ఉత్తమ్ చిత్రం..
ఆ మధ్య వచ్చిన అకాల వర్షం నిలువునా ముంచేసింది.. తమ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది.. ఈసారీ పంటను ఎలాగైనా కాపాడు కోవాలి.. ప్రాణం పోసైనా దక్కించుకోవాలి.. పశ్చిమ బెంగాల్లోని తీస్తా నదీ తీరంలో పుచ్చకాయల పంటను కాపాడుకునేందుకు గొట్టాల ద్వారా నీరందిస్తూ.. శ్రమిస్తున్న రైతు దంపతుల చిత్రమిది.
ఈ చిత్రాన్ని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ ఉత్తమ్ కమాటి తీశారు. దీనికి 2015 ఉత్తమ పర్యావరణ ఫొటోగ్రాఫర్(అట్కిన్స్ ఎన్విరాన్‌మెంటల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్) పురస్కారం దక్కింది. ఈ అవార్డుకు వివిధ దేశాల నుంచి వేలల్లో ఎంట్రీలు రాగా.. ‘వాటరింగ్ మెలన్’ పేరిట తీసిన ఈ ఫొటోకు మొదటి స్థానం దక్కింది. పర్యావరణ మార్పుల వల్ల జరిగే అనర్థాలను ఈ ఫొటో చిత్రిక పట్టిందని అవార్డు ఎంపిక జ్యూరీ సభ్యులు తెలిపారు.