ముంబై: అనిల్ కపూర్ ముద్దుల తనయగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తక్కువ కాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది సోనమ్ కపూర్. 'ప్రేమ్ రతన్ ధన్ పాయో'లో నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తోటి నటీనటులతో, మీడియాతోనే ఎప్పుడూ ముక్కు సూటిగా తాను అన్నుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టేలా మాట్లాడుతుంది. తాను అవార్డుల కోసం మాత్రం తాపత్రయపడనంటోంది ఈ భామ. తనకు అవార్డుల కంటే కూడా తన నటన మెరుగు పరుచుకోవడంపై దృష్టిసారిస్తానని చెప్పింది. తాను ఎప్పుడూ అసలు భయపడనని చాలా ధైర్యంగా ఉంటానంది.
ప్రస్తుతం 'నీర్జా' మూవీ పనులతో ఆమె బిబీబిజీగా ఉంటోంది. తాను కళ కోసం మాత్రమే పనిచేస్తానంది. ఇప్పుడు ఉన్న గుర్తింపు చాలు అంటూ చెప్పుకొచ్చింది. గుర్తింపు, కాస్త ఎంకరేజ్ మెంట్ కోసం అవార్డులు సాయం చేస్తాయని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో అయితే హీరోయిన్లకు వారి నటనకు తగ్గ పేరు, మంచి గుర్తింపు వస్తుందని పేర్కొంది. బాలీవుడ్ గతంలో హీరోలకు ప్రాధాన్యం కల్పించేది, ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నీర్జాలో విమానం హైజాక్ అంశంపై ఉంటుందని, ప్రస్తుతం తాను మరికాస్త ధైర్యాన్ని పెంపొందించుకున్నట్లు వివరించింది.
'అవార్డుల కోసం నటించను'
Published Tue, Feb 9 2016 2:08 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement