ఔను.. డేటింగ్ చేస్తున్నా! | Yes I am dating someone for quite sometime | Sakshi
Sakshi News home page

ఔను.. డేటింగ్ చేస్తున్నా!

Published Fri, May 29 2015 10:59 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఔను.. డేటింగ్ చేస్తున్నా! - Sakshi

ఔను.. డేటింగ్ చేస్తున్నా!

గత ఏడాది ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఎంతగా మజా ఇచ్చాయో, వివాదాలు కూడా అంతే కిక్‌నిచ్చాయి. బాలీవుడ్ కథానాయిక ప్రీతీ జింటా, వ్యాపారవేత్త నెస్‌వాడియాల ప్రేమ జంట శాశ్వతంగా విడిపోవడానికి ఆ ఐపీఎల్ వేదికగా మారింది.
 
 ఆఖరికి ప్రీతీ జింటా పోలీస్ కేసు పెట్టేంత వరకూ ఈ వ్యవహారం వెళ్లింది. ఈ వివాదం తర్వాత అమెరికా వెళ్లిపోయిన ప్రీతి ఈ ఏడాది ఐపీఎల్ కోసం మళ్లీ భారత్‌కు వచ్చారు. యూఎస్‌లో ఉన్నప్పుడు ఆమె ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో పడ్డారన్న వార్త ప్రచారంలో ఉంది. దీని గురించి ప్రీతి స్పందిస్తూ - ‘‘అవును. డేటింగ్ చేస్తున్నా.
 
 ఆ వ్యక్తి ఎవరు? అతని హైట్ ఎంత? వెయిట్ ఎంత? ఏ రంగు లాంటి ప్రశ్నలు అడగొద్దు. అస్సలు చెప్పను. డేటింగ్ చేస్తున్నానని ఒప్పుకున్నా కదా.. ఇక అంతటితో చర్చలకు ఫుల్‌స్టాప్ పెడితే బాగుంటుంది’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement