రూ.30 కోట్లుపైగా వసూళ్లు | 'Mohenjo Daro' movie collects over Rs 30 crore in opening weekend | Sakshi
Sakshi News home page

రూ.30 కోట్లుపైగా వసూళ్లు

Published Mon, Aug 15 2016 2:39 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

రూ.30 కోట్లుపైగా వసూళ్లు

రూ.30 కోట్లుపైగా వసూళ్లు

ముంబై: హృతిక్ రోషన్ తాజా చిత్రం 'మొహంజోదారో' బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్ లో రూ.30.54 కోట్లు మాత్రమే వసూలు చేసింది. లగాన్' దర్శకుడు అసతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

విడుదల రోజున రూ.8.87 కోట్లు, శనివారం రూ.9.6 కోట్లు, ఆదివారం రూ.12.07 కోట్లు రాబట్టిందని సినిమా యూనిట్ వెల్లడించినట్టు నెట్ బాక్సాఫీస్ కలెక్షన్(ఎన్బీఓసీ) తెలిపింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'మొహంజోదారో'ను సిద్ధార్థ రాయ్ కపూర్, సునీత గోవారికర్ నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement