వైరల్
నటిగా సుపరిచితమైన శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా లిప్‌స్టిక్‌కు సంబంధించిన ఒక అడ్వర్‌టైజ్‌మెంట్‌లో బ్రిటిష్, ఫ్రెంచ్, రష్యన్, అమెరికన్ యాక్సెంట్‌లతో మాట్లాడి ‘ఔరా’ అనిపించింది.
శ్రద్ధా నాలుగు విభిన్న భాషలను అలవోకగా మాట్లాడుతున్న ఈ వీడియో వైరల్ అయింది. గతంలో ‘కపిల్ శర్మ షో’లో తన భాషా నైపుణ్యాన్ని ప్రదర్శించి ‘శభాష్’ అనిపించుకుంది శ్రద్ధ. ‘శ్రద్ధా కపూర్‌లో మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంది’ అంటున్నారు ఆమె అభిమానులు.
Comments
Please login to add a commentAdd a comment