చెన్నై : ఆంధ్రా, తెలంగాణా యూట్యూబ్ ఛానల్‌లో పాపులర్ అయిన మిమిక్రీ ఆర్టిస్ట్ అచ్చ తెలుగమ్మాయి హిరోషిణి. ఈ చిన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో ఉట్రాన్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.సాట్ సినిమాస్ పతాకంపై ఓ.రాజా గజనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ఉట్రాన్. ఉట్రాన్ చిత్రం గురించి ఓ.రాజా గజనీ తెలుపుతూ సమీపకాలంతో హర్రర్, థ్రిల్లర్ వంటి సీక్వెల్స్‌కు తమిళసినిమా ప్రముఖ్యతనివ్వడంతో ఎవర్‌గ్రీన్ కథా చిత్రాలయిన ప్రేమ కథా చిత్రాల రాక కొరవైందన్నారు. ఆ లోటును తీర్చే చిత్రంగా ఉట్రాన్ ఉంటుందని చెప్పారు.
ఇక కళాశాల యువకుడి నేపధ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఒక్క స్క్రూ ఆ యువకుడి జీవితాన్ని ఎలా మార్చేసిందన్నదే చిత్ర కథ అన్నారు. ఇది 1994లో చెన్నైలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు. ఇందులో రోషన్ అనే నటుడు హీరోగా పరిచయం అవుతున్నారని చెప్పారు. సినీ, పత్రికా రంగాల నేపధ్యం నుంచి వచ్చిన ఈయన పలు వాణిజ్య ప్రకటనల్లో నటించారని చెప్పారు. ఇక హీరోయిన్‌గా ఆంధ్రా, తెలంగాణాల్లో యూట్యూబ్ చానళ్లలో కోమలి సిస్టర్స్ పేరుతో మిమిక్రీ ఆర్టిస్టŠస్‌గా పేరు పొందిన యువతుల్లో ఒకరైన హిరోషిణిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో ముఖ్య పాత్రల్లో జిన్నా, గానా పాటల్లో దుమ్మురేపుతున్న గానా సుధాకర్, ఒరు కల్ ఒరు కన్నాడీ ఫేమ్ మధుమిత, దర్శకుడు సరవణన్‌శక్తి, ఇమాన్ అన్నాచ్చి, విజయ్ టీవీ ఫేమ్ కోదండం, కాదల్ చిత్రం ఫేమ్ సరవణన్, సులక్షణ నటిస్తున్నట్లు తెలిపారు. రఘునందన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ద్వారా కెమెరామెన్ సుకుమార్ శిష్యుడు హాలీక్ ప్రభును చాయాగ్రహకుడిగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment