'టెర్రరిస్టు'తో హీరోయిన్ డేటింగ్! | Kalki Koechlin dating actor who played terrorist in Neerja movie | Sakshi
Sakshi News home page

'టెర్రరిస్టు'తో హీరోయిన్ డేటింగ్!

May 18 2016 12:40 PM | Updated on Apr 3 2019 6:34 PM

'టెర్రరిస్టు'తో హీరోయిన్ డేటింగ్! - Sakshi

'టెర్రరిస్టు'తో హీరోయిన్ డేటింగ్!

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ నుంచి విడిపోయి కొన్ని నెలలుగా నటి కల్కి కొచ్లిన్ దూరంగా ఉంటోంది.

ముంబై: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ నుంచి విడిపోయి కొన్ని నెలలుగా నటి కల్కి కొచ్లిన్ దూరంగా ఉంటోంది. అయితే ఆమె ఇటీవల ఓ కొత్త వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. కల్కి డేటింగ్ గురించి బాలీవుడ్ కోడై కూస్తోంది. అయితే టెర్రిరిస్టుతో డేటింగ్ చేయడమేంటని కంగారు పడకండి. ఆ వివరాలపై ఓ లుక్కేద్దామా మరి. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ కల్కి చాలా ఫాస్ట్. ఇటీవల విడుదలై బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపిండంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ 'నీర్జా'. ఈ సినిమాలో కరడుగట్టిన టెర్రరిస్టుగా జిమ్ సరభ్ కనిపిస్తాడు. పాక్ టెర్రరిస్టుగా నటించిన జిమ్, ఎయిర్ హోస్టెస్ నీరజా బానోతు(సోనమ్ కపూర్)తో పాటు విమాన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తాడు జిమ్.

జిమ్, కల్కి గత కొంత కాలం నుంచి సన్నిహితంగా ఉంటున్నారు. రిలేషన్ పై వారిద్దరూ కాస్త సీరియస్ గా కనిపిస్తున్నారన్న వార్త స్థానిక మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుండటంతో వీరి డేటింగ్ విషయం గుప్పుమంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా 2009లో వచ్చిన 'డేవ్.డి'తో బెస్ట్ సపోర్టింగ్ నటిగా అవార్డు అందుకున్న కల్కి ఆ తరువాత మరిన్ని మూవీల్లో నటనకుగానూ ఎన్నో అవార్డులు సాధించింది. అయితే రియల్ స్టోరీ 'నీర్జా' మూవీతో పేరు తెచ్చుకున్న జిమ్ అప్పుడే మంచి స్టార్ నటితో డేటింగ్ మొదలెట్టడంతో వీరి రిలేషన్ పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement