కాలేజ్ అమ్మాయికి హృతిక్ స్పెషల్ గిఫ్ట్ | Hrithik Roshan's impromptu birthday gift to a fan made her day! | Sakshi
Sakshi News home page

కాలేజ్ అమ్మాయికి హృతిక్ స్పెషల్ గిఫ్ట్

Published Sat, Aug 6 2016 8:11 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

కాలేజ్ అమ్మాయికి హృతిక్ స్పెషల్ గిఫ్ట్

కాలేజ్ అమ్మాయికి హృతిక్ స్పెషల్ గిఫ్ట్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఓ కాలేజ్ అమ్మాయికి స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు. తన లేటెస్ట్ ఫిల్మ్ 'మొహంజొదారో' ప్రమోషన్ కోసం ఢిల్లీ చేరుకున్న హృతిక్, హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి శుక్రవారం గార్గీ గాళ్స్ కాలేజ్కి వెళ్లారు. హృతిక్కు అక్కడి అమ్మాయిల నుంచి అదిరే వెల్కం అందింది. స్టార్ హీరోను చూసిన ఆనందంలో యువతులంతా సంతోషంలో మునిగిపోయారు.

హృతిక్, పూజాలిద్దరూ వారితో సరదా సంభాషణ జరుపుతూ.. వారి ప్రశ్నలకు సమాధానాలిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ యువతి పుట్టినరోజని తెలిసింది. వెంటనే ఆమెను స్టేజ్పైకి ఆహ్వానించిన హృతిక్.. ఆమె కోరుకున్నట్టుగానే ఆమెతో కలిసి డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ను ఫిదా చేశాడు. 'జిందగీ న మిలేగీ దొబారా'  సినిమాలోని హిట్ సాంగ్ సెనోరీటాకు ఆ బర్త్ డే గాళ్తో కలిసి స్టెప్పులేశాడు. అభిమాన హీరోతో కలిసి ఆడిపాడిన ఆమె స్వీట్ షాక్కు గురైంది. ఇది తనెప్పటికీ మర్చిపోలేని బర్త్ డే అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

చారిత్రాత్మక కథనంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'మొహంజొదారో' ఆగస్టు 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement