యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును అభిమానులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో జూనియర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రయూనిట్ కూడా ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు గిఫ్ట్ ఇచ్చింది.
నిన్న(శనివారం) మాస్ యాక్షన్ లుక్‌లో ఉన్న ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్‌చేసిన చిత్రయూనిట్ ఈ రోజు (ఆదివారం) క్లాస్ రొమాంటిక్‌లుక్‌లో ఉన్న ఎన్టీఆర్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్‌తో పాటు హీరోయిన్ పూజ హెగ‍్డే లుక్‌ను కూడా ఈ మోషన్ పోస్టర్‌లో రివీల్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment