అనిపించడం, బయటకు తీయడం కష్టంగా అనిపించడం, మధ్యరాత్రిలో విపరీతమైన పొడిదగ్గు, నిద్రకు భంగం కలగడం వంటి సమస్యలు ఉన్నవారికి ఈ మందు చక్కటి పరిష్కారం. బెల్లడోనా : ఇది ఇన్ఫ్లమేటరీ కండిషన్స్‌లో ప్రధానంగా ఉపయోగిస్తారు. గొంతు ఎర్రగా ఉండి, పొడిబారినట్లుగా ఉంటుంది. గొంతు పట్టేసినట్లు, మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోగులు ముఖ్యంగా నిమ్మజాతి పండ్లనూ, పులుపునూ ఇష్టపడతారు. బెల్లడోనా లక్షణాలు అకస్మాత్తుగా వస్తాయి. అదేవిధంగా తగ్గిపోతాయి. దీనికారణంగా కంఠధ్వని కూడా బొంగురుపోయినట్లుగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు దగ్గు కూడా వస్తుంటుంది. స్పాంజియా : ఇది గొంతు, స్వరపేటిక సమస్యలకు దివ్యౌషధం. వీరికి గొంతుపొడిబారిపోవడం, దగ్గుతో పాటు తెమడ రావడం జరుగుతుంది. గొంతువాపు, మంట ఉండి, మింగడానికి ఇబ్బంది కలుగుతుంది. ఈ లక్షణాలు తీపి పదార్థాలు తిన్న తర్వాత అధికమవుతాయి. లారింజైటిస్కి కూడా స్పాంజియా చక్కగా పనిచేస్తుంది. డ్రొసెరా : ఇది ముఖ్యంగా శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. స్వరపేటికపై ప్రభావం పడటం వల్ల కంఠస్వరం బొంగురుపోయినట్లుగా ఉంటుంది. దగ్గు, తిన్న ఆహారపదార్థాలు వాంతి చేసుకోవడం, దగ్గుపొడిగా కోరింత దగ్గులా ఉంటుంది. ఈ లక్షణాలు మధ్యరాత్రి పడుకున్నప్పుడు, ద్రవపదార్థాలు తీసుకున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు, పాటలు పాడటం వల్ల అధికం అవుతాయి. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్, హోమియో వైద్య నిపుణులు, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ స్వరభేదం / స్వరభంగం మనిషి మనిషికీ కంఠస్వరంలో తేడా కనిపిస్తుంది. దీనికి కారణం గొంతులోని స్వరపేటికలోని రచనావిశేషం. అంటే అక్కడ ఉన్న కండరాల నిర్మాణంలోని తేడాలన్నమాట. ఇది సృష్టిలోని ప్రకృతి ధర్మం. ఏ భాగమైనా సక్రమరీతిలో పనిచేయాలంటే, దానికి సంబంధించిన ‘రక్తప్రసరణ, నరాల పనితీరు, పోషకవిలువలు, వినాళ గ్రంథులపై ప్రభావం’ తగిన స్థాయిలో ఉండాలి. అంతేకాకుండా ఆ అవయవానికి సంబంధించి ‘వ్యాయామం’ (అంటే అది చేసే క్రియ) తక్కువ కాకూడదు. అలాగే మితిమీరీ ఉండకూడదు. వీటిల్లో ఎక్కడ తేడా వచ్చినా ఆ భాగపు పనితీరు దెబ్బతింటుంది. కంఠస్వరానికి బంధించిన ఈ వికారాన్ని ఆయుర్వేదకారులు ‘స్వరభేదం’గా వర్ణించారు. ‘బిగ్గరగా మాట్లాడటం, విషపదార్థాలు (అంటే ఆయా కణజాలాలను అసాత్మ్యంగా ఉంచే, హానికలిగించే పదార్థాలు) అధ్యయనం (అదేపనిగా నిరంతరం చదవడం, మాట్లాడటం, పాడటం, అరవడం మొదలగునవి), అభిఘాతం (దెబ్బతగలడం) వంటివన్నీ స్వరభేదానికి / స్వరభంగానికి ప్రధాన కారణాలు. (ఆధారం: మాధవాచార్యుల వారి శ్లోకం... అత్యుచ్ఛ భాషణ విషాధ్యయనాభిఘాతాః....) పై సందర్భాల్లో స్వరం స్వభావం మారిపోయి మాట్లాడటం కష్టం కావడం, అతి చిన్న శబ్దం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతుబొంగురుపోవడం, తాత్కాలిక స్వరనాశం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కారణాన్ని బట్టి దోషప్రాబల్యం మారుతుంటుంది. ఇతర లక్షణాలు కూడా (అంటే... జ్వరం, గొంతునొప్పి, మంట, దగ్గు వంటివి) మారుతుంటాయి. మరికొన్ని కారణాల వల్ల శాశ్వత స్వరఘ్నం కలగవచ్చునని ప్రాచీనాచార్యులు ప్రస్తావించారు. నివారణ / చికిత్స ఇందులో ముఖ్యమైనది ‘నిదాన పరివర్జనం’. అంటే కారణాన్ని దూరం చేయడం. కంఠకార్యానికి సాధనతో బాటు తగిన విశ్రాంతి కూడా అవసరమని గుర్తుంచుకోవాలి. శీతలపానియాలు, ఐస్‌క్రీములు, మసాలాలు, కారం, ఉప్పుతో కూడిన నూనె పదార్థాలు మొదలైన వాటి జోలికి పోవద్దు. వారానికి రెండు, మూడు సార్లు ‘తిలతైలం’తో పుక్కిలిపట్టి అనంతరం ‘త్రిఫలాకషాయం’తో కంఠాన్ని శుభ్రపరచుకోవాలి. (దీన్ని ‘గండూషం’ అంటారు. రోజూ ‘ఖదిరాదివటి (రెండు మాత్రలు) ఒక పూట, ‘లవంగాదివటి’ (రెండు మాత్రలు) ఒకపూట చప్పరించి తినాలి. లేదా పొడి చేసి తేనెతో తినవచ్చు. అనంతరం గోరువెచ్చని నీళ్లు తాగాలి. అదేవిధంగా ‘కూకా’ అనే పేరుతో మాత్రలు ఆయుర్వేద షాపుల్లో లభిస్తాయి. ఇవి కూడా సత్ఫలితాలనిస్తున్నాయి. రసాయనంగా: ‘వాసాకంటకారీలేహ్యం’ ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించి పాలు తాగాలి. ఇది కంఠ, స్వర ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. జీడిపప్పు, బాదం, ఖర్జూరం వంటి శుష్క ఫలాలను ప్రతిరోజూ మితంగా తింటే శరీరానికి చక్కటి ఖనిజలవణాలంది, బలకరంగా ఉంటూ, స్వరానికీ ఆరోగ్యం చేకూరుతుంది. యష్టిమధుచూర్ణాన్ని (నాలుగు గ్రాములు) తేనెతో రెండుపూటలా తింటే కంఠరసాయనంగా పనిచేస్తుంది. త్రికటుచూర్ణం (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు), రెండు గ్రాముల తేనెతోరోజుకి ఒకటి లేక రెండుసార్లు తినాలి. లశున క్షీరం : ఒక కప్పు పాలలో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, దంచిన వెల్లుల్లి రేకలు మూడు, కొంచెం బెల్లం కలిపి బాగా మరిగించి, వడగట్టి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు, రెండుపూటలా తాగాలి. గమనిక : పైన పేర్కొన్న ఔషధాలలో ఏ రెండు లేక మూడింటిని వాడినా సరిపోతుంది. ఎంతకాలమైనా వాడుకోవచ్చు. ఎలాంటి దుష్ఫలితాలూ ఉండవు. ఈ చికిత్సాప్రక్రియల వల్ల గొంతు వ్యాధులు, స్వరపేటికకు సంబంధించిన వికారాలూ తగ్గుతాయి. ఉదా: జ్వరం, గొంతునొప్పి, గొంతుగరగర, దగ్గు, జలుబు, స్వరభేదం అన్నీ తగ్గుతాయి. - డాక్టర్ వి.ఎల్.ఎన్. శాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హైదరాబాద్ - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
మిమిక్రీ శేషు..కామెడీ అదుర్స్
కడియం :పాత్ర ఏదైనా.. పంచ్ డైలాగులతో కితకితలు పెట్టించే కామెడీ అద్దంకి శేషుకుమార్ సొంతం... మిమిక్రీతో కళారంగం వైపు అడుగుపెట్టిన ఆయన ప్రస్తుతం బుల్లితెర కామెడీ షోలలో ‘బజర్దస్త్’గా సాగుతున్నారు. బుధవారం తన స్వగ్రామం కడియం మండలం దుళ్ల గ్రామంలోని ఆయన సోదరుడు అద్దంకి శ్రీనివాస్ ఇంటికి కుటుంబసమేతంగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కళారంగ అనుభూతులను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు... ‘‘మా నాన్నగారు అద్దంకి రామారావు (దుళ్ల కరణం) ప్రోత్సాహంతో మిమిక్రీలో పట్టుసాధించా. మూడు సార్లు మిమిక్రీలో గోల్డ్‌మెడల్స్ గెలిచా. దుళ్లలో ఏ పండుగొచ్చినా సెంటర్లో స్టేజీపై నా మిమిక్రీ ఉండేది. అలా గ్రామస్తుల చప్పట్లతో నా ప్రస్థానం మొదలైంది. ఓ సారి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును మక్కీకిమక్కీ అనుకరించడంతో ఆయన నన్ను అభినందించారు. కాకినాడలోని బాబ్జి, విశాఖలోని రోషన్‌లాల్ ఆర్కెస్ట్రాల్లో చాలాకాలం పనిచేశా. అవకాశాల కోసం హైదరాబాద్ వెళ్లగా ఈటీవీలో ప్రసారమైన ష్.. కార్యక్రమంలో అవకాశం వచ్చింది. బాగా పేరు తెచ్చింది. తర్వాత భార్యామణి, కుంకుమరేకు, అభిషేకం వంటి సీరియళ్లతో పాటు, ‘మాయా బజార్’ అనే రాజకీయ వ్యంగ్య రూపకం కూడా నాకు గుర్తింపు తీసుకొచ్చింది. జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే ఫ్యామిలీ సర్కస్‌లో ‘పులిహోర’ టీమ్‌లో, ఈటీవీ జబర్దస్త్ చలాకీచంటి టీమ్‌లో చేశా. వాటిలో చాలా పాపులర్ అయ్యాను. ఒక జంతువును అనుకరిస్తూ అభినయించడంలో అల్లు రామలింగయ్యతో సమానంగా, తాను చేశానని నాగబాబు చెప్పడం మరిచిపోలేని జ్ఞాపకం. ప్రస్తుత కాలంలో పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు చేస్తున్న పొరపాట్లను వివరిస్తూ కామెడీ స్క్రిప్ట్‌ను రూపొందిస్తున్నాం. టీవీ షోలతోపాటు పంచముఖి, ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్, లక్ష్మీరావే మాయింటికి రావే తదితర సినిమాల్లో నటించా. అవి త్వరలోనే విడుదల కానున్నాయి.’’ -
కుక్కను చూసి మొరుగుతాడు..!
అతడి పేరు రూడీ రాక్. మిమిక్రీలో దిట్ట. ప్రత్యేకించి జంతువుల అరుపులను అనుకరించడంలో నేర్పరి. దాదాపు ఐదారు శునకజాతుల అరుపులను ప్రాక్టీస్ చేశాడు. ఆ జాతుల శునకాలను మచ్చిక చేసుకొని.. వాటి దగ్గర అచ్చం అలాగే అరిచాడు. (మొరిగానని అతడు అంటాడు). వాటిల్లో ఒక్కో శునకం ఒక్కో విధంగా రియాక్ట్ అయ్యింది. కొన్నేమో బెదిరి పారిపోయాయి. తమకు అలవాటు అయిన మనిషి మాట్లాడకుండా అచ్చంతమలాగే మొరిగే సరికి అవి షాక్ అయి పారిపోయాయి. మరికొన్ని ఏమో రాక్ పై విరుచుకుపడ్డాయి. అతడు ఉన్నట్టుండి మొరిగే సరికి అవి కూడా అందుకు దీటుగా స్పందిం చాయి. మరికొన్ని జాతి కుక్క పిల్లలు మాత్రం అర్థం కానట్టుగా ప్రవర్తించాయి. రాక్ మొరుగుతున్నట్టుగా అరుస్తున్నా.. ఆ శబ్దాన్ని అవి అర్థం చేసుకోక అతడిని తమ యజమానిగా భావించి ఆడుకోవడానికి ప్రయత్నించాయి. ఇంకొన్ని మాత్రం ఆ వీడియో సెటప్‌ను, రాక్ అరుపులను చూసి ‘ఏం జరుగుతోందిక్కడ..’అన్నట్టుగా చూశాయి. దాదాపు ఐదారు శునకజాతులతో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. రాక్ రూపొందించి యూ ట్యూబ్ లోకి అప్లోడ్ చేసిన ఈ వీడియో అందరినీ అలరిస్తోంది. ఈ వీడియోలో రాక్ శునకాలను అనుకరించడం ఒక ఎత్తు అయితే.. ఇతడి అరుపులను చూసి శునకాలు ఇచ్చే ఎక్స్ప్రెషన్లు మరో ఎత్తు. -
చిరంజీవికి పెద్ద ఫాన్ అయ్యాను
వేములవాడ : 'నవ్వించటం నా జీవనోపాధి... అంతకు మించి నేను మనసారా నవ్వుకునేంతటి సందర్భమెప్పుడూ రాలేదు. బతుకంతా ఎదురీతగానే సాగింది. ఇంకా నిత్యవిద్యార్థిగా బతకుపాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాను' అంటారు సినీ హాస్యనటుడు శివారెడ్డి. తనది కరీంనగర్ జిల్లా అని చెప్పుకునేందుకు గర్వంగా ఉందంటారు. వారి మూడో కూతురుకు రాజన్న ఆశీర్వాదం పొందేందుకు వేములవాడ విచ్చేశారు. బాల్యం కష్టాల కడలి.... మాది రామగుండం స్వస్థలం. మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పుడే నాన్న పోయారు. అమ్మే అన్ని తానే సాధింది. మేము అయిదుగురం అన్నదమ్ములం, ఇద్దరు అక్కయ్యలు. అందరం స్థిరపడ్డాం. బాల్యమంతా కష్టాల కడలే. ఏటా బద్దిపోచమ్మ తల్లికి బోనాలూ సమర్పించుకుంటాం. నాన్న పోయక ఇల్లు గడవని పరిస్థితి. ఇంట్లోని పాత్రలు సైతం అమ్ముకోవాల్సి వచ్చింది. ఏ బల్లా మీదనైతే నాన్న చనిపోయాడో దానిని సైతం అమ్ముకునేంత దారిద్ర్యం వెంటాడింది. కన్నీళ్లు రాని రోజంటూ లేదు. ఏదోలా రోజు గడిచేది. అదొక్కటే జీవితం కాదు కాబట్టి ....ఏ అవసరం తీరాలన్నా డబ్బు కావాలి. వేదమంత్రాల ఇమిటేషన్ తో మొదలు... జంతువుల అరుపులు అనుసరించడంతో మిమిక్రి మొదలయింది. చిన్నప్పుడు నాన్నతో గుడికి వెళ్లినప్పుడు అయ్యవారు మంత్రలు చదివే విధానాన్ని గమనించేవాడిని. అచ్చు ఆయనలాగే చదివేవాడిని. మాదాల రంగారావుగారి సినిమాలోని 'జజ్జనకరి జనారే' పాటకు పెండ్లి భరాత్లల్ల డాన్స్ చేసేటోన్ని. టీవీలో ఎన్టీఆయర్, ఏఎన్నార్, కృష్ణా డైలాగ్‌లను చూసి ఇమిటేట్ చేసేవాడిని. ఆతర్వాత చిరంజీవికి పెద్ద ఫానయ్యాను. ప్రత్యేకంగా మిమిక్రీలో గురువంటూ ఎవరూ లేరు. ఇన్స్ట్రుమెంట్లు మోయడంతో... ఉపాధి వెతుక్కుంటూ రామగుండం వెళ్లాను. గాయకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ పరిచయంతో దూరదర్శన్‌లో అవకాశం వచ్చింది. ఆయన ద్వారానే గాయకులు వరంగల్ శంకర్, సారంగపాణి పరిచయం అయ్యారు. వాళ్ల ఆర్కెస్ట్రా గ్రూప్ లో ఇన్స్ట్రుమెంట్లు మోసేవాడిని. క్రమంగా సింగర్‌గా, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ఎదిగాను. తొలుత పది రూపాయలిచ్చినోళ్లే ప్రోగ్రాంకు ఇంత అని ఫిక్స్ చేశారు. కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో ఇచ్చిన మిమిక్రీ ప్రోగ్రామ్స్ పేరు తెచ్చిపెట్టాయి. మిత్రలు సలహాతో హైదరాబాద్ వచ్చాను. సానా యాదిరెడ్డి గారి పరిచయంతో 'పిట్టలదోర', 'ప్రేమపల్లకి'లో పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. 'బ్యాచ్లర్స్' సినిమాతో బ్రేక్ వచ్చింది. 'ఈతరం ఫిలిమ్స్' అధినేత పోకూరి బాబూరావు తన ఆఫీసుకు పిలిపించి హీరోయిన్ మీనా పక్కన 'అమ్మాయి కోసం' సినిమాలో హీరోగా అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. -
విను నా మాట బంగారు బాట
చేపని ఇవ్వడం కంటే చేపలు పట్టడం నేర్పడమే మంచి పని. నిజమే... పది రూపాయలు ఇవ్వడం సులువు. పరుల కోసం పది నిమిషాలు కేటాయించడం మాత్రం చాలా కష్టమైన పని. కాని ఓ హెడ్‌కానిస్టేబుల్ ఆ పని చేశాడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ... అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. కానిస్టేబుల్ ఉద్యోగం రాగానే డి.జి.రామమూర్తి తల్లిదండ్రులు ‘హమ్మయ్య...’ అనుకున్నారు. కాని మన కానిస్టేబుల్ నిశ్చింతగా అక్కడితో ఆగిపోలేదు. ఇంకా ఏదో చేయాలన్న తపన. చదువుకున్నన్నాళ్లు సాంఘిక సంక్షేమ హాస్టల్లో ట్యూషన్లు చెప్పుకుంటూ ప్రతిక్షణం విద్యార్థుల మధ్యన గడిపిన జ్ఞాపకాలు ఉద్యోగంలో చేరినా అతన్ని వదల్లేదు. ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూనే తనకున్న మిమిక్రీ కళతో సెలవు రోజులన్నీ పాఠశాలల్లో, కళాశాలల్లో గడపడం మొదలుపెట్టాడు. ఇలా ఇరవైఏళ్ల నుంచి రామమూర్తి విద్యార్థుల గదుల్లోకి, వారి మస్తిష్కాలలోకి వెళ్లి ఏం చేశాడు? ఏం సాధించాడు? అదే మాట అడిగితే... ‘‘ఏవో నాలుగు మంచి ముక్కలు చెబుతాం, వినండి అంటే ఎవరికి నచ్చుతుంది? ఏదో ఒక ఆకర్షణ లేకపోతే గంటల తరబడి నేను చెప్పే కబుర్లు ఎవరు వింటారు? అందుకే ‘మిమిక్రీ’తో అందర్నీ ఓ చోట కదలకుండా కూర్చోబెట్టగలిగాను. ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి, కష్టాల్లో ఎలా నిలబడాలి... ఇలా ఒక్కో అంశానికి హాస్యాన్ని జోడించి మిమిక్రీ చేసి చెప్పడంలో విజయం సాధించాను. నవ్వులతో మొదలైన నా పాఠాలు ఓ పదిమంది జీవితాలకు బంగారు భవిష్యత్తు ఇచ్చేవరకూ వెళ్లాయి’’ అని ఎంతో గర్వంగా చెప్తారు రామమూర్తి. కూతురు పేరుతో... చిత్తూరు వి.కోట పరిధిలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామమూర్తి గత ఇరవైఏళ్లుగా మిమిక్రీ పేరుతో విద్యార్థులకు వ్యక్తిత్వవికాస తరగతులు చెబుతూ తనవంతు సేవ చేస్తున్నాడు. ఈ సమయంలో తన కూతురు రేవతికి క్యాన్సర్ వచ్చింది. ఇంజనీరింగ్ చదువుతున్న రేవతి ఆరు నెలలపాటు క్యాన్సర్‌తో పోరాడి మరణించింది. గత ఏడాది జనవరిలో రేవతి మరణం తర్వాత రామమూర్తి చేసిన మొదటిపని ‘రేవతి ఫౌండేషన్’ స్థాపించడం. ‘‘మా అమ్మాయి ఈడు పిల్లలకు భవిష్యత్తుపై ఎంత బెంగ ఉంటుందో తెలుసు నాకు. అందుకే యువతకు ఉపాధి మార్గాలు వెతికిపెట్టే పనిచేస్తే బాగుంటుంది అనుకున్నాను. దానికి ఆన్లైన్ సహకారం తీసుకున్నాను. ఇప్పటివరకూ మా డిపార్ట్మెంట్లో ఇప్పించిన ఉద్యోగాలతో కలిపి వందకు పైగా యువతకు ఉపాధి అవకాశాల్ని కల్పించగలిగాను’’ అంటున్నారు రామమూర్తి. అందరి సహకారం... రేవతి ఫౌండేషన్ స్థాపించాక జాతీయస్థాయిలో యువతకున్న ఉద్యోగ అవకాశాల గురించి వెతుకులాట మొదలుపెట్టారు రామమూర్తి. ఆ సమయంలో ‘ఐ గెట్ యు’ అనే ప్రైవేటు సంస్థతో పరిచయం ఏర్పడి వారితో కలిసి పనిచేస్తున్నారు. ‘‘ఓ వందమంది యువతకు శిక్షణ ఇచ్చి కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయించడంతో చాలామందికి మా డిపార్టుమెంటులోనే ఉద్యోగాలు వచ్చాయి. బ్యాంకు, ఇంజనీర్... వంటి డిపార్టుమెంట్లలో కూడా అప్లయ్ చేయించాను. నాకున్న కొద్దిపాటి పరిచయాలతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం కష్టం. అలాంటి సమయంలో ‘ఐ గెట్ యు’ అని సంస్థ నా గురించి తెలుసుకుని నాకు సహకరిస్తానంది. వారి వెబ్సైట్లో దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాల సమాచారం ఉంటుంది. ఆ లింక్ మా రేవతి ఫౌండేషన్ సైట్‌కి ఇమ్మని అడిగితే ఒప్పుకున్నారు. ఇక అప్పటినుంచి కొన్ని వేలమంది మా సైట్ ద్వారా ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకుంటున్నారు. వివరాల కోసం సైట్లో ఉన్న నెంబర్‌కి ఫోన్ చేస్తే మా సిబ్బంది వెంటనే వారికి గైడ్ చేస్తారు. నా ధ్యేయం... చదువుకున్న యువత ఒక్క నిమిషం కూడా సమయం వృథా చేయకూడదు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదు. వారి భవిష్యత్తు కోసం నేను చెబుతున్న పాఠాలకు రేవతి ఫౌండేషన్ ద్వారా బలమైన పునాది పడాలి. వాటిపై వారు నిర్మించుకునే సౌధాలు సమాజానికి ఎంతోకొంత నీడనివ్వాలి’’ అని ముగించారు రామమూర్తి. - భువనేశ్వరి రేవతి ఫౌండేషన్ స్థాపించాక జాతీయ స్థాయిలో యువతకున్న ఉద్యోగ అవకాశాల గురించి వెతుకులాట మొదలుపెట్టారు రామమూర్తి. ఆ సమయంలో ‘ఐ గెట్ యు’ అనే ప్రైవేటు సంస్థతో పరిచయం ఏర్పడి వారితో కలిసి పనిచేస్తున్నారు. -
మిమిక్రి టపాసులు
-
సమైక్య సభలో అదరగొట్టిన అంధ ఉపాధ్యాయుడు