Na peru surya
-
త్వరలోనే చెబుతానంటోన్న బన్నీ!
‘నా పేరు సూర్య’ ఫలితంతో నిరాశ చెందాడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. మళ్లీ ఇంతవరకు తన తదుపరి ప్రాజెక్ట్ విషయంపై బన్నీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే అభిమానులు మాత్రం తమ హీరో ఎప్పుడెప్పుడు తన నెక్స్ట్ సినిమా ప్రకటిస్తాడా అని ఎదురుచూస్తున్నారు. అయితే బన్నీ తన అభిమానులకు ఓ శుభవార్తను తెలియజేశాడు. ‘నా పేరు సూర్య’ పరాజయంతో బన్నీ.. తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌పై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ముందుగా విక్రమ్ కె కుమార్‌తో సినిమా ఉంటుందని ప్రచారం సాగినా.. అది ఫైనల్ కాలేదనీ సమాచారం. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్‌తో కలిసి సినిమా చేయబోతున్నాడనే ప్రచారం సాగుతోంది. అది కూడా ఓ హిందీ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి వీటన్నంటికి బన్నీ త్వరలోనే పుల్‌స్టాప్ పెట్టబోతున్నాడు. ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ.. ‘ ప్రతి ఒక్కరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దివాళి మన అందరి జీవితాల్లోకి వెలుగులు నింపాలని ఆశిస్తున్నాను. ఎప్పటినుంచో నా తదుపరి చిత్ర ప్రకటన గురించి ఎదురుచూస్తున్న నా అభిమానులకు ధన్యవాదాలు. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటను త్వరలోనే ప్రకటిస్తాను’. అంటూ ట్వీట్ చేశాడు. Happy Diwali to each and everyone. May this Diwali bring a new light into our lives . And I would like to thank all my fans for waiting soo long for an announcement... will make an official one in a few days . Thank you all for being so concerned & loving. — Allu Arjun (@alluarjun) November 7, 2018 -
రావాలని ఉంది కానీ..: అను ఇమ్మాన్యుయేల్
సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ తాజా చిత్రం ‘నా పేరు సూర్య’కు ప్రమోషన్లు చేస్తూ బిజీగా ఉన్నారు చిత్ర నిర్మాతలు. దీనిలో భాగంగానే గురువారం (మే 10) సాయంత్రం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి అందరి దృష్టి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ రాలేదు. సినిమా విడుదలైనప్పటి నుంచి హీరోయిన్ అను ఎక్కడా కూడా ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు. ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. అసలే విపరీతమైన పోటీలో నా పేరు సూర్య రిలీజైంది. టాక్ కూడా పాజిటివ్‌గా రాకపోవడంతో కలెక్షన్స్‌పై ప్రభావం చూపుతోంది. ‘మహానటి’కి పాజిటివ్ టాక్ రావడం కూడా ఈ మూవీపై ప్రభావం పడుతుంది. సక్సెస్మీట్కు అను ఇమ్మాన్యూయేల్ హాజరుకాకపోగా... చిన్న వివరణ ఇచ్చి చేతులు దులుపుకుంది. ‘కుటుంబ విషయాల వల్ల హాజరుకాలేకపోతున్నాను. నాకు సక్సెస్మీట్కు రావాలని ఉంది. కానీ దురదృష్టవశాత్తు రాలేకపోతున్నాను. ఇది నాకు ప్రత్యేకమైన మూవీ, ఈ సినిమాలో నటించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా గురించి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. pic.twitter.com/Be7g0YOWGz — Anu Emmanuel (@ItsAnuEmmanuel) May 10, 2018 -
అలా చేసుంటే అందరూ విమర్శించేవారు
‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కథని డెవలప్ చేసుకుంటూ డైరెక్షన్ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు బన్నీకి ఈ కథ బావుంటుందనిపించింది. ఆయన్ని కలిసి ఒక గంట కథ చెప్పా. బన్నీకి నచ్చిన తర్వాత మిగిలిన కథను డెవలప్ చేశా. సూర్య పాత్రలో అల్లు అర్జున్‌ని తప్ప మరో యాక్టర్‌ని ఊహించుకోలేను’’ అని వక్కంతం వంశీ అన్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదలైంది. ఈ సందర్భంగా వక్కంతం వంశీ విలేకరులతో మాట్లాడారు.దర్శకుడు కావాలన్న నా కల ‘నా పేరు సూర్య’ సినిమాతో నేరవేరింది. మా చిత్రం ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. అన్నిచోట్ల నుంచి మంచి స్పందన వస్తుండటంతో చాలా సంతోషంగా ఉంది. మిలటరీ వారు సినిమా చూసి హ్యాపీగా ఫీలయ్యారు ∙ఏ హాలీవుడ్ సినిమాకూ ఇది ఇన్స్పిరేషన్ కాదు. ఫిక్షన్ కథే. మన కలల్ని సాధించాలని మొదలుపెట్టే జర్నీ ప్యూర్‌గా ఉంటుంది. ఆ గోల్‌ను సాధించే క్రమంలో అంతే ప్యూర్‌గా ఉండగలుగుతున్నామా? అలా ఉండటం ఎంతో ముఖ్యమనే పాయింట్ చెప్పాలనుకున్నా. దానికి కోపం అనే పాయింట్‌ను యాడ్ చేశాను ∙ప్రతి యాక్టర్ ఒక జాబ్ శాటిస్ఫాక్షన్ కోసం ప్రయత్నిస్తుంటారు. బన్నీ కూడా ఓ పర్ఫార్మెన్స్ రోల్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో నేను కథ చెప్పడం.. ఆయనకు నచ్చడంతో సినిమా చేశారు. రిలీజ్ తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమా చూసి త్రివిక్రమ్‌గారు, సుకుమార్‌గారు అభినందించారు ∙క్లయిమాక్స్‌లో చూపించిన అన్వర్ అనే సమస్య విలన్ సమస్య కంటే చాలా పెద్దది. సినిమా ప్రారంభంలో హీరో టెర్రరిస్ట్‌తో ‘నువ్వు టెర్రరిస్ట్ అయ్యాక నాకు కనపడ్డావ్. అందుకే చంపుతున్నాను. కాకముందు కనపడి ఉంటే టెర్రరిస్ట్ అవ్వాలనే నీ ఆలోచనను చంపేసేవాణ్ణి’ అనే డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్‌నే క్లయిమాక్స్‌లో చూపించాం. ఈ కథను రొటీన్ ఫార్మెట్లో చేసుంటే అందరూ విమర్శించేవారు. కానీ, నేను కథను ఎక్కడా డైవర్ట్ కాకుండా తీసుకువెళ్లాను ∙ఎన్టీఆర్‌గారు నా ఫేవరెట్ యాక్టర్. నన్ను డైరెక్టర్ని చేస్తానని చెప్పిందే ఆయన. ఆయన కోసం ఓ పాయింట్ అనుకున్నాను. అయితే డెవలప్మెంట్లో వర్కవుట్ కాలేదు ∙రైటర్‌గా కంటే డైరెక్టర్‌గా బాగా చేశానని చాలామంది అంటున్నారు. డైరెక్టర్ అయిన తర్వాత కూడా బయటి దర్శకులకు కథలు ఇస్తాను. ‘నీ రెండో మూవీ కూడా మా బ్యానర్లోనే ఉంటుంది’ అని నాగబాబుగారు అనడం ఆయన సంస్కారం. -
పైన సన్ కింద స్టార్స్
ఎండాకాలం భగ్గుమంటోంది.సన్ ఆక్సిలేటర్ తొక్కాడు.ఫార్టీ దాటింది!ఏమో ఫిఫ్టీ దాకా పోవచ్చు!ఎటు చూసినా బర్నింగే.దాంట్లోనే ఉంటుందండీ ఎర్నింగూ!సమ్మర్ సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి.పైన సన్ కింద స్టార్. ఎంజాయ్ ద సీజన్. సూపర్ రీసౌండ్ చిట్టిబాబుకు ‘రంగస్థలం’ సినిమాలో సౌండ్ ప్రాబ్లమ్. కానీ మూవీ సక్సెస్ సౌండ్ మాత్రం గట్టిగా సాలిడ్‌గా వినిపించింది. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన సినిమా ‘రంగస్థలం’. సినిమా సమ్మర్ హీట్ ‘రంగస్థలం’ హిట్‌తోనే స్టారై్టందని చెప్పవచ్చు. చిత్రంలో చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్, రామలక్ష్మి పాత్రలో సమంత, కుమార్‌బాబు పాత్రలో ఆది పినిశెట్టి, రంగమ్మత్త పాత్రలో అనసూయ నటించారు. ఈ బొమ్మ థియేటర్లో ఇంకా ఆడుతోంది. మరి థియేటర్లో చిట్టిబాబును పలకరించిరండి. గుర్తుపెట్టుకోండి విజిల్స్, అరుపుల్స్తో గట్టిగా సౌండ్ చేయండి. ఎందుకంటే చిట్టిబాబు సౌండ్ ఇంజనీర్ అని తెలుసు కదా. అదేనండి కాస్త వినికిడి లోపం అని మరోసారి గుర్తుండేలా చెబుతున్నాం. భరత్ విజన్ అదుర్స్ ప్రతి ఒక్కరికి భయం, బాధ్యత ఉండాలంటున్నారు సీయం భరత్ రామ్. తప్పు చేస్తే కాస్త కఠినంగానే ఉంటాడు కానీ పరిస్థితుల నుంచి తప్పించుకోడు. చేసిన ప్రామిస్‌ను ఇచ్చిన హామీని మర్చిపోడు. అసెంబ్లీ స్టెప్సే కాదు. గరీబోడి గడప కూడా తొక్కుతాడు. మరి..సీయంగా చేసిన ప్రామిస్‌ను నిలబెట్టుకోవడంలో భరత్ రామ్ ఎలా గెలిచాడు అన్నది మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో చూడాల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీయం భరత్ రామ్ పాత్రలో మహేశ్‌బాబు నటించారు. కియారా అద్వాని కథానాయిక. మరి..భరత్ రామ్ పరిపాలన అండ్ విజన్ అదిరిపోయాయి అంటున్నారు ప్రేక్షకులు. ఓ సారి భరత్ రామ్‌ను చూసిరండి. థియేటర్స్‌లో మాస్ క్లాస్ కలిపి కుమ్మేశాడు. ఉన్నది ఒకటే ఇండియా మా కులం భారతీయం. మా మతం మానవత్వం. మా వ్యక్తిత్వం సమానత్వం అని ఫీలయ్యేవారు బోర్డర్లో ఉండే సైనికులు. వారిలో ఒకడే సూర్య. అందుకే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ ఇన్ని ఇండియాలు లేవు. ఉన్నది ఒకటే ఇండియా అంటున్నాడు సోల్జర్ సూర్య. కానీ సూర్యకి కొంచెం కోపం ఎక్కువ? ఈ కోపం వల్లే బోర్డర్లో కొన్ని పరిస్థితులను ఫేస్ చేయాల్సి వచ్చింది. అవేంటో ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమాలో చూడండి అంటున్నారు చిత్రబృందం. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ సినిమాలో సోల్జర్ సూర్య పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. సూర్య కోపాన్ని మే 4న చూడండి. అదేనండి.. ఆ రోజే సినిమా రిలీజŒ అన్నమాట. అనగనగా ఓ మహానటి మధురవాణి...అంటే అర్థం తెలుసుగా మధురమైన మాటలు పలికే అమ్మాయి అని. పైగా బీఏ గోల్డ్ మెడలిస్ట్. ఆపై జర్నలిస్ట్. మరి..విజయ్ ఆంటోనీతో కలిసి మధురవాణి అనగనగా ఓ మహానటి అంటూ అలనాటి అందాల అభినేత్రి సావిత్రి కథను చెప్పడానికి రెడీ అయ్యారు. మరి..సావిత్రి గురించి ఏఏ కొత్త విషయాలు ఎలా చెప్పారనేది మే 9న రిలీజ్ కానున్న ‘మహానటి’ సినిమాలో చూడండి. సావిత్రి జీవితం ఆధారంగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన చిత్రం ‘మహానటి’. సావిత్రి పాత్రలో హీరోయిన్ కీర్తీ సురేశ్ నటించారు. జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో సమంత, విజయ్ ఆంటోనీ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య, దుల్కర్ సల్మాన్ తదితరులు నటించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకంపై ప్రియాంకా దత్ నిర్మించారు. రాజుగాడి జబ్బు వేరయ్యా! క్లెప్టోమేనియాను తెచ్చుకున్నాడు రాజు...ఇదేదో డిగ్రీ అనుకునేరు.. కాదండి బాబు. దిస్ ఈజ్ డిసీజ్. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా.. వాళ్లకు తెలియకుండానే వాళ్లు దొంగతనాలు చేస్తుంటారు. ఎంతలా అంటే సొంత వస్తువులే దొంగలించుకుని దాచుకునేంతలా. అర్థం అయ్యిందిగా.. జబ్బులందు రాజుగాడి జబ్బు వేరయ్యా అని. రాజ్‌తరుణ్, అమైరా దస్తూర్ జంటగా సంజనరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగాడు’. రాజు పాత్రలో నటిస్తున్నారు రాజ్‌తరుణ్. మరి..రాజుగాడి జబ్బు చిత్రాలు ఎంటో మే 11న తెలుసుకోండి. జన్మజన్మల బంధం సైనికుడిని ప్రేమించింది ఓ అమ్మాయి. ఈ సైనికుడి మనసులో దేశం మీద ఉన్న ప్రేమలో కాస్తో కూస్తో తనపై ఉన్నా చాలని తపన పడుతుంది. అంటే ఆ అమ్మాయి ఎంతగా అబ్బాయిని ఇష్టపడుతుందో అర్థం చేసుకోవచ్చు. అబ్బాయి కూడా దేశం తర్వాత ఆ అమ్మాయికే మనసులో స్థానం ఇచ్చాడు. కానీ వారి ప్రేమ సక్సెస్ కావడానికి మాత్రం ప్రాంతాలు, కులాలు, మతాలు అడ్డుగోడలుగా నిలిచాయి. మరి..ఆ గోడలనుప్రేమికులు ఎలా పగలగొట్టారో తెలుసుకోవాలంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘మెహబూబా’ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా కూడా మే11న రిలీజ్ కానుంది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటించాడు. నేçహాశెట్టి కథానాయికగా నటించారు. ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ని బట్టి ఈ సినిమా గత జన్మకు కనక్టయ్యేలా ఉంటుందని ఊహించవచ్చు. అంటే వీళ్లది జన్మజన్మల బంధమేమో?. స్పీడ్ పెంచాడు ఫస్ట్ గేర్.. నెక్ట్స్ సెకండ్ గేర్ వేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్తుంటారు ఆర్టిస్టులు. కానీ ‘పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి’ సినిమాలతో డైరెక్ట్‌గా థర్డ్గేర్ వేసి కెరీర్లో రయ్యిమంటూ దూసుకెళ్తున్నారు విజయ్ దేవరకొండ. ఇదే స్పీడ్‌లో నోటా చిత్రంతో చెన్నై రోడ్డు కూడా ఎక్కాడు. ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ వేసవిలో స్పీడ్ బ్రేకర్ వద్ద కాస్త ఆగి థియేటర్స్‌లోకి రానున్నారు. విజయ్ హీరోగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’ వచ్చే నెల 18న రిలీజ్ కానుంది. ప్రియాంకా జవాల్కర్, మాళవిక నాయర్ కథానాయికలు. రాహుల్ సంకృత్యాన్ అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సేమ్ ఎనర్జీ కొత్త ఊపొస్తుంది. ఉత్సాహం పొంగుకొస్తుంది హీరో రవితేజ ఎనర్జీని సిల్వర్ స్క్రీన్‌పై చూస్తే. ఆయన నటన అలా ఉంటుంది. ఈ వేసవి వినోదాన్ని ప్రేక్షకులకు పంచేందుకు ఆయన కూడా కర్చీఫ్ వేశారు. ఫస్ట్‌లుక్‌తో ఉగాదికి గుర్తు చేశారు. ఫస్ట్‌లుక్‌లో రవితేజ గెటప్ చూస్తుంటే ఆయనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గినట్లు లేదు. బాక్సాఫీసు వద్ద టికెట్లు తెచ్చి, థియేటర్లో చించి ఆడియన్స్ మూవీని ఏ లెవల్లో ఎంజాయ్ చేస్తారో చూడాలంటే మాత్రం రవితేజ తాజా చిత్రం ‘నెలటిక్కెటు’్ట బొమ్మ థియేటర్స్‌లో పడేంత వరకు ఆగాల్సిందే. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయిక. షూటింగ్ పూర్తి కావచ్చింది. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మే 24న సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పవర్ఫుల్ డ్యూటీ మొదలుపెడితే పూర్తి చేసేంతవరకు ఆగే రకం కాదు ఈ పోలీస్ ఆఫీసర్. ఇన్వెస్టిగేషన్ కోసం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చాడు. మరి.. కేసు ఏంటి? ఆఫీసర్ డ్యూటీని ఎంత పవర్‌ఫుల్‌గా చేశాడు అన్నది తెలుసుకోవాలంటే ‘ఆఫీసర్’ సినిమా చూడాల్సిందే. ఆల్మోస్ట్ 25ఏళ్ల తర్వాత నాగార్జున హీరోగా సుధీర్‌చంద్రతో కలిసి రామ్‌గోపాల్‌వర్మ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘ఆఫీసర్’. మైరా సరీన్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ చేశారు. నాగార్జున, రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘శివ’ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ‘ఆఫీసర్’ మే 25న థియేటర్స్‌లోకి వస్తాడు. మేరా.. మీరా చూశారుగా ‘నా నువ్వే’ సినిమాలో కల్యాణ్‌రామ్ సూపర్ లుక్. ఇంత సూపర్‌గా ఉన్నోడు ఎందుకు ఖాళీగా ఉంటాడు. అందుకే మీరా మేరా అంటున్నాడు. అర్థం కాలేదా మీరా అనే రేడియో జాకీని లవ్ చేస్తున్నాడు. మరి..మ్యాజిక్ లవ్‌లో నెక్ట్స్ ఏం జరిగింది అనేది మాత్రం సస్పెన్స్. థియేటర్లో చూడాల్సిందే. కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నా నువ్వే’. ఈ సినిమాను మే 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని చిత్రాలు వేసవిలో వినోదాన్ని ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతున్నాయి. ఫైనల్‌గా ఆచారి ఫిక్స్ చేసుకున్నాడు ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయడానికి ముందు అల్లు అర్జున్ సూర్యగా బుక్ చేసుకున్నాడు. తర్వాత సీయం భరత్ రామ్‌గా థియేటర్స్‌కు వస్తున్నానని మహేశ్‌బాబు ప్రామిస్ చేశాడు. ఇంతలో.. రోబో రెడీ అయ్యాడన్న వార్తలు వచ్చాయి. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘2.0’. రోబో సినిమాకు సీక్వెల్ చిత్రమిది. అంతలోనే తూచ్ అన్నారు. ‘కాలా’ ఖాయం అన్నారు. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’. కానీ ‘కాలా’తో క్లాష్ వద్దనుకుని స్నేహపూర్వకంగా భరత్, సూర్య మాట్లాడుకుని వేరే డేట్స్‌కి షిఫై్ట పోయారు.స్ట్రైక్‌తో ‘కాలా’ రానన్నాడు. దీంతో లక్కొచ్చి ఆచారి డోర్ కొట్టింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆచారి రంగంలోకి దిగాడు. ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఎనౌన్స్ చేశాడు. విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. సో..ఫైనల్‌గా సోల్జర్, సీయం, రోబో, గ్యాంగ్‌స్టర్ రావాలనుకున్నా.. గ్రహచారం అడ్డొచ్చి, ఆచారికి అన్నీ కలిసొచ్చి రిలీజ్‌కు రెడీ అయ్యాడు. అంతేకాదండోయ్.. వేసవికి గోపీచంద్ ‘పతం’ పట్టి థియేటర్స్‌లోకి వద్దాం అనుకున్నాడు కానీ వర్క్ కాస్త బ్యాలెన్స్ ఉండటంతో పంతం కొంచెం సడలించి జూలైకి రెడీ అవుతున్నాడు. అన్నట్లు తమిళనాడులో స్ట్రైక్ క్లోజ్ అయ్యిందిగా ఇక ‘కాలా’ లైన్లోకి వచ్చాడు. జూన్ 7న థియేటర్స్‌లోకి వస్తున్నాడు. – ముసిమి శివాంజనేయులు -
నా పేరు సూర్య ఆడియో ఫంక్షన్...అక్కడా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. మిలటరీ నేపథ్యం, బన్నీ నటన, భారీ యాక్షన్ సీన్స్ వీటన్నింటి దృష్ట్యా సినిమా గ్యారంటీగా హిట్ అవుతుందని అంటున్నారు బన్నీ అభిమానులు. ఇప్పటికే విడుదలైన టీజర్, డైలాగ్ ఇంపాక్ట్, సాంగ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సినిమాలోని మిగతా పాటలను మిలటరీ గ్రామమైన మాధవరం(ప.గో జిల్లా)లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట చిత్రబృందం. ఈ ఊళ్లో ప్రతి ఇంటి నుంచి ఒకరు మిలటరీలో పనిచేస్తారు. ఈ సినిమాలో బన్నీ సోల్జర్‌గా నటిస్తున్నాడు, అందుకే మిలటరీ గ్రామంలో ఆడియో ఫంక్షన్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. మే 4న ఈ సినిమా రిలీజ్ కానుంది విడుదలకు ముందు ఈ నెల చివర్లో హైద్రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
నోటిలో చుట్ట.. కంటిపై గాయం
సాక్షి, హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'. ఇందులో బన్నీ ఆర్మీ అధికారిగా నటిస్టున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించి సినిమా యూనిట్ ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా బన్నీ మరో స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో బన్నీ నోటిలో పొగాకు చుట్టతో జీప్‌లో కూర్చొని ఉన్నాడు. అంతేకాదు కంటిపై గాయంతో ఊర మాస్ లుక్‌తో అల్లువారబ్బాయి రచ్చ చేస్తున్నాడు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బన్నీ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈసినిమాను లగడపాటి శ్రీధర్, నాగబాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్లు స్వరాలందిస్తున్నారు. -
నో కాంప్రమైజ్.. రిలీజ్ అప్పుడే..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య’. వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విడుదలపై వస్తున్న రూమర్లకు నిర్మాతలు చెక్ పెట్టారు. సినిమా విడుదల తేదీని మార్చినట్లు సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వార్తలు వస్తుండటంతో నిర్మాతలు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. అనుకున్న తేదీ ప్రకారం ఏప్రిల్ 27న విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను అనే సినిమాలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల కూడా ఏప్రిల్ 27నే ఉండటంతో ఓపెనింగ్స్ దెబ్బతినకూడదని ‘నా పేరు సూర్య‘ను ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. వాటన్నింటికి చిత్ర నిర్మాతలు ఫుల్స్టాప్ పెట్టారు. ముందుగా అనుకున్న ప్రకారమే చిత్రం ఏప్రిల్ 27నాడే విడుదలవుతుందని వెళ్లడించారు. లగడపాటి శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో బన్నీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. విశాల్-శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఏడు భాషల్లో బన్నీ చిత్రం!
సాక్షి, సినిమా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగుతోపాటు మళయాళంలోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఓ మాదిరిగా ఆడిన చిత్రాలు కూడా.. అక్కడ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అలాంటిది బన్నీ ఇప్పుడు తన మార్కెట్ పరిధిని మరింత విస్తరించుకునే పనిలో పడ్డాడు. అల్లు అర్జున్ తదుపరి చిత్రం నా పేరు సూర్యను ఏడు భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ్, హిందీ, మళయాళం, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుందని సమాచారం. దేశ భక్తికి సంబంధించిన కంటెంట్ కావటంతో అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చుతుందన్న కాన్ఫిడెంట్‌లో మేకర్లు ఉన్నారంట. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కథా రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తుండగా... నాగబాబు, బన్నీవాస్‌లు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ కాగా, సీనియర్ నటుడు అర్జున్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
న్యూ ఇయర్‌కు బన్నీ గిఫ్ట్
సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య. నా ఇళ్లు ఇండియా అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ లు నిర్మిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సైనికుడిగా నటిస్తున్నాడు. సీనియర్ నటుడు అర్జున్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను జనవరి 1న ప్రారంభించనున్నారు చిత్రయూనిట్. న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాతో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని బన్నీ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్ శేఖర్ స్వరాలందిస్తున్నారు. Naa Peru Surya Naa Illu India - First Impact on First Jan 2018 .#FirstImpactOn1stJan #NSNI pic.twitter.com/CCikn5cMXn — Allu Arjun (@alluarjun) 23 December 2017 -
ఇండిపెండెన్స్ డేకి బన్నీ సర్ప్రైజ్..!
డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బుధవారం తన కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తున్నాడు బన్నీ. బన్నీ సరసన అనూ ఇమ్మన్యూల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్, శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంటనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి 2018 సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బన్నీకి బాగా కలిసొచ్చిన ఏప్రిల్ నెలలో 27వ తేదిన సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇండిపెండెన్స్ రోజు ఓ సర్ప్రైజ్ ఇస్తానంటున్నాడు అల్లు అర్జున్. మరి బన్నీ ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఫస్ట్ లుక్ లేదా టీజర్ ను రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. ఈసినిమాలో బన్నీ సోల్జర్ గా కనిపించనున్నాడు.