jennifer lopez
-
ఖరీదైన బంగ్లా అమ్మేసిన ఇషా అంబానీ: ఎవరు కొన్నారంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' లాస్ ఏంజిల్స్‌లోని తన విలాసవంతమైన భవనాన్ని విక్రయించింది. దీనిని హాలీవుడ్ జంట జెన్నిఫర్ లోపెజ్, ఆమె భర్త బెన్ అఫ్లెక్ కొనుగోలు చేశారు. ఈ భవనం వివరాలు, ఇంతకు విక్రయించారు అనే సంగతులు ఈ కథనంలో తెలుసుకుందాం.తండ్రిలాగే ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ప్రసిద్ధి చెందిన ఇషా అంబానీకి అమెరికాలో (లాస్ ఏంజిల్స్) సుమారు 5.2 ఎకరాల విస్తీర్ణంలో ఓ బంగ్లా ఉంది. పది సంవత్సరాల క్రితమే ఇషా దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ ఇంట్లో ఆమె ఉన్న రోజులు చాలా తక్కువనే తెలుస్తోంది.ఇషా అంబానీ గర్భంతో ఉన్నప్పుడు ఇదే భవనంలో ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలో నీతా అంబానీ కూడా ఈ భవనంలోనే ఉన్నారు. ఆ తరువాత అక్కడ నుంచి వచ్చేసారు. ఇప్పుడు హాలీవుడ్ స్టార్ కపుల్ 'జెన్నిఫర్ లోపెజ్ & బెన్ అఫ్లెక్' దీనిని 508 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతను నాయుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?ఇషా అంబానీ విలాసవంతమైన భవనంలో 12 బెడ్రూమ్లు, 24 బాత్రూమ్లతో పాటు.. స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ జిమ్, విశాలమైన డైనింగ్ ఏరియా, పికెల్ బాల్ కోర్టు, స్పా మొదలైన సకల సావుకార్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విలాసవంతమైన భవనాన్ని హాలీవుడ్ జంట సొంతం చేసుకుంది. -
USA Presidential Elections 2024: చపలచిత్తుడు
ఫిలడెల్ఫియా: రిపబ్లికన్ల అధ్య ర్థి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన డెమొక్రాటిక్ పార్టీ ప్రత్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఘాటైన విమ ర్శలు చేశారు. ‘‘ట్రంప్ అ త్యంత చపలచిత్తుడు. ఆపాద మస్తకమూ ప్రతీకారేచ్ఛతో నిండిపోయిన బాపతు. దానికోసమే అపరిమితమైన అధికారానికై అర్రులు చాస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అతి సమీపంలోకి నేపథ్యంలో ఆమె శుక్రవారం లాస్‌వెగాస్‌లో ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అంటేనే విద్వేషానికి ప్రతినిధి అంటూ తూర్పారబట్టారు. ‘‘పొరపాటున ట్రంప్‌ను గెలిపిస్తే ‘శత్రువుల జాబితా’ను జేబులో పెట్టుకుని మరీ శ్వేతసౌధంలోకి అడుగు పెడతారు. నేనైతే అమెరికన్ల జీవితాలను మరింత మెరుగుపరిచేందుకు ఏమేం చేయాలన్న జాబితాతో కాలు పెడతా. అందులో మొదటిది మీ జీవనవ్యయాన్ని తగ్గించడమే’’ అని ప్రకటించారు. హారిస్‌కు మద్దతుగా ప్రఖ్యాత గాయని జెన్నిఫర్ లోపెజ్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. అమెరికన్లంతా, ప్రత్యేకించి లాటినో అమెరికన్లు హారిస్‌కు మద్దతివ్వాలని పిలుపు నిచ్చారు. ట్రంప్ మాదిరిగా కొందరినే కాకుండా అమెరికన్లందరి సంక్షేమాన్నీ హారిస్ పట్టించుకుంటారని లోపెజ్ అభిప్రా యపడ్డారు. అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ కూడా గురువారం హారిస్‌కు తన మద్దతు ప్రక టించారు. ఆమెకు ఓటేస్తేనే తన పిల్లల భవిష్యత్తు క్షే మంగా ఉంటుందన్నారు. ‘కమలా హారి స్కే ఓటే యండి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. -
బర్త్‌డే పార్టీలో మహారాణిలా మెరిసిన పాప్‌స్టార్ జెన్నిఫర్ లోపెజ్ (ఫోటోలు)
-
జెన్నిఫర్ బర్త్‌డే స్పెషల్.. ఓటీటీలో ఈ యాక్షన్ సినిమాలు చూడొచ్చు!
'జెన్నిఫర్ లోపెజ్' అనగానే.. మనకు ముందుగా గుర్తుకొచ్చేది తెలుగు సినిమా పాట. అయితే, హాలీవుడ్ సినీపరిశ్రమలో జెన్నిఫర్ లోపెజ్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న స్టార్ నటి. జులై 24, 1969న న్యూయార్క్‌లో జన్మించిన జెన్నిఫర్ లోపెజ్ మొదట స్కెచ్ కామెడీ TV సిరీస్ 'ఇన్ లివింగ్ కలర్'లో ఫ్లై గర్ల్ జాజ్-ఫంక్ డాన్సర్‌గా గుర్తింపు పొంది, సంగీత పరిశ్రమలో కూడా చెరగని ముద్రగా ఎదిగింది.తాను కేవలం డ్యాన్సింగ్, సింగింగ్లకే పరిమితం కాకుండా నటనలో కూడా ప్రతిభ కనబరిచి తనను తాను పరిచయం చేసుకుంది. తాను నటించిన యాక్షన్ చిత్రాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. నటిగా మారిన తన కెరీర్ అన్ని రకాల జోనర్ల చిత్రాలను నటించి, అడ్వెంచర్ యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. జెన్నిఫర్ తన హాలీవుడ్ మూవీ కెరీర్లో అన్నీ రకాల పాత్రలను పోషించినప్పటికీ, అందులో అద్భుతమైన యాక్షన్ సినిమాలను కొన్నింటిని చూసినట్లయితే..అనకొండ..హారర్ అండ్ యాక్షన్‌గా 1997లో విడుదలైన 'అనకొండ' మూవీ ఇప్పటికీ ప్రజల అభిమాన చిత్రాల్లో ఒకటి. దట్టమైన అడవిలో అనకొండ నుంచి తప్పించుకోవడానికి టెర్రీ (జెన్నిఫర్ లోపెజ్) తన స్నేహితులతో కలిసి ఎలా పోరాడుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. మీరు ఈ మూవీని జియో సినిమాలో చూడవచ్చు.ఎనాఫ్..2002లో విడుదలైన యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ 'ఎనాఫ్'. స్లిమ్ (జెన్నిఫర్ లోపెజ్) తన బెదిరింపు భర్త నుండి తనను తాను ఎలా రక్షించుకుంటుందో మనం ఇందులో చూడవచ్చు. ఈ చిత్రం హాట్‌స్టార్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.షాట్‌గన్ వెడ్డింగ్..జెన్నిఫర్ లోపెజ్ నటించినటువంటి చిత్రం 'షాట్‌గన్ వెడ్డింగ్' (2022). యాక్షన్‌తో పాటు కామెడీని ఆస్వాదించాలనుకునేవారికి ఈ మూవీ నచ్చుతుంది. దీనిని మీరు హాట్‌స్టార్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.ది మదర్..2023లో విడుదలైన 'ది మదర్' చిత్రంలో జెన్నిఫర్ లోపెజ్ కథానాయికగా నటించింది. యాక్షన్, థ్రిల్లర్‌గా కొనసాగే ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. -
ప్రముఖ సింగర్‌పై రూమర్స్.. నాలుగో భర్తకు కూడా..!
హాలీవుడ్ ప్రముఖ నటి, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ విడిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 2022లో బెన్ అఫ్లెక్‌ను పెళ్లాడిన నటి త్వరలోనే తమ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు హాలీవుడ్లో లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ జంట బెవర్లీ హిల్స్‌లోని ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నారు. తాజాగా ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం ఏడాది క్రితమే కొనుగోలు చేసిన బంగ్లా అమ్మకానికి పెట్టడంతో ఈ జంట డైవర్స్ తీసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.కాగా.. ఇప్పటికే జెన్నిఫర్ లోపెజ్ ముగ్గురి పెళ్లి చేసుకుని వారితో విడాకులు తీసుకున్నారు. బెన్ అఫ్లెక్ ఆమెకు నాలుగో భర్త కాగా.. ఈ బంధానికి ఎండ్ కార్డ్ పడడం ఖాయంగా కనిపిస్తోంది. 2021లో డేటింగ్ ప్రారంభించిన వీరిద్దరు.. ఆ తర్వాత 2022లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. దీంతో ఈ జంట కేవలం రెండేళ్లలోనే తమ వివాహాబంధానికి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గత నెల రోజులుగా ఈ జంటపై విడాకుల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు తలెత్తినట్లు సమాచారం. బిజీ షెడ్యూల్ కారణంగానే వీరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. -
లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు?
రిలయన్స్ అధినేత ముఖేష్, నీతా అంబానీ ముద్దుల తనయ, వ్యాపారవేత్త ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రిలయన్స్ రీటైల్ వ్యాపారాన్ని విజయ వంతంగా నడిపిస్తూ తండ్రికి తగ్గ తనయగా వ్యాపారంలో రాణిస్తోంది. తాజాగా ఇషా, భర్త ఆనంద్ పిరమల్ ఇంటికి సంబంధించి ఒక ముఖ్య సమాచారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఇషా ఖరీదైన ఇంటిని ప్రముఖ హాలీవుడ్ జంట కొనుగోలు చేసిందట. ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, ఈ డీల్ మాత్రం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇషా-ఆనంద్ పిరమల్ లాస్ ఎంజేల్స్లోని విలాసవంతమైన భవనాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది. దీన్ని అమెరికన్ టాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ బెన్ అఫ్లెక్ జంట కొనుగోలు చేసిందట. 38వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇంటిని 'క్వీన్ ఆఫ్ డ్యాన్స్' జెలో,బెన్ దంపతులు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇందులో 12 బెడ్రూమ్లు, 24 బాత్రూమ్లు ఉన్నాయి. ప్రత్యేక జిమ్‌లు, స్పాలు, సెలూన్లు, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ లాంటి స్పెషల్ వసతులు కూడా లగ్జరీ హౌస్‌లో కొలువు దీరాయి. దాదాపు 61 మిలియన్ డాలర్ల (రూ. 508కోట్లు) ఇంటిని కొనుగోలు చేశారని కూడా ఇన్‌స్టా ఫ్యాన్ పేజీ నివేదించింది. కాగా ఇషాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైందే అని చెప్పవచ్చు. ఇషా గర్భంతో ఉన్నపుడు తల్లి నీతాతో కలిసి ఆ ఇంట్లోనే గడిపింది. ఇద్దరు పిల్లలకు ఈ ఇంట్లోనే జన్మనిచ్చింది. అయితే ఈ ఇల్లు విక్రయించడానికి గల కారణాలు ఏంటి అనేదానిపై స్పష్టత లేదు. -
సద్గురు హాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా అలాంటి సినిమాలో!
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ పరిచయం చేయాల్సిన పనిలేదు. తన ఫౌండేషన్ ద్వారా సేవ్ సాయిల్ పేరిట అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఆయన సినిమాల్లోను ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల విడుదలైన హాలీవుడ్ చిత్రం 'దిస్ ఈజ్ మీ నౌ: ఎ లవ్ స్టోరీ'లో నటి జెన్నిఫర్ లోపెజ్ నటించిన చిత్రంలో కనిపించారు. ఈ సినిమాకు డేవ్ మేయర్స్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కించిన దిస్ ఈజ్ మీ నౌ: ఎ లవ్ స్టోరీలో బెన్ అఫ్లెక్, ట్రెవర్ నోహ్, సోఫియా వెర్గారా, కేకే పాల్మెర్, పోస్ట్ మలోన్, నీల్ డి గ్రాస్సే టైసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓ కీలక పాత్రలో కనిపించారు. తాజాగా ఈ సినిమాలో ఆయన నటించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈనెల 16 నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇండియాతో పాటు మరికొన్ని దేశాల్లో పేరు తెచ్చుకున్న జగ్గీ వాసుదేవ్ ఈ సినిమాతో మరింత ఫేమస్ అయ్యారు. See who is in Hollywood. Sadhguru appeared in the Hollywood movie, 'This is Me... Now'. It's so exciting to see his role alongside other Hollywood stars. 🙌✨🤩 "You Shall Always Be Loved" ❤️🙏#sadhguru #SadhguruInHollywood pic.twitter.com/Hr7lBVkJby — JANAKA (@immortalsutra) February 17, 2024 nothing, just all shades of @JLo being herself! 💗#ThisIsMeNowOnPrime, watch now pic.twitter.com/ZORql3wrf9 — prime video IN (@PrimeVideoIN) February 21, 2024 -
ఆ సింగర్ డ్రెస్‌తో గూగుల్‌కు లక్షల కోట్ల ఆదాయం?
గూగుల్.. ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్ ఇంజిన్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్, మ్యాప్స్‌లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది. ఏ సందేహం వచ్చినా గూగులమ్మను అడగటం పరిపాటైంది. అలాంటి గూగులమ్మ సిలికాన్ వ్యాలీకి చెందిన ఓ చిన్న గ్యారేజీలో ప్రారంభమై నేడు 200లక్షల కోట్ల కంపెనీగా అవతరించేందుకు అడుగు దూరంలో ఉంది. 50 దేశాల్లో 70 కార్యాలయాల్లో 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1998లో ప్రారంభమైన గూగుల్..ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఆ సంస్థ ఎదిగిన తీరు అనిర్వచనీయం. అలాంటి టెక్ దిగ్గజం పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి , ఆర్ధికంగా ఎదిగేందుకు పరోక్షంగా ఓ సింగర్ ధరించిన డ్రెస్సేనంటే మీరు నమ్ముతారా? ఇద్దరు విద్యార్ధుల ఆలోచనే గూగుల్ 1995లో అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదివే సమయంలో విద్యార్ధులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్లు గూగుల్‌కు ప్రాణం పోశారు. కానీ వారి ఆలోచనని ఆచరణలోకి పెట్టేందుకు మూడేళ్లు పట్టింది. సెప్టెంబర్ 4, 1998లో దాని (గూగుల్) కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మొదట గూగుల్ సెర్చిఇంజిన్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్ధులకు కావాల్సిన యూనివర్సిటీలు, కాలేజీ వివరాలు లభ్యమయ్యేవి. ఆ తర్వాత మెల్లగా ఇతర రంగాలకు సంబంధించిన సమాచారాన్ని యూజర్లు పొందే అవకాశాన్ని కల్పించింది. ఆశించిన స్థాయిలో లేక రోజులు గడుస్తున్నాయి. గూగుల్‌కు వచ్చే యూజర్లు, పనిచేసే ఉద్యోగులు పెరుగుతూ వస్తున్నారు. కానీ గూగుల్ స్థాపించిన లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లకు మాత్రం వాళ్లు ఆశించిన స్థాయిలో గూగుల్‌కు అనుకున్నంత పేరు రావడం లేదని నమ్ముతుండేవారు. అప్పుడే గూగుల్‌పై వాళ్లకున్న నమ్మకాన్ని పటాపంచలు చేసేలా ఓ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో సింగర్ డ్రెస్ ధరించిన డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడంతో ఆమె పేరు మారు మ్రోగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆమె ధరించిన డ్రెస్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అదే విషయాన్ని అడిగి తెలుసుకునేందుకు గూగుల్ సెర్చింజిన్కు పోటెత్తారు. చివరికి ఏమైందంటే? జెన్నిఫర్ లోపెజ్ అందంగా ఉన్న అమ్మాయిని చాలామంది జెన్నిఫర్ లోపెజ్‌తో పోల్చుతుంటారు. అంతెందుకు.. ‘జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరీ...’ అంటూ టాలీవుడ్లో ఓ సాంగ్ కూడా పాడేసుకున్నారు. ఔను మరి.. జెలో మామూలు అందగత్తె కాదుగా! ఆ మాటకొస్తే పాప్ ప్రపంచంలో తనని నేచురల్ బ్యూటీ, కాంతివంతమైన చర్మం ఉన్న సింగర్‌గా చెబుతుంటారు. అందుకే ఆమె పాట, ఆట, నటనకంటే అందానికే ఫ్యాన్స్ ఎక్కువ. రెడ్ కార్పెట్ మీద హొయలొలుకుతూ సంగీత ప్రపంచాన్ని తమ మ్యూజిక్‌తో ఉర్రూతలూగించిన కళాకారులకు ది రికార్డింగ్ అకాడమీ ప్రతి ఏడాది గ్రామీ అవార్డ్‌లను ప్రధానం చేస్తుంది. అయితే, ప్రతిసారి జరిగినట్లే 2001లో గ్రామీ అవార్డుల ప్రధానం జరిగింది. ఆ ఈవెంట్‌కు జెన్నీఫర్ లోపెజ్ ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించి రెడ్ కార్పెట్ మీద హొయలొలుకుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అంతే ఆ ఫోటోల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు జెన్నీ డ్రెస్ గురించి తెలుసుకునేందుకు గూగుల్‌లో తెగ వెతికారు. యూజర్ల తాకిడికి దీంతో గూగుల్ సైట్ సైతం స్తంభించిపోయింది. ఈ ఊహించని పరిణామానికి గూగుల్ ఫౌండర్లు సైతం ఆనందంలో ఉక్కిరి బిక్కిరయ్యారు. గూగుల్ పేరు మారు మ్రోగింది గూగుల్ పేరు సైతం మారు మ్రోగింది. గూగుల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. అప్పుడే గూగుల్ ఫౌండర్లకు ఓ మెరుపు లాంటి ఐడియా వచ్చింది. గూగుల్ ఇమేజెస్ అనే టూల్‌ను లాంచ్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. ఇందుకోసం ముందుగా గూగుల్ ఇమేజెస్ టూల్‌ను ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులోకి తెచ్చారు. పనితీరు ఎలా ఉంటుందా? అని టెస్ట్ చేశారు. ఐడియా సూపర్ హిట్ అయ్యింది. ఆదాయం అనూహ్యంగా ఆ తర్వాత ఏడాది 2001లో గూగుల్ గూగుల్ ఇమేజ్ అనే టూల్‌ను లాంచ్ చేసింది. గూగుల్ ఇమేజ్ అనే టూల్ .. గూగుల్ ఇమేజ్‌నే మార్చేసింది. యూజర్ల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి.. లక్షల నుంచి కోట్లకి చేరింది. గూగుల్‌లో అడ్వటైజ్మెంట్స్ పెరిగాయి. ఆదాయ మార్గాలకు కొదువలేకుండా పోయింది. థ్యాంక్స్ టూ జెన్నిఫర్ లోపెజ్ గూగుల్ ఇమేజెస్, యాప్స్, మ్యాప్స్, బిజినెస్ లిస్టింగ్ ఇలా అన్నింట్లో గూగుల్ ఇమేజ్ అనే టూల్ ఆ సంస్థ స్వరూపానే మార్చేసింది. సెర్చ్ ఇంజిన్ సంపాదనలో 80 శాతం ఈ గూగుల్ ఇమెజ్ టూల్ వల్లే వస్తుంది. ఇలా ప్రపంచంలో తనతో ఏ ఇతర టెక్ కంపెనీ కూడా పోటీ పడలేని స్థాయికి చేరింది. కాబట్టే పరోక్షంగా తమ విజయానికి కారణమైన జెన్నిఫర్ లోపెజ్కు గూగుల్ ఫౌండర్లు సందర్భానుసారం కృతజ్ఞతలు చెబుతుండడం విశేషం. -
తన పిల్లల ముందే నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్
హాలీవుడ్ స్టార్స్ జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్ పెళ్లి చేసుకున్నారు. అదేంటి, మళ్లీ పెళ్లేంటి? అనుకుంటున్నారా? అవును, జూలైలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఈ దంపతులు తాజాగా అందరి సమక్షంలో మరోసారి ఉంగరాలు మార్చుకున్నారు. శనివారం జార్జియాలోని బెన్ నివాసంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి జరగడానికి ఒకరోజు ముందు అతడి తల్లి క్రిస్ యానే ఇంట్లో కిందపడింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేరించగా వైద్యులు చికిత్స చేసిన అనంతరం తనను వీల్‌చైర్‌లో డిశ్చార్జ్ చేశారు. అదే స్థితిలో పెళ్లికి హాజరైన ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించింది. కాగా 2001లో గిగ్లి సినిమా షూటింగ్ సెట్స్‌లో బెన్ అఫ్లెక్, జెన్నిఫర్ లోపెజ్ మధ్య ప్రేమ పుట్టగా ఆ మరుసటి ఏడాదే నిశ్చితార్థం చేసుకున్నారు, కానీ పెళ్లి మాత్రం వాయిదా వేశారు. చివరికి 2004లో పెళ్లి చేసుకోవట్లేదని ప్రకటించారు. 2021లో వీరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించడంతో ఈసారి దాన్ని పెళ్లితో పదిలపర్చుకున్నారు. ఇక ఈ వివాహానికి పలువురు సెలబ్రిటీలతో పాటు జెన్నిఫర్ లోపెజ్ మాజీ భర్త, వారి సంతానం, అలాగే బెన్ మాజీ భార్య, వారి పిల్లలు హాజరయ్యారు. ఇకపోతే హీరో బెన్ అఫ్లెక్ మొదటి భార్య పేరు జెన్నిఫర్ గార్నర్. వీరికి వయొలెట్, సెరఫినా, సామ్యూల్.. అని ముగ్గురు పిల్లలు సంతానం. 2018లో గార్నర్‌తో తెగదెంపులు చేసుకున్న బెన్ తర్వాత లిండ్సే షూకస్, అనడే ఆర్మస్లతో డేటింగ్ చేశాడు. గాయని, నటి జెన్నిఫర్ లోపెజ్ విషయానికి వస్తే ఈమె గతంలో ఓజానీ నోవాను 1997లో వివాహం చేసుకోగా 1998 ప్రారంభంలో విడిపోయారు. 2001లో క్రిస్ జుడ్‌ని పెళ్లి చేసుకుని 2002లో విడిపోతున్నట్లు ప్రకటించింది. 2004లో సింగర్ మార్క్ ఆంటోనీని పెళ్లాడింది. వీరికి 2008లో ఎమ్మీ, మాక్స్ అని కవలలు పుట్టారు. ఆ తర్వాత ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్, షాక్‌లో ఫ్యాన్స్ హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్, కార్లిటీ ఇచ్చిన యంగ్ హీరో -
నటుడితో డేటింగ్, సీక్రెట్‌గా నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్
అమెరికన్ సింగర్, నటి జెన్నీఫర్ లోపెజ్ మరోసారి పెళ్లిపీటలు ఎక్కింది. కొంతకాలంగా నటుడు బెన్ అఫ్లెక్, జెన్నీఫర్ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా జెన్నీఫర్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ బెన్‌తో తన వివాహాన్ని అధికారికంగా ప్రకటిచింది. చదవండి: వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, కోర్టు నోటీసులు కొద్ది మంది సన్నిహితులు మధ్య జూలై 16న లాస్ వెగాస్‌లో సీక్రెట్‌గా ఈ జంట పెళ్లి జరిగినట్లు స్టానిక మీడియా పేర్కొంది. దీంతో ఈ జంటకు సహా నటీనటులు, ఫాలోవర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పెళ్లి అనంతరం కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ జంట కొత్త ఇంటిని వేతికే పనిలో పడ్డారని, ఆఖరికి బెవర్లీ హిల్స్‌లో ఇల్లు కొనుగొనుల చేశారని సమాచారం. కాగా 52 ఏళ్ల జెన్నీఫర్‌కు ఇప్పటికే మూడు పెళ్లిల్లు అయిన సంగతి తెలిసిందే. తాజాగా బెన్ అఫ్లెక్స్ను 4వ వివాహం చేసుకుంది. View this post on Instagram A post shared by Jennifer Lopez (@jlo) -
సహజీవనం..బ్రేకప్..20 ఏళ్లకు మళ్లీ పెళ్లి.. హీరోహీరోయిన్ల క్రేజీ లవ్‌స్టోరీ
హాలీవుడ్ తారలు జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్ రెండోసారి నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని జెన్నిఫర్ తన వెబ్సైట్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సైతం పోస్ట్ చేసింది. కాగా జెన్నిఫర్, అఫ్లెక్ గతంలో 2002లో నిశ్చితార్థం చేసుకున్నారు. రెండేళ్లు బాగానే కలిసున్న వీళ్లిద్దరూ అనూహ్యంగా తమ బంధానికి ఫుల్స్టాప్ పెడుతూ విడిపోయారు. అనంతరం జెన్నిఫర్.. మార్క్ ఆంథొనీని పెళ్లాడగా, అఫ్లెక్.. జెన్నిఫర్ గార్నర్‌ను వివాహం చేసుకున్నాడు. కానీ వీళ్ల వైవాహిక జీవితాలు కూడా సవ్యంగా సాగలేవు. దీంతో ఈ రెండు ప్రేమజంటలు గతేడాది విడాకులు తీసుకున్నాయి. విడాకుల తర్వాత ఒంటరైన వాళ్లిద్దరూ మరోసారి దగ్గరయ్యారు. గతేడాది నుంచి జెన్నిఫర్, బెన్ అఫ్లెక్‌లు రిలేషన్లో ఉన్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. కలిసి విహారయాత్రలకు వెళ్లడం, వర్కవుట్స్ మధ్యలో ఇద్దరూ ముద్దులాటలో మునగడం, రెడ్ కార్పెట్ మీద కలిసే దర్శనమివ్వడం వంటి చర్యలతో అవును, తామిద్దరం మళ్లీ ప్రేమలో పడ్డామంటూ చెప్పకనే చెప్పారు. జెన్నిఫర్ లోపెజ్ బర్త్‌డే రోజు సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా! తాజాగా రెండోసారి నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్‌కు స్వీట్ షాకిచ్చిన ఈ జంట ఈసారైనా పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి! కాగా హీరోయిన్ జెన్నిఫర్ సింగర్, డ్యాన్సర్ మాత్రమే కాదు ఓ ఎంటర్ప్రెన్యూర్ కూడా! గతేడాది ఆమె 'లో బ్యూటీ' పేరిట సౌందర్య ఉత్పత్తులను పరిచయం చేసింది. జెన్నిఫర్ చివరగా 'మ్యారీ మీ' సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో 'షాట్‌గన్ వెడ్డింగ్', 'ద మదర్' చిత్రాలున్నాయి. View this post on Instagram A post shared by Jennifer Lopez (@jlo) చదవండి: Will Smith: విల్ స్మిత్‌పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో సోనమ్ కపూర్ ఇంట్లో దొంగతనం.. కోట్ల విలువైన నగలు మాయం -
ఇప్పటికే 3 పెళ్లిళ్లు.. నాలుగో పెళ్లికి సింగర్ రెడీ
Jennifer Lopez Said About Her Fourth Marriage: అమెరికన్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ తన పాటలతో ఎంతో పేరు తెచ్చుకుంది. 52 ఏళ్ల ఈ నటి ఇప్పటికి మూడు పెళ్లిల్లు చేసుకుంది. ప్రస్తుతం బెన్ అఫ్లెక్‌తో డేటింగ్లో ఉంది. ఈ విషయమై తాజాగా జెన్నిఫర్‌ను మళ్లీ వివాహం చేసుకుంటారా అని అడిగితే అవునని సమాధానమిచ్చింది. జెన్నిఫర్ కొత్త చిత్రం 'మ్యారీ మీ' సినిమా ప్రమోట్ చేస్తున్నప్పుడు ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. 'అవును. నేను అనుకుంటున్నాను. మీకు నా గురించి తెలుసు. ఐయామ్ రొమాంటిక్. అలా ఎప్పటినుంచో ఉన్నాను. నాకు కొన్ని సార్లు వివాహం జరిగింది. మరో పెళ్లి తర్వాత కూడా సంతోషంగా ఉంటానని 100 శాతం నమ్ముతున్నాను.' ఈ గాయని గతంలో ఓజానీ నోవాను 1997లో వివాహం చేసుకుంది. తర్వాత ఇద్దరూ 1998 ప్రారంభంలో విడిపోయారు. 2001లో క్రిస్ జుడ్‌ని పెళ్లి చేసుకుని 2002లో విడిపోతున్నట్లు ప్రకటించింది. రెండు సంవత్సరాల తర్వాత జెన్నిఫర్ మార్క్ ఆంటోనిని వివాహామాడింది. 2011లో విడిపోయే వరకు వారు ఏడేళ్లు కలిసి ఉన్నారు. తర్వాత 13 ఏళ్ల ట్విన్స్ అయిన మాక్స్, ఎమ్మేలను చెరొకరు తీసుకున్నారు. మార్క్‌తో వివాహానికి ముందు, జెన్నిఫర్, బెన్ 2002 చివరిలో మొదటిసారి డేటింగ్ చేసి నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం 2004లో విడిపోయారు. సుమారు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి గతంలో కంటే సంతోషంగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో అలెక్స్ రోడ్రిగ్జ్‌తో జెన్నిఫర్ నిశ్చితార్థం ముగిసాక బెన్నిఫర్ (బెన్ అఫ్లెక్, జెన్నిఫర్ లోపెజ్) 2.0 మళ్లీ ప్రారంభమైంది. వారు వారి ప్రేమలో లోతుగా మునిగిపోయారు. వివిధ నగరాల్లో ఎక్కువ రోజులు గడపడం వల్ల ఒకరినొకరు చాలా మిస్సయ్యారని వారి సన్నిహితులు తెలిపారు. జెన్నిఫర్ లోపెజ్ తన తాజా చిత్రం 'మ్యారీ మీ' ని ఒకటి కంటే ఎక్కువసార్లు అనుసరిస్తున్నట్లుగా ఉంది. -
17ఏళ్ల తర్వాత.. ‘మాస్క్ ముద్దు’తో మళ్లీ కలిసిన ‘బెన్నీఫర్’
పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ మళ్లీ ఒకటై అభిమానులను సంతోషంలో ముంచెత్తారు. ఒకటైన తర్వాత వారిద్దరూ మాస్క్‌తోనే ముద్దు పెట్టుకున్నా పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెన్నిఫర్‌గా గుర్తింపు పొందిన ఈ జంట 2002లో నిశ్చితార్థం చేసుకుంది. నిజానికి 2003లో వివాహం చేసుకున్నారు. అయితే అది డిలే అయ్యింది. అనంతరం 2004లో విభేదాలతో విడిపోయారు. బ్రేకప్ తర్వాత జెన్నీ,మార్క్ ఆంటోనిని వివాహం చేసుకోగా.. ఆమె ప్రియుడు బెన్, జెన్నిఫర్ గార్నెర్ని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ వారి లైఫ్ పార్టనర్స్ నుంచి విడాకులు తీసుకున్నారు. కాగా వీరిద్దరూ మళ్లీ ఒకటైన విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ జెన్నీ తన 52 పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేసి తన సంతోషాన్ని తెలిపింది. అయితే మళ్లీ కలిసిన వారిద్దరూ మొదటి సారి గత వారం వెనిస్ లిడోలో జరిగిన 78 వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్‌కార్పెట్‌పై జంటగా నడిచారు. తాజగా సోమవారం (సెప్టెంబర్ 14న) మెట్ గాలా 2021లో రెడ్ కార్పెట్‌పై మరోసారి కనిపించిన ఈ జంట మాస్క్‌తోనే ముద్దు పెట్టుకొని అభిమానులకు కనులవిందు కలిగించారు. బెన్నీఫర్ ముద్దు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 17ఏళ్ల కలిసిన ఈ కపుల్‌ని చూసిన అభిమానులు ‘వావ్ అమేజింగ్’‘ఎప్పటికీ బెస్ట్ జోడి’ అంటూ కామెంట్ పెడుతున్నారు. "And then we kiss your our love comes alive on my lips"#MetGala2021 #Bennifer #BritneySpears pic.twitter.com/SfV2qngBj7 — I'm Still... (@BraveOnthe6) September 14, 2021 Living for #bennifer pic.twitter.com/s3HLurWllq — Momo (@MomoCominThru) September 14, 2021 -
వికీపీడియా హ్యాక్..! లిస్ట్‌లో టాప్ సెలబ్రిటీలు..!
ప్రముఖ వెబ్సైట్ వికీపీడియా సోమవారం రోజున హ్యాకింగ్‌కు గురైనట్లు వార్తలు వస్తోన్నాయి. డజన్ల కొద్దీ వికీపీడియా పేజీలు సోమవారం ఉదయం స్వస్తిక్(జర్మన్ నాజీ పార్టీ జెండా) చిత్రాలతో తాత్కాలికంగా భర్తీ చేయబడినట్లు తెలుస్తోంది. వికీపీడియా పేజీలను ఒపెన్ చేస్తుంటే జర్మన్ నాజీ పార్టీ జెండాలు కన్పించాయని యూజర్లు తెలిపారు. చాలా మేరకు ప్రముఖుల వికీపీడియా పేజీలు హ్యాకింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది. (చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్) హ్యాకింగ్‌కు గురైన వికీపీడియా పేజీల్లో హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు, సింగర్స్ ఉన్నారు. జెన్నిఫర్ లోపెజ్, బెన్ ఆఫ్లెక్, మడోన్నా వికీపీడియా పేజీల్లో ఎరుపు వర్ణంలోని జర్మన్ నాజీ పార్టీ జెండా స్వస్తిక్ గుర్తు కన్పించిందని కొత్త మంది యూజర్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతేకాకండా జర్మన్ తత్వవేత్త థియోడర్ అడోర్నో, జోసెఫ్ స్టాలిన్ పేజీలు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. వికీపీడియాను ఎలాంటి లాభాపేక్షలేకుండా వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తోంది. కాగా హ్యాకింగ్‌పై వికీమీడియా ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ..ప్రముఖ స్టార్స్, సింగర్స్ వికీపీడియా పేజీల్లో కొద్ది క్షణాలపాటు జర్మన్ నాజీ పార్టీ జెండా కన్పించినట్లు నిర్థారించారు. కాగా వికీపీడియా వెబ్సైట్లపై జరిగిన హ్యాకింగ్‌ను వీకీమీడియా ఫౌండేషన్ ప్రతినిధులు కేవలం ఐదు నిమిషాల్లో తిప్పికొట్టిన్నట్లు వెల్లడించారు. (చదవండి: తాలిబన్లకు భారీ షాకిచ్చిన ఫేస్బుక్..!) Has Wikipedia been hacked? I'm opening new tabs and they're coming up with swastikas / Nazi flags??? pic.twitter.com/i0498octaZ — Ben Travis (@BenSTravis) August 16, 2021 -
షాకింగ్: బ్రేకప్ చెప్పేసిన స్టార్ సింగర్
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికన్ స్టార్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ (51)కు సంబంధించి మరో వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రియుడు, ప్రముఖ క్రీడాకారుడు అలెక్స్ రోడ్రిగెజ్(45)తో తెగదెంపులు చేసుకుందిట. గతకొన్ని రోజులుగా వీరిద్దరి బ్రేక్‌పై పలు ఊహాగానాలు చెలరేగాయి. దీనికి తోడు వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేయడంతోపాటు, ఈ అంచనాలకు మరింత బలం చేకూర్చాయి. గతవారమే వీరిద్దరూ తమ ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్టు యూఎస్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను జేఎల్ఓగానీ, అలెక్స్గానీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. జెన్నిఫర్,అలెక్స్ దాదాపు నాలుగు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మయామిలో 40 మిలియన్ డాలర్ల ఇంటిని కూడా కొనుక్కున్నారు. లోపెజ్ డొమినికన్ రిపబ్లిక్లో షూటింగ్లో బిజీగా ఉన్నారు. రెండేళ్లకు పైగా డేటింగ్ చేసిన తర్వాత ఇద్దరూ 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే కరోనావైరస్ మహమ్మారి కారణంగా పెళ్లిని రెండుసార్లు వాయిదా వేసుకున్నామని స్వయంగా జెన్నిఫర్ గత డిసెంబర్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. చార్మ్ స్టార్ మాడిసన్ లెక్రోయ్తో అలెక్స్ చెట్టాపట్టాలేసుకుని తిరగుతున్నాడన్నకారణంగానే జెలో ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. View this post on Instagram A post shared by Jennifer Lopez (@jlo) -
లేడీ గాగా..జెన్నిఫర్ లోపెజ్..!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా ఈనెల 20వ తేదీన జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో జెన్నిఫర్ లోపెజ్, లేడీ గాగా వంటి పలువురు ప్రముఖ పాప్ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అమెరికాలో కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడిగా జో బైడెన్(78), ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్(56) వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనం వెస్ట్‌ఫ్రంట్‌లో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చాలా కొద్ది మాత్రమే హాజరుకానున్నారు. పలు కార్యక్రమాలు వర్చువల్‌గానే ఉంటాయి. క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో 10వేల మంది నేషనల్ గార్డులను వాషింగ్టన్లో పహారాకు నియమించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జరిగే పరేడ్ కూడా వర్చువల్‌గానే ఉంటుందని ప్రమాణ స్వీకార కమిటీ ప్రకటించింది. -
హాలీవుడ్ నటి జెన్నీఫర్ లోపెజ్ ఫోటోలు
-
పాప్ సింగర్ జెన్నీఫర్‌పై కేసు
న్యూయార్క్: హాలీవుడ్ నటి, పాప్ సింగర్ జెన్నీఫర్ లోపెజ్పై మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో సోమవారం కేసు నమోదైంది. ప్రముఖ న్యూయార్క్ ఫొటో గ్రాఫర్ స్టీవ్ సాండ్స్ తీసిన ఫొటోను అనుమతి లేకుండా జెన్నీ సోషల్ మీడియాలో ఫోస్టు చేసిందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అంతేగాక జెన్నీ నుంచి తనకు రూ. 1.14 కోట్ల నష్టాపరిహరాన్ని కూడా ఇప్పించాలని సాండ్స్ కోర్టును విజ్ఞప్తి చేశాడు. (నా భర్త కరణ్‌లా ఉంటే ఇష్టపడను) దీనిపై సాండ్స్ తరపు న్యాయవాది రిచర్డ్ లీబోవిట్జ్ మాట్లాడుతూ.. ‘గాయని జెన్నీఫర్ లోపెజ్ అనుమతి లేకుండ తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారని ఫొటోగ్రాఫర్ సాండ్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అంతేగాక జెన్నీ నుంచి తనకు రూ. 150,000 డాలర్లనష్ట పరిహారంతో పాటు న్యాయవాది ఫీజును కూడా ఇప్పించాలని పిటిషన్లో పేర్కొన్నాడు’ అని చెప్పుకొచ్చాడు. అంతేగాక జెన్నీఫర్ సోంత నిర్మాణ సంస్థ నుయోరికాన్ ప్రోడక్షన్ బ్రాండ్ ప్రమోషన్ కోసమే తన ఫొటోను వాడుకుందని సాండ్స్ పిటిషన్లో పేర్కొన్నట్లు చెప్పాడు. తన ఫొటోను జెన్నీ 2017 జూన్ 23న తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారని.. దానికి ఇప్పటి వరకూ 650, 000 లైక్‌లు కూడా వచ్చినట్లు కూడా చెప్పాడని రిచర్డ్ పేర్కొన్నాడు. అయితే దీనిపై జెన్నీఫర్ కానీ ఆమె న్యాయవాది కానీ ఇంత వరకూ స్పందించలేదు. (హాలీవుడ్ సంస్థతో బాలీవుడ్ 'ఏరోస్' విలీనం) -
హీరోయిన్ ఫోటోలపై కామెంట్ల వెల్లువ
లాస్ఏంజెలెస్: ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్, సింగర్ జెన్నీఫర్ లోపెజ్ ఫోటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ‘ఇన్ స్టైల్ మాగ్జైన్’ కోసం తీసిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు పోస్ట్ చేసిన 24 గంటల వ్యవధిలో 4 మిలియన్ల లైకులతో, 81వేల కామెంట్లతో రికార్డు సృష్టించాయి. ఆ ఫోటోలపై నెటిజన్లు చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కేప్ వస్త్రధారణలో ఉన్న లోపెజ్ ఫోటోపై నెటిజన్లు చేసిన కామెంట్లు మరింత వైరల్‌గా మారాయి. ‘ఆమె 1969లో పుట్టినా ఇప్పటికీ ఎంతో అందంగా ఉంది. స్మృతి ఇరానీ కంటే వయస్సులో పెద్దది, మన కేజ్రీవాల్ వయస్సు ఉంటుంద’ని ‘ఆమె యవ్వనపు సరస్సులోని నీరు తాగుతోంది’, ‘ఆమె కర్టెన్ వెనుక దాక్కుంది’, ‘కొందరు వ్యక్తులు అరటి ఆకులను కప్పుకుని ఆమెను కాపీ కొట్టాలని చూస్తున్నారు’ అంటూ అభిమానులు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది ఆమె వస్త్రధారణను మెచ్చుకున్నారు. -
స్త్రీలోక సంచారం
కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కె.చంద్రశేఖరరావు మహిళల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దనసరి అనసూయ (సీతక్క), తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆరోపించారు. రాష్ట్రంలో స్త్రీ సంక్షేమ శాఖ క్రియాశీలకంగా లేకపోవడంతో యాదాద్రి వంటి చోట్ల వ్యభిచారం వర్ధిల్లుతోందని, ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు కేసీఆర్ తన మంత్రి వర్గంలోకి తక్షణం ఒక మహిళను తీసుకుని, ఆమెకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖను అప్పగించాలని వీరు డిమాండ్ చేశారు. ► బ్రెజిల్‌లోని రియోలో 2016లో జరిగిన ఒలింపిక్స్‌లో హిజాబ్ ధరించి పాల్గొన్న తొలి ముస్లిం–అమెరికన్ అథ్లెట్ ఇబ్తిహాజ్ ముహమ్మద్‌ను పోలిన కొత్త బార్బీ మార్కెట్లోకి వచ్చింది. ‘బాలికలు ఇప్పుడు హిజాబ్ ధరించిన బార్బీ బొమ్మతో ఆడుకోవచ్చు’ అని అంటూ, ఇది తన చిన్ననాటి కల అని 32 ఏళ్ల ఈ ఫెన్సింగ్ చాంపియన్ ట్వీట్ చేశారు. ►లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ, పదిలక్షల డాలర్ల పూచీకత్తుపై బెయిలు మీద తిరుగుతున్న హాలీవుడ్ దిగ్గజం హార్వీ వైన్‌స్టీన్ కేసు సెప్టెంబరు 10కి వాయిదా పడింది. వైన్‌స్టీన్ ఎవర్నీ బలవంత పెట్టలేదనీ, ఆయన తమపై అత్యాచారం జరిపారని ఆరోపిస్తున్న మహిళలు వైన్‌స్టీన్‌కు రాసిన ప్రేమలేఖల్ని బట్టి వారి మధ్య జరిగినది సమ్మతితో కూడిన కలయికే తప్ప లైంగిక దాడి కాదని వైన్‌స్టీన్ తరఫు న్యాయవాది.. ఆ ప్రేమలేఖల్ని కోర్టుకు సమర్పిస్తూ.. అతడిపై ఉన్న అన్ని కేసుల్ని కొట్టివేయాలని వాదించారు. ►అమెరికన్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ధరించిన డెనిమ్ బూట్స్.. నలుగురి నోళ్లలో నానుతున్నాయి. ప్యాంట్, కాలి బూట్లు కలగలిసి ఉన్న ఈ డ్రెస్ ఆమె నడుముకింది నుంచి దిగి, మోకాళ్ల పైభాగం కనిపించేలా ఉండటంతో.. ‘జెన్నిఫర్ బాత్రూమ్కి వెళ్లి ప్యాంటు పైకి లాక్కోవడం మర్చిపోయి గానీ బయటికి రాలేదు కదా’ అనే నెగటివ్ కామెంట్లే ఈ డ్రెస్‌పై ఎక్కువగా వస్తున్నాయి. ► 2009 నుంచి 2016 వరకు 7 సీజన్లుగా, 156 ఎపిసోడ్లుగా సి.బి.ఎస్. (కొలంబియా బ్రాడ్‌కాస్టింగ్ సిస్టం) చానల్లో ప్రసారం అయి అత్యంత వీక్షకాదరణ పొందిన అమెరికన్ లీగల్, పొలిటికల్ డ్రామా ‘ది గుడ్ వైఫ్’ను బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ భారతదేశానికి తెచ్చేస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రను పోషించడంతో పాటు, నిర్మాణ భాగస్వామ్యానికి కూడా చొరవ చూపుతున్న శెరావత్ ప్రస్తుతం ఆ పనిలో భాగంగా ముంబైలోని న్యాయ నిపుణులను కలిసి భార్యాభర్తల న్యాయవివాదాలలోని మలుపుతీర్పులను (ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్స్) అధ్యయనం చేస్తున్నారు. ► స్టీవ్ జాబ్స్ కూతురు లిసా బ్రెనన్ కొత్త పుస్తకం ‘స్మాల్ ఫ్రై’ (అప్రాముఖ్యాలు) లో.. క్యాన్సర్‌తో చనిపోతున్న చివరి రోజులలో ఆమె తన తండ్రి పక్కన కూర్చున్నప్పుడు ‘నీ దగ్గర టాయ్‌లెట్ కంపు కొడుతోంది’ అని అన్నారని లిసా రాసిన జ్ఞాపకాలలోని కొంత భాగాన్ని ప్రచురణకర్తలు విడుదల చేశారు. ఆపిల్ కంపెనీని ప్రారంభించిన తొలి సంవత్సరాలలో న్యాయపరమైన వివాదాల కారణంగా లిసాను తన కూతురిగా అంగీకరించని స్టీవ్స్, ఆ తర్వాత ఆమె తన కూతురే అని ఒప్పుకున్నప్పటికీ చనిపోయేనాటి వరకు ఆమెను ద్వేషిస్తూనే ఉన్నారని, నిజానికి ఆయన ‘టాయ్‌లెట్ కంపు కొడుతోంది’ అన్న రోజు లీసా.. గులాబీల అత్తరును ఒంటి మీద స్ప్రే చేసుకుని ఉన్నారని ‘స్మాల్ ఫ్రై’లోంచి వెల్లడయిన ముఖ్యాంశాలను బట్టి తెలుస్తోంది. ► లైటెనింగ్ లేజర్ ట్రీట్మెంట్తో పెదవులు మెరిపించుకోవడం ఇప్పుడు నగరాల్లో ట్రెండ్‌గా మారింది. పుట్టుకతోనో, పొగతాగడం వల్లనో నల్లగా ఉన్న పెదవులపై నలుపు రంగును తగ్గించే ఈ ట్రీట్మెంట్ను ఎక్కువగా 25–35 మధ్య వయసున్న యువతులు చేయించుకుంటుండగా, దీని వల్ల ఆశించిన ఫలితం ఉన్నా లేకున్నా.. హాని మాత్రం లేకుండా ఉండదని గట్టిగా చెప్పలేమని వైద్య నిపుణులు అంటున్నారు. -
జెన్నిఫర్ లోపెజ్ ఇంట్లో...
సాంగ్స్, ఫైట్స్, రొమాన్స్, లొకేషన్స్ అదిరిపోవద్దూ... పదేళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్లో మూవీ సెట్ అయితే. అలాగే అదరగొడుతున్నారు దర్శకుడు శ్రీనువైట్ల. ‘నీకోసం, వెంకీ, దుబాయ్ శీను’ తర్వాత రవితేజ హీరోగా తాను తెరకెక్కిస్తోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా కోసం హాలీవుడ్ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఇంటిని ఒక లొకేషన్‌గా సెలక్ట్ చేశారాయన. అమెరికాలో ఉన్న లోపెజ్ మ్యాన్షన్ పరిసర ప్రాంతాల్లో మంచు బాగా కురుస్తోందట. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 1న స్టారై్టంది. ఎక్కువ శాతం అమెరికాలోనే షూటింగ్ జరుపనున్నారు. ‘‘జెన్నిఫర్ లోపెజ్ మ్యాన్షన్‌లో సినిమా షూటింగ్ జరుపుతుండటం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఆమెకు వీరాభిమానిని. ఈ ప్లేస్‌లో షూటింగ్ చేయడానికి సహకరించిన మిత్రులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు శ్రీను వైట్ల. ప్రస్తుతం ఈ మ్యాన్షన్‌లో జెన్నిఫర్ లోపెజ్ ఉండటం లేదు. ఆ సంగతలా ఉంచితే... మంచు కురిసే వేళలో రీల్‌పై నాయకా నాయికలు రవితేజ, అనూ ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్‌పై ఎలా ఉంటుందో చూడాలంటే వెయిట్ అండ్ సీ. రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్లో సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, రవితేజ తనయుడు మహాధన్, అలనాటి హీరోయిన్ లయ, ఆమె తనయ శ్లోక ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
పాప్ స్టార్ నివాసంలో రవితేజ, శ్రీనువైట్ల
-
పాప్ స్టార్ నివాసంలో రవితేజ, శ్రీనువైట్ల
కొంతకాలంగా సరైన హిట్ లేక కష్టాల్లో ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల ప్రస్తుతం రవితేజ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు అమర్ అక్బర్ ఆంటోని అనే పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ అమెరికాలోని పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్‌కు చెందిన నివాసంలో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీనువైట్ల చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘ఆమెకు వీరాభిమానిని. లక్షల మంది అభిమాన పాప్ గాయని. పాప్ రాణి. ప్రస్తుతం ఆమె నివాసంలో షూటింగ్ చేస్తున్నాం. కల నిజమైంది’ అంటూ ట్వీట్ చేశారు శ్రీనువైట్ల. గతంలో రవితేజ హీరోగా శ్రీనువైట్ల తెరకెక్కిన వెంకీ, దుబాయ్ శీను సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో అమర్ అక్బర్ ఆంటోనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేవలం జెన్నీపర్ లోపేజ్ విల్లాలో జరిగే చిత్రీకరణ కోసం భారీ మొత్తాన్ని కేటాయించారన్న ప్రచారం జరుగుతోంది. రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ కథానాయికగా నటిస్తోంది. Been her craziest fan throughout my life..the heartthrob of millions ..the evergreen queen of pop ..and here I am Shooting right in her palatial mansion in Long Island .Dreams do come true ! My biggest fan moment @jlo #AAA pic.twitter.com/PyGrnyVwR4 — Sreenu Vaitla (@SreenuVaitla) 2 April 2018 -
హాఫ్ న్యూడ్‌గా కనిపించమన్నారు!
‘‘నేను ఆ రోజు ఆడిషన్‌కు వెళ్లా. ఒక్కదాన్నే. ఆడిషన్ చేసిన ప్రొడ్యూసర్ నన్ను షర్ట్ విప్పమని, హాఫ్ న్యూడ్‌గా కనిపించమని అడిగాడు. నేనప్పుడు గట్టిగా నో చెప్పడానికి కూడా ఎలా భయపడ్డానో ఆలోచిస్తే ఈరోజుకీ భయమేస్తుంది’’ జెన్నిఫర్ లోపెజ్ ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి. 48 ఏళ్ల జెన్నిఫర్, 30 ఏళ్లకు పైనే ఇండస్ట్రీలో ఉంది. పైన చెప్పిన సంఘటన 30 ఏళ్ల క్రిందట, ఆమె ఇండస్ట్రీకి అడుగు పెట్టకముందు జరిగింది. ఇన్నేళ్లకు గానీ ఆమె ఈ విషయం చెప్పలేదంటే, స్త్రీ ఒక జీవిత కాలమంత విషాదాన్ని తనలో దాచుకుంటుందని అనుకోవాలి. ఇప్పటికైనా జెన్నిఫర్ ఈ మాటలు చెప్పిందంటే, అది మీటూ అన్న ఒక ఉద్యమం బయటకొచ్చాకే! హాలీవుడ్లో మీటూ ఉద్యమం తీసుకొచ్చిన మార్పు తెలిసిందే. ఆరు నెలలుగా వందలాది మంది హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక దాడుల గురించి చెబుతూ, ఎందరి పేర్లనో బయటపెట్టారు. హాలీవుడ్లో ఇప్పటికీ ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ‘‘నాకే ఈ విషయం చెప్పడానికి ఇన్నేళ్లు పట్టిందంటే.. ఇంక మామూలు అమ్మాయి సంగతి?’’ అంటూ మీటూ ఉద్యమం లాంటివి ఎప్పుడూ ఉండాలని, హాలీవుడ్ ఇప్పటికైనా మారాలని జెన్నిఫర్ లోపెజ్ అన్నారు. -
అలా చేయనని చెప్పి వచ్చేశా: నటి
లాస్ ఏంజెలెస్ : మహిళలపై వేధింపులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. స్వశక్తిగా ఎదిగే క్రమంలో హాలీవుడ్లో మహిళలు అనుభవించిన క్షోభను ఒక్కొక్కొరు ‘మీ టూ’ కార్యక్రమం ద్వారా వెలుగులోకి తీసుకోస్తున్నారు. తాజాగా సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ కెరీర్ తొలినాళ్లలో తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాయని ఓ మేగజీన్‌కు వెల్లడించారు. సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లిన తనను టాప్ తీసేసి నటించాలని డైరెక్టర్ కోరినట్లు చెప్పారు. అలా చేస్తేనే సినిమా అవకాశం ఇస్తానని చెప్పారన్నారు. అప్పుడే కెరీర్లో అడుగులు వేస్తున్న తనతో డైరెక్టర్ అలా అనడంతో ఒక్కసారిగా తన గుండె చప్పుడు తనకే వినిపించిందని, భయంతో తన మైండ్ పని చేయలేదని వెల్లడించారు. అయితే, కొద్ది క్షణాల తర్వాత తేరుకుని నో అలా చేయను చెప్పి వచ్చేశానన్నారు. ‘నా బలాలు బలహీనతలు నాకు తెలుసు. వేరే అవకాశాలు కచ్చితంగా నన్ను వెతుక్కుంటూ వస్తాయనే నమ్మకంతో ఆ డైరెక్టర్ ప్రపోజల్‌కు ఒప్పుకోలేదు. ఆ తర్వాత దృఢ సంకల్పంతో అనుకున్న లక్ష్యాలను సాధించి ఈ స్థాయిలో నిలిచాను’ అని మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు లోపెజ్.