తొలి వారం నీర్జా రికార్డ్ | sonam kapoor Neerja First week collections | Sakshi
Sakshi News home page

తొలి వారం నీర్జా రికార్డ్

Published Wed, Feb 24 2016 8:34 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

తొలి వారం నీర్జా రికార్డ్

తొలి వారం నీర్జా రికార్డ్

స్టార్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ సాధించటంలో మాత్రం వెనకబడిన అందాల భామ సోనమ్ కపూర్. సినిమాల సంగతి ఎలా ఉన్నా తన గ్లామర్ షో తో మాత్రం ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ బ్యూటీ తొలిసారిగా నీర్జా సినిమాతో తన కల నెరవేర్చుకుంది. 1986లో జరిగిన విమానం హైజాక్ నేపథ్యంలో తెరకెక్కిన బయోగ్రఫికల్ థ్రిల్లర్ నీర్జాలోఎయిర్ హోస్టెస్ నీర్జా భానోత్ పాత్రలో నటించింది సోనమ్.

ఈ సినిమాతో మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్న సోనమ్.. ఇన్నాళ్లు తనను ఊరిస్తున్న భారీ కమర్షియల్ హిట్ను కూడా సాధించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా 29 కోట్లకు పైగా వసూలు చేసింది. తొలివారం పూర్తయ్యే సరికి 35 కోట్ల వరకు వసూలు చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతున్న నీర్జా లాంగ్ రన్‌లో 100 కోట్ల మార్క్ ను రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement