వీడియో చాటింగ్ చేస్తానంటున్న హీరోయిన్ | Sakshi
Sakshi News home page

వీడియో చాటింగ్ చేస్తానంటున్న హీరోయిన్

Published Mon, Jan 4 2016 11:52 AM

వీడియో చాటింగ్ చేస్తానంటున్న హీరోయిన్ - Sakshi

సినీతారలు అంటే షూటింగులు, ఇతర కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు. మరి పిల్లలతో ఎలా కాలం గడపాలి? ఇందుకోసం ప్రఖ్యాత పాప్‌ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ (జెలో) మంచి ఉపాయం ఆలోచించింది. మధ్యాహ్నం పూట తాను బయటకు వెళ్తే, తన కవల పిల్లలు మాక్స్, ఎమ్మీలతో వీడియో చాటింగ్ చేస్తోంది. మాజీ భర్త మార్క్ ఆంథోనీతో కలిసి కన్న ఈ కవల పిల్లలకు ప్రతి రోజూ వీడియో సందేశాలు పంపుతోంది.

తాను బిజీగా ఉంటానన్న విషయం ఏడేళ్ల వయసున్న తన పిల్లలకు తెలుసని, తిరిగి వచ్చాక తనను నిద్రపోనివ్వడం కూడా వాళ్ల డ్యూటీలో భాగమని చెప్పింది. తాను నిద్రపోయేటప్పుడు వాళ్లు చాలా నిశ్శబ్దంగా ఉంటారని తెలిపింది. ఇక పిల్లలు నిద్ర లేవక ముందే తాను షూటింగుల కోసం వెళ్లిపోతుంది.. రాత్రి వాళ్లు పడుకున్నాక వస్తుంది కాబట్టి, ఆ సమయంలో వాళ్ల బెడ్ పక్కన నిల్చుని ఫొటోలు తీసుకుంటుందట.

Advertisement
 
Advertisement
 
Advertisement