హైదరాబాద్ లో హృతిక్ సందడి | Hrithik Roshan promotes Mohenjo Daro in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో హృతిక్ సందడి

Published Mon, Aug 1 2016 7:57 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

హైదరాబాద్ లో హృతిక్ సందడి - Sakshi

హైదరాబాద్ లో హృతిక్ సందడి

బాలీవుడ్  స్టార్ హీరో హృతిక్ రోషన్ హైదరాబాద్ విచ్చేశారు. కూకట్పల్లి సుజనామాల్లో ఆయన సోమవారం సందడి చేశారు. రాడో వాచీల ప్రచార కార్యక్రమంలో భాగంగా హృతిక్ నగరానికి వచ్చారు. పనిలో పనిగా ఆయన తాజా చిత్రం 'మొహంజొదారో' ప్రమోషన్లో కూడా పాల్గొన్నారు. మాల్కి బాలీవుడ్ టాప్ స్టార్ రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. హృతిక్.. అంటూ అరుస్తూ అభిమానాన్ని చాటుకున్నారు హైదరాబాదీలు.

థాంక్యూ హైదరాబాద్ అంటూ హృతిక్ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. అమేజింగ్ పీపుల్, అమేజింగ్ ఫుడ్, అమేజింగ్ డే అంటూ నగరంలోని స్నేహితులతో గడిపిన ఫొటోలను పోస్ట్ చేశారు. చారిత్రక కథతో తెరకెక్కిన మొహంజొదారో సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ మంజూరయ్యింది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement