ఉత్తమ చిత్రంగా ‘నీర్జా’
న్యూయార్క్: ‘ఉడ్తా పంజాబ్’ సినిమాలో అద్భుత నటనకు షాహిద్ కపూర్, అలియా భట్‌లు ఉత్తమ హీరో, హీరోయిన్లుగా ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ)–2017 అవార్డుల్ని దక్కించుకున్నారు. న్యూ యార్క్‌లో శనివారం రాత్రి(భారత్‌లో ఆదివా రం ఉదయం) జరిగిన 18వ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ చిత్రంగా ‘నీర్జా’ నిలిచింది. పింక్ సినిమాకుగాను అనిరుధ్ రాయ్ చౌదురీకి ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. సంగీత దర్శకుడిగా పాతికేళ్లు పూర్తిచేసుకున్న ఏఆర్ రెహమాన్‌ను ప్రత్యేక అవార్డుతో సత్కరించారు. అనుపమ్ ఖేర్(ఎంఎస్ ధోనీ), షబానా అజ్మీ(నీర్జా) ఉత్తమ సహాయ నటు డు, నటి అవార్డులు గెలుచుకున్నారు.
డిష్యూం సినిమాకు వరుణ్ ధావన్ ఉత్తమ హాస్య నటుడి, జిమ్ సర్బా(నీర్జా) ఉత్తమ విలన్ అవార్డుల్ని దక్కించుకున్నారు. మ్యూజిక్ విభాగంలో కరణ్ జోహార్ సినిమా ‘యే దిల్ హై ముష్కిల్’ ఎక్కువ అవార్డుల్ని సాధించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతమ్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా అమిత్ మిశ్రా, ఉత్తమ పాటల రచయితగా అమితాబ్ భట్టాచార్యలు నిలి చారు. ఉత్తమ నేపథ్య గాయనిగా తుల్సీ కుమార్(ఎయిర్ లిఫ్ట్), కనికా కపూర్(ఉడ్తా పంజా బ్)లు సంయుక్తంగా ఎంపికయ్యారు. నటి దిశా పటానీ(ఎంఎస్ ధోనీ), పంజాబ్ నటుడు దిల్జిజ్ దోసాంజా(ఉడ్తా పంజాబ్)లు తొలి పరిచయం కేటగిరీలో అవార్డులొచ్చాయి.