
జెన్నిఫర్ లోపెజ్ (ఫైల్ ఫోటో)
లాస్ ఏంజెలెస్ : మహిళలపై వేధింపులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. స్వశక్తిగా ఎదిగే క్రమంలో హాలీవుడ్‌లో మహిళలు అనుభవించిన క్షోభను ఒక్కొక్కొరు ‘మీ టూ’ కార్యక్రమం ద్వారా వెలుగులోకి తీసుకోస్తున్నారు. తాజాగా సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ కెరీర్ తొలినాళ్లలో తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాయని ఓ మేగజీన్‌కు వెల్లడించారు.
సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లిన తనను టాప్ తీసేసి నటించాలని డైరెక్టర్ కోరినట్లు చెప్పారు. అలా చేస్తేనే సినిమా అవకాశం ఇస్తానని చెప్పారన్నారు. అప్పుడే కెరీర్‌లో అడుగులు వేస్తున్న తనతో డైరెక్టర్ అలా అనడంతో ఒక్కసారిగా తన గుండె చప్పుడు తనకే వినిపించిందని, భయంతో తన మైండ్ పని చేయలేదని వెల్లడించారు. అయితే, కొద్ది క్షణాల తర్వాత తేరుకుని నో అలా చేయను చెప్పి వచ్చేశానన్నారు.
‘నా బలాలు బలహీనతలు నాకు తెలుసు. వేరే అవకాశాలు కచ్చితంగా నన్ను వెతుక్కుంటూ వస్తాయనే నమ్మకంతో ఆ డైరెక్టర్ ప్రపోజల్‌కు ఒప్పుకోలేదు. ఆ తర్వాత దృఢ సంకల్పంతో అనుకున్న లక్ష్యాలను సాధించి ఈ స్థాయిలో నిలిచాను’ అని మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు లోపెజ్.
Comments
Please login to add a commentAdd a comment