హీరోయిన్‌ ఫోటోలపై కామెంట్ల వెల్లువ | Netizens Comments On Jennifer Lopez Cape Dress Photo | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ ఫోటోలపై కామెంట్ల వెల్లువ

Published Fri, Nov 2 2018 12:06 PM | Last Updated on Fri, Nov 2 2018 12:34 PM

Netizens Comments On Jennifer Lopez Cape Dress Photo - Sakshi

లాస్ఏంజెలెస్‌: ప్రముఖ హాలీవుడ్‌ హీరోయిన్‌, సింగర్‌ జెన్నీఫర్‌ లోపెజ్‌ ఫోటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ‘ఇన్‌ స్టైల్‌ మాగ్జైన్‌’ కోసం తీసిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోలు పోస్ట్‌ చేసిన 24 గంటల వ్యవధిలో 4 మిలియన్ల లైకులతో, 81వేల కామెంట్లతో రికార్డు సృష్టించాయి. ఆ ఫోటోలపై నెటిజన్లు చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కేప్‌ వస్త్రధారణలో ఉన్న లోపెజ్‌ ఫోటోపై నెటిజన్లు చేసిన కామెంట్లు మరింత వైరల్‌గా మారాయి.

‘ఆమె 1969లో పుట్టినా ఇప్పటికీ ఎంతో అందంగా ఉంది. స్మృతి ఇరానీ కంటే వయస్సులో పెద్దది, మన కేజ్రీవాల్‌ వయస్సు ఉంటుంద’ని ‘ఆమె యవ్వనపు సరస్సులోని నీరు తాగుతోంది’, ‘ఆమె కర్టెన్‌ వెనుక దాక్కుంది’, ‘కొందరు వ్యక్తులు అరటి ఆకులను కప్పుకుని ఆమెను కాపీ కొట్టాలని చూస్తున్నారు’ అంటూ  అభిమానులు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది ఆమె వస్త్రధారణను మెచ్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement