
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మురళీధర్‌రావు
వైట్‌ఫీల్డ్: దేశ ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ సీఎం సిద్ధరామయ్య మిమిక్రీ చేయడం ఆయన స్థాయికి తగదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు ఆక్షేపించారు. శనివారం మారతహళ్లి న్యూహారిజన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ‘పొలిటిక్స్ ఆఫ్ గుడ్ గవర్ననెస్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిం మాట్లాడారు. ప్రపంచంలోనే మోదీ గురించి ఎన్నో సర్వేలు మంచి పాలన అందిస్తున్నట్లు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బాహుబలి సినిమా ఎంత విజయం సాధించిందో అందరికీ తెలుసని, అదే రీతిలో మోదీ ప్రధానిగా మరింత విజయాన్ని సాధిస్తున్నారని చెప్పారు.
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద లింబావళి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. మహదేవపుర నియోజకవర్గాన్ని ఒక మోడల్‌గా తీర్చిదిద్ధుతానని అన్నారు. సినీనటులు, బీజేపీ నేత సాయికుమార్ మాట్లాడుతూ.. మోదీ చేపట్టిన ప్రగతితో కర్ణాటకలో కూడా వచ్చే ఎన్నికల్లో తమపార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు. బీజేపీ కిసాన్‌మార్చా జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, కదిరి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment