తేలికగా ఫేస్ బుక్ పోస్టుల తర్జుమా
ఆన్ లైన్ యూజర్లు సమాచార మాధ్యమంగా ఎక్కువగా వినియోగించే ఫేస్ బుక్ పోస్టులు, తమ కోరుకున్న భాషలో కావాలనుకుంటున్నారా..? అయితే దీనికోసం ఆటోమేటిక్ గా ఫేస్ బుక్ పోస్టులను వివిధ భాషల్లో తర్జుమా చేసేవిధంగా, కొత్త టూల్ టెస్టింగ్ ను ఫేస్ బుక్ ప్రారంభించింది. యూజర్ కోరుకున్న భాషలో పోస్టులను ఈ టూల్ తర్జుమా చేయనుంది. ప్రస్తుతం టెస్ట్ చేస్తున్న ఈ టూల్ ద్వారా పేజీ రచయితలు, ఇతర యూజర్లు ఫేస్ బుక్ ప్లాట్ ఫామ్ పై సింగిల్ పోస్టును వివిధ లాంగ్వేజ్ లో కంపోజ్ చేసుకునే సౌలభ్యంతో పాటు, ఫేస్ బుక్ ప్రేక్షకులు తమకు కావాలనుకునే లాంగ్వేజ్ లో పోస్టులను చదువుకునే అవకాశాన్ని కల్పించనుంది. దీంతో సులభతరంగా విభిన్న తరహా ప్రేక్షకులను యూజర్లు సంపాదించుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.
ఫేస్ బుక్ యూజర్లలో సగంమంది(150 కోట్ల యూజర్లు) యూజర్లు ఇంగ్లీష్ కాని భాషల్లోనే మాట్లాడుతున్నారని కాలిఫోర్నియాకు చెందిన ఈ కంపెనీ వెల్లడించింది. అకౌంట్ సెట్టింగ్స్ లోనే స్థానికత బట్టి యూజర్లు ఏ భాషను పోస్టులకు వినియోగించదల్చుకుంటున్నారో ఫేస్ బుక్ గుర్తించనుంది. అదేవిధంగా యూజర్లు ఏ భాషల్లో సాధారణంగా పోస్టులను వాడుతున్నారో కూడా తెలుసుకోనుంది. దీంతో యూజర్లు కోరుకునే భాషలో పోస్టులను ఫేస్ బుక్ ఆటోమేటిక్ గా తర్జుమా చేయనుంది. భాష మాధ్యమంలో నెలకొంటున్న అడ్డంకులను తొలగించడానికి ఈ టూల్ ను టెస్ట్ చేస్తోంది.
సోషల్ మీడియం దిగ్గజం ఈ ఏడాది మొదట్లోనే "మల్టిలింగ్యువల్ కంపోజర్"(బహుభాషా సర్వకర్త) టూల్ ను యూజర్ల ముందుకు తీసుకొచ్చింది. తన పేజెస్ సర్వీసు ద్వారా కంపెనీల, బ్రాండ్ల, గ్రూప్ ల, సెలబ్రిటీల ప్రాతినిధ్య పేజీలకు ఈ ఆప్షన్ ను అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఈ టూల్ సాధారణ వినియోగదారులందరికీ అందుబాటులోకి ఉంది.