
నగ్నంగా హృతిక్..?
సినిమాల్లో కథానాయకులు చొక్కా తీసి, తమ కండల దేహాలను ప్రదర్శించడం లేదా నగ్నంగా నటించడం అనేది ఇటీవల సర్వసాధారణమైంది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ తమ సిక్స్ ప్యాక్స్‌తో అభిమానులకు స్ఫూర్తిగా నిలిచారు. ఇక ఆమిర్‌ఖాన్ మరి కాస్త ముందుకు వెళ్లి ‘పీకే’ చిత్రంలో నగ్నంగా కనిపించారు. అప్పట్లో ఆ పోస్టర్ వివాదానికి కూడా దారి తీసింది. తాజాగా హృతిక్ రోషన్ కూడా తన తాజా చిత్రం ‘మొహంజదారో’లోని ఓ సన్నివేశంలో నగ్నంగా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి ఆశుతోష్ గోవారీకర్ దర్శకుడు. ప్రాచీన సింధు నాగరక సమాజం నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. పూజా హెగ్డే ఈ చిత్రంలో నాయిక.