best picture
-
#TodayBestPhotos : ‘అద్భుత’ దృశ్యం.. సజీవ సాక్ష్యం
-
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.. ‘సాక్షి’ స్పెషల్ ఫొటోలు
-
నా బెస్ట్ చిత్రాలలో ఒకటిగా నిమిర్: ప్రియదర్శన్
తన ది బెస్ట్ చిత్రాలలో నిమిర్ చిత్రం ఒకటిగా నిలిచిపోతుందని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్. ఈయన తెరకెక్కించిన తాజా చిత్రం నిమిర్. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన మహేషింటే ప్రతీకారం చిత్రానికిది రీమేక్. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన ఇందులో నమిత ప్రమోద్, పార్వతి నాయర్ నాయికలుగా నటించారు. మూన్‌షాట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సంతోష్ టి.కురువిల్లా నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ తానింతకు ముందు మలయాళంలో నాలుగు చిత్రాలు నిర్మాంచాననీ, తమిళంలో చేస్తున్న తొలి చిత్రం నిమిర్ అని చెప్పారు. వివిధ భాషల్లో 93 చిత్రాలు చేసిన లెజెండ్రీ దర్శకుడు ప్రియదర్శన్‌తో చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తన సినీ కేరీర్‌లోనే నిమిర్ చాలా ముఖ్యమైన చిత్రంగా పేర్కొన్నారు. ఒక రోజు ప్రియదర్శన్ పిలిచి తన చిత్రంలో నటించమని అడిగారన్నారు. దీంతో తాను సార్ నిజంగానే అంటున్నారా? దర్శకుడెవరు? అని అడగ్గా నేనే దర్శకుడిని అని ఆయన చెప్పడంతో చెప్పలేనంత ఆనందం కలిగిందన్నారు. ఇందులో ముఖ్య పాత్రను పోషించిన దర్శకుడు మహేంద్రన్ తెరి చిత్రం తరువాత విలన్‌గా నటించమని చాలా అవకాశాలు వచ్చినా అంగీకరించలేదనీ, ప్రియదర్శన్ కోసమే ఈ చిత్రంలో నటించానని చెప్పారు. ఈ చిత్రం ప్రివ్యూ చూసి మనిదన్ చిత్రం తరువాత అంతకంటే మంచి చిత్రం చేశారని తన భార్య ప్రశంసించిందన్నారు. అయితే పాహద్ ఫాజిల్ నటనలో సగమే మీరు చేశారని అందనీ, అదీ ప్రశంస గానే తాను తీసుకున్నానని చెప్పారు. చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోందని, జనవరి 26న విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని స్టాలిన్ వెల్లడించారు. ప్రియదర్శన్ మాట్లాడుతూ ఈ చిత్ర కథకు ఒక సాధారణ నటుడు అవసరం అవ్వడంతో ఉదయనిధిని ఎంపిక చేశామన్నారు. ఆయన ఇంతకుముందు చేసిన చిత్రాలేవీ తాను చూడలేదన్నారు. ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక ఫోటోగ్రాఫర్ ఇతివృత్తంతో కూడిన కథా చిత్రం అని చెప్పారు. మలయాళంలో షాహద్ పాజిల్ కంటే తమిళ వెర్షన్లో ఉదయనిధి స్టాలిన్ చాలా బాగా నటించారని దర్శకుడు మహేంద్రన్ తనతో అన్నారని ప్రియదర్శన్ చెప్పారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా తన పని తాను చేసుకుపోయే ఒక యువకుడిని అవమాన పరుస్తారన్నారు. వారిపై ప్రతీకారం తీర్చుకునే వరకు తాను కాళ్లకు చెప్పులు కూడా తొడగనని ఆ యువకుడు శపథం చేస్తాడన్నారు. దాన్ని ఎలా నెరవేర్చుకున్నాడన్నదే నిమిర్ ఇతివృత్తం అని వివరించారు. మలయాళం చిత్ర కథను మాత్రమే తీసుకుని మరిన్ని కమర్షియల్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. ఇది తన సినీ కేరీర్‌లోనే ముఖ్య చిత్రంగా నిలిచిపోతుందని నటి పార్వతీనాయర్ అన్నారు. -
ఉత్తమ చిత్రంగా ‘నీర్జా’
న్యూయార్క్: ‘ఉడ్తా పంజాబ్’ సినిమాలో అద్భుత నటనకు షాహిద్ కపూర్, అలియా భట్లు ఉత్తమ హీరో, హీరోయిన్లుగా ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ)–2017 అవార్డుల్ని దక్కించుకున్నారు. న్యూ యార్క్‌లో శనివారం రాత్రి(భారత్‌లో ఆదివా రం ఉదయం) జరిగిన 18వ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ చిత్రంగా ‘నీర్జా’ నిలిచింది. పింక్ సినిమాకుగాను అనిరుధ్ రాయ్ చౌదురీకి ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. సంగీత దర్శకుడిగా పాతికేళ్లు పూర్తిచేసుకున్న ఏఆర్ రెహమాన్‌ను ప్రత్యేక అవార్డుతో సత్కరించారు. అనుపమ్ ఖేర్(ఎంఎస్ ధోనీ), షబానా అజ్మీ(నీర్జా) ఉత్తమ సహాయ నటు డు, నటి అవార్డులు గెలుచుకున్నారు. డిష్యూం సినిమాకు వరుణ్ ధావన్ ఉత్తమ హాస్య నటుడి, జిమ్ సర్బా(నీర్జా) ఉత్తమ విలన్ అవార్డుల్ని దక్కించుకున్నారు. మ్యూజిక్ విభాగంలో కరణ్ జోహార్ సినిమా ‘యే దిల్ హై ముష్కిల్’ ఎక్కువ అవార్డుల్ని సాధించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతమ్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా అమిత్ మిశ్రా, ఉత్తమ పాటల రచయితగా అమితాబ్ భట్టాచార్యలు నిలి చారు. ఉత్తమ నేపథ్య గాయనిగా తుల్సీ కుమార్(ఎయిర్ లిఫ్ట్), కనికా కపూర్(ఉడ్తా పంజా బ్)లు సంయుక్తంగా ఎంపికయ్యారు. నటి దిశా పటానీ(ఎంఎస్ ధోనీ), పంజాబ్ నటుడు దిల్జిజ్ దోసాంజా(ఉడ్తా పంజాబ్)లు తొలి పరిచయం కేటగిరీలో అవార్డులొచ్చాయి. -
ఈ వారం మేటి చిత్రాలు (26-07-2015)
-
ఈ వారం మేటి చిత్రాలు (11-07-2015)
-
ఈ వారం మేటి చిత్రాలు (05-07-2015)
-
ఉత్తమ్ చిత్రం..
ఆ మధ్య వచ్చిన అకాల వర్షం నిలువునా ముంచేసింది.. తమ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది.. ఈసారీ పంటను ఎలాగైనా కాపాడు కోవాలి.. ప్రాణం పోసైనా దక్కించుకోవాలి.. పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నదీ తీరంలో పుచ్చకాయల పంటను కాపాడుకునేందుకు గొట్టాల ద్వారా నీరందిస్తూ.. శ్రమిస్తున్న రైతు దంపతుల చిత్రమిది. ఈ చిత్రాన్ని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ ఉత్తమ్ కమాటి తీశారు. దీనికి 2015 ఉత్తమ పర్యావరణ ఫొటోగ్రాఫర్(అట్కిన్స్ ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్) పురస్కారం దక్కింది. ఈ అవార్డుకు వివిధ దేశాల నుంచి వేలల్లో ఎంట్రీలు రాగా.. ‘వాటరింగ్ మెలన్’ పేరిట తీసిన ఈ ఫొటోకు మొదటి స్థానం దక్కింది. పర్యావరణ మార్పుల వల్ల జరిగే అనర్థాలను ఈ ఫొటో చిత్రిక పట్టిందని అవార్డు ఎంపిక జ్యూరీ సభ్యులు తెలిపారు.