'హిస్టరీ అంటే ఇష్టమే లేదు'
చారిత్రాత్మక చిత్రం 'మొహంజొదారో'తో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయిన హీరో హృతిక్.. తనకు హిస్టరీ సబ్జెక్ట్ అంటే ఇష్టమే ఉండేది కాదంటున్నాడు. మొహంజొదారో ప్రమోషన్ కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. స్కూల్లో ఉన్నప్పుడు హృతిక్.. హిస్టరీ అంటే చాలా బోరింగ్ సబ్జెక్ట్ అని ఫీలయ్యేవాడట. కానీ ఆ తర్వాత చరిత్ర ప్రాముఖ్యతను తెలుసుకున్నాడు. నేనే కాదు.. ఎవరైనా సరే చరిత్ర గొప్పతనం తెలుసుకుని తీరాలి. మన పుట్టుపూర్వోత్తరాల గురించి, సంస్కృతి,సంప్రదాయాల గురించి, గొప్ప వ్యక్తుల జీవితాల గురించి తెలుసుకోవడం బావుంటుందంటున్నాడు హృతిక్.
చదువుకునే రోజుల్లో మాత్రం హిస్టరీ సబ్జెక్ట్ అస్సలు నచ్చేది కాదట. ఇప్పుడు ఇదంతా చదివి నేనేం చేయాలి అనుకునేవాడట. తర్వాత్తర్వాత తన ఆలోచన పూర్తిగా మారిందట. మన కుటుంబం గురించి, తాతముత్తాతల గురించి, వారి కష్టం గురించి తెలుసుకోవాల్సి అవసరం ఉంది. అన్నిటికీ మించి ప్రపంచ చరిత్ర తెలుసుకోవడం చాలా ముఖ్యం, నా పిల్లలిద్దరికీ అదే చెప్తుంటానంటూ సెలవిచ్చాడు. హృతిక్, పూజా హెగ్డేలు జంటగా నటిస్తున్న 'మొహంజొదారో' ఆగస్టు 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం హృతిక్, పూజాలు చిత్ర ప్రమోషన్లో ఫుల్ బిజీగా ఉన్నారు.