different languages
-
Shraddha Kapoor: బహు భాషిణి
నటిగా సుపరిచితమైన శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా లిప్స్టిక్కు సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్లో బ్రిటిష్, ఫ్రెంచ్, రష్యన్, అమెరికన్ యాక్సెంట్లతో మాట్లాడి ‘ఔరా’ అనిపించింది. శ్రద్ధా నాలుగు విభిన్న భాషలను అలవోకగా మాట్లాడుతున్న ఈ వీడియో వైరల్ అయింది. గతంలో ‘కపిల్ శర్మ షో’లో తన భాషా నైపుణ్యాన్ని ప్రదర్శించి ‘శభాష్’ అనిపించుకుంది శ్రద్ధ. ‘శ్రద్ధా కపూర్‌లో మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంది’ అంటున్నారు ఆమె అభిమానులు. -
ఏడు భాషల్లో బన్నీ చిత్రం!
సాక్షి, సినిమా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగుతోపాటు మళయాళంలోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఓ మాదిరిగా ఆడిన చిత్రాలు కూడా.. అక్కడ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అలాంటిది బన్నీ ఇప్పుడు తన మార్కెట్ పరిధిని మరింత విస్తరించుకునే పనిలో పడ్డాడు. అల్లు అర్జున్ తదుపరి చిత్రం నా పేరు సూర్యను ఏడు భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ్, హిందీ, మళయాళం, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుందని సమాచారం. దేశ భక్తికి సంబంధించిన కంటెంట్ కావటంతో అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చుతుందన్న కాన్ఫిడెంట్‌లో మేకర్లు ఉన్నారంట. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కథా రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తుండగా... నాగబాబు, బన్నీవాస్‌లు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ కాగా, సీనియర్ నటుడు అర్జున్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తేలికగా ఫేస్ బుక్ పోస్టుల తర్జుమా
ఆన్ లైన్ యూజర్లు సమాచార మాధ్యమంగా ఎక్కువగా వినియోగించే ఫేస్ బుక్ పోస్టులు, తమ కోరుకున్న భాషలో కావాలనుకుంటున్నారా..? అయితే దీనికోసం ఆటోమేటిక్ గా ఫేస్ బుక్ పోస్టులను వివిధ భాషల్లో తర్జుమా చేసేవిధంగా, కొత్త టూల్ టెస్టింగ్ ను ఫేస్ బుక్ ప్రారంభించింది. యూజర్ కోరుకున్న భాషలో పోస్టులను ఈ టూల్ తర్జుమా చేయనుంది. ప్రస్తుతం టెస్ట్ చేస్తున్న ఈ టూల్ ద్వారా పేజీ రచయితలు, ఇతర యూజర్లు ఫేస్ బుక్ ప్లాట్ ఫామ్ పై సింగిల్ పోస్టును వివిధ లాంగ్వేజ్ లో కంపోజ్ చేసుకునే సౌలభ్యంతో పాటు, ఫేస్ బుక్ ప్రేక్షకులు తమకు కావాలనుకునే లాంగ్వేజ్ లో పోస్టులను చదువుకునే అవకాశాన్ని కల్పించనుంది. దీంతో సులభతరంగా విభిన్న తరహా ప్రేక్షకులను యూజర్లు సంపాదించుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఫేస్ బుక్ యూజర్లలో సగంమంది(150 కోట్ల యూజర్లు) యూజర్లు ఇంగ్లీష్ కాని భాషల్లోనే మాట్లాడుతున్నారని కాలిఫోర్నియాకు చెందిన ఈ కంపెనీ వెల్లడించింది. అకౌంట్ సెట్టింగ్స్ లోనే స్థానికత బట్టి యూజర్లు ఏ భాషను పోస్టులకు వినియోగించదల్చుకుంటున్నారో ఫేస్ బుక్ గుర్తించనుంది. అదేవిధంగా యూజర్లు ఏ భాషల్లో సాధారణంగా పోస్టులను వాడుతున్నారో కూడా తెలుసుకోనుంది. దీంతో యూజర్లు కోరుకునే భాషలో పోస్టులను ఫేస్ బుక్ ఆటోమేటిక్ గా తర్జుమా చేయనుంది. భాష మాధ్యమంలో నెలకొంటున్న అడ్డంకులను తొలగించడానికి ఈ టూల్ ను టెస్ట్ చేస్తోంది. సోషల్ మీడియం దిగ్గజం ఈ ఏడాది మొదట్లోనే "మల్టిలింగ్యువల్ కంపోజర్"(బహుభాషా సర్వకర్త) టూల్ ను యూజర్ల ముందుకు తీసుకొచ్చింది. తన పేజెస్ సర్వీసు ద్వారా కంపెనీల, బ్రాండ్ల, గ్రూప్ ల, సెలబ్రిటీల ప్రాతినిధ్య పేజీలకు ఈ ఆప్షన్ ను అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఈ టూల్ సాధారణ వినియోగదారులందరికీ అందుబాటులోకి ఉంది. -
ఇక భాష రాకపోయినా.. మాట్లాడొచ్చు
మన దేశంలో, ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు వాళ్ల భాష మనకు, మన భాష వాళ్లకు అర్థంగాక ఇబ్బందిపడకతప్పదు. చాలామంది జీవితంలో ఇలాంటి సందర్భం ఎదురై ఉంటుంది. ఈ కష్టాలను తీర్చేందుకు త్వరలో స్మార్ట్ ఇయర్‌పీస్ మార్కెట్లోకి రాబోతోంది. న్యూయార్క్‌కు చెందిన కంపెనీ వేవర్లీ ల్యాబ్స్ ప్రపంచంలోనే తొలిసారి ఈ ఇయర్‌పీస్‌ను రూపొందించింది. ఇద్దరు వ్యక్తులు రెండు వేర్వేరు భాషల్లో మాట్లాడుకున్నప్పుడు, అప్పటికప్పుడు వారి సంభాషణలను అనువాదం చేసి ఇద్దరికీ అర్థమయ్యేలా చేయడం దీని ప్రత్యేకత. మాట్లాడేటపుడు హెడ్పీస్ను చెవిలో పెట్టుకోవాలి. ట్రాన్స్లేషన్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ ఇయర్‌పీస్‌ను పైలట్ అని పిలుస్తున్నారు. భాషల మధ్య సమన్వయం చేసేలా ఇందులో ఓ యాప్ ఉంటుంది. పైలట్ మూడు రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో తయారు చేశారు. కాగా దీన్ని జతగా కొనాలి. ఓ వ్యక్తి ఒకదాన్ని, అతను మాట్లాడేవ్యక్తి మరొకదాన్ని చెవిలో ఉంచుకోవాలి. పైలట్‌తో పాటు పోర్టబుల్ చార్జర్ ఇస్తారు. ఇయర్‌పీస్ సృష్టికర్త ఆండ్రూ ఒషోవా.. ఓ ఫ్రెంచ్ అమ్మాయితో మాట్లాడినపుడు భాష రాక ఇబ్బందిపడ్డాడు. ఆ తర్వాత అతనికి ఓ ఐడియా వచ్చింది. ఇలాంటి సమస్యను తీర్చే సాధనాన్ని తయారు చేయాలని కృషిచేశాడు. ఫలితంగా ఇయర్ఫీస్ను రూపొందించాడు. ఆండ్రూ, తన ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్ ఇయర్‌పీస్ పెట్టుకుని హాయిగా మాట్లాడుకున్నారు. వేవర్లీ ల్యాబ్స్ తొలుత యూరోపియన్ భాషలు ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్లలో స్మార్ట్ ఇయర్‌పీస్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. తర్వాత తూర్పు ఆసియా భాషలు హిందీ, అరభిక్తో పాటు ఆఫ్రికన్ భాషల్లో మార్కెట్లోకి రానుంది. వేవర్లీ ల్యాబ్స్ పైలట్ ప్రొమోను ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయగా నెటిజెన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. లక్షా 67 వేల షేర్లు రాగా, 77 లక్షల మంది వీక్షించారు. నెటిజన్ల స్పందన చూసి వేవర్లీ ల్యాబ్స్ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. ఇయర్‌పీస్ రూపకల్పన కోసం దీర్ఘకాలం పనిచేశామంటూ, మద్దతు ఇచ్చిన నెటిజన్లకు ధన్యవాదాలు తెలియజేసింది. మార్కెట్లో పైలట్ ధర 20 వేల రూపాయలు ఉండవచ్చని భావిస్తున్నారు. -
లాంగ్వేజెస్ డిలే ద డిమెన్షియా
భాషలతో మరింత పదునెక్కే మెదడు వేర్వేరు భాషలు నేర్చుకుంటున్న కొద్దీ మెదడు మరింతగా పదునెక్కుతుందని పేర్కొంటున్నారు ‘యూనివర్సిటీ ఆఫ్ ఎడింబరో’కు చెందిన నిపుణులు. కనీసం రెండు భాషలు వచ్చిన వారికి వయసు పెరిగాక వచ్చే మతిమరుపు (డిమెన్షియా) చాలా ఆలస్యం అవుతుందని ఇదివరకే తెలుసు. 1947 నాటికి పదకొండేళ్ల పిల్లలుగా ఉన్నవారిని 853 మందిని ఎంపిక చేశారు. ఇందులో 262 మంది ఇంగ్లిష్తో పాటు మరో భాషను అదనంగా నేర్చుకున్నవారు ఉన్నారు. దాదాపు వీళ్లకు డెబ్బయి ఏళ్లు వచ్చాక పరీక్షించి చూడగా.... ఒక భాష మాత్రమే మాట్లాడేవారికంటే కనీసం రెండు, అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడేవారిలో మతిమరపు వచ్చిన దాఖలాలు తక్కువని తేలింది. అంచెలంచెలుగా సాగిన ఈ పరిశోధనను నిర్వహించిన అధ్యయనవేత్తలు ఈ విషయాలను ‘యానల్స్ ఆఫ్ న్యూరాలజీ’ అనే విశ్వవిద్యాలయానికి చెందిన ప్రచురణలలో నమోదు చేసినట్లు వివరించారు. -
బహుళ భాషలు మనదేశానికి సంపద: స్మృతి
చెన్నై: బహుళ భాషలు భారతదేశానికి తరతరాలుగా వస్తున్న వారసత్వ సంపద అని, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఈ భిన్నత్వాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శనివారం చెన్నైలోని యతిరాజ్ మహిళా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వందలకొద్దీ మాతృభాషలతో భారతదేశం గొప్ప భాషా వైవిధ్యాన్ని కలిగి ఉందన్నారు. మనదేశంలో వెయ్యికంటే ఎక్కువ భాషలను మాతృభాషగా మాట్లడే ప్రజలు ఉన్నారన్నారు.