సాక్షి, సినిమా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగుతోపాటు మళయాళంలోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఓ మాదిరిగా ఆడిన చిత్రాలు కూడా.. అక్కడ బ్లాక్ బస్టర్‌లు అయ్యాయి. అలాంటిది బన్నీ ఇప్పుడు తన మార్కెట్ పరిధిని మరింత విస్తరించుకునే పనిలో పడ్డాడు.
అల్లు అర్జున్ తదుపరి చిత్రం నా పేరు సూర్యను ఏడు భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ్, హిందీ, మళయాళం, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుందని సమాచారం. దేశ భక్తికి సంబంధించిన కంటెంట్ కావటంతో అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చుతుందన్న కాన్ఫిడెంట్‌లో మేకర్లు ఉన్నారంట. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కథా రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తుండగా... నాగబాబు, బన్నీవాస్‌లు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ కాగా, సీనియర్ నటుడు అర్జున్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment