హీరోపై అభిమానాన్ని ఇలా చూపాడు! | Hrithik Roshan's fan buys 70 tickets to watch 'Mohenjo Daro' | Sakshi
Sakshi News home page

హీరోపై అభిమానాన్ని ఇలా చూపాడు!

Published Sat, Aug 13 2016 10:43 AM | Last Updated on Wed, Aug 21 2019 10:13 AM

హీరోపై అభిమానాన్ని ఇలా చూపాడు! - Sakshi

హీరోపై అభిమానాన్ని ఇలా చూపాడు!

ముంబై: తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే ఫ్యాన్స్ కు పండగే. తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రదర్శిస్తుంటారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తాజా చిత్రం 'మొహంజోదారో' విడుదల సందర్భంగా ఓ అభిమాని వినూత్నంగా ఆదరణ ప్రదర్శించాడు. తన ఫేవరేట్ హీరో హృతిక్ సినిమా రెండేళ్ల విడుదల కావడంతో రాహుల్ రాజ్ అనే అభిమాని సందడి చేశాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా తానొక్కడే 70 టిక్కెట్లు కొనేశాడు. మార్నింగ్ షోకు 70 టిక్కెట్లు తీసుకుని హృతిక్ రోషన్ తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. టిక్కెట్లతో రాహుల్ రాజ్ ఉన్న ఫొటోను మరో అభిమాని ట్వీట్ చేశాడు. అయితే రాహుల్ రాజ్ ఎక్కడి వాడు అనే వివరాలు వెల్లడించలేదు.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'మొహంజోదారో' సినిమా శుక్రవారం విడుదలైంది. 'లగాన్' డైరెక్టర్ అసతోశ్ గోవారికర్ దరకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ సరసన పూజా హెగ్డే  నటించింది. కాగా, సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' సినిమా విడుదలైనప్పుడు కూడా ఓ అభిమాని ధియేటర్ లోని టిక్కెట్లులన్నీ తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. తన భార్యను ఇంప్రెస్ చేయడానికి అతడు ఈ పనిచేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement