చానీ.. లుకింగ్ సో చార్మింగ్! | Pooja Hegde unveils her regal look in Hrithik Roshan starrer Mohenjo Daro | Sakshi
Sakshi News home page

చానీ.. లుకింగ్ సో చార్మింగ్!

Published Thu, Jun 16 2016 10:35 PM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

చానీ.. లుకింగ్ సో చార్మింగ్! - Sakshi

చానీ.. లుకింగ్ సో చార్మింగ్!

లైలా తన లుక్‌తో అభిమానుల గుండెల్లో హీట్ పెంచేశారు. ఇంతకీ ఈ లైలా ఎవరో తెలిసే ఉంటుంది. తెలుగు చిత్రం ‘ఒక లైలా కోసం’లో నాగచైతన్య ప్రేయసి  లైలాగా కుర్రకారు గుండెలను దోచేసిన పూజా హెగ్డే ఆ తర్వాత ‘ముకుంద’ చిత్రంలో నటించారు. హిందీలో తొలి చిత్రం ‘మొహంజదారో’ విడుదల కాక ముందే ఆ చిత్రంలోని లుక్‌తో బాలీవుడ్‌ను తన వైపు తిప్పుకుంటున్నారు. ఇంతకీ ఆమెకు ఈ సినిమాలో ఎలా అవకాశం వచ్చిందో తెలుసా...? ఒకే ఒక్క యాడ్‌తోనే ఆమె ఈ బంపర్ ఆఫర్ కొట్టేశారు.

సినిమాల్లోకి రాకముందు పూజ చే సిన యాడ్ ‘మొహంజదారో’ టీమ్ దృష్టిలో పడింది. అంతే.. ఆ భారీ చిత్రంతోనే బాలీవుడ్ ఎంట్రీ చాన్స్ వచ్చేసింది. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఆయన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.హృతిక్ ప్రేయసి చానీగా పూజ ఇందులో నటిస్తున్నారు.  గురువారం విడుదల చేసిన చానీ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిమానులు ‘చానీ.. లుకింగ్ సో చార్మింగ్’ అని పూజాని ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement