మావారు చూసింది ఆ ఒక్క సినిమానే : ప్రీతీజింటా | Preity zinta Chit chat with fans after Bhaiyyaji Superhitt shooting | Sakshi
Sakshi News home page

మావారు చూసింది ఆ ఒక్క సినిమానే : ప్రీతీజింటా

Published Fri, Feb 3 2017 9:24 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

మావారు చూసింది ఆ ఒక్క సినిమానే : ప్రీతీజింటా

మావారు చూసింది ఆ ఒక్క సినిమానే : ప్రీతీజింటా

ముంబై :
తన బాయ్ ఫ్రెండ్ జెనీ గుడ్ఎనఫ్ను పెళ్లాడిన సొట్టబుగ్గల సుందరి ప్రీతీజింటా కొంచెం గ్యాప్ తర్వాత 'భయ్యాజీ సూపర్ హిట్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఈ సమ్మర్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. చిత్ర షూటింగ్ ముగియడంతో ప్రీతి ట్విట్టర్లో అభిమానులతో శుక్రవారం చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా బదులిచ్చింది.

ప్ర- మీ అభిమాన క్రికెటర్ ఎవరు?
స-వీరూ, యూవీ, విరాట్, ధోనీ, సచిన్

ప్ర- మీ జీవితంలో ఏదైనా సంఘటన జరగకుండా ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా?
స-జీవితంలో జరిగే మంచి, చెడులనుంచి నేను ప్రతిసారి కొత్త విషయాలన్ని నేర్చుకుంటూనే ఉన్నా. గడచిన జీవితంలో తాలూకూ సంఘటనలను జరగకుండా ఉంటే బావుండు అని అనుకోవడం లేదు. మా తండ్రిని కోల్పోయిన విషయంలో మాత్రం చింతిస్తూనే ఉన్నా..

ప్ర-మీ ఆయనకు బాలీవుడ్ చిత్రాలంటే ఇష్టమేనా?
స- ఆయన ఒక్క వీర్ జరా సినిమా మాత్రమే చూశారు.
ప్ర-2016లో మీకు నచ్చిన చిత్రాలు..
స-దంగల్, సుల్తాన్, పింక్, నీరజ్, ఏ దిల్ హై ముష్కిల్

ప్ర- కాబిల్ సినిమా చూశారా ?
స-కోయి మిల్ గయా తర్వాత హృతిక్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. యామీ గౌమి తన నటనతో నన్ను ఏడిపించింది.

ప్ర- అక్షయ్ కుమార్ గురించి అడిగితే మీ మదిలోకొచ్చే సమాధానం
స-కిలాడీ

ప్ర- సమోసా, దోసల్లో ఏది ఇష్టం ?
స-ముంబైలో ఉంటే సమోసా, లాస్ ఏంజెల్స్లో దోస

ప్ర- మీ రోల్ మాడల్ ?
స-మా అమ్మ

ప్ర- పాడటం అంటే మీకిష్ణమా ?
స-భూమ్మీదే కాదు విశ్వంలోనే నేనే బెస్ట్ బాత్రూం సింగర్ని..హహా

ప్ర - మీరు బాలీవుడ్లో అందమైన నటిగా కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ చెప్పారు..మీ స్పందన ?
స-అయితే సల్మాన్కి తప్పకుండా థ్యాంక్స్ చెప్పాల్సిందే..

ప్ర- మీ ఫేవరేట్ హాలిడే డెస్టినేషన్ ?
స-ఇండియాలోని పర్వతాలు, అమెరికాలోని సముద్రం...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement