సాక్షి, హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'. ఇందులో బన్నీ ఆర్మీ అధికారిగా నటిస్టున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించి సినిమా యూనిట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు అందిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా బన్నీ మరో స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఇందులో బన్నీ నోటిలో పొగాకు చుట్టతో జీప్‌లో కూర్చొని ఉన్నాడు. అంతేకాదు కంటిపై గాయంతో ఊర మాస్ లుక్‌తో అల్లువారబ్బాయి రచ్చ చేస్తున్నాడు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బన్నీ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈసినిమాను లగడపాటి శ్రీధర్, నాగబాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్‌లు స్వరాలందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment