Gene Goodenough
-
సరోగసి ద్వారా ప్రీతి జింటాకు కవలలు
ముంబై: ప్రేమంటే ఇదేరా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నటి ప్రీతి జింటా అద్దె గర్భం (సరోగసి) ద్వారా తల్లయింది. ఆమెకు కవల పిల్లలు.. ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. ఈ శుభవార్తని ప్రీతి జింటా గురువారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. అమెరికాకు చెందిన ఆర్థిక నిపుణుడు జెనె గుడెనఫ్‌ను 2016లో పెళ్లిచేసుకున్న ప్రీతి జింటా అప్పట్నుంచి వెండితెరకి దూరమయ్యారు. అమెరికాలో లాస్ఏంజెల్స్లో ఉంటున్న 46 ఏళ్ల వయసున్న ప్రీతి ఇప్పుడు తల్లయిన సంబరంలో ఉన్నారు. సరోగసి ద్వారా తల్లినయ్యే అపురూపమైన ఈ ప్రయాణంలో తమకు తోడ్పాటునందించిన డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది, అద్దె గర్భాన్ని మోసిన మహిళకి ప్రీతి ధన్యవాదాలు తెలిపారు. తన పిల్లలకి జై, జియా అని పేర్లు పెట్టినట్టు ఆ ట్వీట్లో వెల్లడించారు. ‘‘నేను, నా భర్త ఆనందంలో తలమునకలై ఉన్నాము. ఇద్దరు పిల్లలు ఒడిలోకి వచ్చిన ఈ సంబరంలో మా హృదయాలు ఎంతో ప్రేమతో నిండిపోయి ఉన్నాయి. వైద్య సిబ్బందిపై అపారమైన కృతజ్ఞత ఉంది. పిల్లలతో కొత్త ప్రయాణంపై ఎంతో ఉద్వేగంగా ఉంది’’ అని ప్రీతి ఆ ట్వీట్లో పేర్కొన్నారు. బాలీవుడ్లో బిడ్డల్ని కనడానికి సరోగసి విధానాన్ని ఎంచుకోవడం కొత్తకాదు. గతంలో కరణ్ జోహార్, షారూక్ ఖాన్, ఏక్తాకపూర్, అమీర్‌ఖాన్ వంటి వారు సరోగసి ద్వారా తల్లిదండ్రులయ్యారు. -
మావారు చూసింది ఆ ఒక్క సినిమానే : ప్రీతీజింటా
ముంబై : తన బాయ్ ఫ్రెండ్ జెనీ గుడ్ఎనఫ్ను పెళ్లాడిన సొట్టబుగ్గల సుందరి ప్రీతీజింటా కొంచెం గ్యాప్ తర్వాత 'భయ్యాజీ సూపర్ హిట్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఈ సమ్మర్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. చిత్ర షూటింగ్ ముగియడంతో ప్రీతి ట్విట్టర్లో అభిమానులతో శుక్రవారం చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా బదులిచ్చింది. ప్ర- మీ అభిమాన క్రికెటర్ ఎవరు? స-వీరూ, యూవీ, విరాట్, ధోనీ, సచిన్ ప్ర- మీ జీవితంలో ఏదైనా సంఘటన జరగకుండా ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా? స-జీవితంలో జరిగే మంచి, చెడులనుంచి నేను ప్రతిసారి కొత్త విషయాలన్ని నేర్చుకుంటూనే ఉన్నా. గడచిన జీవితంలో తాలూకూ సంఘటనలను జరగకుండా ఉంటే బావుండు అని అనుకోవడం లేదు. మా తండ్రిని కోల్పోయిన విషయంలో మాత్రం చింతిస్తూనే ఉన్నా.. ప్ర-మీ ఆయనకు బాలీవుడ్ చిత్రాలంటే ఇష్టమేనా? స- ఆయన ఒక్క వీర్ జరా సినిమా మాత్రమే చూశారు. ప్ర-2016లో మీకు నచ్చిన చిత్రాలు.. స-దంగల్, సుల్తాన్, పింక్, నీరజ్, ఏ దిల్ హై ముష్కిల్ ప్ర- కాబిల్ సినిమా చూశారా ? స-కోయి మిల్ గయా తర్వాత హృతిక్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. యామీ గౌమి తన నటనతో నన్ను ఏడిపించింది. ప్ర- అక్షయ్ కుమార్ గురించి అడిగితే మీ మదిలోకొచ్చే సమాధానం స-కిలాడీ ప్ర- సమోసా, దోసల్లో ఏది ఇష్టం ? స-ముంబైలో ఉంటే సమోసా, లాస్ ఏంజెల్స్‌లో దోస ప్ర- మీ రోల్ మాడల్ ? స-మా అమ్మ ప్ర- పాడటం అంటే మీకిష్ణమా ? స-భూమ్మీదే కాదు విశ్వంలోనే నేనే బెస్ట్ బాత్రూం సింగర్‌ని..హహా ప్ర - మీరు బాలీవుడ్లో అందమైన నటిగా కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ చెప్పారు..మీ స్పందన ? స-అయితే సల్మాన్‌కి తప్పకుండా థ్యాంక్స్ చెప్పాల్సిందే.. ప్ర- మీ ఫేవరేట్ హాలిడే డెస్టినేషన్ ? స-ఇండియాలోని పర్వతాలు, అమెరికాలోని సముద్రం... -
ప్రీతి రిసెప్షన్లో బాలీవుడ్ తారా లోకం
రెండు నెలల క్రితం లాస్ ఏంజిల్స్‌లో తన బాయ్ ఫ్రెండ్ జెనీ గుడ్ఎనఫ్ను పెళ్లాడిన సొట్టబుగ్గల సుందరి ప్రీతీజింటా, బాలీవుడ్ సెలబ్రిటీల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 28న జరిగిన పెళ్లి వేడుక తరువాత తన భర్తతో కలిసి ఇటీవలే ముంబై చేరుకుంది ప్రీతి. ఈ సందర్భంగా ముంబైలో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా పాల్గొన్ని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫారూక్ ఖాన్, షాహిద్ కపూర్, యువరాజ్ సింగ్, లారాదత్త, డినో మోరియా, అభిషేక్ బచ్చన్, మాధురి దీక్షిత్, జూహీచావ్లా, ఫరాఖాన్, మహేష్ భూపతి, మాధవన్, కరణ్ జోహర్ లాంటి ప్రముఖుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కొద్ది రోజులుగా పెళ్లి వార్తలతో సందడి చేస్తున్న బాలీవుడ్ లాంగ్ టైం బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ తన గర్ల్ ఫ్రెండ్ లులియా తో కలిసి రావటం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. -
వాహ్ తాజ్.. భర్తతో బాలీవుడ్ నటి
ముంబయి: పెళ్లి వార్తలతో కొన్ని నెలల కిందట వార్తల్లో కెక్కిన బాలీవుడ్ భామ ప్రీతిజింటా ఇప్పుడు జాలీగా ఉంది. ఆమె ఈ ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన బ్యూ జీనే గూడెనఫ్ ను లాస్ ఏంజెలిస్ లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత అక్కడే కొన్ని రోజులు గడిపిన ప్రీతి... ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్ కు వచ్చేసింది. దీంతో భర్తతో తీరికగా గడిపే సమయం సొట్ట బుగ్గల సుందరికి దొరకనట్లు కనిపిస్తోంది. భర్త కుటుంబం అమెరికా నుంచి రావడంతో వారితో గడపాలని నిర్ణయించుకుంది. భర్త గూడెనఫ్, ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ కు వెళ్లింది. తాజ్ మహల్ ను సందర్శించిన సందర్భంగా తన కుటుంబంతో కలిసి సరదాగా దిగిన ఫొటోను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇదివరకు సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఫ్యామిలితో అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. చరిత్రకు చిహ్నం, సుందర కట్టడమైన తాజ్ దగ్గర ఉన్నామంటూ ప్రీతి పేర్కొంది. ఓ వైపు ప్రేమకు చిహ్నమైన కట్టడం తాజ్ మహల్.. మరోవైపు ప్రియమైన భర్తతో ప్రీతి చాలా సంతోషంగా తీరిక సమయాన్ని ఎంజాయ్ చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్న ప్రీతి బిజీబిజీగా ఉంటోంది. ప్రొఫెషన్ తో పాటు కుటుంబానికి కూడా తగిన సమయం కేటాయిస్తూ లైఫ్ లీడ్ చేస్తోంది. -
'అవును.. మా పెళ్లయింది నిజమే..'
ముంబయి: ఎట్టకేలకు అందరి సందేహాలకు తెరపడింది. తన పెళ్లయినట్లు బాలీవుడ్ నటి, పలు తెలుగు సినిమాల్లోనూ నటించిన ప్రీతిజింటా స్పష్టం చేసింది. ఆమె తన భర్త ఫొటోను కూడా సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. ఈ మంగళవారం కబీర్‌బేడీ ట్వీట్‌తో ప్రీతి పెళ్లి అయినట్లు అందరికీ తెలిసింది. కానీ, స్వయంగా ఆమె ఈ విషయం ముందు చెప్పలేదు. దీంతో అది నిజమా కాదా అని అందరూ సందేహంలో పడ్డారు. కానీ, ఈ సొట్ట బుగ్గల చిన్నది తాజాగా తన భర్త ఫొటోను పోస్ట్ చేసి తెరదించింది. ఆమె బ్యూ జీనే గూడెనఫ్ అనే అమెరికన్‌ను వివాహం చేసుకుంది. ఈ వివాహం లాస్ ఎంజెల్స్‌లో జరిగినట్లు తెలిపింది. ప్రీతీకి జీనే స్నేహితుడు కూడా. -
బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న ప్రీతి జింతా
బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా ఎట్టకేలకు పెళ్లి కూతురైంది. ప్రీతి తన ప్రేమికుడు, అమెరికాకు చెందిన ఆర్థిక విశ్లేషకుడు జీని గుడెనఫ్‌ను వివాహం చేసుకుంది. ఫిబ్రవరి 29న లాస్ ఏంజిలెస్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వివాహానికి ప్రీతి, గుడెనఫ్ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం. ఏడాదిన్నరగా ప్రీతి జింతా, గుడెనఫ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్టు కొంతకాలంగా వార్తలు వచ్చినా ప్రీతి వీటిని ఖండించింది. అయితే లాస్ ఏంజిలెస్‌లో ప్రీతి తన బాయ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీతికి సన్నిహితంగా ఉండే సుజానే ఖాన్, సురిలీ గోయెల్ లాస్ ఏంజిలెస్ వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రీతి ఏప్రిల్‌లో ముంబైకు రానుంది. ఈ దిల్ సే హీరోయిన్ ప్రముఖ వ్యాపారవేత్త నెస్ వాడియాను వివాహం చేసుకోనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను కొనుగోలు చేశారు. అనంతరం వారిద్దరి మధ్య వివాదం ఏర్పడటం, పరస్పరం కేసులు పెట్టుకునే దాకా వ్యవహారం వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు.