అను ఇమ్మాన్యుయేల్
సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ తాజా చిత్రం ‘నా పేరు సూర్య’కు ప్రమోషన్లు చేస్తూ బిజీగా ఉన్నారు చిత్ర నిర్మాతలు. దీనిలో భాగంగానే గురువారం (మే 10) సాయంత్రం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి అందరి దృష్టి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ రాలేదు.
సినిమా విడుదలైనప్పటి నుంచి హీరోయిన్ అను ఎక్కడా కూడా ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు. ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. అసలే విపరీతమైన పోటీలో నా పేరు సూర్య రిలీజైంది. టాక్ కూడా పాజిటివ్‌గా రాకపోవడంతో కలెక్షన్స్‌పై ప్రభావం చూపుతోంది. ‘మహానటి’కి పాజిటివ్ టాక్ రావడం కూడా ఈ మూవీపై ప్రభావం పడుతుంది.
సక్సెస్‌మీట్‌కు అను ఇమ్మాన్యూయేల్ హాజరుకాకపోగా... చిన్న వివరణ ఇచ్చి చేతులు దులుపుకుంది. ‘కుటుంబ విషయాల వల్ల హాజరుకాలేకపోతున్నాను. నాకు సక్సెస్‌మీట్‌కు రావాలని ఉంది. కానీ దురదృష్టవశాత్తు రాలేకపోతున్నాను. ఇది నాకు ప్రత్యేకమైన మూవీ, ఈ సినిమాలో నటించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా గురించి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు.
— Anu Emmanuel (@ItsAnuEmmanuel) May 10, 2018
Comments
Please login to add a commentAdd a comment