Twin children
-
సరోగసి ద్వారా ప్రీతి జింటాకు కవలలు
ముంబై: ప్రేమంటే ఇదేరా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నటి ప్రీతి జింటా అద్దె గర్భం (సరోగసి) ద్వారా తల్లయింది. ఆమెకు కవల పిల్లలు.. ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. ఈ శుభవార్తని ప్రీతి జింటా గురువారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. అమెరికాకు చెందిన ఆర్థిక నిపుణుడు జెనె గుడెనఫ్‌ను 2016లో పెళ్లిచేసుకున్న ప్రీతి జింటా అప్పట్నుంచి వెండితెరకి దూరమయ్యారు. అమెరికాలో లాస్ఏంజెల్స్లో ఉంటున్న 46 ఏళ్ల వయసున్న ప్రీతి ఇప్పుడు తల్లయిన సంబరంలో ఉన్నారు. సరోగసి ద్వారా తల్లినయ్యే అపురూపమైన ఈ ప్రయాణంలో తమకు తోడ్పాటునందించిన డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది, అద్దె గర్భాన్ని మోసిన మహిళకి ప్రీతి ధన్యవాదాలు తెలిపారు. తన పిల్లలకి జై, జియా అని పేర్లు పెట్టినట్టు ఆ ట్వీట్లో వెల్లడించారు. ‘‘నేను, నా భర్త ఆనందంలో తలమునకలై ఉన్నాము. ఇద్దరు పిల్లలు ఒడిలోకి వచ్చిన ఈ సంబరంలో మా హృదయాలు ఎంతో ప్రేమతో నిండిపోయి ఉన్నాయి. వైద్య సిబ్బందిపై అపారమైన కృతజ్ఞత ఉంది. పిల్లలతో కొత్త ప్రయాణంపై ఎంతో ఉద్వేగంగా ఉంది’’ అని ప్రీతి ఆ ట్వీట్లో పేర్కొన్నారు. బాలీవుడ్లో బిడ్డల్ని కనడానికి సరోగసి విధానాన్ని ఎంచుకోవడం కొత్తకాదు. గతంలో కరణ్ జోహార్, షారూక్ ఖాన్, ఏక్తాకపూర్, అమీర్‌ఖాన్ వంటి వారు సరోగసి ద్వారా తల్లిదండ్రులయ్యారు. -
వారికి ఇల్లే ఆట స్థలం: ఒలింపిక్స్ బరిలో 24 క్రీడా కుటుంబాలు
తమ కుటుంబం నుంచి ఎవరైనా ఒలింపిక్స్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తే... పతకాలు సాధిస్తే ఆ ఫ్యామిలీ ఆనందం అంతా ఇంతా కాదు. నాలుగేళ్లకోసారి జరిగే విశ్వ క్రీడల్లో తోబుట్టువులు దేశం తరఫున బరిలోకి దిగడం, పతకాలు నెగ్గడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లోనూ పలు క్రీడాంశాల్లో అక్కా చెల్లెళ్లు, అన్నా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు, కవలలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. మరో మూడు రోజుల్లో మొదలయ్యే ఈ మెగా ఈవెంట్లో మొత్తం 24 కుటుంబాల సభ్యులు ఆయా క్రీడాంశాల్లో సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. –సాక్షి క్రీడా విభాగం గోల్డ్‌పై గోల్ఫ్ ‘సిస్టర్స్’ గురి... అమెరికాకు చెందిన నెల్లీ, జెస్సికా కోర్డా టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల గోల్ఫ్ విభాగంలో పోటీ పడనున్నారు. నెల్లీ వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉండగా... జెస్సికా 13వ ర్యాంక్‌లో ఉంది. వీరికి గొప్ప క్రీడా నేపథ్యమే ఉంది. నెల్లీ, జెస్సికా తల్లిదండ్రులు పీటర్ కోర్డా, రెజీనా రజ్రతోవా ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్లు. పీటర్ కోర్డా 1998 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. 1996 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ సాధించాడు. రెజీనా 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించింది. నాలుగుగ్రాండ్స్లామ్ టోర్నీలలోనూ పాల్గొంది. నెల్లీ, జెస్సికా సోదరుడు సెబాస్టియన్ కోర్డా కూడా ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. అయితే అతను టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయాడు. కొన్నేళ్లుగా ప్రొఫెషనల్ గోల్ఫ్‌లో పలు టైటిల్స్ సాధించిన నెల్లీ, జెస్సికా పాల్గొంటున్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకాలతో తిరిగి వెళ్లడం ఖాయమనిపిస్తోంది. గోల్ఫ్లోనే కాకుండా అమెరికా నుంచి ‘సిస్టర్స్’ మెకంజీ–అరియా (వాటర్ పోలో), క్రిస్టీ–సామ్ మెవిస్ (మహిళల ఫుట్‌బాల్), కెల్లీ–కోట్నీ హర్లీ (ఫెన్సింగ్)... ‘బ్రదర్స్’ కవిక–ఎరిక్ షోజీ (వాలీబాల్), హెన్రీ–జాక్సన్ లెవెరెట్ (షూటింగ్) టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. ఇందులో కెల్లీ–కోట్నీ, కవిక–ఎరిక్ జోడీలు గతంలో ఒలింపిక్స్‌లో పతకాలు కూడా సాధించాయి. హర్డిల్స్‌లో అక్కాచెల్లెళ్లు... బ్రిటన్‌కు చెందిన అథ్లెటిక్స్ ‘సిస్టర్స్’ టిఫానీ పోర్టర్–సిండీ సెంబర్ వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో సెంబర్ నాలుగో స్థానంలో, టిఫానీ ఏడో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది టిఫానీ 12.51 సెకన్ల అత్యుత్తమ సమయాన్ని నమోదు చేయగా... సిండీ 12.53 సెకన్లతో సోదరికి సమీపంలో ఉంది. ఇక బ్రిటన్ నుంచే ‘సిస్టర్స్’ జెన్నిఫర్–జెస్సికా (జిమ్నాస్టిక్స్), జోడీ–హానా విలియమ్స్ (అథ్లెటిక్స్), మథిల్డా–చార్లోటి హాడ్జ్కిన్స్ (రోయింగ్), ‘బ్రదర్స్’ మాక్స్–జో లిచ్‌ఫీల్డ్ (స్విమ్మింగ్–బ్రిటన్), ‘ట్విన్ బ్రదర్స్’ ఆడమ్–సిమోన్ యేట్స్ (సైక్లింగ్), ప్యాట్–ల్యూక్ మెకార్మక్ (బాక్సింగ్–బ్రిటన్), అన్నా, చెల్లెలు హ్యారీ–హనా మార్టిన్ (హాకీ), ఎమిలీ–టామ్ ఫోర్డ్ (రోయింగ్) బరిలో ఉన్నారు. బాస్కెట్‌బాల్ బ్రదర్స్... అమెరికా, బ్రిటన్ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా క్రీడా కుటుంబాలు టోక్యోకు వస్తున్నాయి. పురుషుల బాస్కెట్‌బాల్‌లో స్పెయిన్‌కు చెందిన సోదర ద్వయం పావ్, మార్క్ గసోల్ నాలుగోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటోంది. పావ్, మార్క్ సభ్యులుగా ఉన్న స్పెయిన్ జట్టు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాలు సాధించగా... 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ‘స్విమ్మింగ్ సిస్టర్స్’ కేట్ క్యాంప్‌బెల్, బోంటి క్యాంప్‌బెల్ మరోసారి స్వర్ణమే లక్ష్యంగా పోటీపడనున్నారు. కేట్కిది నాలుగో ఒలింపిక్స్‌కాగా... ఆమె సోదరి బోంటికి రెండో ఒలింపిక్స్. 2016 రియో ఒలింపిక్స్‌లో కేట్, బోంటిలతో కూడిన ఆస్ట్రేలియా జట్టు 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో స్వర్ణ పతకం సాధించింది. వీరే కాకుండా ఆఫ్రికాలోని కేప్ఫ వెర్డె దేశం నుంచి స్విమ్మింగ్‌లో అన్నా, చెల్లెళ్లు లాట్రోయ, ట్రాయ్, జేలా పినా... స్విమ్మింగ్‌లో ‘సిస్టర్స్’ బోంటి, కేట్ క్యాంప్‌బెల్ (ఆస్ట్రేలియా), సింక్రనైజ్డ్ స్విమ్మింగ్‌లో అన్నా మరియా, ఎరిని అలెగ్జాండ్రి (ఆస్ట్రియా)... లౌరా–చార్లోటి ట్రెంబల్ (ఫ్రాన్స్)... సెయిలింగ్‌లో ‘బ్రదర్స్’ సిమ్–మిహోవిల్ ఫెంటెలా (క్రొయేషియా)... ఎటెస్–డెనిజ్ సినార్ (టర్కీ), జిమ్నాస్టిక్స్‌లో ‘ట్విన్ సిస్టర్స్’ సేన్–లీకీ వెవెర్స్ (నెదర్లాండ్స్), ట్రయాథ్లాన్లో అన్నా, చెల్లెలు ట్రెంట్ థోర్ప్, ఐన్స్లే (న్యూజిలాండ్) కూడా బరిలోనిలిచారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1731380308.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఎవరు అనుదీపో? ఎవరు మనుదీపో? అని తికమక!
ఖమ్మం: ఒకే రూపం కలిగిన ఇద్దరు పిల్లలు ఒకే ఇంట్లో ఉంటే.. గొప్ప అనుభూతే. కవలలంటే ఇష్టపడని హృదయముండదు. ఒకే పోలిక ఉంటే ఆనందంతోపాటు బంధువులు, ఇరుగుపొరుగులో కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. కొందరు ఆ ఇంట్లో ఒకే బిడ్డ ఉన్నాడని అనుకుంటూ ఉంటారు. నేడు కవలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. అలీఫా, అఫియా నగరంలోని ముస్తాఫానగర్‌కు చెందిన హోంగార్డు షేక్ అక్బర్ అలీకి 2010 మార్చి 18న కవలలు జన్మించారు. షేక్ అలీఫా తబసుమ్, షేక్ అఫియా తబసుమ్ ఇద్దరూ ఒకేలా ఉంటారు. వీరిని స్నేహితులు గుర్తుపట్టడం కూడా కష్టమే. వీరు స్థానిక లోటస్ పాఠశాలలో చదువుకుంటున్నారు. అలీఫా , అఫియాలను బంధువులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఒకే పోలికలతో ఆడపిల్లలు ఇంట తిరుగుతుంటే ఎంతో సంతృప్తిగా అనిపిస్తుందని తాత మహబూబ్ అలీ గారాబం చేస్తారని ఈ అక్కాచెల్లెళ్లు ఆనందంగా చెబుతున్నారు. నయోనిక, నైతిక్ కుమార్ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరానికి చెందిన కె.వినోద్‌కుమార్, శ్రీదివ్య దంపతుల పిల్లలు కె.నయోనిక, నైతిక్కుమార్ కవలలు. వీరి వయసు ఇప్పుడు పదేళ్లు. వీరిద్దరూ ఇంట్లో, బయట కూడా ఐక్యంగా ఉంటారని తల్లిదండ్రులు చెబుతున్నారు. అనుదీప్, మనుదీప్ నగరంలోని త్రీటౌన్ పంపింగ్‌వెల్ రోడ్‌కు చెందిన తలారి సురేష్, మహాలక్ష్మి దంపతులకు కవల పిల్లలు అనుదీప్, మనుదీప్ ఒకరినొకరు పోలి ఉంటారు. తొమ్మిదేళ్ల వయసున్న వీరిలో ఎవరు అనుదీపో?ఎవరు మనుదీపో? అర్థంకాగా తికమకపడుతుంటారు. తండ్రి సురేష్ వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తాడు. జార్జి విహాన్, అన్నిక మెర్ల వైరా మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపలిటికి చెందిన గొల్లమందల రాజు, అనిత దంపతులకు మూడేళ్ల కిందట కుమారుడు, కుమార్తె (జార్జి విహాన్, అన్నిక మెర్లీ) కవలలుగా జన్మించారు. ఇద్దరు అచ్చం ఒకేలా ఉంటారు. ఒకరిని ఒకరు విడిచి ఉండలేరు. వర్షిణి–హర్షిణి నేలకొండపల్లి: మండలంలోని బైరవునిపల్లి గ్రామంలో గోపి ఉపేందర్‌రావు–నాగలక్ష్మి దంపతుల పిల్లలు వర్షిణి–హర్షిణి కవలలు. వీరికి డ్రస్, పుస్తకాలు, చివరకు తినే పదార్థాలలో కూడా సేమ్ టు సేమ్. వీరి అభిరుచులను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. ముద్దుగా కిట్టు...బిట్టు అని పిలుస్తారు. హిమ కర్షిణి, హిమ వర్షిక వైరారూరల్: సిరిపురం గ్రామానికి చెందిన కూరాకుల సాయిబాబా, స్రవంతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు కవలలుగా జన్మించారు. హిమ కర్షిణి, హిమ వర్షికలకు ప్రస్తుతం నాలుగేళ్లు. వీరు అచ్చం ఒకేలా ఉంటారు. అలోక్, అయాన్ ఖమ్మంసహకారనగర్: ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీ సిటీలో నివసించే పునాటి మనోజ్, హర్మ్య దంపతులకు కవలలు అలోక్, అయాన్. వీరికి నాలుగేళ్ల వయసు. ఏ వస్తువు కొనుగోలు చేసినా ఇద్దరికీ కావాలని పట్టుబడతారని, అందుకే ఏదైనా చెరొకటి కొంటామని తల్లిదండ్రులు చెబుతున్నారు. -
ఇద్దరు పిల్లలను కొట్టి చంపిన తండ్రి
సాక్షి, అనంతపురం : మతి స్థిమితం కోల్పోయిన తండ్రి రక్తం పంచుకు పుట్టిన బిడ్డలను హతమార్చిన విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామానికి చెకందిన రవి.. ఇద్దరు చిన్నారులు సుదీప్,(5) సుధీర్ (5)ను హతమార్చాడు. బుధవారం రాత్రి పొద్దుపోయిన అనంతరం తన ఇద్దరు కొడుకులను గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకు వెళ్లి గొంతు నులిమి చంపి అక్కడే పూడ్చి పెట్టాడు. అయితే పిల్లలు కనిపించకపోవడంతో స్థానికులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూడ్చి పెట్టిన ఇద్దరు చిన్నారులను గ్రామస్తులు వెలికితీసి, పోలీసులకు సమాచారం అందించారు. కళ్యాణదుర్గం రూరల్ ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు రవిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
ఉక్కు మహిళ ట్విన్స్ ఫోటోలివిగో..
సాక్షి, బెంగళూరు : ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల (46) కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కదా.. నిక్స్ సఖి, ఆటం తారా అనే పేర్లను పెట్టారు ఇరోమ్ దంపతులు వీరి ఫోటోలనుతాజాగా విడుదల చేశారు. పిల్లలిద్దరూ 2.15, 2.16 కేజీల బరువుగా ముద్దుగా, ఆరోగ్యంగా ఉన్నారని ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు శ్రీపాద వినెక్కర్ తెలిపారు. మల్లేశ్వరంలోని ప్రైవేట్ ఆస్పత్రి క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో సిజేరియన్ ద్వారా ఇరోమ్‌కు ఇద్దరు పండంటి ఆడబిడ్డలు పుట్టారు. అదీ మాతృదినోత్సవం రోజున ఇద్దరు ఆడబిడ్డలు పుట్టడం విశేషంగా నిలిచింది. దీంతో ఐరన్ లేడీకి అభినందనల వెల్లువ కురిసింది. మణిపూర్ రాష్ట్రంలో సాయుధబలగాల ప్రత్యేక చట్టం రద్దుచేయాలంటూ 16 ఏళ్ల పాటు నిరాహారదీక్ష చేసి ఇరోమ్ షర్మిల ఐరన్ లేడీగా ఘనతకెక్కారు. దీక్ష విరమణ అనంతరం రాజకీయాల్లో ప్రవేశించినా.. ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. 2017లో గోవాలో పుట్టి బ్రిటీష్ జాతీయత కలిగిన వ్యక్తి డెస్మండ్ కొటిన్హోను ఇరోమ్ షర్మిల వివాహమాడారు. -
వీడియో చాటింగ్ చేస్తానంటున్న హీరోయిన్
సినీతారలు అంటే షూటింగులు, ఇతర కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు. మరి పిల్లలతో ఎలా కాలం గడపాలి? ఇందుకోసం ప్రఖ్యాత పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ (జెలో) మంచి ఉపాయం ఆలోచించింది. మధ్యాహ్నం పూట తాను బయటకు వెళ్తే, తన కవల పిల్లలు మాక్స్, ఎమ్మీలతో వీడియో చాటింగ్ చేస్తోంది. మాజీ భర్త మార్క్ ఆంథోనీతో కలిసి కన్న ఈ కవల పిల్లలకు ప్రతి రోజూ వీడియో సందేశాలు పంపుతోంది. తాను బిజీగా ఉంటానన్న విషయం ఏడేళ్ల వయసున్న తన పిల్లలకు తెలుసని, తిరిగి వచ్చాక తనను నిద్రపోనివ్వడం కూడా వాళ్ల డ్యూటీలో భాగమని చెప్పింది. తాను నిద్రపోయేటప్పుడు వాళ్లు చాలా నిశ్శబ్దంగా ఉంటారని తెలిపింది. ఇక పిల్లలు నిద్ర లేవక ముందే తాను షూటింగుల కోసం వెళ్లిపోతుంది.. రాత్రి వాళ్లు పడుకున్నాక వస్తుంది కాబట్టి, ఆ సమయంలో వాళ్ల బెడ్ పక్కన నిల్చుని ఫొటోలు తీసుకుంటుందట. -
కవలల కనువిందు
చెన్నై: ఇద్దరు కవల పిల్లలు కన్పిస్తే చాలు చూడడానికి ముద్దేస్తుంటారు. అదే పదుల సంఖ్యలో అయితే ఇక కనువిందే. ఇందుకు వేదికగా బాలల దినోత్సవం నిలిచింది. నగరంలోని మొగపేర్ వేళమ్మాల్ విద్యా సంస్థ ఈ ఏడాది బాలల దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించింది. తమ విద్యా సంస్థలో ఎల్కేజీ నుంచి ప్లస్ టూ వరకు చదువుకుంటున్న కవల పిల్లల్ని ఎంపిక చేసి, వీరి ద్వారా వినూత్నంగా వేడుకలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ కవల పిల్లలు ఒకే వేదిక మీదకు రావడంతో కనువిందుగా మారింది. అన్నాతమ్ముడు, అక్కాచెల్లెలు, అక్కాతమ్ముడు, అన్నాచెల్లలుగా కవలలు ఒకరి వెంట మరొకరు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకే వేదిక మీదకు 76 మంది కవలలు తమ విద్యా సంస్థలో చదువుకుంటున్న 76 మంది కవల జంట పిల్లలను బాలల దినోత్సవానికి ఎంపిక చేశారు. ఒక్కో జంటకు ఒక్కో డ్రెస్ కోడ్, వేషాధారణ, అలంకరణ అప్పగించారు. ఒక్కో కవల జంట ఒకే వస్త్రధారణ, వేషధారణ, పాద రక్షల మొదలు చేతి గాడియారం వరకు ఒకే విధంగా ధరించి ప్రత్యక్షం కావడంతో మరింత ఆకర్షణగా మారింది. ఒక్కో జంట అక్కడి వేదిక మీద నిర్వహించిన పోటీల్లో తమ ప్రతిభను చాటుకుని బహుమతుల్ని సొంతం చేసుకునే యత్నం చేశారు. బాంబే సిస్టర్స్ పేరిట గాయకులుగా పెరెన్నికగన్న సరోజ, లలితలు ఈ వేడుకలలో తమలాగే ఉన్న సహచర కవల పిల్లల్ని చూసి ఎందో సంబరపడిపోయారు. వారితో ఫొటోలు దిగారు. తమ కెమెరాల్లో ఆ పిల్లల ఫొటోలను బంధించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కవల పిల్లల్లో ఎవరి పేర్లు ఎవరివోనని గుర్తించలేని రీతిలో అచ్చుగుద్దినట్టు ఉండడం విశేషం.