
‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కథని డెవలప్ చేసుకుంటూ డైరెక్షన్ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు బన్నీకి ఈ కథ బావుంటుందనిపించింది. ఆయన్ని కలిసి ఒక గంట కథ చెప్పా. బన్నీకి నచ్చిన తర్వాత మిగిలిన కథను డెవలప్ చేశా. సూర్య పాత్రలో అల్లు అర్జున్‌ని తప్ప మరో యాక్టర్‌ని ఊహించుకోలేను’’ అని వక్కంతం వంశీ అన్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదలైంది. ఈ సందర్భంగా వక్కంతం వంశీ విలేకరులతో మాట్లాడారు.దర్శకుడు కావాలన్న నా కల ‘నా పేరు సూర్య’ సినిమాతో నేరవేరింది. మా చిత్రం ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. అన్నిచోట్ల నుంచి మంచి స్పందన వస్తుండటంతో చాలా సంతోషంగా ఉంది. మిలటరీ వారు సినిమా చూసి హ్యాపీగా ఫీలయ్యారు ∙ఏ హాలీవుడ్ సినిమాకూ ఇది ఇన్‌స్పిరేషన్ కాదు. ఫిక్షన్ కథే. మన కలల్ని సాధించాలని మొదలుపెట్టే జర్నీ ప్యూర్‌గా ఉంటుంది. ఆ గోల్‌ను సాధించే క్రమంలో అంతే ప్యూర్‌గా ఉండగలుగుతున్నామా? అలా ఉండటం ఎంతో ముఖ్యమనే పాయింట్ చెప్పాలనుకున్నా.
దానికి కోపం అనే పాయింట్‌ను యాడ్ చేశాను ∙ప్రతి యాక్టర్ ఒక జాబ్ శాటిస్‌ఫాక్షన్ కోసం ప్రయత్నిస్తుంటారు. బన్నీ కూడా ఓ పర్ఫార్మెన్స్ రోల్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో నేను కథ చెప్పడం.. ఆయనకు నచ్చడంతో సినిమా చేశారు. రిలీజ్ తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమా చూసి త్రివిక్రమ్‌గారు, సుకుమార్‌గారు అభినందించారు ∙క్లయిమాక్స్‌లో చూపించిన అన్వర్ అనే సమస్య విలన్ సమస్య కంటే చాలా పెద్దది. సినిమా ప్రారంభంలో హీరో టెర్రరిస్ట్‌తో ‘నువ్వు టెర్రరిస్ట్ అయ్యాక నాకు కనపడ్డావ్. అందుకే చంపుతున్నాను. కాకముందు కనపడి ఉంటే టెర్రరిస్ట్ అవ్వాలనే నీ ఆలోచనను చంపేసేవాణ్ణి’ అనే డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్‌నే క్లయిమాక్స్‌లో చూపించాం. ఈ కథను రొటీన్ ఫార్మెట్‌లో చేసుంటే అందరూ విమర్శించేవారు. కానీ, నేను కథను ఎక్కడా డైవర్ట్ కాకుండా తీసుకువెళ్లాను ∙ఎన్టీఆర్‌గారు నా ఫేవరెట్ యాక్టర్. నన్ను డైరెక్టర్‌ని చేస్తానని చెప్పిందే ఆయన. ఆయన కోసం ఓ పాయింట్ అనుకున్నాను. అయితే డెవలప్‌మెంట్‌లో వర్కవుట్ కాలేదు ∙రైటర్‌గా కంటే డైరెక్టర్‌గా బాగా చేశానని చాలామంది అంటున్నారు. డైరెక్టర్ అయిన తర్వాత కూడా బయటి దర్శకులకు కథలు ఇస్తాను. ‘నీ రెండో మూవీ కూడా మా బ్యానర్‌లోనే ఉంటుంది’ అని నాగబాబుగారు అనడం ఆయన సంస్కారం.
Comments
Please login to add a commentAdd a comment