లక్కీ ఛాన్స్ వదులుకుందా..! | Alia bhat miss chance in Neerja movie | Sakshi
Sakshi News home page

లక్కీ ఛాన్స్ వదులుకుందా..!

Published Fri, Mar 18 2016 11:27 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

లక్కీ ఛాన్స్ వదులుకుందా..! - Sakshi

లక్కీ ఛాన్స్ వదులుకుందా..!

ముంబయి: ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ మూవీ 'నీరజా'. ఈ మూవీలో నటనకు గానూ సోనమ్ కపూర్ విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఇందుకు కారణం.. ఆమె నటన మాత్రమే కాదు, ఆమె ఎంచుకున్న పాత్ర కూడా ఇందుకు తోడైంది. ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ మూవీలో సోనమ్ కు అవకాశం ఇవ్వాలని దర్శకనిర్మాతలు అసలు అనుకోలేదట. మొదట ఈ మూవీ కోసం ఆలియా భట్ ను తీసుకోవాలని భావించారట. అయితే ఆ తర్వాత ఏమైందోగానీ సోనమ్ ను ఈ అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. దీంతో ఒక్కసారిగా మరింత పాపులర్ స్టార్ గా మారిపోయింది.


ఆమె చాలా ప్రతిభ గల హీరోయిన్ అని, ఆమె నటించిన నీరజా సినిమాతో తానెంటో రుజువు చేసుకుంటుందని అమీర్ ఖాన్, మరి కొందరు ప్రముఖుల నుంచి సోనమ్ ప్రశంసలు అందుకుంది. రాం మద్వానీ 'నీరజ' మూవీకి దర్శకత్వం వహించారు. నీరజ సినిమాను పాన్ ఎమ్ 73 విమానాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు కరాచీలో హైజాక్ చేసిన యదార్థ సంఘటన ఆధారంగా చిత్రీకరించిన విషయం తెలిసిందే. మహిళా సిబ్బందిలో ఒకరైన నిరజా బానోతు విమానంలోని ప్రయాణికులను కాపాడుకునేందుకు చూపించిన తెగువ అద్భుతంగా తెరకెక్కించారు. ఆలియా భట్ ఓ మంచి అవకాశాన్ని కోల్పోయిందని బాలీవుడ్ లో ఈ మధ్య వార్తలు ప్రచారం అవుతున్నాయి. తనకు తానే ఈ మూవీలో అవకాశం వదులుకున్నట్లయితే ఓ మంచి సినిమాను ఆలియా చేజేతులారా పోగొట్టుకున్నట్టేనని కొందరు బాలీవుడ్ సినీ విమర్శకులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement