హృతిక్ రోషన్‌తో కలసి జోధా అక్బర్ వంటి అద్భుత కళాఖండాన్ని సృష్టించిన నిర్మాత ఆశుతోష్ గోవరికర్ మరో ప్రేమకథను కథను తెరకెక్కించనున్నాడు. అదే మొహంజదారో. ఈ సవాలును స్వీకరిస్తున్నందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నాడీ జాతీయ పురస్కార గ్రహీత. ఈ కథ చెప్పగానే ఎంతో ఉత్తేజితుడినయ్యానని అని అన్నాడు. ‘కథలను ప్రేమిస్తా. అందులోనూ విభిన్న కాలాలకు చెందినవంటే ఇంకా ఎంతో ఇష్టం. అవికూడా అనేక శతాబ్దాల క్రితంనాటివంటే ఉత్సాహం అనేక రెట్లు పెరుగుతుంది’ అని అన్నాడు. ‘మొహంజదారో క్రీస్తుపూర్వం 2500 సంవత్సరంనాటిది. నేను తెరకెక్కించనున్న ఈ సినిమాలో హృతిక్ ఓ ప్రవక్తలా కనిపించనున్నాడు. ఈ సినిమా తెరకెకి కంచనుండడం నన్ను ఎంతో ఉత్సుకతకు గురిచేస్తోంది. పురాతన చరిత్ర ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాకి మేమిద్దరం మరోసారి కలసి పనిచేయనుండడం నాకు చెప్పలేనంత ఆనందం కలిగిస్తోంది.
కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యకలాపాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ ఏడాది చివరి తైమాసికంలో ఈ సినిమా సెట్లపైకి రానుంది. ఇదిలాఉంచితే జోధాఅక్బర్‌లో నటించిన హృతిక్ సైతం ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు. ‘సవాళ్లను ఎదుర్కోవడం గొప్పగా అనిపిస్తుంది. ఇది ఆయా వ్యక్తుల శారీరక, మానసిక శక్తిని అభివర్ణిస్తుంది. ఈ సినిమా ఎంతో స్ఫూర్తిదాయకమైనది. అందులోనూ ఇది పురాతన భారతీయ ప్రేమగాధను వర్ణించే చిత్రం. సింధు నాగరికత అందరికీ తెలిసినదే. ఇది భారతీయులకే కాకుండా ఇతర దేశాలవారికీ ఎంతో ఆసక్తికరమైనది. ఆశుతోష్‌తో కలసి మరోసారి పనిచేయనుండడం నాకు కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తోంది’ అని హృతిక్ ఈ సందర్భంగా అన్నాడు.
కథల్ని ప్రేమిస్తా..!
Published Sun, Jun 8 2014 9:44 PM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM
Advertisement
Advertisement