మొహంజొదారోలో పూజా హెగ్డే | Puja hegde Look in Mohenjo Daro Movie | Sakshi
Sakshi News home page

మొహంజొదారోలో పూజా హెగ్డే

Published Thu, Jun 16 2016 2:39 PM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

మొహంజొదారోలో పూజా హెగ్డే - Sakshi

మొహంజొదారోలో పూజా హెగ్డే

వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముందుగుమ్మ పూజా హెగ్డే. తరువాత నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించిన ఈ బ్యూటీకి టాలీవుడ్లో పెద్దగా ఆఫర్స్ ఏవీ రాలేదు. దీంతో అమ్మడి కెరీర్ ఆరంభంలోనే ముగిసిపోయిందనుకున్నారు. అయితే అదే సమయంలో బాలీవుడ్ మ్యాన్లీ హంక్ హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా మొహంజోదారో సినిమాలో కీలకపాత్రలో నటించే అవకాశం వచ్చింది. దీంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.

తాజాగా పూజా హెగ్డే బాలీవుడ్ ఎంట్రీకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ప్రపంచంలోనే ప్రాచీన నాగరికతగా చెబుతున్న మొహంజోదారో కాలంలో మహారాణిలా కనిపిస్తున్న పూజా లుక్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన హృతిక్ ఫస్ట్ లుక్ ఆన్ లైన్లో హవా చూపిస్తుండగా.., ఇప్పుడు విడుదలైన పూజా ఫస్ట్ లుక్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement