లాంగ్వేజెస్ డిలే ద డిమెన్షియా
భాషలతో మరింత పదునెక్కే మెదడు
వేర్వేరు భాషలు నేర్చుకుంటున్న కొద్దీ మెదడు మరింతగా పదునెక్కుతుందని పేర్కొంటున్నారు ‘యూనివర్సిటీ ఆఫ్ ఎడింబరో’కు చెందిన నిపుణులు. కనీసం రెండు భాషలు వచ్చిన వారికి వయసు పెరిగాక వచ్చే మతిమరుపు (డిమెన్షియా) చాలా ఆలస్యం అవుతుందని ఇదివరకే తెలుసు. 1947 నాటికి పదకొండేళ్ల పిల్లలుగా ఉన్నవారిని 853 మందిని ఎంపిక చేశారు. ఇందులో 262 మంది ఇంగ్లిష్‌తో పాటు మరో భాషను అదనంగా నేర్చుకున్నవారు ఉన్నారు.
దాదాపు వీళ్లకు డెబ్బయి ఏళ్లు వచ్చాక పరీక్షించి చూడగా.... ఒక భాష మాత్రమే మాట్లాడేవారికంటే కనీసం రెండు, అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడేవారిలో మతిమరపు వచ్చిన దాఖలాలు తక్కువని తేలింది. అంచెలంచెలుగా సాగిన ఈ పరిశోధనను నిర్వహించిన అధ్యయనవేత్తలు ఈ విషయాలను ‘యానల్స్ ఆఫ్ న్యూరాలజీ’ అనే విశ్వవిద్యాలయానికి చెందిన ప్రచురణలలో నమోదు చేసినట్లు వివరించారు.