ఫేస్బుక్ పోస్టులతో డబ్బు సంపాదించండి!
వాషింగ్టన్: గ్రూప్ కాలింగ్ సర్వీస్ తో పాటుగా ఫేస్బుక్ సంస్థ మరిన్ని ఆఫర్లను యూజర్లకు అందించాలని భావిస్తుంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇటీవలే గ్రూప్ కాలింగ్ సర్వీస్ ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. దీంతో ఒక్క యూజర్ ఒకేసారి ఇంటర్నెట్ ద్వారా 50 మందితో కనెక్ట్ అయ్యే అవకాశం లభిస్తుంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ గ్రూప్ కాలింగ్ సర్వీస్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండే మొబైల్స్ లో అందుబాటులోకి రానుంది. తాజాగా చేసిన ఓ సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు యూజర్లు ఫేస్ బుక్ లో ఎన్నో ఫొటోలు, ఇతర డాటాను పోస్ట్ చేసుంటారు. అయితే భవిష్యత్తులో మాత్రం పోస్టింగ్స్ ద్వారా కొంత మొత్తం నగదును యూజర్స్ అందుకోనున్నారు.
యూజర్స్ పోస్ట్ చేసే డాటాకు గాను వారికి మనీ ఇవ్వాలన్న యోచనలో సంస్థ ఉందని సర్వే ద్వారా తెలిసింది. కానీ కొన్ని రోజుల తర్వాత 'టిప్ జార్' అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని, దాంతో సంస్థకు వచ్చే రెవెన్యూలో కొంత మొత్తంలో నగదును ఈ డాటా పోస్టింగ్స్ చేసిన యూజర్లకు అందించనుంది. 2007లో యూట్యూబ్ వారు వీడియో షేరింగ్ లో ఈ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఓ కేటగిరీ యూజర్లకు మాత్రమే ఈ సర్వీస్ అందిస్తుంది. ప్రస్తుతం ఫేస్బుక్ కూడా కొన్ని కేటగిరీలకు చెందిన యూజర్లకు మాత్రమే మనీ ఎర్నింగ్ ఫెసిలిటీ కల్పిస్తుందా.. లేదా యూజర్స్ అందరికీ అందుబాటులోకి తెస్తుందా అనే విషయంపై ఇప్పటివరకైతే స్పష్టతరాలేదు.