సినిమా బడ్జెట్లతో పోలిస్తే కలెక్షన్లు రివర్స్ | Rustom wins big against Mohenjo Daro on first day | Sakshi
Sakshi News home page

సినిమా బడ్జెట్లతో పోలిస్తే కలెక్షన్లు రివర్స్

Published Sat, Aug 13 2016 6:58 PM | Last Updated on Fri, Oct 5 2018 9:08 PM

సినిమా బడ్జెట్లతో పోలిస్తే కలెక్షన్లు రివర్స్ - Sakshi

సినిమా బడ్జెట్లతో పోలిస్తే కలెక్షన్లు రివర్స్

బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు మొహంజదారో, రుస్తుం బాక్సాఫీసు వద్ద పోటీపడుతున్నాయి. శుక్రవారం ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి. రుస్తుంను 65 కోట్ల రూపాయల వ్యయంతో తీయగా, మొహంజదారోను 120 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. కాగా తొలిరోజు ఈ రెండు సినిమాల కలెక్షన్లను రుస్తుందే పైచేయి.

తొలిరోజు రుస్తుం సినిమాకు భారత్లో 14.11 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కాగా మొహంజదారోకు 8.87 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు వెల్లడించాడు. చారిత్రక కథతో తెరకెక్కిన మొహంజొదారో సినిమాలో హృతిక్ రోషన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, నావికా దళంలో సేవలందించిన ఆఫీసర్ కేఎం నానావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన రుస్తుం సినిమాలో అక్షయ్ సరసన ఇలియానా నటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement