డైరెక్టర్ అవుతానంటున్న హీరోయిన్ | Sonam Kapoor plans to direct Women Centric films | Sakshi

డైరెక్టర్ అవుతానంటున్న హీరోయిన్

Feb 11 2016 4:54 PM | Updated on Sep 3 2017 5:26 PM

డైరెక్టర్ అవుతానంటున్న హీరోయిన్

డైరెక్టర్ అవుతానంటున్న హీరోయిన్

సక్సెస్ సంగతి ఎలా ఉన్నా బాలీవుడ్లో ఫ్యాషన్ ఐకాన్గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ వారసురాలు సోనమ్ కపూర్. ఇప్పటి వరకు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకునే భారీ హిట్ ఒక్కటి కూడా...

సక్సెస్ సంగతి ఎలా ఉన్నా బాలీవుడ్లో ఫ్యాషన్ ఐకాన్గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ వారసురాలు సోనమ్ కపూర్. ఇప్పటి వరకు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకునే భారీ హిట్ ఒక్కటి కూడా సాధించలేకపోయిన ఈ బ్యూటీ త్వరలో ఓ లేడి ఓరియంటెడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. 1986లో జరిగిన ఫ్లైట్ హైజాక్లో 300 మంది ప్రాణాలు కాపాడిన ఎయిర్ హోస్టస్ నీర్జా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన నీర్జా సినిమాలో నటించింది సోనమ్.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న సోనమ్, భవిష్యత్తులో తాను డైరెక్టర్గా మారనున్నట్టుగా ప్రకటించింది. ఇండస్ట్రీలో దర్శకత్వ శాఖలో మహిళ సంఖ్య చాలా తక్కువగా ఉందన్న సోనమ్, ఆ ఫీల్డ్ లో మరింత మంది అవకాశముందని తెలిపింది. అందుకే శక్తివంతమైన మహిళల నేపథ్యంలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించే ఆలోచన ఉందంటూ తన కోరికను బయట పెట్టింది. అయితే తన దర్శకత్వంలో తెరకెక్కే సినిమా ఎప్పుడు ఉంటుంది అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement