ఎన్టీఆర్‌తో తెలుగమ్మాయి | Aravindha Sametha Movie Latest Updates- Sakshi
Sakshi News home page

Published Tue, May 22 2018 10:31 AM | Last Updated on Tue, May 22 2018 2:37 PM

Eesha Rebba In Ntr And Trivikram Srinivas Film - Sakshi

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అరవింద సమేత’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌లకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ‍్చింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఫ్యామిలీ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎన్టీఆర్‌తో ఆడిపాడనున్నారట. ఇప్పటికే ఒక హీరోయిన్‌గా పూజాను తీసుకోగా మరో హీరోయిన్‌ పాత్రకు తెలుగమ్మాయి ఈషా రెబ్బాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నాగబాబు, జగపతి బాబులు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement