‘అరవింద సమేత’పై మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌! | Jr Ntr Mass and Class Roles in Aravinda Sametha | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 21 2018 10:57 AM | Last Updated on Thu, Jun 21 2018 2:06 PM

Jr Ntr Mass and Class Roles in Aravinda Sametha - Sakshi

జై లవ కుశ సినిమా తరువాత షార్ట్ గ్యాప్‌ తీసుకున్న యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడి స్లిమ్‌ అండ్‌ స్టైలిష్ లుక్‌లోకి మారిపోయాడు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ రెండు విభిన్న కోణాలున్నా పాత్రలో కనిపించనున్నాడట. క్లాస్‌గా కనిపించే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా రాయసీయ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో వచ్చే మాస్ యాక్షన్ హీరోగా ఎన్టీఆర్‌ అలరించనున్నాడని తెలుస్తోంది. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్ రాధకృష్ణ నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement