
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అరవింద సమేత.. అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వీర రాఘవ ఉపశీర్షిక.
చేతిలో కత్తి.. సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్‌ను మేకర్లు వదిలారు. గతంలో హీరోల క్లాస్ మేకోవర్‌లతో ఫస్ట్ లుక్‌లను వదిలిన త్రివిక్రమ్.. ఈసారి ఎన్టీఆర్ కోసం యాక్షన్ పార్ట్‌తో ఫస్ట్ లుక్ వదలటం విశేషం. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 28వ చిత్రం కాగా, డస్కీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా తన ట్విటర్‌లో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Presenting, అరవింద సమేత... #AravindhaSamethaFirstLook pic.twitter.com/9tHpB6WfDK
— Jr NTR (@tarak9999) 19 May 2018