
ఫేస్‌బుక్‌లో నెలవారీ క్రియాశీల వినియోగదారులు సంఖ్య ఇప్పుడు 2.85 బిలియన్లకు చేరుకుంది. అమెరికాకు చెందిన సోషల్ మీడియా దిగ్గజం 10 శాతం(సంవత్సరానికి పైగా) వృద్దిని కనబరిచింది. అలాగే, ఫేస్‌బుక్ రోజువారీ క్రియాశీల వినియోగదారుల సంఖ్య సగటున 1.88 బిలియన్లకు చేరుకుంది, గతంతో పోలిస్తే 8 శాతం పెరుగుదల నమోదు చేసింది. సోషల్ నెట్‌వర్క్ అంచనాలను మించి మొదటి త్రైమాసికంలో 26.1 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 48 శాతం ఎక్కువ.
2020 మొదటి త్రైమాసికంలో సంస్థ నికర ఆదాయం 4.9 బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది 9.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ మాట్లాడుతూ.. "ప్రజలను చేరుకోవడానికి, వ్యాపారాలు వృద్ధి చెందడానికి ఇది మాకు బలమైన త్రైమాసికం. రాబోయే సంవత్సరాల్లో కొత్త, మంచి అనుభూతిని అందించడానికి వర్చువల్ రియాలిటీపై మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్లు" ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఫేస్‌బుక్ షేర్లు 7 శాతం పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment