Neerja
-
మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
నగరంపాలెం: గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా జడ్జి హాల్లో సోమవారం సుప్రీంకోర్టు మీడియేషన్/కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ(ఎంసీపీసీ–న్యూఢిల్లీ), రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(అమరావతి) ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘మధ్యవర్తిత్వం’పై 40 గంటల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. గుంటూరు జోన్‌లోని గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఏపీ రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయాధికారులు హాజరు కాగా, ఈ నెల 20 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి.శిక్షణ అధికారులుగా ఎంపికైన సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఢిల్లీ నుంచి నిషా సక్సేనా(జిల్లా జడ్జి), నీర్జాభాటియా(జిల్లా జడ్జి) హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి తరగతులను ప్రారంభించారు. వారు మధ్యవర్తిత్వానికి సంబంధించి పలు అంశాలను వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎఫ్ఏసీ చైర్మన్, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్‌బాబు, సంస్థ టి.లీలావతి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం అని అన్నారు. తక్కువ ఖర్చుతో న్యాయం పొందేందుకు మధ్యవర్తిత్వం అనే సాధనం చక్కగా ఉపకరిస్తుందని వివరించారు. -
ఉత్తమ చిత్రంగా ‘నీర్జా’
న్యూయార్క్: ‘ఉడ్తా పంజాబ్’ సినిమాలో అద్భుత నటనకు షాహిద్ కపూర్, అలియా భట్లు ఉత్తమ హీరో, హీరోయిన్లుగా ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ)–2017 అవార్డుల్ని దక్కించుకున్నారు. న్యూ యార్క్‌లో శనివారం రాత్రి(భారత్‌లో ఆదివా రం ఉదయం) జరిగిన 18వ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ చిత్రంగా ‘నీర్జా’ నిలిచింది. పింక్ సినిమాకుగాను అనిరుధ్ రాయ్ చౌదురీకి ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. సంగీత దర్శకుడిగా పాతికేళ్లు పూర్తిచేసుకున్న ఏఆర్ రెహమాన్‌ను ప్రత్యేక అవార్డుతో సత్కరించారు. అనుపమ్ ఖేర్(ఎంఎస్ ధోనీ), షబానా అజ్మీ(నీర్జా) ఉత్తమ సహాయ నటు డు, నటి అవార్డులు గెలుచుకున్నారు. డిష్యూం సినిమాకు వరుణ్ ధావన్ ఉత్తమ హాస్య నటుడి, జిమ్ సర్బా(నీర్జా) ఉత్తమ విలన్ అవార్డుల్ని దక్కించుకున్నారు. మ్యూజిక్ విభాగంలో కరణ్ జోహార్ సినిమా ‘యే దిల్ హై ముష్కిల్’ ఎక్కువ అవార్డుల్ని సాధించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతమ్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా అమిత్ మిశ్రా, ఉత్తమ పాటల రచయితగా అమితాబ్ భట్టాచార్యలు నిలి చారు. ఉత్తమ నేపథ్య గాయనిగా తుల్సీ కుమార్(ఎయిర్ లిఫ్ట్), కనికా కపూర్(ఉడ్తా పంజా బ్)లు సంయుక్తంగా ఎంపికయ్యారు. నటి దిశా పటానీ(ఎంఎస్ ధోనీ), పంజాబ్ నటుడు దిల్జిజ్ దోసాంజా(ఉడ్తా పంజాబ్)లు తొలి పరిచయం కేటగిరీలో అవార్డులొచ్చాయి. -
ఫ్యాషన్ రంగంలోకి స్టార్ హీరోయిన్
హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోతున్న స్టార్ వారసురాలు సోనమ్ కపూర్, ఫ్యాషన్ ఐకాన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ స్టైల్స్ అప్పుడప్పుడు వివాదాస్పదమవుతున్నా.. ఫ్యాషన్ దివాగా సోనమ్ కు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఇటీవల నీర్జా సినిమాతో నటిగానూ మంచి మార్కులు సాధించింది. ఈ సినిమాకు జాతీయ అవార్డును సైతం అందుకున్న సోనమ్, వ్యాపార రంగంలోకి అడుగుపెడుతుంది. లేటెస్ట్ స్టైల్స్ ను బాలీవుడ్ కు పరిచయం చేసిన సోనమ్, ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెడుతుంది. తన సోదరి రియా కపూర్ తో కలిసి రేసన్ అనే ఫ్యాషన్ బ్రాండ్ ను లాంచ్ చేస్తోంది. ఈ నెల 12నుంచి ఈ బ్రాండ్ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. అన్ని షాపర్ స్టాప్ స్టోర్స్ లో ఈ బ్రాండ్ ను అందుబాటులోకి తెస్తున్నారు. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయిన సోనమ్ బిజినెస్ ఉమెన్ ఆకట్టుకుంటుందేమో చూడాలి. -
తళుక్కున మెరిసిన సినీ తారలు
-
అవార్డు కొనలేదు
‘‘ఈ అవార్డును నేను నిజాయితీతో సంపాదించుకున్నాను. నేనిప్పటివరకూ మోసం చేయలేదు. అవార్డు కోసం ఎవరికైనా ఫోన్ చేయడం గాని, నాకు ఫేవర్ చేయమని డబ్బులు ఇవ్వడం గానీ చేయలేదు’’ అన్నారు హిందీ హీరో అక్షయ్ కుమార్. జాతీయ ఉత్తమ నటుడిగా అక్షయ్‌కు అవార్డు ఇవ్వడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతకు ముందు అవార్డు పట్ల అక్షయ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ఈ అవార్డును నా పేరెంట్స్, ఫ్యామిలీ, నా వైఫ్ (ట్వింకిల్ ఖన్నా)కు అంకితం చేస్తున్నాను. ‘మీరు అవార్డు ఫంక్షన్లకు వెళ్లడం మానేశారా? మీకెప్పుడైనా అవార్డు వస్తుందా?’ అని ట్వింకిల్ అన్నప్పుడు బాధగా అనిపించేది. ఇప్పుడు హ్యాపీ. అవార్డ్స్ కమిటీ జ్యూరీ, ఫ్యాన్స్, అందరికీ థ్యాంక్స్’’ అన్నారు అక్షయ్. అన్నట్టు... జాతీయ ఉత్తమ హిందీ చిత్రం ‘నీర్జా’లోని నటనకు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న సోనమ్‌కపూర్‌తో కలసి అక్షయ్ ‘పాడ్‌మ్యాన్’ అనే సినిమా చేస్తున్నారు. జాతీయ అవార్డులు ప్రకటించినప్పుడు వీరిద్దరూ ఆ సినిమా లొకేషన్లోనే ఉన్నారు. -
ఆ పాత్ర నా జీవితాన్ని మార్చేసింది!
నీర్జా బానోత్.. విమాన ఉద్యోగి అయిన ఆమె 23 ఏళ్ల వయస్సులో నిరూపమానమైన ధైర్యసాహసాన్ని చూపింది. ఉగ్రవాదులు హైజాక్ చేసిన విమానంలోని ప్రయాణికులను కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టింది. తన పుట్టినరోజుకు కేవలంర రెండురోజుల ముందు ఉగ్రవాదుల కాల్పుల్లో ఆమె ప్రాణాలు విడిచింది. ఆమె జయంతి సెప్టెంబర్ 7 కావండంతో బాలీవుడ్ నటి సోనం కపూర్.. ఆమెను స్మరించుకుంది. సాటివారి కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఆమె గొప్పతనాన్ని కీర్తిస్తూ ఘనంగా నివాళులర్పించింది. నీర్జా బానోత్ పాత్రను వెండితెరపై అద్భుతంగా పోషించిడం ద్వారా ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలను సోనం కపూర్ పొందిన సంగతి తెలిసిందే. నీర్జా బానోత్ కు నివాళులర్పిస్తూ.. ఆమె తల్లితో దిగిన ఫొటోను సోనం ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ' హ్యాపీ బర్త్ డే నీర్జా. నీ జన్మదినం నాకెంతో ప్రత్యేకమైనది. నువ్వెప్పుడూ చీకట్లో వెలుగుదీపమై నన్ను నడిపిస్తావు. నాకు ఎన్నో విధాలుగా స్ఫూర్తినిచ్చావు. నీ పాత్ర పోషించడంతో నాలో సహనం, దయాగుణాన్ని మరింతగా నింపింది. అన్నింటికన్నా స్వీయ ఉనికి అంటే ఏమిటో తెలిపింది' అని సోనం పేర్కొంది. -
దోస్త్ మేరా దోస్త్
ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఇంటర్వ్యూ కలిసి చాయ్ తాగేవాళ్లు... కమ్మని కబుర్లు చెప్పేవాళ్లు... ఫ్రెండ్స్ అంటే వీళ్లేనా? ఊహూ... ఎనీ టైమ్ నీకు నేనున్నా అని భరోసా కలిగించేవాళ్లు... అలాంటి ఫ్రెండ్ ఒక్కరు దొరికినా లక్కీయే హీరో నితిన్... డిజైనర్ కోన నీరజ లక్కీ పీపుల్... ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్... ఈ ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు... • సమంత, రకుల్, నితిన్.. ఇలా మీ ఫ్రెండ్స్ లిస్ట్ చాలానే ఉంటుందేమో? నీరజ: అవునండి. యాక్చువల్‌గా చిత్ర పరిశ్రమలో మంచి స్నేహితులు దొరకడం చాలా కష్టం. ఈ విషయంలో నేను చాలా లక్కీ. నాకు గొప్ప స్నేహితులు దొరికారు. అందులో నితిన్ ఒకడు. వెరీ డౌన్ టు ఎర్త్. ఓ హీరోలా అనిపించడు. పక్కింటి కుర్రాడిలానే ఉంటాడు. చాలా మంచోడు. • మీరు తొలిసారి కలిసింది ఎప్పుడు? ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కాస్ట్యూమ్ డిస్కషన్స్ టైమ్‌లో కలిశాను. నేను ఓ కాస్ట్యూమ్ డిజైనర్, తను ఓ హీరో.. ఫస్ట్‌లో మా రిలేషన్ అంతే. ఎక్కువగా మా డిస్కషన్లో సినిమా విషయాలు మాత్రమే ఉండేవి. • మరి... మంచి స్నేహితులు ఎప్పుడయ్యారు? మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. గ్యాంగ్ అందరూ ఒక్కటే. షూటింగ్ ఉన్నా.. లేకున్నా.. స్నేహితులు అందరం కలుస్తూ ఉండేవాళ్లం. అలా మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. • మీ ఇద్దరికీ కామన్‌గా ఉండే ఇష్టాల గురించి? ఫుడ్ అండ్ ట్రావెలింగ్. సరదగా కబుర్లు చెప్పుకోవడం. షాపింగ్.. ఏం చేయకుండా ఖాళీగా ఉండడం అన్నా ఇష్టమే. • ‘ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్’ అంటారు కదా. మీ ఫ్రెండ్షిప్? అలాంటిదే.. నాకు అవసరమైన ప్రతి సందర్భంలోనూ నితిన్ అండగా నిలబడతాడు. సలహాలు ఇస్తుంటాడు. • పెళ్లైన తర్వాత మరో అబ్బాయితో స్నేహం సాధ్యమేనా? మీ భర్త ఏమంటారు? ఎందుకు సాధ్యం కాదు? పెళ్లయినంత మాత్రన వేరే అబ్బాయితో స్నేహం చేయకూడదా? మనం పెరిగిన సంస్కృతి, సంప్రదాయాల వల్ల ఆడ, మగ స్నేహం అంటే అదో వింతగా అనిపించడం సహజం. మిగతావారు ఏం ఆలోచిస్తారో అర్థం చేసుకోగలను. కానీ, మా స్నేహం ఇటువంటి విషయాలకు అతీతమైనది. నా పెళ్లికి ముందే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఆ తర్వాత మా స్నేహం బలపడింది. పెళ్లి తర్వాత నా స్నేహితుల్లో మా ఆయన ఒకరు అయ్యారు. మేం ముగ్గురం కలిస్తే సందడికి కొదవ ఉండదు. • నితిన్ ప్లస్ అండ్ మైనస్‌లు ఏంటి? ప్లస్ పాయింట్స్ ఏంటంటే.. జాలి ఎక్కువ. మైనస్.. చాలా మొండిఘటం. • వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నితిన్ భవిష్యత్ ఎలా ఉండాలనుకుంటున్నారు? హీరోగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగా పెళ్లి చేసుకుని జీవితంలో ఓ ఇంటివాడైతే చూడాలనుంది. తనకు సరిజోడి ఎప్పుడు వెతుక్కుంటాడా? అని ఎదురుచూస్తున్నాను. • నీరజతో మీ ఫ్రెండ్షిప్ గురించి? నితిన్: నీరూ.. నీరజ కోనను నేనలాగే పిలుస్తాను. మా పరిచయం అయిన కొన్నాళ్లకు మేము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. మా ఇద్దరి మధ్య ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో నీరూ ఒకటి. • మీది ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్పా? రీల్ అండ్ రియల్.. నీరూ, నేను గుడ్ ఫ్రెండ్స్. రీల్ లైఫ్ స్టైలిస్ట్.. రియల్ లైఫ్‌లో కూడా బెస్ట్ ఫ్రెండ్ అయితే చాలా అడ్వాంటేజ్. • మీ ఫ్రెండ్స్‌లో చాలామంది అబ్బాయిలున్నారు. వాళ్లకీ, నీరజాకీ డిఫరెన్స్? ఏం లేదని అనుకుంటున్నాను. మేమంతా కలసి పార్టీలు చేసుకుంటాం. సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం. అబ్బాయిలతో నేనెంత సరదాగా ఉంటానో.. నీరూతో కూడా అంతే సరదాగా ఉంటాను. • ఓ ఫ్రెండ్‌గా నీరజ భవిష్యత్తు ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ప్రొఫెషనల్‌గా ఇంకా ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నా. ఫ్యాషన్ డిజైనింగ్ వైజ్‌గా ఓ సొంత బ్రాండ్ ప్రారంభించాలన్నది తన లక్ష్యం. అది నెరవేరాలని ఆశిస్తున్నా. నీరూ వ్యక్తిగత జీవితం చాలా బాగుంది. నీరూ కొడుకు అన్ష్ చాలా క్యూట్‌గా ఉంటాడు. కొడుకుతో చాలా ఎంజాయ్ చేస్తుంది. ఆ ఆనందం ఎప్పటికీ అలా కొనసాగాలి. • పెళ్లయిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ సాధ్యమేనా? నీరజ భర్తతో మీ అనుబంధం గురించి? ఫ్రెండ్షిప్ అనేది ఒకరి వైవాహిక జీవితంతో ముడి పడి ఉండదు. యాక్చువల్‌గా నీరూకి థ్యాంక్స్ చెప్పాలి. తనతో పాటు నాకు మరో మంచి ఫ్రెండ్‌ని కూడా ఇచ్చింది. అతనే అజయ్, నీరజ భర్త. నాకు చాలా మంచి స్నేహితుడు. మా ఫ్రెండ్స్ సర్కిల్ అంతటికీ తను కూడా క్లోజ్ అయ్యాడు. మాతో ఆయన వేవ్‌లెంగ్త్ బాగా కుదిరింది. • నీరజ ఎలాంటి అమ్మాయి? చాలా క్రియేటివ్ పర్సన్. తెలివైన అమ్మాయి • మీ టఫ్ టైమ్‌లో తన సలహాలు తీసుకుంటారా? తప్పకుండా. ఇప్పటికి అలానే ఉన్నాం. ఎప్పటికీ అలా ఉండాలని కోరుకుంటున్నాను. • మీ ఫ్రెండ్లో ఉన్న ప్లస్సులు, మైనస్సులు? ఎదుటి వ్యక్తి చెప్పేది కాదనకుండా వింటుంది. ప్లస్ పాయింట్ అదే. మైనస్ పాయింట్ ఏంటంటే.. ఎవరినైనా ఈజీగా నమ్మేస్తుంది. -
'టెర్రరిస్టు'తో హీరోయిన్ డేటింగ్!
ముంబై: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ నుంచి విడిపోయి కొన్ని నెలలుగా నటి కల్కి కొచ్లిన్ దూరంగా ఉంటోంది. అయితే ఆమె ఇటీవల ఓ కొత్త వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. కల్కి డేటింగ్ గురించి బాలీవుడ్ కోడై కూస్తోంది. అయితే టెర్రిరిస్టుతో డేటింగ్ చేయడమేంటని కంగారు పడకండి. ఆ వివరాలపై ఓ లుక్కేద్దామా మరి. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ కల్కి చాలా ఫాస్ట్. ఇటీవల విడుదలై బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపిండంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ 'నీర్జా'. ఈ సినిమాలో కరడుగట్టిన టెర్రరిస్టుగా జిమ్ సరభ్ కనిపిస్తాడు. పాక్ టెర్రరిస్టుగా నటించిన జిమ్, ఎయిర్ హోస్టెస్ నీరజా బానోతు(సోనమ్ కపూర్)తో పాటు విమాన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తాడు జిమ్. జిమ్, కల్కి గత కొంత కాలం నుంచి సన్నిహితంగా ఉంటున్నారు. రిలేషన్ పై వారిద్దరూ కాస్త సీరియస్ గా కనిపిస్తున్నారన్న వార్త స్థానిక మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుండటంతో వీరి డేటింగ్ విషయం గుప్పుమంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా 2009లో వచ్చిన 'డేవ్.డి'తో బెస్ట్ సపోర్టింగ్ నటిగా అవార్డు అందుకున్న కల్కి ఆ తరువాత మరిన్ని మూవీల్లో నటనకుగానూ ఎన్నో అవార్డులు సాధించింది. అయితే రియల్ స్టోరీ 'నీర్జా' మూవీతో పేరు తెచ్చుకున్న జిమ్ అప్పుడే మంచి స్టార్ నటితో డేటింగ్ మొదలెట్టడంతో వీరి రిలేషన్ పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. -
హిట్ హీరోయిన్‌కు ఒక్క సినిమా లేదట!
బాలీవుడ్ స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా.. అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన బ్యూటీ సోనమ్ కపూర్. హీరోయిన్గా సక్సెస్‌లు సాధించలేకపోయినా తన గ్లామర్ షోతో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ పరంగా అప్ డేట్ అవుతూ వస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. ఇటీవల బయోపిక్‌గా తెరకెక్కిన నీర్జా సినిమాలో నటించిన సోనమ్ తొలిసారి నటిగా మంచి మార్కులు సాధించింది. నీర్జా సినిమా సోనమ్‌కు మంచి పేరు తీసుకురావటమే కాదు. కలెక్షన్ల పరంగా కూడా బాలీవుడ్లో సంచలనాలు సృష్టించింది. దీంతో సోనమ్ ఫేట్ మారిపోయినట్టే అని భావించారు అంతా. కానీ అలా జరగలేదు. నీర్జా లాంటి భారీ హిట్ తరువాత కూడా సోనమ్ కపూర్‌కు మంచి అవకాశాలు రావటం లేదట. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'నీర్జా సినిమా తరువాత ఇప్పటివరకు ఒక్క మంచి కథ కూడా రాలేదు. అందుకే ఇంత వరకు సినిమా అంగీకరించలేదు' అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ర్యాంప్ షోలతో టైం పాస్ చేస్తున్న సోనమ్‌కు స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేని సోనమ్, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇండియాలో జరిగే ఈవెంట్స్ లోనే ఓ రేంజ్ గ్లామర్ షో ఇచ్చే సోనమ్ కేన్స్ హాట్ టాపిక్ గా మారనుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు తన సొంత నిర్మాణ సంస్థలో బ్యాటిల్ ఆఫ్ బిట్టోరా పేరుతో సినిమాను నిర్మించే ఆలోచనలో ఉంది. -
లక్కీ ఛాన్స్ వదులుకుందా..!
ముంబయి: ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ మూవీ 'నీరజా'. ఈ మూవీలో నటనకు గానూ సోనమ్ కపూర్ విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఇందుకు కారణం.. ఆమె నటన మాత్రమే కాదు, ఆమె ఎంచుకున్న పాత్ర కూడా ఇందుకు తోడైంది. ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ మూవీలో సోనమ్ కు అవకాశం ఇవ్వాలని దర్శకనిర్మాతలు అసలు అనుకోలేదట. మొదట ఈ మూవీ కోసం ఆలియా భట్ ను తీసుకోవాలని భావించారట. అయితే ఆ తర్వాత ఏమైందోగానీ సోనమ్ ను ఈ అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. దీంతో ఒక్కసారిగా మరింత పాపులర్ స్టార్ గా మారిపోయింది. ఆమె చాలా ప్రతిభ గల హీరోయిన్ అని, ఆమె నటించిన నీరజా సినిమాతో తానెంటో రుజువు చేసుకుంటుందని అమీర్ ఖాన్, మరి కొందరు ప్రముఖుల నుంచి సోనమ్ ప్రశంసలు అందుకుంది. రాం మద్వానీ 'నీరజ' మూవీకి దర్శకత్వం వహించారు. నీరజ సినిమాను పాన్ ఎమ్ 73 విమానాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు కరాచీలో హైజాక్ చేసిన యదార్థ సంఘటన ఆధారంగా చిత్రీకరించిన విషయం తెలిసిందే. మహిళా సిబ్బందిలో ఒకరైన నిరజా బానోతు విమానంలోని ప్రయాణికులను కాపాడుకునేందుకు చూపించిన తెగువ అద్భుతంగా తెరకెక్కించారు. ఆలియా భట్ ఓ మంచి అవకాశాన్ని కోల్పోయిందని బాలీవుడ్ లో ఈ మధ్య వార్తలు ప్రచారం అవుతున్నాయి. తనకు తానే ఈ మూవీలో అవకాశం వదులుకున్నట్లయితే ఓ మంచి సినిమాను ఆలియా చేజేతులారా పోగొట్టుకున్నట్టేనని కొందరు బాలీవుడ్ సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. -
తొలి వారం నీర్జా రికార్డ్
స్టార్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ సాధించటంలో మాత్రం వెనకబడిన అందాల భామ సోనమ్ కపూర్. సినిమాల సంగతి ఎలా ఉన్నా తన గ్లామర్ షో తో మాత్రం ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ బ్యూటీ తొలిసారిగా నీర్జా సినిమాతో తన కల నెరవేర్చుకుంది. 1986లో జరిగిన విమానం హైజాక్ నేపథ్యంలో తెరకెక్కిన బయోగ్రఫికల్ థ్రిల్లర్ నీర్జాలోఎయిర్ హోస్టెస్ నీర్జా భానోత్ పాత్రలో నటించింది సోనమ్. ఈ సినిమాతో మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్న సోనమ్.. ఇన్నాళ్లు తనను ఊరిస్తున్న భారీ కమర్షియల్ హిట్‌ను కూడా సాధించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా 29 కోట్లకు పైగా వసూలు చేసింది. తొలివారం పూర్తయ్యే సరికి 35 కోట్ల వరకు వసూలు చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతున్న నీర్జా లాంగ్ రన్లో 100 కోట్ల మార్క్ ను రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు. -
సినిమానే కాదు.. మా నిజ జీవిత సంఘటన
ముంబై: ఎయిర్ హోస్టెస్ నీర్జా బానోత్ జీవితకథ ఆధారంగా నిర్మించిన బాలీవుడ్ సినిమా 'నీర్జా'కు ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. 1986 సెప్టెంబర్ 5న హైజాక్‌కు గురైన ముంబై-న్యూయార్క్ విమానంలో లిబియా ఉగ్రవాదుల నుంచి ప్రయాణికులను కాపాడే ప్రయత్నంలో నీర్జా తన ప్రాణాలను కోల్పోయింది. అప్పట్లో ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకున్న విమాన ప్రయాణికుడు ఖంజన్ దలాల్ 'నీర్జా' సినిమాను చూసి.. అనాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. నీర్జా బానోత్‌కు నివాళులు అర్పిస్తూ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. నీర్జా సినిమా మాత్రమే కాదు మా జీవితాల్లో జరిగిన వాస్తవిక సంఘటన అని ఖంజన్ దలాల్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అప్పట్లో ఉగ్రవాదుల దాడిలో ఖంజన్ దలాల్ తల్లి తృప్తి దలాల్ మరణించింది. 'కొందరికిది గొప్ప చిత్రం. థియేటర్లో నీర్జా సినిమా చూసి పాప్ కార్న్ తిని, కూల్ డ్రింక్ తాగి ఆస్వాదిస్తారు. కంటతడి కూడా పెడతారు. ఇంటికి వెళ్లాక సినిమా గురించి ఇతరులకు చెబుతారు. మాకు మాత్రం ఇది కేవలం సినిమా కాదు. నిజ జీవితంలో జరిగిన సంఘటన. జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని భయంకర ఘటన. అద్భుతంగా తెరకెక్కించారు' అని ఖంజన్ దలాల్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. సోనమ్ కపూర్ ప్రధానపాత్రలో నటించిన 'నీర్జా' సినిమాకు రామ్ మధ్వానీ దర్శకత్వం వహించారు. ఈ నెల 19న విడుదలైన ఈ సినిమా తొలి మూడు రోజుల్లో 22 కోట్ల రూపాయలను వసూలు చేసింది. -
'పొగడ్తలు సరే.. మా అమ్మాయి ఇంకా నేర్చుకోవాలి'
ముంబయి: తన కూతురు, బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ అన్నారు. 'ప్రపంచంలో మంచినటుడిగా, నటిగా అనిపించుకునే వారు ప్రతిరోజు ఏదోఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఇదే సోనమ్‌కు కూడా వర్తిస్తుంది. ఆమెకు ఎంతమంది నుంచి పొగడ్తలు వస్తున్నా, ఎవరు ఏ విధంగా మెచ్చుకుంటున్నా సోనమ్ మాత్రం ఇంకా నేర్చుకోవాల్సిందే. ఒక నటిగా ఆమె ఎప్పుడూ విద్యార్థినే' అని ఆయన అన్నారు. నటన అనేది ఒక సముద్రమంత విశాలమైనదని, దాన్ని ఎప్పటికీ పూర్తిగా నేర్చుకోలేమని అన్నారు. ప్రతిసారి తనకు తాను పునరాగమనం చెప్పుకొని కొత్తగా ప్రారంభించాల్సిందేనని చెప్పారు. నీర్జా సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ఆ చిత్రం తమ కుటుంబం మొత్తాన్ని ఒక భావోద్వేగంలోకి తీసుకెళ్లిందని చెప్పారు. బహుశా ప్రయాణీకుల కోసం నాడు ప్రాణ త్యాగం చేసిన నీర్జా భానోత్ ఆశీస్సులు తన కూతురుకు అందడం వల్లే సినిమా అంత బాగా వచ్చిందని అనుకుంటున్నానని చెప్పారు. -
'చివరిసారి ఎప్పుడు ఏడ్చానో తెలియదు.. కానీ'
ముంబై: సినిమా షూటింగ్ లో గాయాలపాలైన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్... ఆందోళన చెందవద్దని తన అభిమానులకు సూచించాడు. సోనమ్ కపూర్ నటించిన 'నీరజా' మూవీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో హృతిక్ పాల్గొన్నాడు. 'చివరిసారిగా ఎప్పుడు ఏడ్చానో కూడా తెలియదు. కానీ, ఈ మూవీ ఎమోషనల్ గా ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన మూవీ అని, సీనియర్ నటి షబానా అజ్మీకి సెల్యూట్' అంటూ హృతిక్ పేర్కొన్నాడు. తాను భయం లాంటి విషయాలు అసలు మాట్లాడనని, నీరజా మూవీ అందరికీ చాలా గర్వకారణమన్నాడు. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మొహంజోదారో షూటింగ్లో పాల్గొంటున్న మ్యాన్లీ స్టార్ ఈ మూవీ తీస్తుండగానే రెండోసారి గాయపడ్డాడు. గత నెలలో ఒకసారి గాయపడి షూటింగ్ కు విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అశుతోష్ గోవారికర్ ఈ మూవీకి దర్శకత్వం చేస్తున్నాడు. కనీసం రెండు వారాల పాటు షూటింగ్‌లకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. దీంతో మరోసారి మొహంజోదారో షూటింగ్‌కు బ్రేక్ పడింది. పూజా హెగ్డే ఈ మూవీతో బాలీవుడ్ లో కాలు మోపనుంది. డ్యాన్స్, ఫైట్స్ విషయంలో క్వాలిటీ కోసం హృతిక్ తీసుకుంటున్న జాగ్రత్తలే ప్రమాదాలకు కారణమవుతున్నాయని చిత్రయూనిట్ భావిస్తోంది. -
'ఆ సీన్ చూస్తూ కళ్ల వెంట నీళ్లొచ్చేశాయి'
ముంబయి: సోనమ్ కపూర్‌పై బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె చాలా ప్రతిభ గల హీరోయిన్ అని, ఆమె నటించిన నీరజా సినిమాతో తానెంటో రుజువు చేసుకుంటుందని చెప్పారు. మరికొద్ది రోజుల్లో సోనమ్ నటించిన నీరజ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో అమీర్ మీడియాకు సోనమ్ గురించి, ఆమె చిత్రం గురించి కొన్ని కబుర్లు చెప్పారు. నీరజా సినిమా ఈ వారంలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సినిమాలో సోనమ్ కపూర్‌కు షబానా ఆజ్మీ అమ్మగా నటించిందని, ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. ముఖ్యంగా సోనమ్ గురించి చెబుతూ ఈ సినిమా చివరి భాగంలో తాను చాలా భావోద్వేగానికి లోనయ్యానని, కళ్ల వెంట నీళ్లు కూడా వచ్చాయని, ఇది గొప్ప సినిమా అవుతుందని అన్నారు. నీరజ సినిమాను పాన్ ఎమ్ 73 విమానాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు కరాచీలో హైజాక్ చేసిన సంఘటన ఆధారంగా చిత్రీకరించారు. ఒక మహిళా సిబ్బంది తన ప్రయాణికులను కాపాడుకునేందుకు చూపించిన తెగువ అద్భుతంగా తెరకెక్కించారు. 'ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాం మద్వానీ నాకు మంచి స్నేహితుడు. అతను ఎంతో టాలెంట్ ఉన్న దర్శకుడు. ఈ సినిమా యదార్థంగా జరిగిన సంఘటన. హైజాక్ చేసినప్పుడు ప్రయాణికులను కాపాడిన అమ్మాయి(సోనమ్) నిజంగా చాలా తెలివైనది. ప్రతిఒక్కరికీ ఈ సినిమా స్పూర్తినిస్తుంది' అని అమీర్ అన్నారు. నిజ జీవితంలో తాను కూడా కొన్ని సమయాల్లో భయానికి లోనవుతుంటానని ఆయన చెప్పారు. ముఖ్యంగా తన కుటుంబం గురించే ఎక్కువ భయంగా ఉంటుందని నా భార్య, పిల్లలు బయటకు వెళ్లినప్పుడు వారు తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఆందోళన పడుతుంటానని అమీర్ అన్నారు. -
డైరెక్టర్ అవుతానంటున్న హీరోయిన్
సక్సెస్ సంగతి ఎలా ఉన్నా బాలీవుడ్లో ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ వారసురాలు సోనమ్ కపూర్. ఇప్పటి వరకు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకునే భారీ హిట్ ఒక్కటి కూడా సాధించలేకపోయిన ఈ బ్యూటీ త్వరలో ఓ లేడి ఓరియంటెడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. 1986లో జరిగిన ఫ్లైట్ హైజాక్‌లో 300 మంది ప్రాణాలు కాపాడిన ఎయిర్ హోస్టస్ నీర్జా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన నీర్జా సినిమాలో నటించింది సోనమ్. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న సోనమ్, భవిష్యత్తులో తాను డైరెక్టర్‌గా మారనున్నట్టుగా ప్రకటించింది. ఇండస్ట్రీలో దర్శకత్వ శాఖలో మహిళ సంఖ్య చాలా తక్కువగా ఉందన్న సోనమ్, ఆ ఫీల్డ్ లో మరింత మంది అవకాశముందని తెలిపింది. అందుకే శక్తివంతమైన మహిళల నేపథ్యంలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించే ఆలోచన ఉందంటూ తన కోరికను బయట పెట్టింది. అయితే తన దర్శకత్వంలో తెరకెక్కే సినిమా ఎప్పుడు ఉంటుంది అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. -
పాక్‌లో ‘నీర్జా’పై నిషేధం
కరాచి: కరాచి విమానాశ్రయంలో 1986లో పాన్ ఆమ్ ఫ్లైట్ 73 విమానాన్ని హైజాక్ చేసిన ఘటనను ఆధారంగా చేసుకుని నిర్మించిన బాలీవుడ్ సినిమా ‘నీర్జా’ను పాకిస్తాన్ తమ దేశంలో నిషేధించింది. సోనమ్‌కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో పాక్‌ను చెడుగా చూపించారన్న ఆరోపణతో ఈ సినిమా ప్రదర్శనపై నిషేధం విధిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. రామ్ మాధ్వాని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పాక్‌లో ఈ నెల 19న విడుదల చేయటానికి ఆ దేశం తొలుత అంగీకరించింది. అయితే పాక్ వ్యతిరేకమైన, ముస్లింల వ్యతిరేకమైన అంశాలు ఉన్నాయంటూ ఆ దేశ వాణిజ్య, సమాచార మంత్రిత్వశాఖ అనుమతిని ఉపసంహరించుకుంది. -
'అవార్డుల కోసం నటించను'
ముంబై: అనిల్ కపూర్ ముద్దుల తనయగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తక్కువ కాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది సోనమ్ కపూర్. 'ప్రేమ్ రతన్ ధన్ పాయో'లో నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తోటి నటీనటులతో, మీడియాతోనే ఎప్పుడూ ముక్కు సూటిగా తాను అన్నుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టేలా మాట్లాడుతుంది. తాను అవార్డుల కోసం మాత్రం తాపత్రయపడనంటోంది ఈ భామ. తనకు అవార్డుల కంటే కూడా తన నటన మెరుగు పరుచుకోవడంపై దృష్టిసారిస్తానని చెప్పింది. తాను ఎప్పుడూ అసలు భయపడనని చాలా ధైర్యంగా ఉంటానంది. ప్రస్తుతం 'నీర్జా' మూవీ పనులతో ఆమె బిబీబిజీగా ఉంటోంది. తాను కళ కోసం మాత్రమే పనిచేస్తానంది. ఇప్పుడు ఉన్న గుర్తింపు చాలు అంటూ చెప్పుకొచ్చింది. గుర్తింపు, కాస్త ఎంకరేజ్ మెంట్ కోసం అవార్డులు సాయం చేస్తాయని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో అయితే హీరోయిన్లకు వారి నటనకు తగ్గ పేరు, మంచి గుర్తింపు వస్తుందని పేర్కొంది. బాలీవుడ్ గతంలో హీరోలకు ప్రాధాన్యం కల్పించేది, ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నీర్జాలో విమానం హైజాక్ అంశంపై ఉంటుందని, ప్రస్తుతం తాను మరికాస్త ధైర్యాన్ని పెంపొందించుకున్నట్లు వివరించింది. -
మాకు ఈ చెడ్డపేరు వస్తుందని అప్పుడే తెలుసు!
అలాంటి న్యూస్ వినాల్సి వస్తే... ఫీలవకు అన్నారు! - నీరజ, రంగనాథ్ పెద్ద కుమార్తె తెలుగు ప్రేక్షకులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ‘రంగనాథ్ గారేంటి? అలా చేయడం ఏంటి?!’ రంగనాథ్ పిల్లలూ ఆ షాక్‌లో నుంచి బయట పడలేదు. ‘నాన్నగారేంటి? ‘అలా’ వెళ్లిపోవడం ఏంటి?!’ రంగనాథ్... విమానం ఎక్కరు. భయం! బస్సూ ఎక్కరు. భయం! అంత భయం ఉన్నవారు.. ఇంత ధైర్యం ఎలా చేశారు? డెస్టినీ..!?! ఏ పరిస్థితులు ఆయన్ని ఈ విపరీతానికి ప్రేరేపించాయి? అందరూ ఉన్నా...తనకు ఎవరూ లేరనుకున్నారా? ఉన్నవారికి తను లేకున్నా ఫరవాలేదనుకున్నారా? ఎన్నో ప్రశ్నలు. మరెన్నో సందేహాలు. సమాధానాల కోసం ‘సాక్షి ఫ్యామిలీ’... రంగనాథ్ పిల్లల్ని కలిసింది. వారి బాధను షేర్ చేసుకుంది. (రంగనాథ్ చివరి సంతకం) ‘‘నాన్న గారు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం నాకు ఇప్పటికీ మింగుడుపడట్లేదు. ఇంకా షాక్‌లోనే ఉన్నా. అందరూ వచ్చి పలకరించడం, నాన్న గారి గురించి మాట్లాడడంతో మళ్ళీ మళ్ళీ ఆయనే గుర్తుకొస్తున్నారు. చెల్లెలు, తమ్ముడి కన్నా నాన్న గారికి దగ్గరగా ఉండడం వల్ల ఆయన ఉరేసుకుని ఉన్న దృశ్యం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. ఆయన అలాంటి నిర్ణయం తీసుకుంటారనుకోలేదు. ఆయనిలా చేసుకోవడానికి కారణం అర్థం కావడం లేదు. కనీసం నోట్ అయినా రాసి ఉంటే తెలిసేదేమో, అదీ లేదు! సాధారణంగా ఆయన ఏ మాత్రం డల్‌గా ఉన్నా నేను కనిపెట్టేస్తా. ఈ దుర్ఘటన జరగడానికి రెండు రోజుల ముందు కూడా కలిశా. కానీ, ఆయన ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడే మూడ్‌లో ఉన్నారని గ్రహించలేకపోయా. ఎన్నడూ లేనిది నుదుట బొట్టు పెట్టుకొని, కనిపించారు. ఏదో దేవుడి మీద భక్తి, ఆధ్యాత్మిక ధోరణిలో ఉన్నారనుకున్నా. అదీ మంచిదేలే అనుకున్నాను. కానీ, ఇలా చేస్తారనుకోలేదు. నాన్నగారికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. మేము ఏ రోజూ ఆర్థికంగా ఆయన్ని ఇబ్బందీ పెట్టలేదు. ఆయన కూడా ‘నాకున్నది చాలు’ అనేవారు. ఆయనకు తృప్తి ఉండేది. సినిమాల్లో, టీవీలో పాత్రల కోసం కూడా ఆయన వెంపర్లాడింది లేదు. అవకాశాలు వచ్చినా నాన్న గారికి ఓపిక పోయింది. ‘ఎవరి కోసం చేయా లమ్మా! ఎవరి కోసం సంపాదించాలమ్మా!’ అనేవారు. కానీ, మేమే ‘అలా కాదు నాన్నా! డబ్బు కోసం కాదు. సెట్స్కెళ్ళి నటిస్తుంటే నీకు ఉత్సాహంగా ఉంటుంది. తెలిసినవాళ్ళందరితో కలవచ్చు. మాట్లాడుకోవచ్చు’ అని ఎంకరేజ్ చేసేవాళ్ళం. నటిస్తూ ఉంటే పనిలో పడి, ఒంటరితనం పోతుందని అలా చెప్పేవాళ్ళం. కానీ, ఆయనకు ఎక్కడో ఆసక్తి పోయింది. హైదరాబాద్‌లో మా ఇంటికెదురుగా ఉన్న బ్యాంక్‌లో నాన్న గారికి ఖాతా ఉంది. డబ్బులు కావా లంటే, అక్కడికే వచ్చేవారు. అక్కడికి ఎప్పుడొచ్చినా ఇంటికి వచ్చేవారు. ఆయన వచ్చినప్పుడు ఏది ఉంటే, అది తినడానికి పెట్టేదాన్ని. ఆకలి లేకపోతే, ‘వద్దమ్మా’ అనేవారు. యోగక్షేమాలు కనుక్కొని వెళ్ళేవారు. పిల్లలందరినీ పద్ధతిగా పెంచారాయన. ఎవరి మీదా ఆధారపడడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. కూతురి దగ్గర అల్లుడి ఇంట్లో ఉండడం బాగుండదను కొనేవారు. ‘నేను అల్లుళ్ళ దగ్గర ఉండలేనమ్మా’ అని చెప్పారు. తమ్ముడి భవిష్యత్తు దృష్ట్యా బెంగుళూరులో వాడు ఉద్యోగం చేయడానికి సరే అన్నారు. ‘మీకెక్కడ, ఎలా హ్యాపీగా ఉంటుందనిపిస్తే, అలాగే ఉండండి నాన్నా’ అనేవాళ్ళం. ఆయన విడిగా ఉంటానంటే సరేనని ఒప్పుకున్నాం. కానీ, అది చివరకు ఎదురు తంతుందనీ, ఆయనను ఒంటరిగా వదిలేశామన్న నింద మోయాల్సి వస్తుందనీ నేను ఊహించలేదు. మా నాయనమ్మ కర్నూలులో ఉంటుంది. ఆమె ఫోటో ఈ మధ్యే మా బాబాయ్ కూతురు వాట్సప్‌లో పంపింది. బాగా వృద్ధురాలైన ఆమెకు వినికిడి తగ్గింది. మనుషుల్ని కూడా గుర్తుపట్టట్లేదు. ‘రంగనాథ్’ అని మాత్రం కొడుకు గురించి అంటూ ఉంటుంది. నాయ నమ్మ ఫోటో చూశాక, ఆమెకు ఏదో అయినట్లు నాన్న గారికి పీడకల వచ్చిందట. నాయనమ్మను చూసి వస్తానని నెల న్నర క్రితం అప్పటికప్పుడు కర్నూలె ళ్ళారు. ఒకటిన్నర రోజు లక్కడే ఉండొచ్చారు. అప్పుడూ ఏమీ అనలేదు. నాన్న గారికి చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండైన నందా అంకుల్ గూడూరులో ఉంటారు. సెప్టెంబర్‌లో ఆయన పుట్టిన రోజు కూడా బాగా చేశారు. కనీసం నందా అంకుల్‌తో కూడా నాన్న గారు తన బాధేమిటో చెప్పలేదు. సహజ మరణ మైతే కొంత కాలానికైనా సర్దు కుంటామేమో కానీ మమ్మల్ని అనాథల్ని చేసి, ఇలా ఆత్మహత్యకి పాల్పడడం జీర్ణించు కోలేకపోతున్నాం. అమ్మ అంటే నాన్న గారికి బాగా ఎటాచ్ మెంట్. ప్రమాదవశాత్తూ మేడ మీద నుంచి కిందపడి, అమ్మ మంచానికే పరిమితమై పోతే ఆమె కన్నుమూసేవరకు పధ్నాలుగేళ్ళపాటు పసిపిల్లలా చూసుకున్నారు. మంచాన పడ్డ మా అమ్మను చూసుకోవడానికి అప్పట్లో పనిమనుషులు కూడా దొరికేవారు కారు. పెళ్ళి అయిపోయాక, నేనూ వచ్చేశా. మా తమ్ముడు చదువుకొంటూ ఉండేవాడు. నాన్న గారు వాళ్ళు మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు షిఫ్టయ్యాక కూడా చాలామంది పనిమనుషుల్ని మార్చాల్సి వచ్చింది. చివరకు ఇప్పుడున్న మీనాక్షి దొరికింది. ఆమె చాలా మంచిది. అప్పట్లో మా అమ్మగారికి ఎంతో చేసింది. అమ్మ పోయాక నాన్నను చూసుకోవడానికి కూడా వేరెవరో ఎందుకని నమ్మకస్థురాలైన మీనాక్షినే పెట్టాం. అమ్మనీ, తననీ బాగా చూసుకున్న మీనాక్షికి ఏమైనా చేయాలనే నాన్న గారు ఆ రెండు ఫిక్స్డ్ డిపాజిట్ల డబ్బులు (రూ. 5 లక్షలు) ఆమెకిమ్మని రాశారు. నాన్న గారికి మొదటి నుంచీ హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఆర్థికంగా ఇంకా బాగుండి ఉంటే, సంఘానికి చాలా చేయాలని ఉండేది. ఇంట్లో ఉంటే ఉదయం ఎప్పుడూ టీవీలో న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్ ఎక్కువ పెడతారు. అవే చూస్తుంటారు. సొసైటీలో జరుగుతున్న దారుణాలు చూసి, కథలు, కవితల రూపంలో స్పందిస్తారు. ‘సమాజం ఎటుపోతోంది! బంధాలకూ, బాంధవ్యాలకూ చోటు లేకుండా పోయింది’ అని బాధపడుతుండేవారు. ♦ ఆలుమగల గురించి ఆయన రాసిన కవిత్వం చదివి, అయిదేళ్ళ క్రితం విడిపోయిన జంట మళ్ళీ కలిసిందట. ఆ సంగతి వాళ్ళే నాన్న గారికి ఫోన్ చేసి చెప్పారు. అది తెలిసి ఆయన ఎంత సంతోషించారో చెప్పలేం! ఆ సంగతి మా అందరితో పంచుకున్నారు. (పొంగుకొస్తున్న దుఃఖంతో...) అందరికీ సాయపడా లనే స్వభావం ఉండి, అన్ని కవిత్వాలు రాసి, అంత ఫిలసాఫికల్‌గా ఉండే ఆయన చివరకిలా చేసుకొని తీరని బాధ మిగిల్చారు. హి హ్యాజ్ టేకెన్ ఎ రాంగ్ స్టెప్. ఈ శోకం నుంచి, ఈ షాక్ నుంచి మేము, మరీ ముఖ్యంగా నేను ఎప్పటికీ తేరుకోలేనేమో!’’ ♦ అమ్మ పోయాక అప్పుడప్పుడు ‘ఇంకెందుకు నేను’ అనే వాళ్ళు. అయితే, నేను చాలా సెన్సిటివ్. పైగా హార్ట్ పేషెంట్‌ని. అందుకే నా గురించి ఆలోచించేవారు. ఆరు నెలల ముందో, ఏడాది ముందో ఒకసారి- ‘నేనేదైనా చేసుకున్నట్లు న్యూస్ వస్తే ఫీలవకు! బెంగపెట్టుకోకమ్మా!’ అన్నారు. నేను షాకైతే, ‘ఏదో ఒకరోజు అంతా పోవాలి కదా!’ అని సర్దారు. తర్వాత సర్దుకున్నారు. ‘ఏదో మూడ్‌లో అన్నారులే... చాలా రోజులైందిగా’ అనుకున్నా. కానీ, ఉన్నట్టుండి ఇలా చేసుకుంటారనుకోలేదు. ♦ మీ నాన్న గారి మరణంతో మీ జీవితంలో వచ్చిన మార్పు? రంగనాథ్ ఏకైక కుమారుడు నాగేంద్రకుమార్: షాకిం గ్గా ఉంది. బెంగుళూరులో జీవితం తలకిందులైంది. మారిన పరిస్థితుల్లో కొత్త పాత్రకు సిద్ధం కావాలి. హైదరా బాద్ షిఫ్టై, మొత్తం వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంది. ♦ ఆయనకు ఆర్థికంగా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అలాంటివేమీ లేవు. హి ఈజ్ ఏబుల్ టు మెయిన్టైన్ హిమ్సెల్ఫ్. ఆయన ఏ రోజూ మమ్మల్ని పైసా అడగలేదు. ‘నాన్నా! డబ్బులు ఏమైనా కావాలా’ అని అడిగితే కూడా ‘నాకేమీ అక్కర్లేదు. మీరు బాగుంటే అదే చాలు’ అనేవారు. అవసరమైతే మాకే ఆయన డబ్బులు ఇచ్చేవారు. మాకే కాదు... బయటవాళ్ళకి - చదువుకోవడానికి కష్టపడుతున్న వాళ్ళకీ, పిల్ల పెళ్ళి చేయలేక ఇబ్బందిపడుతున్నవాళ్ళకీ ఆయన వేలు, లక్షల్లో సాయం చేసిన సంఘటనలున్నాయి. కాకపోతే, కుడిచేతితో చేసిన దానం ఎడమచేతికి తెలియ కూడదనేవాళ్ళు. నైతికంగానూ అండగా నిలబడేవాళ్ళు కానీ, ఎప్పుడూ పబ్లిసిటీ కోరుకోలేదు. ఒక్కమాటలో హి ఈజ్ వెరీ సింపుల్ మ్యాన్. అహంకారం, పొగరు లేవు. ఎదుటివాళ్ళను ఎప్పుడూ బాధపెట్టేవారు కాదు. ♦ నాన్నగారు చనిపోయారనే వార్త మీకెలా తెలిసింది? మేము వేరేవేరే ఊళ్ళలో ఉంటున్నాం. హైదరాబాద్‌లో నాన్న గారుంటున్న ఇంటికి దగ్గరలో మా పెద్దక్క నీరజ ఉంటోంది. మా పెద్దక్క బెంగుళూరులోని మా చిన్నక్క శైలజకు ఫోన్ చేసి, విషయం చెప్పింది. చిన్నక్క నాకు చెప్పింది. తెలియగానే హడావిడిగా బయలుదేరాం. ♦ మీ నాన్న గారితో ఆఖరుసారిగా ఎప్పుడు మాట్లాడారు? గత నెల (నవంబర్) మాట్లాడా. నాన్నగారు చనిపోవ డానికి రెండు రోజుల ముందు కూడా హైదరాబాద్ వచ్చి, ఆయనని చూడాలనిపించింది. ఆ మాటే మా వాళ్ళతో అంటూ వచ్చా. కానీ, మా ఆవిడ పేషెంట్. ఆవిడను కూడా చూసుకోవాలి. ఇంతలో ఈ వార్త వినాల్సి వచ్చింది. ♦ కన్నతండ్రితో నెల రోజుల క్రితం మాట్లాడారా!? మేమెక్కువగా ఆయనను ఫోన్లో విసిగించం. ఎందు కంటే, ఆయనెప్పుడూ ఏదో పనిలో ఉంటారు. ఉదాహర ణకు, ఆ మధ్య పుట్టినరోజుకు ఫోన్ చేస్తే, ఆయన అనాథా శ్రమంలో అన్నదానంలో ఉన్నారు. మరొకసారి ఫోన్ చేస్తే, ఏదో సభలో ఉంటారు. కొన్నిసార్లు కథలు, కవిత్వాలు రాసుకొనే మూడ్‌లో ఉంటారు. మరికొన్నిసార్లు రాత్రివేళ ఆయన తొందరగా నిద్రపోతారు. సాయంత్రం మూడు, నాలుగు గంటలు ఆయన ఫోన్ తీయలేదంటే, సీరియస్‌గా టెన్నీస్ ఆడుతూ ఉండి ఉంటారని అర్థం. అందుకే, ఉయ్ డోన్ట్ నో వెన్ టు కాల్ హిమ్. ఫోన్ చేస్తే మూడు రింగుల య్యాక కూడా ఆయన తీయలేదంటే, బిజీగా ఉన్నారని పెట్టేస్తాం. ఆయనే మళ్ళీ మాకు కాల్‌బ్యాక్ చేస్తారు. ♦ మీరెందుకని మీ నాన్న గారితో ఉండట్లేదు? గతంలో నేను, మా ఆవిడ, మా అబ్బాయి - మేమంతా అమ్మానాన్నలతో కలసి హైదరాబాద్‌లోనే గాంధీనగర్లోనే ఉండేవాళ్ళం. కానీ అమ్మ ఉన్నప్పుడు ఆమెను చూసుకోవడంతో, ఆమె పోయిన తరువాత ఒంటరితనంతో నాన్నగారికి స్ట్రెస్ ఉండేది. హీరోగా వెలిగిన ఆయనను మామూలు మని షిలా అబ్బాయిని చూసుకోమనీ, ఇంటి పని చూడమనీ చెప్పలేం! ‘వయసు మీద పడుతోంది, ఓపిక లేద’ని ఆయనా ఇష్టపడ లేదు. అప్పటి దాకా అమ్మను చూసు కున్న ఆయన్ని మళ్ళీ మా బరువు బాధ్యతలతో ముంచేయడం సరికాదు. ఆయన స్వేచ్ఛగా ఉండడా నికి ఇష్టపడ్డారు. నేనూ ఉద్యోగ రీత్యా బెంగళూరు మారా. దానివల్ల ‘ఆయన్ని వదిలేశారు. చూసుకోవడం లేద’ని మాకు చెడ్డపేరొస్తుందని అప్పుడే తెలుసు. కానీ, ఆయన ఇష్టాన్ని గౌరవించాం. ♦యాక్సిడెంటై మంచానపడ్డ భార్యను ఆయన పధ్నాలుగేళ్ళ పాటు చంటిబిడ్డలా సాకడం సామాన్య విషయం కాదు! సేవ చేయాలనే మనసున్నా, అలా చేయడానికి ధైర్యం కూడా ఉండాలి. అది ఎంత మందికుంటుంది! పనిమనిషి పక్కన లేకపోతే, ఒంటికీ, రెంటికీ వెళితే శుభ్రం చేయడం, భార్యని పసిబిడ్డను చూసుకున్నట్లు చూసుకోవడం కష్టం. అవన్నీ నాన్నగారు చేశారు. పైగా పేషెంట్‌కు మన కష్టం తెలియనివ్వకుండా, విసుక్కోకుండా, నవ్వుతూ చేశారు. ♦రంగనాథ్ గారికి మీరెంత మంది పిల్లలు? ఏం చేస్తున్నారు? మేము ముగ్గురం. మా పెద్దక్క నీరజ హౌస్‌వైఫ్. హైదరాబాద్‌లోనే ఉంటుంది. పెద్ద బావ గారు ఫార్మస్యూ టికల్ కంపెనీలో చేస్తారు. చిన్నక్క శైలజ బెంగుళూరులో కాలేజ్‌లో ఇంగ్లీష్ లెక్చరర్. చిన్న బావగారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఇంజనీర్. నేను, మా ఆవిడ, అబ్బాయి (అగస్త్య సాయిరిత్విక్) బెంగుళూరులో ఉంటాం. ♦ఇంతమంది ఉన్నా, తన పక్కన ఎవరూ లేరని ఆయన... (మధ్యలోనే..) ‘ఐ నీడ్ సమ్ స్పేస్’ అని ఆయన న్నారు. ఆయన అలా బలవంతం చేయబట్టే, స్వేచ్ఛగా వదిలేశాం. ‘వియ్ హ్యావ్ టు ఫేస్ దిస్ డే’ అని తెలిసినా సిద్ధపడ్డాం. తొమ్మిదో తరగతి చదువుతున్న మా పెద్ద మేనల్లుడే (పెద్దక్క కొడుకు శశాంక్) నా స్థానంలో ఇక్కడ మా నాన్న గారి దగ్గరకు తరచూ వచ్చి, ‘తాతా! ఎలా ఉన్నా’వని అడుగుతుండేవాడు. పెద్దక్క వచ్చి ఆయన క్షేమంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా అని కనుక్కునేది. ♦హీరోగా వెలిగిన నాన్నగారు చిన్న వేషాలూ అరుదైన పరిస్థితిలో బాధ, డిప్రెషన్ ఏమైనా మీతో వ్యక్తంచేసేవారా? డిప్రెషన్ అంటూ చెప్పింది ఏమీ లేదు. ‘హీరోగా వెలిగినా, కాలంతో పాటు మారడానికి తగినంత వర్క్ చేయలేదేమో’ అని అంటూ ఉండేవారు. ‘డ్యాన్స్‌లు, ఫైట్స్ లాంటి వర్క్ చేయలేదు. చేసి ఉంటే, చిరంజీవి తరంలో కూడా నిలబడి ఉండేవాణ్ణి’ అనేవారు. కానీ, ఆయనకు అసంతృప్తి లేదు. ‘నాకు రావాల్సినదాని కన్నా ఎక్కువే వచ్చింది’ అనేవారు. పదేళ్ళకోసారి మార్పు వస్తుంది. కొత్తనీరు వచ్చినప్పుడు హుందాగా వెనక్కి తగ్గడం నేర్చుకోవాలనేవారు. హీరో శోభన్‌బాబు లాంటి వాళ్ళు చెప్పినమాటల్ని గుర్తుచేసేవారు. హీ నోస్ ది ఫేడింగ్ ఎవే ఆఫ్ ది ఫేమ్. హి యాక్సెప్టెడ్ ఇట్ విత్ డిగ్నిటీ. ♦ సినిమా రంగంలో ఆయనకు మంచి స్నేహితులు లేరా? లేకేం! మద్రాసులో ఉన్న రోజుల నుంచి శరత్‌బాబు, చలపతిరావు, శారద లాంటివారందరూ ఫ్యామిలీ మెంబర్సే. అల్లు అరవింద్, చిరంజీవి, కోట శ్రీనివాసరావు గారు లాంటి చాలామంది సన్నిహితులు. గిరిబాబు గారైతే వెరీక్లోజ్. అందరితో ఫోన్లో టచ్‌లో ఉండేవాళ్ళు. ♦కానీ, ఆయన ఊళ్ళకు, విదేశాలకు వెళ్ళడం తక్కువే కదూ! అవును. తెలుగు సంఘాల కార్యక్రమాలకు అమెరికా రమ్మనమని శరత్‌బాబు లాంటివాళ్ళు అడిగేవారు. కానీ, నాన్న గారు ఆసక్తి చూపించేవారు కాదు. పైగా, విమాన ప్రయాణమంటే మహా భయం. చివరికి బస్ జర్నీ కూడా! ఆల్వేస్ ట్రైన్ జర్నీనే! 1970ల చివరలో ‘లవ్ ఇన్ సింగ పూర్’లో చేస్తున్నప్పుడు తప్పనిసరై, విమానంలో వెళ్ళారని నాన్న గారి బెస్ట్ ఫ్రెండ్ నందా అంకుల్ చెబుతుంటారు. ఒకసారి మద్రాసులో ఉండగా నెల్లూరులో సన్మానానికి వెళ్ళాలంటే రైలు మిస్సయిందట. బలవంతాన బస్సులో పంపిస్తే, ‘క్షేమంగా చేరగానే ఫోన్ చేస్తా’ అన్నారట! ♦చనిపోవడానికి ముందు ఇటీవల ఆయన ఎటూ వెళ్ళలేదా? తాత, నాయనమ్మలకు అయిదుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. నాన్న గారే అందరిలోకీ పెద్ద. మా నాయనమ్మ జానకీదేవి రిటైర్డ్ స్కూల్టీచరైన బాబాయ్ దగ్గరుంటుంది. చనిపోవడానికి నెలన్నర ముందు నాన్న గారు కర్నూలు వెళ్ళి, కన్నతల్లిని చూసొచ్చారు. ఆమె 88 ఏళ్ళ వృద్ధురాలు. మనం చెప్పేది విని అర్థం చేసుకొనే స్థితిలో లేదు. తట్టుకో లేదని నాన్న పోయినట్లు ఇప్పటికీ చెప్పకుండా దాచాం. ♦ఛాన్సుల్లేక కుంగిపోయినా, అది మీ దగ్గర దాచారేమో? లేదండీ! ఆ మధ్య ‘గోపాల గోపాల’లో నటించారు. ఇటీవలే ‘ఇద్దరమ్మాయిలు’లోనో, మరేదోనో టీవీ సీరి యల్లోనో కూడా నటించారట. అవకాశాలు లేవని ఆయన అనడం, అనుకోవడం మేము వినలేదు. పూజగూడు దగ్గర ‘డెస్టినీ’ అని రాసి ఉరిపోసుకున్నారే... ‘తలరాత’ అనే అర్థంలో ‘డెస్టినీ’ రాశారేమో! ♦ పనిమనిషి మీనాక్షికి డిపాజిట్లు ఇమ్మని రాయడం గురించి? మీనాక్షి నమ్మకంగా, సిన్సియర్‌గా పనిచేసిన ఆవిడ. దగ్గరలోనే ఆసుపత్రిలో ఆయమ్మగా పనిచేసేది. 2006 నుంచి ఇంట్లో అమ్మకు సేవలు చేసింది. అమ్మ పోయాక, నాన్న గారి బాగోగులు చూసింది. భార్యనూ, తననూ తల్లిలా చూసుకున్న ఆమెకు పోయే ముందు ఏదైనా చేయాలని నాన్న గారు అనుకోవడం తప్పా? ప్రభుత్వం పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తోందని తెలిసి, ఆమెకు కూడా వీలుంటే ఇవ్వమని మంత్రికి ఫోన్ చేశారు. 70వ ఏట ఉన్న వ్యక్తి చనిపోయే ముందు పెద్ద మనసుతో తోటివారి గురించి ఆలోచిస్తే, దాన్నీ కొందరు అనుమా నించి, తప్పుపడితే ఎలా? మనం ఏ సమాజంలో ఉన్నాం! ♦భార్య పోయాక ఆయన డిప్రెషన్లో జారిపోయారంటారా? కావచ్చు. ఎక్కడో ఆయనకు ఇతరులతో పోలికొచ్చిం దేమో! ఒంటరితనం, డిప్రెషనొచ్చాయేమో! కానీ, తను స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. ఆయన సంతోషమే మా సంతోషం! అందుకే, ఆయన మానాన ఉండనిచ్చాం. (బాధగా...) చివరకు ‘ఆయన్ని అనాథను చేసేశారు’ అన్న చెడ్డపేరే మిగిలింది. పేపర్లలో, టీవీల్లో ఎవరికి తోచినట్లు వాళ్ళు రాశారు, చెప్పారు. చివరకు అందరికీ సంజాయి షీలు చెప్పుకుంటున్నాం. ఆయన జనం మనిషి కాబట్టి, మాకు ఇది తప్పదు. ఉయ్ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లనేషన్! - రెంటాల జయదేవ