వాహ్ తాజ్.. భర్తతో బాలీవుడ్ నటి | Wah Taj! Preity Zinta strikes a pose with hubby Gene Goodenough | Sakshi
Sakshi News home page

వాహ్ తాజ్.. భర్తతో బాలీవుడ్ నటి

Published Fri, May 13 2016 10:28 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

వాహ్ తాజ్.. భర్తతో బాలీవుడ్ నటి - Sakshi

వాహ్ తాజ్.. భర్తతో బాలీవుడ్ నటి

ముంబయి: పెళ్లి వార్తలతో కొన్ని నెలల కిందట వార్తల్లో కెక్కిన బాలీవుడ్ భామ ప్రీతిజింటా ఇప్పుడు జాలీగా ఉంది. ఆమె ఈ ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన బ్యూ జీనే గూడెనఫ్ ను లాస్ ఏంజెలిస్ లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత అక్కడే కొన్ని రోజులు గడిపిన ప్రీతి... ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్ కు వచ్చేసింది. దీంతో భర్తతో తీరికగా గడిపే సమయం సొట్ట బుగ్గల సుందరికి దొరకనట్లు కనిపిస్తోంది. భర్త కుటుంబం అమెరికా నుంచి రావడంతో వారితో గడపాలని నిర్ణయించుకుంది. భర్త గూడెనఫ్, ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ కు వెళ్లింది.

తాజ్ మహల్ ను సందర్శించిన సందర్భంగా తన కుటుంబంతో కలిసి సరదాగా దిగిన ఫొటోను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇదివరకు సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఫ్యామిలితో అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. చరిత్రకు చిహ్నం, సుందర కట్టడమైన తాజ్ దగ్గర ఉన్నామంటూ ప్రీతి పేర్కొంది. ఓ వైపు ప్రేమకు చిహ్నమైన కట్టడం తాజ్ మహల్.. మరోవైపు ప్రియమైన భర్తతో ప్రీతి చాలా సంతోషంగా తీరిక సమయాన్ని ఎంజాయ్ చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్న ప్రీతి బిజీబిజీగా ఉంటోంది. ప్రొఫెషన్ తో పాటు కుటుంబానికి కూడా తగిన సమయం కేటాయిస్తూ లైఫ్ లీడ్ చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement