Preity Zinta Children's Names: Preity Zinta Becomes Mother Of Twins Via Surrogacy - Sakshi
Sakshi News home page

Preity Zinta Children's Names: సరోగసి ద్వారా ప్రీతి జింటాకు కవలలు

Published Fri, Nov 19 2021 5:00 AM | Last Updated on Fri, Nov 19 2021 10:10 AM

Preity Zinta Becomes Mother of Twins Via Surrogacy - Sakshi

భర్తతో ప్రీతి జింటా

ముంబై: ప్రేమంటే ఇదేరా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా అద్దె గర్భం (సరోగసి) ద్వారా తల్లయింది. ఆమెకు కవల పిల్లలు.. ఒక కుమారుడు, కుమార్తె  జన్మించారు. ఈ శుభవార్తని ప్రీతి జింటా గురువారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అమెరికాకు చెందిన ఆర్థిక నిపుణుడు జెనె గుడెనఫ్‌ను 2016లో పెళ్లిచేసుకున్న  ప్రీతి జింటా అప్పట్నుంచి వెండితెరకి దూరమయ్యారు. అమెరికాలో లాస్‌ఏంజెల్స్‌లో ఉంటున్న  46 ఏళ్ల వయసున్న ప్రీతి ఇప్పుడు తల్లయిన సంబరంలో ఉన్నారు.

సరోగసి ద్వారా తల్లినయ్యే అపురూపమైన ఈ ప్రయాణంలో తమకు తోడ్పాటునందించిన డాక్టర్లు, నర్సులు, మెడికల్‌ సిబ్బంది, అద్దె గర్భాన్ని మోసిన మహిళకి ప్రీతి ధన్యవాదాలు తెలిపారు. తన పిల్లలకి జై, జియా అని పేర్లు పెట్టినట్టు ఆ ట్వీట్‌లో వెల్లడించారు. ‘‘నేను, నా భర్త ఆనందంలో  తలమునకలై ఉన్నాము. ఇద్దరు పిల్లలు ఒడిలోకి వచ్చిన ఈ సంబరంలో మా హృదయాలు ఎంతో ప్రేమతో నిండిపోయి ఉన్నాయి. వైద్య సిబ్బందిపై అపారమైన కృతజ్ఞత ఉంది. పిల్లలతో కొత్త ప్రయాణంపై ఎంతో ఉద్వేగంగా ఉంది’’ అని ప్రీతి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. బాలీవుడ్‌లో బిడ్డల్ని కనడానికి  సరోగసి విధానాన్ని ఎంచుకోవడం కొత్తకాదు. గతంలో కరణ్‌ జోహార్, షారూక్‌ ఖాన్, ఏక్తాకపూర్, అమీర్‌ఖాన్‌ వంటి వారు సరోగసి ద్వారా తల్లిదండ్రులయ్యారు.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement